Jump to content

బకాసురుడు

వికీపీడియా నుండి
బకాసురుడు
మహాభారతం పాత్ర
దస్త్రం:Bhima fighting with Bakasura color.jpg
బకాసురిడిని సంహరిస్తున్న భీముడు
సమాచారం
SpeciesDemon
లింగంపురుషుడు
గుర్తింపురాక్షసుడు

బకాసురుడు మహాభారతం లోని పాత్రలు. ఇతడు భీమసేనుడు ని చేత వధించబడ్డాడు.

మాయాజూదం

[మార్చు]

పాండవులకు ప్రజాదరణ చూసి సహించలేక దుర్యోధనుని దురాలోచనలతో తండ్రిని ఒప్పించి వారణావతానికి పాండవులను పంపించి, వారిని అక్కడే హతమార్చాలని పథకం వేసాడు. ధర్మరాజుని మాయా జూదంలో రెండవసారి ఓడించి. శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతములో లక్క ఇల్లు ఇంట్లో ఉంచి వారిని దహించివేయాలని పధకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు తప్పించుకున్నారు. పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయుచున్న పాండవులు తమ తల్లితో సహా ఏకచక్రపురం అగ్రహారము చేరుకున్నారు. ఒక అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఆశ్రమం పొందుతారు. వైదిక వృత్తిలో కాలక్షేపం చేస్తున్నారు. ఒక నాడు కుంతీ, భీముడు ఇద్దరే విడిదిలో ఉన్నారు. తక్కిన వారు భిక్షానికి వెళ్ళారు. ఒక పెట్టున ఆ ఇంటి వారంతా గొల్లుమన్నారు. పాపం వీరికి ఏమి కష్టమొచ్చిందో! మనకు ఆశ్రయమిచ్చారు. మంచివారు, వీరికి మనము ఏదయినా ప్రత్యుపకారము చేయాలి అని అనుకొంటూ ఉండేదాన్ని, అని అన్నది కుంతి. ఈ సమయములో మనము వారిని ఆదుకోవాలి అని చెప్పింది కుంతీ దేవి. తప్పకుండా చేద్దాము. వెళ్ళి విషయమేమిటో కనుక్కుని రమ్మని అన్నాడు భీముడు. ఇక్కడ యమునా నది గట్టుమీద భకుడనే రాక్షసుడున్నాడు. వాడు ఊరి మీద పడి ప్రజలను మారి మసిగినట్లు తినేవాడట. ఒక నాడు ఊరి పెద్దలంతా సభ చేసి ఒక కట్టడి చేసుకున్నారంట. రాక్షసుడు ఊరిమీదకు రాకూడదు, అక్కడే ఉండాలి, ప్రతి వారం ఒక ఇంటి వరుస ప్రకారం ఒక మనిషి, రెండు దున్నపోతులకు కట్టిన బండి నిండా అన్నము పంపిస్తాము అని. రాక్షసుడు బండెడు కూడు, రెండు దున్నలు, ఒక మనిషిని మొత్తం స్వాహా చేస్తాడడ. ఈ దినం మన ఇంటి బ్రాహ్మణుని వంతు వచ్చింది. అలా బకాసురుని వద్దకు ప్రతి వారం ఒక్కో ఇంటి నుంచి ఒక్కో మనిషి వెళ్ళి బకాసురునికి ఆహారమై పోతుంటారు. పాండవులు ఆశ్రమం పొందిన ఇంటి వారి వంతు వస్తుంది వాళ్ళకు ఒక్కడే కుమారుడు. భకునికి ఆహారంగా నేను పోతాను అని గృహస్తు, వద్దు నేనే పోతానని ఇల్లాలు, మీరిద్దరూ వద్దు ఎప్పుడైనా ఇల్లు దాటి వెళ్ళే దాన్నే కదా అని కూతురు ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఏడుస్తున్నారు. నా కొడుకుని పంపుతానని పాండవుల తల్లి కుంతి ఇదీ సంగతి అని చెప్పింది. కుంతీ దేవి వెళ్ళి వచ్చింది. నాయనా! భీమ సేనా! నేను వారికి మాట యిచ్చాను. నీవు నెరవేర్చాలి.

భీముడు, వజ్ర శరీరుడు

[మార్చు]

అంతా విని భీముడు ఇంతేనా, నేను పోతాను, నాకు కడుపునిండా అన్నము పెట్టించు అన్నాడు, ఉల్లాసంగా ఉన్నాడు. ఇంతలో భిక్షానికి వెళ్ళిన సోదరులువచ్చారు. భీముని వాలకము చూసేసరికి ధర్మరాజుకు అనుమానం కలిగింది. వీడు ఎవరితోనో పోట్లాటకు తయారైనాడే, అని తల్లిని అడిగాడు. సంగతి తెలుసుకున్నాడు. అమ్మా! నీకు వెర్రా? పిచ్చా?, భీముడు నీకు బరువయ్యాడా? తల్లికి నలుగురు కొడుకులుంటే దురదృష్టవశాత్తు వారిలో ఒకడు కుంటో, గుడ్డో అయితే తల్లి వాడిని కూడా ప్రేమిస్తుందే కానీ, పోగొట్టుకోవడానికి అంగీకరించదు. నీవు భీముని రక్కసునికి ఆహారముగా ఇస్తావా? అని ఆక్రోశించాడు ధర్మరాజు. భీముడు నవ్వాడు. తల్లి కూడా నవ్వుతూ, నీవు భీమ సేనుని ఆ ఏటి గట్టున ఉండే బకాసురునికి లోకువ అని భావిస్తున్నావా?, వీడు వజ్ర శరీరుడు. వీడు పుట్టిన పదవ రోజున నా చేతిలోనించి జారి క్రింద పడ్డాడు. అది కఠిన శిలా ప్రదేశము, వీడికి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని భయపడ్డాను. తీరా చూస్తే వీడి శరీర భారానికి కొండ రాయి నుగ్గయిపోయింది. వీడు అంత గట్టి వాడు. మనకు నిలువ నీడ యిచ్చిన ఈ కుటుంబానికే కాదు, ఈ ప్రదేశానికి రాక్షస బాధ లేకుండా చేయాలని నా ఉద్దేశము, మీరేమి భయపడవద్దు అని సమాధానమిచ్చింది కుంతీ దేవి.

చివరికి బకాసురుడు

[మార్చు]

కుంతి వారిని వారించి తన కుమారుడైన భీమసేనుని ఆ అబ్బాయి కి బదులుగా పంపిస్తుంది ఆ గ్రామ సమీపం దాటిన తర్వాత బకాసురుని దగ్గరికి వెళ్ళే వరకు ఆహారం అంతా భీముడు తినేస్తాడు. ఆ తర్వాత బకాసురుని వద్దకు వెళతాడు ఆహారం లేకుండా వచ్చావు అని బకాసురుడు ఆహారంగా నిన్నే తినేస్తా అంటూ భీముడు మీదకి వస్తాడు దాంతో వారికి ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది చివరికి బకాసురుడు భీమసేనుని ని చేతలో మరణిస్తాడు.

దీపావళీ పండుగ

[మార్చు]

బకాసురుడు మరణిస్తాడు ప్రజలు రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ఏకచక్రపురం లో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే నరకాసురుడ రాక్షసుడిని సంహరించిన ఆనందంలో కూడా ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.

ఇప్పటికీ బకాసురుడు

[మార్చు]

తెలుగువారిలో ఇప్పటికి కూడా ఎవరైనా ఎక్కువగా తిండి తింటే బండెడు తినే బకాసురుడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు[1].

మూలాలు వనరులు

[మార్చు]
  1. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-396449[permanent dead link]