బలాంగిర్ జిల్లా

వికీపీడియా నుండి
(బలంగీర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బలాంగిర్ జిల్లా
బొలాంగిర్
జిల్లా
హరిశంకర్ దేవాలయం
హరిశంకర్ దేవాలయం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంబలాంగిర్
Government
 • కలెక్టరుDr. M. Muthukumar, IAS
 • Members of ParliamentKalikesh Narayan Singh Deo, BJD
Area
 • Total6,575 km2 (2,539 sq mi)
Elevation
115 మీ (377 అ.)
Population
 (2011)
 • Total16,48,574
 • Density251/km2 (650/sq mi)
భాషలు
 • అధికారఒరియా, Kosli,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
767 xxx
టెలిఫోన్ కోడ్06652
Vehicle registrationOR-03
లింగ నిష్పత్తి0.983 /
అక్షరాస్యత65.50%
లోక్‌సభ నియోజకవర్గంBalangir
Vidhan Sabha constituency7
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,443.5 millimetres (56.83 in)
సగటు వేసవి ఉష్ణోగ్రత48.7 °C (119.7 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత16.6 °C (61.9 °F)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో బలాంగిర్ జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 165 చ.కి.మీ. జనసంఖ్య 1,335,760. బలాంగిర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లాలో అత్యధికభారం గ్రామీణప్రాంతంగా ఉంది. జిల్లాలో తిత్లగర్, పత్నాగర్, కాంతాబంజి, లోయిసింగ, సైంతల, బెల్పద, తుష్ర, అగల్పూర్, దేవ్గావ్, చుదాపలి వంటి చిన్నపట్టణాలు ఉన్నాయి.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

Royal Palace of Balangir -Ex patna state.

16వ శతాబ్దంలో పాట్నా రాజాస్థానానికి 19వ రాజైన బలరాందేవ్ బలరాంగర్ పేరుతో ఒక పట్టణం నిర్మించి తన రాజధానిని పాట్నాగర్ నుండి బలరాంగర్ పట్టణానికి మార్చాడు. తరువాత ఈ పట్టణం పేరు బలరాంగర్ నుండి బలంగీర్‌గా మార్చబడింది. బలరాందేవ్ 8 సంవత్సరాల పాలన తరువాత బలరాందేవ్ తల్లి కుమారుడికి అంగ్ నది నుండి బర్మా సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని కానుకగా బహూకరించింది. తరువాత బలరాందేవ్ సంబల్‌పూర్ పేరుతో సామ్రాజ్య స్థాపన చేసాడు. తరువాత సంబల్పూర్ సంరాజ్యం మరింత శక్తివంతంగా మారింది. [1]

చరిత్ర[మార్చు]

బలాంగిర్ పట్టణం బలాంగిర్ జిల్లా కేంద్రంగా ఉంది. ఈ పట్టణం పాట్నా రాజాస్థానానికి 1880 నుండి రాజధానిగా ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దులో గంధమాదన్ కొండల వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం పలు కొండలు, శెలయేర్లతో ప్రకృతి సౌందర్యంతో ఉంటుంది. ఈ ప్రాంతం తాంత్రిక విద్యకు కేంద్రంగా ఉండేది. ఈప్రాంతంలో ఆరంభించిన ప్రజాపాలన రామైదేవ్ తిరస్కరించబడింది.

పురాతన చరిత్ర[మార్చు]

దస్త్రం:Indralath Temple.jpg
8th Century AD Indralath Temple at Ranipur-Jharial.

బలాంగిర్ జిల్లా భూభాగం పురాతన కాలంలో కోసలరాజ్యంలో భాగంగా ఉండేది. సంప్రదాయం అనుసరించి ఈ ప్రాంతం రామాయణ కాలం నాటిదని రాముడు ఇక్కడ దీర్ఘకాలం నివసించినందున ఈ ప్రాంతం దక్షిణ కోసల అయిందని పార్గిటర్ వంటి పండితులు భావిస్తున్నారు. పద్మపురాణ కథనం అనుసరించి రాముని తరువాత రాజ్యం రాముని కుమారులైన లవకుశులకు విభజించి ఇవ్వబడింది. తరువాత కుశుడు " కుశస్థలపురం " స్థాపించి కోసరాజ్యం దక్షిణ భూభాగాన్ని (ఆధునిక పశ్చిమ ఒడిషా, చత్తీస్గఢ్ ) పాలించాడని వివరిస్తుంది.

పణిని[మార్చు]

క్రీ.పూ 5వ శతాబ్దంలో కవి పణిని వ్రాతలను అనుసరించి తైతిల జనపదం సమృద్ధిగా ఉండేదని అది ఇప్పటి బలాంగిర్ జిల్లాలోని తితిలాగర్ అయివుండవచ్చని భావిస్తున్నారు. పణిని వర్ణలను అనుసరించి తైతల జనపదం " కద్రు " (గుర్రాలు లేక పత్తి నూలు) వ్యాపారానికి కేంద్రమని విశ్వసిస్తున్నారు.[2]

చేది[మార్చు]

చేతియ జతక అనుసరించి, చేది రాజ్యానికి శోతివతినగరం రాజధానిగా ఉండేదని అదే హరివంశంలో వర్ణించిన సుక్తిమతిపురి, మహాభారతం వనపర్వంలో వర్ణించిన సుక్తిసహ్వయ అని విశ్వసిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలో కూడా చేది రాజ్యరాజధాని ప్రస్తుత బలాంగిర్ జిల్లాలోని శుక్తిమతి నదీతీరంలో ఉందని వర్ణించబడింది. [3]

కళింగదేవ[మార్చు]

కళింగ సామ్రాజ్య రాజులలో ఒకడైన కళింగదేవ బలాంగిర్ ప్రాంతం కేంద్రంగా చేసుకుని రాజ్యాన్ని పాలించాడు. కళింగ రాజులు జిల్లాలోని సుక్తేల్ నదీ జలాలతో వ్యవసాయభూములకు నీటి సదుపాయం చేయబడింది. తరువాత వారు తూర్పుదిశగా రాజ్యవిస్తరణ చేసి క్రీ.పూ 1 వ శతాబ్దం వరకు పాలించారు. హతిగుంఫా శిలాశాసనాలను అనుసరించి కళింగదేవ రాజర్షి వసు వారసుడని భావిస్తున్నారు. వసువు చేది సామ్రాజ్య స్థాపకుడైన అభిశచంద్ర పుత్రుడని భావిస్తున్నారు. వసు మహాభారతం ఆదిపర్వంలో వర్ణించబడిన " ఉపరిచర వసువు " అయివుడవచ్చని భావిస్తున్నారు. ఉపరిచర వసువు చేది రాజ్య రాజని వసు ప్రస్తుత బలంగీర్, సుబర్ణపూర్ ప్రాంతాలను పాలించాడని భావిస్తున్నారు.[4]

గౌతమపుత్ర శాతకర్ణి[మార్చు]

బలాంగిర్ భూభాగం సా.శ.. 1వ శతాబ్దం వరకు చేది రాజుల పాలనలో ఉండేది. సా.శ.. 2 వ శతాబ్దంలో ఈ ప్రాంతం శాతవాహన రాజైన గౌతమీపుత్ర శతకర్ణి ఆధీనంలోకి మారింది. గౌతమీపుత్ర శతకర్ణి తనగురువు నాగార్జున కొరకు అద్భుతమైన బౌద్ధవిహారం నిర్మించాడు. ఈ విహారం పరిమలగిరి (ఆధునిక గంధమాధన పర్వతం) వద్ద నిర్మించబడింది.

ఆరంభకాల చరిత్ర[మార్చు]

బలాంగిర్ ప్రాంతానికి చెందిన ఆరంభకాల చరిత్ర క్రీ.పూ 3వ శతాబ్దం నుండి లభిస్తుంది. ఆరంభకాల ఆర్యుల మతపరమైన ఆచారాలు దక్షిణకాశిలో ఆచరించబడి వ్యాప్తి చెందాయని భావిస్తున్నారు. జైనమతం కూడా ఇక్కడే ఆరంభమైందని భావిస్తున్నారు. హరివంశం పురాణం అనుసరించి మహావీరుడు ఆరంభకాలంలో నలందా, రాజ్గ్రహ, పనియా భూమి, సిద్ధార్ధగ్రామాలలో " ధర్మా " గురించి ఉపన్యసించాడు. అప్పటి పనియభూమి లేక నాగలోక ప్రస్తుత నాగపూర్ అని, భోగపురా చత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని ఆధునిక బస్తర్, ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్,కలహంది, బలాంగిర్ జిల్లా ప్రాంతమని భావిస్తున్నారు.[5]

శిలాశాసనాలు[మార్చు]

బలంగీర్, సోనెపుర్ జిల్లాలలో లభించిన శలాశాసనాల ఆధారంగా అశోకచక్రవర్తి క్రీ.పూ 216లో కళింగ దేశం మీద దండయాత్ర చేసిన కాలంలో ఈ ప్రాంతం ఆటవిక అని పిలువబడేదని భావిస్తున్నారు. చైనా యాత్రీకుడు హూయంత్సాంగ్ 7వ శతాబ్దంలో ఆధునిక పైక్మల్ బౌద్ధవిహారాన్ని సందర్శించాడు. ఈ విహారంలో పొడవైన వసారాలు, గంభీరమైన సభామందిరాలు ఉన్నాయి. ఇవి 5 శ్రేణులుగా ఉన్నాయి. ఒక్కొక్క శ్రేణిలో 4 సభామండపాలు, నిలువెత్తు బుద్ధ స్వర్ణవిగ్రహాలు ఉన్నాయి.[6]

ఉత్కల్ విశ్వవిద్యాలయం[మార్చు]

ఉత్కల్ విశవిద్యాలయ ఆర్కియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సదాశివ బలాంగిర్ జిల్లాలోని గుద్వెలా మండలంలో తేల్ నదీ లోయలో త్రవ్వకాలు సాగించి గుమగాడ్ ప్రదేశాన్ని వెలికి తీసాడు. అది డాక్టర్ సదాశివ కనిపెట్టిన ప్రదేశం క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందిన వ్యూహాత్మక సైనిక శిబిరం అని భావిస్తున్నారు.[7] దీనిని రాజా కరవేలా సమకాలీన రాజు ఏర్పాటు చేసాడని భావిస్తున్నారు. తెర్సింగా గ్రామంలో లభించిన 4 తామ్రఫలకాల ఆధారంగా ఈ ప్రాంతంలో తెల్ లోయ నాగరికత ఉండేదని తెలుస్తుంది. ఈ తామ్రఫలకాలలో ఉదయపూర్, ప్రభాతద్వారక రాజధానుల గురించిన సమాచారం ఉంది. ఇవి రాష్ట్రకూటుల పాలనలో ఉండేవి. ఈ రాజ్యాలలో వివిధ రాజమంశాలకు చెందిన రాజప్రతినిధులు పాలకులుగా ఉండేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట రాజుల రాజధాని ఉదయపూర్ ప్రాంతంలో ఇప్పటికీ రాజుల నిలువెత్తు విగ్రహాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇవి అధికంగా ఆంతగాడ్ వద్ద ఉన్నాయి. ఇక్కడ మధ్యయుగానికి చెందిన శిథిలమైన కోట ఉంది.[8]

సదానందా అగర్వాల్[మార్చు]

ప్రఖ్యాత చరిత్రకారుడు సదానంద అగర్వాల్ బలాంగిర్ జిల్లాలోని కప్సిల గ్రామం వద్ద లభించిన తామ్రఫలకాలను పరిశీలించాడు. ఈ తామ్రఫలకాలు రాజా ఖడ్గవర్మ కాలానికి చెందినవని భావిస్తున్నారు. 8వ శతాబ్ధానికి చెందిన ఈ తామ్రఫలకాలలో తెల్ లోయ చరిత్ర, నాగరికత, చట్టాల గురించిన వివరణ ఉంది.[9]

పురాతన బలాంగిర్ పాలకులు[మార్చు]

బలాంగిర్ పాలకులు:-

  • ఫందువంసిస్
  • భంజస్
  • సొమవంసిస్
  • తెలుగు ఛొదస్
  • కలుచురిస్
  • గంగస్
  • చౌహన్స్

చౌహాన్ పాలకులు[మార్చు]

  • రాజా రమై దేవ్ (సా.శ..1360-1385 )
  • రాజా మహాలింగ్ సింగ్ దేవ్ (సా.శ..1385-1390 )
  • రాజా వత్సరజ దేవ్ (సా.శ..1390-1410 ఆడి)
  • రాజా వైజల్ దేవ్ 1 (సా.శ..1410-1430 )
  • రాజా భొజరజ్ దేవ్ (సా.శ..1430-1455 )
  • రాజా ప్రతాప్ రుద్ర దేవ్-1(సా.శ..1455-1480 )
  • రాజా భుపల్ దేవ్-1(సా.శ..1480-1500 )
  • రాజా విక్రమాదిత్య దేవ్-1(సా.శ..1500-1520 )
  • రాజా వైజల్ దేవ్ -2 (సా.శ..1520-1540 )
  • రాజా సజ్జ హిరధర దేవ్ (సా.శ..1540-1570 ఆడి) (హాడ్ ఇద్దరు కుమారులు, తరువాత సంబల్పూర్ కింగ్డమ్ స్థాపించారు నరసింగ్ దేవ్, బలరాం దేవ్)
  • రాజా నరసింహ దేవ్ (సా.శ..1570-1577 )
  • రాజా హమిర్ దేవ్ (సా.శ..1577-1581 )
  • (ఇది హృదయ నారాయణ దేవ్, సంబల్పూర్ రాజా బలరాం దేవ్ కుమారుడైన ఆధ్వర్యంలో సా.శ.. 1587-1600 మధ్య) రాజా ప్రతాప్ దేవ్ -2 (1581-1587 & 1600-1620 ఆడి)
  • రాజా విక్రమాదిత్య దేవ్ -2 (సా.శ..1620-1640 ఆడి) (అతని తమ్ముడు గోపాల్ రాయ్ ఖరీర్ రాజా చేశారు)
  • రాజా ముకుందా దేవ్ (సా.శ..1640-1670 )
  • రాజా బలరాం దేవ్ (సా.శ..1670-1678 )
  • రాజా హ్రుదెష దేవ్ (సా.శ..1678-1685 )
  • రాజా రాయ్ సింగ్ దేవ్ (సా.శ..1685-1762 )
  • రాజా చంద్ర సెఖర దేవ్
  • రాజా ప్రుథువిరజ్ దేవ్ (సా.శ..1762-1765 )
  • రాజా రామచంద్ర దేవ్-1(సా.శ..1765 - 1820 )
  • రాజా భుపల్ దేవ్ (సా.శ..1820-1848 ఆడ్) (అతని సోదరుడు మహారాజ్ యువరాజ్ సింగ్ డెఔఅస్ 1765 లో ఝరసింఘ ఎశ్త్రేట్ మంజూరు)
  • మహారాజా హిరవజ్ర సింగ్ దేవ్ (సా.శ..1848-1866 )
  • మహారాజా సుర్ ప్రతాప్ సింగ్ దేవ్ (సా.శ..1866-1878 )
  • మహారాజా రామచంద్ర సింగ్ దేవ్ -2 (సా.శ..1878-1895 )
  • మహారాజా దలగంజన్ సింగ్ దేవ్ (సా.శ..1895-1910 )
  • మహారాజా పృథ్వీరాజ్ సింగ్ దేవ్ (సా.శ..1910-1924 )
  • మహారాజా సర్ రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (సా.శ..1924-1975 )
  • మహారాజా రాజ్ రాజ్ సింగ్ దేవ్
  • మహారాజా కనక్ వర్ధన్ సింగ్ దేవ్

18 గర్లు[మార్చు]

  • శుంబుల్పొరె (సంబల్పూర్)
  • శొనెపూర్ (సోనేపూర్ (ఒడిషా))
  • భమ్ర
  • రెహ్రచొలె
  • ఘంగ్పూర్
  • భౌధ్
  • ఆథమల్లిక్
  • ఫూల్జుర్
  • భున్నే (భొనై)
  • రాయ్గఢ్
  • భురగర్హ్ (భర్గర్హ్)
  • శుక్తీ
  • ఛందర్పుర్
  • శరంగర్హ్
  • భిందనవగర్హ్
  • ఖరీర్
  • భొరసంబర్ (ఫదంపుర్)

చారిత్రక నిర్మాణాలు[మార్చు]

తాంత్రిక్ విద్యా కేంద్రం[మార్చు]

బలాంగిర్ జిల్లాలో, చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో రాణిపూర్ - ఖరియల్ ఒకటి. ఈ ప్రాంతంలోని తంత్రవిద్యా కేంద్రం కారణంగా దేశమంతా గుర్తింపు పొందింది. డాఖిన్ కొసల్‌కు చెందిన సోమవంశ రాజులు ఇక్కడ పలు ఆలయాలను నిర్మించారు. అవి సా.శ.. 8-9 శతాబ్దాలకు చెందినవని భావిస్తున్నారు. అరమైలు పొడవు, పావు మైలు వెడల్పు కలిగిన ప్రదేశంలో దాదాపు 200 ఆలయాలు ఉన్నాయని తెలుస్తుంది. వీటిలో " సోమేశ్వర్ శివాలయం " పెద్ద రాతి ఆలయం. ఈ ఆలయాన్ని మట్టమయూర శైవాచార్య గంగాశివ నిర్మించినట్లు ఆలయంలోని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి.

రాణిపూర్- ఝెరియల్[మార్చు]

జిల్లాలో ఉన్న 5 అపురూపమైన స్మారక నిర్మాణాలలో రాణిపూర్ - ఝరియల్ హౌస్ ఒకటి. గోపురం లేని ఆలయసమూహం 64 యోగినీల కొరకు నిర్మించబడింది. మిగిలిన 3 భువనేశ్వర్ సమీపంలో ఉన్న హరిపూర్‌లో ఉన్నాయి. జబల్‌పూర్ వద్ద ఉన్న ఖజూరహో భెరఘాట్, లలితాపూర్ వద్ద ఉన్న డూధై పురాతన నిర్మాణాలకు చెంది ఉన్నాయి. రాణిపూర్ ఝురియల్ లోని ప్రతిమలను ఇసుకరాతితో మలిచారు. రాణిపూర్- ఝెరియల్ లోని 64 యోగినుల శిల్పాలు వాటి శౌందర్యానికే కాక మతపరమైన ప్రాముఖ్యత వలన కూడా గుర్తింపును పొందుతున్నాయి. 64 మంది యోగినుల మద్య త్రిముఖ నటరాజ శిల్పం నిలబడి ఉంది. యోగినులు వివిధ భంగిమలలో ఉన్నారు. కానుగతంగా నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం 48 మంది యోగినీ శిల్పాలు ఇక్కడ నుండి తొలగించబడ్డాయి.[10]

స్వాతంత్రానికి ముందు పరిశ్రమలు[మార్చు]

బలాంగిర్ ఒడిషా రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన జిల్లాగా గుతుంచబడుతుంది. ఒడిషాలో కలిసే ముందు ఈ ప్రాంతం అభివృద్ధి దశలో ఉంది. గత పాట్నా రాజ్యం ఇండియాలో మొదటి పారిశ్రామిక ప్రాంతగా గుర్తించబశింది. 17వ శతాబ్దంలోనే ఈ ప్రాంతంలో పరిశ్రలు స్థాపించబడ్డాయి.

  • స్వాతంత్ర్యానికి ముందు ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రలు.[1]
  • ఖొషల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ బలంగీర్
  • ఖొషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ బలంగీర్
  • బలాంగిర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ టిత్లగర్హ్
  • పాట్నా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ లిమిటెడ్, ళథొర్
  • రాజేంద్ర టైల్ వర్క్స్ లిమిటెడ్, టిత్లగర్హ్
  • ఖొషల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సిండికేట్ బలంగీర్
  • పాట్నా రాష్ట్రం గ్రాఫైట్ మైనింగ్ కంపెని టిత్లగర్హ్
  • పాట్నా రాష్ట్రం చేనేత కర్మాగారము, బలంగీర్
  • మహావీర్ జైన్ చేనేత కర్మాగారము, భెల్గఒన్
  • చేనేత కర్మాగారము, ంఅనిహిర, ళొఇసింఘ
  • సెంట్రల్ జైల్ చేనేత కర్మాగారము, బలంగీర్
  • చేతితో పేపర్ ఫ్యాక్టరీ, బలంగీర్

ఒడిషా రాష్ట్రంతో మిశ్రితం[మార్చు]

1948 జనవరి 1 పాట్నా, సోనేపూర్ ఒడిషాలో చేరిన తరువాత చౌహాన్ పాలన ముగింపుకు వచ్చింది. ఇవి రెండు కలిసి బలాంగిర్ జిల్లాగా చేయబడ్డాయి. 1993 ఏప్రిల్ 1 న సోనేపూర్ ప్రత్యేక జిల్లాగా రుఇపొందించబడింది. తరువాత పాట్నా పాలకుడు రాజేంద్రసింగ్ దేవ్ విజయవంతంగా ప్రాంతీయ రాజకీయాలలో భాగస్వామ్యం వహించాడు. 1967 - 1971 వరకు ఆయన ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

ఆధునిక అభివృద్ధి[మార్చు]

ప్రస్తుతం ఈ జిల్లా ప్రజలు ఒడిషా లోని 9 జిల్లాలతో చేరి కోసల్ పేరుతో ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబడుతున్నారు. బలాంగిర్ జిల్లా నుండి సంవత్సరానికి 20,000 మంది ప్రజలు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని అనధికార వివరణలద్వారా తెలుస్తుంది. జిల్లాలో 90% కంటే అధికులు దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. ఆర్డినెంస్ డేవెలెప్మెంటు బోర్డ్ ఇక్కడ ఒక భారతీయ సైనిక ఆయుధాల కర్మాగారం స్థాపించారు.

మౌలిక సౌకర్యాలు[మార్చు]

ఒడిషా పశ్చిమ ప్రాంత జిల్లా అయిన బలాంగిర్ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల స్థాయికి చేరుకోవడానికి జిల్లాలో వేగవంతమైన మైలిక సదుపాయాల అభివృద్ధి చేయడం అవసరం. ప్రభుత్వం శ్రద్ధ వహించి రహదారుల నిర్మాణం, ప్రభుత్వ భవనాలు, విద్యా సౌకర్యం, రైల్వే, వాయుమార్గం అనుసంధానం మంటి మైలిక సదుపాయాలను మెరుగుపరచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లా నుండి 7 గంటల కారుప్రయాణం చేసి భువనేశ్వర్, రాయపూర్, విశాఖపట్నం విమానాశ్రయం చేరికోవచ్చు. జిల్లా ప్రజల జీవనస్థాయిని పెంచడానికి ఉపాధి కల్పన అధికం చేస్తే వలసలను నివారించవచ్చు. మరొకవైపు కట్నం మరణాలు, దొగతనం, దోపిడీ, హత్యలు వంటి అసాంఘిక చర్యలను కూడా అదుపులోకి తీసుకురావలసిన అవసరంఉంది. 2010 మే మాసంలో 309-97 కోట్ల బడ్జెటుతో క్రెడిట్ ప్లాన్ ప్రవేశపెట్టి దడ శ్రామిక వంటి కూలీల తరలింపు కార్యక్రమాలను నిరోధించడానికి ప్రయత్నించారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా వాయవ్య సరిహద్దులో రామాయణంలో ప్రస్తావించబడిన గంధమర్ధన్ పర్వతాలు, ఈశాన్య సరిహద్దులో మహానది ఉన్నాయి. జిల్లాలో పలు శెలయేర్లు ప్రవహిస్తున్నాయి, ఉన్నాయి. జిల్లాలో సతతహరితారణ్యాలు ఉన్నాయి. జిల్లాలో బైసన్, సాంబార్ జింకలకు ఆశ్రయం ఇస్తుంది. ప్రధాన అటవీప్రాంతం పశ్చిమ సరిహద్దు వెంట నౌపడా జిల్లా, కలహంది సరిహద్దులను తాకుతూ తూర్పుగా గంధమాధన పర్వతాలకు సమాంతరంగా సాగుతుంది. ఇక్కడ స్వల్పంగా ఉన్న నివాసాలు, తరుచగా అడవులను నిర్మీలించడం కారణంగా ఆదవులు అక్కడక్కడా పలుచబడ్డాయి. అయినప్పటికీ ఇక్కడ విస్తారంగా నాణ్యమైన వెదురు, సాల్, సాహై, పియాసల్, ధౌరా, ఎబోనీ చెట్లు పెరుగుతుంది. గంధమాధన పర్వతాలు కొంతమేర మైదనాలు ఉంటాయి. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉంటుంది. తెల్ నదికి వాయవ్య సరిహద్దులో ఉంటుంది. తెల్ నది బలాంగిర్ జిల్లాకు కలహంది, సోనెపూర్, బౌధ్, కంథమాల్ జిల్లాల మధ్య సరిహద్దును ఏర్పరిస్తుంది.

ప్రధాన నదులు, ఉపనదులు[మార్చు]

  • మహానది
  • టెల్
  • ఊందర్, ళంథ్, శుంగద్, సుఖ్తేల్ (టెల్ ఉపనదులు)
  • ఆంగ్
  • ఝీఋఆ
  • శలెషింగ్

కొండలు[మార్చు]

గంధమర్ధన్ (3,296 అడుగులు)

  • భుతెల్ (2,670 అడుగులు)
  • ఛహ్ద్లి (2.630 అడుగులు)
  • ఠుత (2,056 అడుగులు)
  • బెండర్ (1,920 అడుగులు)
  • ఫత్పని
  • చతర్దండి
  • మత్కై (2,591)

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బలాంగిర్ జిల్లా ఒకటి అని గుర్తించింది..[11] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[11]

అడ్మినిస్ట్రేటివ్ సెటప్[మార్చు]

Bolangir జిల్లా 3 సబ్ డివిజన్లు, 14 బ్లాక్స్ విభజించబడింది. డిస్ట్రిక్ట్ (1764 నివసించిన, జనావాసాలు 30) 1,794 గ్రామాలతో 285 గ్రామ పంచాయతీ ఉన్నాయి.

  • సబ్ డివిజన్లు : (3): బలంగీర్, పట్నాఘర్, తితిలగర్
  • బ్లాక్స్ : (14): అగల్పూర్, బలంగీర్, బెల్పర, బొంగముండ, దేఒగావున్, గుడ్‌వెల్లా, ఖపరఖొల్, లోయిసింగ, మురిబహల్, పట్నాఘర్, పుయింతల, సైంతల, తితిలగర్, తురెయికెల.
  • తహసిల్స్ : (14): అగల్పూర్, బలంగీర్, బంగముండ, బెల్పర, దేవగావ్, కాంతబంజి, ఖప్రఖోల్, లోయిసింగ, మొరిబహల్,, పట్నాఘర్, పుయింతల, సైంతల, తితిలిగర్, తుసుర
  • అర్బన్ బాడీస్ : (4):
  • మున్సిపాలిటీ: (1): బలంగీర్
  • ఎన్.ఎ.సి : (3): కాంతబంఝి, పట్నాఘర్, తితిలిగర్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,648,574,[12]
ఇది దాదాపు. గునియా-బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[13]
అమెరికాలోని. ఇదాహో నగర జనసంఖ్యకు సమం.[14]
640 భారతదేశ జిల్లాలలో. 302 వ స్థానంలో ఉంది..[12]
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.5%.[12]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ జాతులకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నారు.

షెడ్యూల్డ్ కులాలు[మార్చు]

కింది 7 జాతులకు చెందిన షెడ్యూల్డ్ తరగతికి చెందిన ప్రజలు మొత్తం షెడ్యూల్డ్ తరగతికి చెందిన ప్రజలలో 96.6% ఉన్నారు.

  • భరిక్
  • ఛమర్, మోచి లేదా సత్నమి
  • ఢుబ లేదా దోబీ
  • డోమ్ లేదా డురీ డోమ్
  • గాండా
  • భెత్ర
  • ఘసి
  • మెహ్రా లేదా మహర్దశ

ఆది ఆంధ్ర, ఆమంత్ ఒర్ ఆమత్, బదైక్, బఘెతి, బజికర్, బౌరి, బెల్దర్, భత, భొఇ, ఛకలి, ఛందల, దందసి, దెవర్, ధన్వర్, ఘంతర్ఘద ఒర్ ఘంత్ర, ఘొగీ, గొద్ర, హది, ఝగ్గలి, ఖంద్ర, ఖరూ, ఖదల, ఖురుంగ, లభన్, లహెరి, మల, మంగ్, మంగన్, ముందపొత్త, నైక్, ఫైది, ఫనొ, ఫనిక, ఫంతంతి, ఫప్, రెల్లి, సమసి, సనై, సిధ్రీ, సింధురీ, సియల్, టమదీ, తన్ల, తిఒర్ వీరిలో కొన్ని కులాలకు చెందిన ప్రజలు భట, దండసి, గోద్రా, మాలా, రెల్లి, ముందపోట్ట, పైది ప్రాంతాలలో నివసిస్తున్నారు.

ఎస్.టి[మార్చు]

జిల్లాలో 31 షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. ఈ కింది 8 జాతులకు చెందిన ప్రజలు మొత్తం షెడ్యూల్డ్ తెగల ప్రజలలో 97 % ఉన్నారు.

  • భింఝల్
  • దళ్
  • గోండు
  • ఖొంద్ లేదా ఖొంధ లేదా
  • ంఇర్ధస్
  • ముండా
  • శబర్ లేదా శూర లేదా సహారా
  • షబర్ లేదా లోధా

వీరిలో కొందరు బగత, బంజర ఒర్ బంజరి, భుయన్, భూమిజ్, బింఝీ ఒర్ బింఝో, డల్, ధరూ, గందీ, గొంద్, హొ, హొల్వ, కవర్, ఖరీ ఒర్ ఖరీన్, కిసన్, కొళ, కొందదొర, కొర, కొరూ, కుతీ, కులిస్, మహాలి, మంకిది, ఒరఒన్, సంథల్, థరు.ప్రాంతాలలో ఇప్పటికీ నివసిస్తున్నారు.

ఒ.బి.సి[మార్చు]

ఒ.బి.సికి చెందిన ప్రజల వివరణ కింద జాబితాలో ఇంది.

  • ఆగరీ
  • బనియా
  • భైరగి
  • భని
  • భులీ
  • దుమల్
  • గుదీ
  • కళర
  • ఖదుర
  • కొస్థ
  • మల్లి
  • సుడ
  • తేలి
  • ఠనపతి
  • చస
  • కుఇల్త
  • గూడ
  • కుంభకర్

సాధారణం[మార్చు]

జిల్లాలో ఎస్.టి, ఎస్.సి, ఒ.బి.సి లకు చెందినవారే కాక ఇతర కులాలకు చెందిన ప్రజలు 25% ఉన్నారు.

  • బ్రాహ్మణులు
  • కరన్
  • ఖందాయతులు
  • క్షత్రియులు

భాషలు[మార్చు]

బలాంగిర్ జిల్లాలో ప్రధానంగా వాడుకలో ఉన్న భాష కొస్లి లేక సంబల్పుర్. ప్రజలలో హిందీ రెండవ భాషగా చెలానణిలో ఉంది. ఆంగ్లం, ఒడిషా స్కూలు స్థాయిలో బోధించబడుతుంది. ఉన్నత విద్యకు ఆంగ్లం బోధించబడుతుంది. ఈ జిల్లాలో ప్రజలు ప్రస్తుతం ఒరియా కంటే అధికంగా హిందీని ధారాళంగా మాట్లాడుతుంటారు.

సంస్కృతి[మార్చు]

జానపద నృత్యాలు[మార్చు]

చిన్నపిల్లల కొరకు చియోల్లై, హుమోబౌల్, దౌలిజిట్ వంటినృత్యాలు, ఆరంభకాల యువతకు సాజని, చటా, దైక, భెకని వంటినృత్యాలు. పరిపక్వ యువత కొరకు రాసర్కెలి, జైఫుల్, మైలజడా, భయమన,ంగుంచికుటా, దల్ఖై వంటి నృత్యాలు రూపకల్పన చేయబడ్డాయి. పనిని ఆరాధించే పురుషులకు విశ్వకర్మ స్వామికి, కర్మషాని దేవిని కీర్తిస్తూ కర్మ, ఝుమర్ వంటి నృత్యాలు రూపకల్పన చేయబడ్డాయి. పొలం దున్నుట, నాటు, ఒబ్బిడి, దంపుడు, బండి, పడవ తోలే సమయం, పశువులను మేపడం వంటి ప్రతి పని, విశ్రాంతి సమయాలలో సందర్భానుసారంగా దేవతారాధనతో ఆరంభిస్తుంటారు. వివాహాలు, సాంఘిక ఉత్సవాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి సంగీతం, నృత్యాలు రూపకల్పన చేయబడి ఉన్నాయి. వృత్తికళాకారులు దండ్, డంగడ, మొద్గడ, ఘుంరా, సాధన, సాదర్ - సబరన్, డిస్డిగో, నచిన - బజ్నియా, సంపర్ద, సంచార్ నృత్యాలను ప్రదఋశిస్తుంటారు. అన్ని సందర్భాలకు తగిన వ్యత్యాసమైన నృత్యాలు, సంగీతం ఉన్నాయి. ఏవిధమైన జానపద నృత్యమైనా నృత్యానికి తగిన సంగీతం, సంగీతానికి అనుగుణమైన అడుగులు వేస్తూ నర్తిస్తుంటారు.

పండుగలు[మార్చు]

శీతల్ శస్తి[మార్చు]

ఇది ఉమామహేశ్వర కల్యాణ సంబంధిత పండుగ. ఈ పండుగను జూన్ మాసంలో ఉత్సాహంగా ఒక వారం నిర్వహించబడుతుంది. సమీపప్రాంతం నుండేకాక మధ్యప్రదేశ్, బీహార్ నుండి కూడా యాత్రీకులు ఈ ఉత్సవాలకు వస్తుంటారు. ఈ ఉత్సవాలకు లక్షలాది యాత్రీకులు వస్తుంటారు.

నౌఖై[మార్చు]

బలంగీర్‌, పశ్చిమ ఒడిషాలలో ఇది పూర్తిగా ప్రాముఖ్యత కలిగిన పండుగలో ఇది ఒకటి. ఈ పండుగను ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి 15 రోజులకు ముందు నుండే ఉత్సవం ఆరంభం ఔతుంది. వరిపంట నుండి తయారు చేసిన మొదటి బియ్యం నుండి విధవిధంగా పదార్ధాలు తయారు చేసి దేవతలకు నైవేద్యం చేయబడుతుంది. తరువాత ఇంటి పెద్ద ఆహారాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెడతాడు. ఇల్లంతా శుభ్రం చేయడం ఒకరికి ఒకరు అభినందనలు చెప్పడం వంటివి చేస్తారు. హిందువులు అందరూ పేదా ధనిక తేడా లేకుండా జరుపుకుంటారు. పశ్చిమ ఒడిషా అంతటా ఈ పండుగ ప్రజాబాహుళ్యం ఈ పండుగను జరుపుకుంటారు.

భైజుంటియా[మార్చు]

పశ్చిమ ఒడిషా అంతటా దుర్గాష్టమి రోజుల ఈ పండుగ నిర్వహించబడుతుంది. ఈ పండుగ రోజున స్త్రీలు రోజంతా ఒక్క పొద్దు ఉండి తమ సోదరుల రక్షణ కొరకు రాత్రివేళలో దుర్గాదేని పూజిస్తారు.

పౌజుంటియా[మార్చు]

పౌజుంటియా స్త్రీలకు ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ పండుగ రోజున తల్లులు తమకుమారుని దీర్ఘాయుషు, సౌభాగ్యసంపదల కొరకు దుతుబహనాదేవిని పూజిస్తుంటారు. ఇవి కాక జిల్లాలో శివరాత్రి, డిలాజాత్రా, దుర్గాపూజ, జన్మాష్టమి, దీపాబళి, గణేశ్ పూజ, సరస్వతి పూజ జరుపుకుంటారు.

శివరాత్రి మేళా[మార్చు]

హుమా, తితాగర్ శివరాత్రి మేళా పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. బలాంగిర్ మద్యప్రాంతమంతా జరసింగ్ మొదలైన ప్రాంతాలలో ఉత్సాహంగా రథ జాత్రా నిర్వహించబడుతుంది. సులియా జాత్రా, పతఖండ జాత్రా వంటి ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

షరబన పూర్ణిమ[మార్చు]

షరబన పూర్ణిమ సందర్భంలో శివభక్తులు కాలినడకతో హరిశంకర్, బెల్ఖండిలకు చేరుకుంటారు. భక్తులు శివునికి పవిత్రజలాలు సమర్పించి ఆరాధిస్తారు. బీహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.

జిల్లాలో ముస్లిములు ఈద్- ఉల్- జుహ, మొహరం వంటి పండుగలను, సిక్కులు గురునానక్ పుట్టినరోజు నిర్వహిస్తుంటారు.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

పత్నఘర్[మార్చు]

పాట్నా రాజ్యానికి రాజధానిగా ఉండేది. పత్నఘర్ ఇతిహాస కాలవైభవం, ఆధునిక సరిళి రెండింటికి సాక్ష్యంగా ఉంది. పత్నేశ్వరి ఆలయాలు చాళుఖ్యుల శైలిలో నిర్మించబడ్డాయి. 12వ శతాబ్ధానికి చెందిన సోమేశ్వరాలయం ఒకటి. చౌహాన్ పాలన కాలంలో పశ్చిమ ఒడిషాలో నిర్మించబడిన ఆలయసమూహాలు పురాతన చిహ్నాల అవశేషాలుగా నిలిచి ఉన్నాయి. జిల్లాకేద్రానికి 40కి.మీ దూరంలో బంగిర్ రైల్వే స్టేషను సౌకర్యం లాడ్జింగ్, బోర్డింగ్ వసతి సౌకర్యాలు ఉన్నాయి.

రాణీపూర్ - ఝరైయల్[మార్చు]

సోమతీర్ధ శలాశాసనాలలో రాణిపూర్ ఝరియల్ గురించిన వివరాలు లభిస్తున్నాయి. జిల్లాలో శైవిజం, బుద్ధిజం, వైష్ణవిజం, తాంత్రికం మిశ్రిత మతదాంప్రదాయం ఉంది. 64 యోగినులను ప్రతిష్ఠించిన ఆలహసమూహాలున్న రాణిఝురియల్ భారతదేశంలో ఇది ఒక్కటేనని భావిస్తున్నారు. ఇక్కడున్న ప్లెథోరాకు చెందిన 50 ఆలయాలలో సోమేశ్వరాలయం ఒకటి. బ్రహ్మాండమైన ఇటుకల భవనం ఒడిషా రాష్ట్రంలో ఎత్తైన ఇటుకల ఆలయంగా గుర్తించబడుతున్నాయి. ఇక్కడి నుండి 100కి.మీ దూరంలో ఉన్న కంటబంజిలో రైల్వే స్టేషను ఉంది. కంటబంజి నుండి రాణీపూర్ - ఝరైయల్ బసు వసతి ఉంది. .

సైంతల[మార్చు]

సైతలలో ఉన్న ప్రబల చంఢీ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. మహిషమర్ధిని రూపంలో ఉన్న చంఢీదేవి ప్రస్తుతం చిన్న కొండగుట్ట మీద ప్రతిష్ఠితమై ఉంది. మహావిష్ణువుకు చెందిన దశావతార శిల్పాలు, గంగా మైయు యమునా ప్రతిమలు ఉన్న విరిగిన ద్వారబంధాలు ఉన్నాయి. ఇక్కడి నుండి 40కి.మీ దూరంలో శాంతల రైల్వేస్టేషను ఉంది.

జోగిసరద[మార్చు]

లోయిసింఘాకు 7కి.మీ దూరంలో జోగిసరదాలో " జోగీశ్వరాలయం " ఉంది.

తురెకెల[మార్చు]

తురెకెలలో బృందాలుగా కేంపు చేయడానికి తగిన వసతి సౌకర్యాలు ఉన్నాయి. తురికెలలో పులి, జింకలు, ఎలుగుబంట్లు, కోతులు మొదలైన వన్యమృగాలు ఉన్నాయి. ఈ అరణ్యప్రాంతంలో పలు విధాలైన పక్షులుకూడా ఉన్నాయి. ఇది జిల్లా కేంద్రం నుండి 98 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వేస్టేషను తితిలాఘర్.

బెల్పర[మార్చు]

బలాంగిర్ జిల్లాలో ఉన్న అందమైన పట్టణాలలో బెల్పర ఒకటి. బెల్పరా రథయాత్ర, దుర్గాపూజ, లక్ష్మి పూజ, గిరిగోబిర్ధన్ పూజ, బిశ్వకర్మ పూజలకు బెల్పరా ప్రత్యేక గుర్తింపును పొందింది.

చౌదపలి[మార్చు]

బలంగిర్, పత్నగర్ మద్య ఉన్న అందమైన ప్రదేశం ఇది. ఇది ప్రాంతీయ కుటీరాలు, మార్కెటుకు గుర్తింపును కలిగి ఉంది.

హరిశంకర్[మార్చు]

ఇది పూర్తిగా ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంది. హరిశంకర్ ఆలయంలో శివుడు, విష్ణువు ఒకే ఆలయంలో ప్రయిష్టితమై ఆరాధించబడుతూ ఉన్నారు. సహజ సౌందర్యం ఇనుమడిస్తూ ఇక్కడ సెలఏరు ఒకటి ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక పర్వతారోహణా కేంద్రం ఉంది. పర్యాటకులు ఖసడా వద్ద స్నానం చేసే సౌకర్యం ఉంది. ఇది చక్కని విహారకేంద్రంగా గుర్తించబడుతుంది.

మధియాపలి[మార్చు]

మధియాపలి వద్ద ప్రబల నాగ బచ్చా మందిరం ఉంది. పాముకాటుకు గురైన వారు ఈ ఆలయంలో నాగదేవతను ఆరాధించి స్వస్థత పొందుతుంటారు.

విద్య[మార్చు]

మద్యయుగంలో సోమవంశరాజుల మీద భక్తితో కొందరు బ్రాహ్మణులు ఇక్కడ స్థిరపడ్డారు. అలాంటి ప్రదేశాలలో ప్రధానమైనది వినీతపుర (ప్రస్తుత బింక), సువర్ణపుర (ఆధునిక సోనేపూర్), రోయర (ప్రస్తుత రొహిల), రాణిపూర్, ఝరియల్ మొదలైనవి. మద్యయుగంలో ప్రాముఖ్యకలిగి ఉన్న ఈ ప్రాతం సంస్కృతి గురించిన వివరాలు కూన్ని తారమపత్రాలు, ఇతర పురాతత్వ పరిశోధక విశేషాల వలన తెలుస్తుంది. చౌహాన్ రాజుల పాలనా కాలంలో సంస్కృత విద్యకు గొప్ప ప్రోత్సాహం ఉండేది. పాట్నా ఆరంభకాల రాజైన రాజా వైజల్ దేవ్ " వైజల్ చంద్రికా (ప్రభోధ్ చంద్రిక) పేరుతో ఒక నిఘంటువును రూపొందించాడు.

18-19 వశతాబ్దంలో విద్య[మార్చు]

18-19 వశతాబ్దంలో ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తి అంతగా జరగలేదు. అబధనాలు అనబడే ఉపాధ్యాయులు సంచారం చేస్తూ పట్టణాలు, గ్రామాలలో ప్రాధమిక విద్యను బోధిస్తూ ఉండేవారు. వారు వ్రాయడం, చదవడం, గణితం మాత్రమే బోధించే వారు. గ్రామాలలో గ్రామస్థులు పాఠశాలలను నిర్మించి వాటిలో అబధనాలను ఉపాధ్యాయులుగా నియమించేవారు. 19వ శతాబ్ధపు చివరలో ఈ ప్రాంతంలో వెస్టర్న్ విద్య మొదలైంది. 1894 లో మహారాజా రామచంద్ర ఈ ప్రాంతంలో ఆంగ్లపాఠశాల నిర్మించాడు. భరతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి బలంగీర్‌లో బాలుర కొరకు 39 హైస్కూల్స్, బాలికల కొరకు 4 హైస్కూల్స్, 119 మిడిల్ స్కూల్స్, 11 బాలికల మిడిల్ స్కూల్స్ ఉన్నాయి. బాలికల పాఠశాలలు అన్నీ కలిపి వరుసగా 11,906, 1,550 ఉన్నాయి.

బలాంగిర్ మెడికల్ కాలేజి వివాదం[మార్చు]

" ఆర్.వి.ర్స్ ఎజ్యుకేషనల్ ట్రస్ట్ ఆఫ్ కోయంబత్తూర్ " బలగిర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ స్థాపించడానికి చేసిన ప్రయత్నం దీర్ఘకాల వివాదం తరువాత విజయం సాధించింది.

రాజకీయాలు[మార్చు]

పార్లమెంటు సభ్యుడు[మార్చు]

  • శ్రీ.కైలాష్ నారాయణ్ సింగ్ దేవ్.(బి.జె.డి)

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

The following is the 5 Vidhan sabha constituencies[15][16] of Balangir district and the elected members[17] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
66 లోయిసింగ షెడ్యూల్డ్ కులాలు లోయిసింఘ, అగల్పూర్, పుయింతల. జోగేంద్రబెహరా బి.జె.డి
67 పత్నాగర్ లేదు పత్నాగర్ (ఎన్.ఎ.సి), పత్నాగర్, ఖప్రఖొల్, బెల్పరా కనక్ వర్ధన్ సింగ్ దేవ్ బి.జె.పి
68 బలంగిర్ లేదు బలాంగిర్ (ఎం), బలంగిర్, దేవ్గావ్. నరసింగ మిస్రా. ఐ.ఎన్.సి
69 తితిలగర్ లేదు తితిలగర్ (ఎన్.ఎ.సి), సైంతల, తెంతులిఖుంతి (గుడ్వెల్ల) తుకుని సాహు (గీత) (బి.జె.డి)
70 కంతబంజి లేదు కంతబంజి (ఎన్.ఎ.సి), తుకెల, బంగొముండ, మురిబహల్. అయుబ్ ఖాన్ బి.జె.డి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Orissa District Gazetteers: Balangir, Printed by the Superintendent, Orissa Government Press, 1966
  2. Panini's Ashtadyayi VI. 2. 42
  3. D. C. Sircar Ancient Geography of India Pg.55
  4. D. C. Sircar Ancient Geography of India
  5. D. C. Sircar, Inscripton of Orissa, Pg. 263
  6. Yuan Chawng 'Journey of the West'
  7. http://kddf.files.wordpress.com/2010/09/gumagod.png
  8. "Riverside kingdom traced in copper plates". The Telegraph. Calcutta, India. December 9, 2010.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-09. Retrieved 2014-10-16.
  10. http://www.kosal.org/
  11. 11.0 11.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  12. 12.0 12.1 12.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  13. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  14. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582
  15. Assembly Constituencies and their EXtent
  16. Seats of Odisha
  17. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]