బల్లిపర్రు (పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్లిపర్రు (పెడన మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,651
 - పురుషులు 779
 - స్త్రీలు 872
 - గృహాల సంఖ్య 450
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08672

బల్లిపర్రు, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు=

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, శింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల[మార్చు]

2005లో గురుకుల ప్రధాన భవనాన్ని ప్రారంభించారు. ముందు పాఠశాలగా ప్రారంభమైన గురుకులం, తరువాత కళాశాలగా అభివృద్ధి చెందినది. ఇక్కడ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 600 మంది బాలికలు 5వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు విద్యనభ్యసించుచున్నారు. పెడన నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ కళాశాలకు మరెక్కడా లేని విధంగా ఇక్కడ సౌకర్యాలు సమకూరుచున్నవి. ఈ పాఠశాల విద్యార్థుల కొరకు, మూడున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డార్మిటరీల నిర్మాణం పురోగతిలో ఉంది. [3]&[4]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గోగులమ్మ (గంగానమ్మ) అమ్మవారి ఆలయం:- పాతబల్లిపర్రుకు 1 కి.మీ. దూరంలో ఊరు బయట ఉన్న ఈ ఆలయాన్ని రు. 5 లక్షలతో పునర్నిర్మించారు. 2014,మే-31 న పునహఃప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పాతబల్లిపర్రులోని ఈ ఆలయంలో ఉత్సవాలు 2014,జూన్-4 నుండి 8 వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా జూన్-6, శుక్రవారం ఉదయం, ఊరేగింపు జరిపినారు. 43 సంవత్సరాల తరువాత ఉత్సవాలు వైభవంగా జరుగుచుండటంతో, గ్రామాంతరం వెళ్ళినవారు, పెళ్ళిళ్ళు చేసికొని అత్తారిళ్ళకు వెళ్ళిన ఆడబడుచులు గ్రామానికి చేరుకున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఇంటి ఆడబడుచులకు నూతన వస్త్రాలు పెట్టనున్నారు. దీనితో గ్రామంలో ఆధ్యాత్మికశోభ నెలకొన్నది. ఉత్సవాలలో భాగంగా బల్లిపర్రు గ్రామ ప్రధాన వీధులలో పోతురాజు ఘటాన్ని, జూన్-6, శుక్రవారం నాడు ఊరేగింపు జరిపినారు. యువకులు ఈ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

==గ్రామ ప్రముఖులు==Venkata ramana pamarthi

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,651 - పురుషుల సంఖ్య 779 - స్త్రీల సంఖ్య 872 - గృహాల సంఖ్య 450

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1598.[2] ఇందులో పురుషుల సంఖ్య 797, స్త్రీల సంఖ్య 801, గ్రామంలో నివాస గృహాలు 428 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Balliparru". Retrieved 2 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014,జూన్-7; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-9; 4వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016,మే-7; 4వపేజీ.