భారతదేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1966లో భారత ప్రధాని ; ఆమె భారతదేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి.

'రాజకీయ భాగస్వామ్యం' అనేది చాలా విస్తృతమైన పదం. దీని అర్థం కూడా చాలా విస్తృతమైనది. భాగస్వామ్యం అంటే 'ఓటు హక్కు'కి పరిమితం కాదు. అన్నింటికి సంబంధించినది. అంటే నిర్ణయం తీసుకోవడం, రాజకీయ క్రియాశీలత, రాజకీయ స్పృహ మొదలైనవి. భారతదేశంలోని మహిళలు ఓటింగ్‌లో పాల్గొంటారు, ప్రభుత్వ కార్యాలయాలలోను, రాజకీయ పార్టీలలో దిగువ స్థాయిలలో పురుషుల కంటే ఎక్కువ పోటీ చేస్తారు. రాజకీయ క్రియాశీలత, ఓటింగ్ రంగాలలో మహిళల రాజకీయ భాగస్వామ్యం బలంగా ఉంటుంది. రాజకీయాల్లో లింగ అసమానతలను రూపు మాపడానికి, భారత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ స్థానాలలో మహిళల కోసం రిజర్వేషన్లను ఏర్పాటు చేసింది.

భారత పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలలో మహిళల నుంచి 65.63 శాతం, పురుషుల నుంచి 67.09 శాతం పోలింగ్ నమోదైంది. భారతదేశం పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం అట్టడుగు నుండి 20వ స్థానంలో ఉంది.[1] భారతదేశంలో మహిళలు రాష్ట్రపతులుగా ఉన్నారు, ప్రధాన మంత్రి, అలాగే వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. భారతీయ ఓటర్లు అనేక దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల శాసన సభలకు, జాతీయ పార్లమెంటుకు మహిళలను ఎన్నుకున్నారు.

మహిళల రాజ్యాంగ హక్కులు

[మార్చు]

భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ వ్యవస్థ పౌరులకు ఎన్నుకోబడే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, సమావేశాలు సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, ఓటు హక్కు కు హామీ ఇస్తుంది.[2] భారత రాజ్యాంగం లింగం, వర్గం ఆధారంగా వివక్షను నిషేధించడం, మానవ అక్రమ రవాణా, బలవంతపు పనిని నిషేధించడం, ఎన్నికైన స్థానాలను మహిళలకు కేటాయించడం (రిజర్వ్) చేయడం ద్వారా లింగ అసమానతలను తొలగించడానికి ప్రయత్నిస్తుంది.[3]

సమాన వేతనం, ఉచిత న్యాయ సహాయం, మానవ పని పరిస్థితులు మెరుగు పరచడం, ప్రసూతికి ఉపశమనం, పని, విద్యా హక్కులు, జీవన ప్రమాణాలను పెంచడం వంటి చర్యల ద్వారా వర్గం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలను ఆదేశించింది. [4] 20వ శతాబ్దం ప్రారంభంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళలు గణనీయంగా పాల్గొన్నారు. బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం కోసం వాదించారు. స్వాతంత్ర్యం రాజ్యాంగ హక్కుల రూపంలో లింగ సమానత్వాన్ని తీసుకువచ్చింది, అయితే చారిత్రాత్మకంగా మహిళల రాజకీయ భాగస్వామ్యం తక్కువగానే ఉంది. [5]

మహిళా భాగస్వామ్యం

[మార్చు]

ఓటింగ్

1947కి ముందు బ్రిటీష్ వారి వలస పాలనలో ఎక్కువ మంది పురుషులు లేదా మహిళలకు ఓటు వేసే హక్కు లేకపోయినా, ఓటు హక్కు కోసం జాతీయ ఉద్యమానికి ప్రతిస్పందనగా, 1900ల ప్రారంభంలో మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, 1950లో భారత రాజ్యాంగం అధికారికంగా స్త్రీలు, పురుషులకు ఓటు హక్కును మంజూరు చేసింది. సార్వత్రిక ఓటు హక్కుకు ముందు, ప్రావిన్షియల్ లెజిస్లేచర్లు మహిళలకు ఓటు హక్కును కల్పించారు.

1921లో మద్రాసు మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది, అయితే బ్రిటిష్ వారి పరిపాలన పత్రాల (రికార్డుల) ప్రకారం భూమి ఆస్తిని కలిగి ఉన్న పురుషులు, మహిళలకు మాత్రమే ఈ ఓటు హక్కుఇచ్చారు.[6] ఓటు హక్కు కోసం ఉద్యమానికి ప్రతిస్పందనగా మంజూరు చేయబడిన ఈ హక్కులు అక్షరాస్యత, భర్తల ఆస్తి యాజమాన్యంతో సహా ఆస్తి యాజమాన్యం వంటి అర్హతలకు పరిమితం అయ్యాయి. [5] దీని వలన చాలా మంది భారతీయ స్త్రీలు, పురుషులకు ఓటింగ్ అర్హత మినహాయించ బడ్డారు ఎందుకంటే వారు పేదవారు. 1950లో వయోజన భారతీయ పౌరులందరికీ సార్వత్రిక ఓటుహక్కు మంజూరు చేయబడినప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది.

1950లో, సార్వత్రిక ఓటు హక్కు మహిళలందరికీ ఓటు హక్కును కల్పించింది. సార్వత్రిక ఓటు హక్కుని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326లో పొందుపరిచారు. భారతదేశం రెండు సభలతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ: లోక్‌సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ). 1962 లోక్‌సభ ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం 46.63% ఉండగా, 1984లో 58.60%కి పెరిగింది. అదే సమయంలో పురుషుల పోలింగ్ 1962లో 63.31% ఉంటే అది 1984లో 68.18%. 1962లో ఉన్న 16.7% అంతరం 2009లో 4.4%కు వచ్చి కాలక్రమేణా స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గింది [7]

గత 50 ఏళ్లలో జాతీయ ఎన్నికలలో ఓటింగ్ శాతం 50 - 60% మధ్య స్తబ్దుగా ఉంది. రాష్ట్ర ఎన్నికలలో మహిళల భాగస్వామ్య ధోరణి పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మహిళల ఓటింగ్, పురుషుల ఓటింగ్ శాతాన్ని మించి ఉంది.[8] 2012 విధానసభ ఎన్నికలకు (శాసనసభ/రాష్ట్ర అసెంబ్లీలకు) మహిళల ఓటింగ్ పెరిగినట్లు నివేదించబడింది, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో 58.82% నుండి 60.29% పోలింగ్ నమోదయింది. 2013 అసెంబ్లీ ఎన్నికలలో, మహిళల ఓటింగ్ శాతం 47.4%, పురుషుల శాతం 52.5%. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, డామన్ డయ్యూ, ఇంకా పుదుచ్చేరి కలిపి అన్ని రాష్ట్రాలలో పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ పోలింగ్ నమోదయింది.[9]

భారతదేశంలోని ధనిక, పేద రాష్ట్రాలలో భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటర్ల లింగ నిష్పత్తి 1960లలో ప్రతి 1,000 మంది పురుష ఓటర్లకు 715 మంది మహిళా ఓటర్లు ఉండగా 2000లలో 883 మంది మహిళా ఓటర్లకు మెరుగుపడింది.[10] ఓటర్ల జాబితాను (ఎలక్టోరల్ రోల్‌)లను తాజాకరించడం, తప్పిపోయిన లేదా మరణించిన సభ్యులను తొలగించడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచాలని భారత ఎన్నికల సంఘం (ECI) అభిప్రాయపడింది. ఓటరును పెంచేందుకు ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు చేశారు. 2014 ఎన్నికలలో, ఓటర్ల సంఖ్యను పెంచడానికి ఓటర్లకు పోలింగ్ స్టేషన్ సమాచారంతో ఫోటో ఐడి జారీ చేశారు. [8] [11] భారతదేశంలో పెరిగిన ఓటింగ్ శాతం కూడా పాక్షికంగా మహిళా ఓటర్ల వల్లనే. భారత ఎన్నికల సంఘం మహిళల్లో ఓటరు నమోదును ప్రోత్సహించడానికి కళాశాల, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో విద్య, వ్యాప్తి ద్వారా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కోరింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచడం వలన కూడా భాగస్వామ్యం పెరుగుతున్నదనే కారణంగాచెపుతారు.[12]

2014 ఎన్నికలు

2014 భారత పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలలో మహిళలు 65.63%, పురుషులకు 67.09% పోలింగ్ నమోదైంది. [13] భారతదేశంలోని 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు వేశారు. [13] భారతదేశ పార్లమెంటుకు ఏప్రిల్-మే 2014 ఎన్నికలలో మొత్తం 260.6 మిలియన్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మహిళా రాజకీయ నాయకులు

[మార్చు]
లోకసభ లో మహిళా రాజకీయ నాయకులు [14]
లోక్‌సభ
(Year elected)
ఎన్నుకోబడిన మహిళల సంఖ్య
17వ
(2019)
78
16వ లోక్‌సభ
(2014)
64
15వ లోక్‌సభ
(2009)
52

భారతదేశం సమాఖ్య ప్రభుత్వం. ఇందులో అధికారాలు ఉన్నాయి. ఓటర్లు జాతీయ పార్లమెంట్‌తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి ఓటు వేస్తారు. 2012లో భారతదేశం జాతీయ పార్లమెంటులో 10.9% మంది మహిళా ప్రతినిధుల కనిష్ట శాతం, అయితే ఈ శాతం హంగేరి (8.8%), బ్రెజిల్ (9.6%), చైనా (9.1%), మలేషియా (9.8%) ల కంటే ఎక్కువ. [15]

విస్తృత స్థాయిలో రాజకీయ భాగస్వామ్యానికి సంబంధించి ఎన్నికలకు పోటీ చేసే మహిళా అభ్యర్థుల సంఖ్యలో రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలు ఉన్నారు. అటువంటి విస్తృత స్థాయిలో అధ్యయనాలు నిర్వహించే ప్రపంచ ఆర్ధిక సమాఖ్య (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) వారి వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం, చాలా సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మొదటి 20 దేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది 2013లో డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలకంటే అధికంగా 9వ స్థానంలో నిలిచి భారతదేశ రాజకీయ ప్రక్రియలో మహిళల అత్యుత్తమ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.[16] [17]

మహిళా ఓటర్ల భాగస్వామ్యం తక్కువ ఉండే పరిస్థితి పరిష్కరించడానికి, 1994లో భారతదేశం స్థానిక ప్రభుత్వాలలో 33% స్థానాలను మహిళలకు కేటాయించడానికి రాజ్యాంగ సవరణలలో (73వ, 74వ) కేటాయింపును (రిజర్వేషన్లు) ఏర్పాటు చేసింది.[18] లోక్‌సభ, విధానసభ స్థానాల్లో 33% మహిళలకు కేటాయించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు (108వ సవరణ) జాతీయ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.[19] బిల్లు ఇంకా లోక్‌సభ ఆమోదం పొంది చట్టంగా సంతకం చేయాల్సి ఉంది. ఇదే విధమైన బిల్లు, నారీ శక్తి వందన్ అధినియం, 2023లో లోక్‌సభ, రాజ్యసభచే ఆమోదించబడింది. ఇప్పుడు భారత మహిళా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆమోదం కోసం నిలిచి ఉంది. [20][21] మహిళా రిజర్వేషన్ల గురించిన చర్చ 1920లలో మొదలై 1930ల వరకు నడిచి బ్రిటన్‌తో ఒక రాజీ కుదిరి పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఓటు వేయడానికి వీలుకుదిరింది. భారతదేశంలో మహిళల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి కమిషన్ 1974లో మహిళా రిజర్వేషన్ల చర్చను మళ్లీ ప్రవేశపెట్టింది, అయితే భారతదేశం 1994 వరకు స్థానిక ప్రభుత్వంలో కోటాలను పూర్తిగా ఏర్పాటు చేయలేదు [22] భారతదేశంలోని స్థానిక పాలక సంస్థలను పంచాయతీ రాజ్ సంస్థలు (PRI) అని పిలుస్తారు. మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు, నాయకత్వ స్థానాలు తప్పనిసరిగా కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కేటాయింపులను 50%కి పెంచాయి. జాతీయ ప్రభుత్వం కూడా పంచాయతీ రాజ్ సంస్థలలో రిజర్వేషన్ల స్థాయిని 50%కి పెంచాలని ప్రతిపాదించింది.[23]

మహిళలకు కేటాయించబడిన స్థానాలు ప్రతి స్థానానికి సమాన అవకాశాలు ఉన్నాయని భరోసా కోసం మార్చుతూ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల ఏర్పాటు తర్వాత, మహిళల్లో రాజకీయ భాగస్వామ్యం 4-5% నుండి 25-40%కి చేరుకుంది లక్షలాది మంది మహిళలకు స్థానిక ప్రభుత్వంలో నాయకురాళ్లుగా పనిచేసే అవకాశం లభించింది. [24] ఒడిశా రాష్ట్రం, 73వ సవరణకు ముందు రిజర్వేషన్లను ఏర్పాటు చేసింది 1992లో 28,069 మంది మహిళలు, 1997లో 28,595 మంది మహిళలు ఎన్నికయ్యారు. పేద మహిళలు పంచాయితీలలో ఉనికిని పొందడంతో వర్గ విభేదాలు వ్యక్తమయ్యాయి, అయితే ఉన్నత తరగతికి చెందిన మహిళలు చైర్‌పర్సన్‌లుగా ( సర్పంచ్ ) ఎన్నికయ్యారు. [18]

ఎన్నికైన స్థానాల్లో మహిళలకు స్థానాలు కేటాయించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాయకత్వ పాత్ర కోసం మహిళలను సిద్ధం చేయడంలో శిక్షణ సమస్య గురించి ఆందోళన పెరుగుతుంది. తమిళనాడులో మహిళలకు పంచాయితీ విధానాలను అర్థం చేసుకునే విద్య, శిక్షణ లేవని తేలింది. ప్రభుత్వంలో మహిళల భాగస్వామ్యంలో కుటుంబం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కుటుంబ సంబంధం పరంగా ఎన్నికైన మహిళా అధికారులకు కుటుంబ వ్యవస్థ ప్రభావం, అడ్డంకి లేదా మద్దతుగా ఉంటుంది. మహిళలు జాతీయ, స్థానిక ప్రభుత్వ స్థాయిలో ఎన్నికైన స్థానాలను పొందేందుకు కుటుంబ సంబంధాలు సహాయపడతాయి. అయితే మగ కుటుంబ సభ్యులకు బదులుగా ఎన్నికవుతున్న మహిళల పాత్రపై ఆందోళన ఉంది, మహిళలు ఇప్పటికీ విధాన నిర్ణయాలపై కుటుంబం ముఖ్యమైన ప్రభావం కలిగి ఉండవచ్చు. [25] నీరు, రోడ్లతో సహా ప్రజా వస్తువుల సంఖ్యలో మహిళల రిజర్వేషన్ ప్రభావం పెరిగింది. తాగునీరు, రోడ్ల మెరుగుదలలు మహిళా ఎన్నికైన అధికారులు తరచుగా లేవనెత్తే సమస్యలు. పురుషులకు అత్యంత ముఖ్యమైన సమస్యలు రోడ్లు, నీటిపారుదల, విద్య, నీరు. మహిళలపై హింస, శిశు సంరక్షణ, తల్లి ఆరోగ్యం వంటి సంక్షేమ సమస్యలను కూడా మహిళలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. [25]

రాజకీయ పార్టీలు

[మార్చు]
ప్రతిభా పాటిల్

భారతదేశంలో జాతీయ స్థాయిలో 7 నమోదిత పార్టీలతో బహుళ-పార్టీ వ్యవస్థ ఉంది.[26] మూడు అతిపెద్ద పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (INC), భారతీయ జనతా పార్టీ (BJP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI).[27] భారతదేశ పార్టీ వ్యవస్థ లో బాగా పోటీ ఏర్పడటంతో రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లకు మరింత చేరువ అయ్యాయి. ఇందులో అతిపెద్ద పార్టీలలో మహిళా విభాగాలు కూడా ఏర్పడ్డాయి. అవి- బిజెపి మహిళా శాఖ బిజెపి మహిళా మోర్చా, భారత జాతీయ కాంగ్రెస్ మహిళా విభాగం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్, సిపిఐ విభాగం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్.[27]

రాజకీయ పార్టీలలో మహిళల ప్రమేయం మహిళల సమాన హక్కుల కోసం పెరుగుతున్న పోరాటం తో ముడిపడి ఉంది. 1990ల వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ పార్టీ సంక్షేమ రాజకీయాలకు దూరమవడంతో, ఇతర పార్టీలు పేదరికాన్ని తమ కార్యక్రమాలకు (అజెండాకు) కేంద్రంగా ఉపయోగించుకొని భారత జాతీయ కాంగ్రెస్ మహిళల భాగస్వామ్యంతో 2004లో తిరిగి అధికారంలోకి వచ్చింది.[28] పార్టీలోని అన్ని స్థాయిలలో మహిళలకు 33% కేటాయింపును ఏర్పాటు చేయడం ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ మహిళల భాగస్వామ్యాన్ని పెంచింది. 2009 జూన్ లో కాంగ్రెస్ ఒక మహిళను లోక్ సభ మొదటి స్పీకర్ గా ఎంపిక చేసింది, అలాగే భారతదేశపు మొదటి మహిళా అధ్యక్షురాలు ప్రతిభా పాటిల్ ఎన్నికకు కూడా మద్దతు ఇచ్చింది.[29] బిజెపి స్థాపన ప్రారంభంలో మహిళలు పాల్గొన్నారు. మహిళా నాయకత్వ కార్యక్రమాలను అభివృద్ధి చేయడం, మహిళా అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయడం, పార్టీ నాయకత్వ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా బిజెపి మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించింది.[29] మతంతో సంబంధం లేకుండా మహిళలు, పురుషులకు సమాన హక్కులను కల్పించే ఏకరీతి పౌర చట్టం వంటి సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా బిజెపికి మహిళల మద్దతు లభించింది. భారతీయ మహిళలపై హింసకు వ్యతిరేకంగా కూడా వారు మాట్లాడారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ద్వారా హింస వంటి సమస్యలను పరిష్కరించడంతో లింగ అసమానత సమస్యలకు కూడా సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది.[30]

1990లలో రాజకీయ పార్టీలలో మహిళల భాగస్వామ్యం 10-12% సభ్యత్వం మాత్రమే ఉంది.[30] భారతీయ మహిళలు తమ సొంత రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. 2007 లో యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్ పార్టీ సృష్టించారు. ఇది పార్లమెంటులో మహిళల రిజర్వేషన్ను 50% కి పెంచాలని వాదించింది.[31] భారతదేశంలోని నాలుగు రాజకీయ పార్టీలలో మాత్రమే మహిళలు పాలిస్తున్నారు. 1980 నుండి 1970 వరకు, 4% అభ్యర్థులు, 70% ఎన్నికలలో మహిళా అభ్యర్థులను కలిగి లేవు.[32] 2013 నాటికి, పార్లమెంటు సభ్యులలో 11% మంది లోక్ సభ లో 10.6% రాజ్యసభలో మహిళలు ఉన్నారు.[33]

50:50 మహిళా అభ్యర్థులు

[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, తమిళనాడుకు చెందిన నామ్ తమిళార్ కచ్చి పార్టీ మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో 50 శాతం మహిళా అభ్యర్థులను నిలబెట్టింది.[34] భారతదేశంలో పురుషులు, మహిళలకు సమాన సంఖ్యలో సీట్లను అందించిన మొదటి పార్టీ ఇదే.[35] 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కూడా వారు అదే 50:50 నిష్పత్తిని అనుసరించి మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో మహిళలకు 117 స్థానాలను ఇచ్చారు.[36]

సరోజినీ నాయుడు

రాజకీయ పార్టీలకు నాయకురాళ్లు

[మార్చు]
అన్నీ బీసెంట్

1917లో భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి మహిళా అధ్యక్షురాలు అన్నీ బెసెంట్. 1925-26 లో భారత జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించిన తొలి భారతీయ మహిళ సరోజిని నాయడు. నెల్లీ సేన్ గుప్త (1933), ఇందిరా గాంధీ (1959), సోనియా గాంధీ (1998-2017)లు భారత జాతీయ కాంగ్రెస్ కు ఇతర మహిళా అధ్యక్షులు. శశికళ కాకోడ్కర్ గోవా మొదటి మహిళా ముఖ్యమంత్రి ఇంకా మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కి అధ్యక్షురాలు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత 1988 నుండి 2016 వరకు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 5వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసింది. మాయావతి 1995లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, 2001లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడికి రాజకీయ వారసురాలిగా 2003 నుండి పార్టీ అధ్యక్ష పదవి కూడా చేపట్టారు.

2001 నుండి అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు మమతా బెనర్జీ. 2016 నుండి అనుప్రియా పటేల్ అప్నా దళ్ (సోనీలాల్) వ్యవస్థాపక అధ్యక్షురాలు. డాక్టర్ రేణుకా డా సిల్వా 2017 మార్చి నుండి జూలై వరకు స్వల్పకాలం గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంది.[37]  

రాజకీయ క్రియాశీలత

[మార్చు]
రైతుల ర్యాలీలో మహిళలు

భారతదేశంలో మహిళా సంస్థలు మొదట 1900 ల ప్రారంభంలో తరువాత 1970 లలో ఉద్భవించడం ప్రారంభించాయి, తరువాత 1950 నుండి 1970 ల వరకు కార్యకలాపాలు పరిమితంగా ఉన్నాయి.[38] 1910లో తొలి మహిళా సంస్థలలో ఒకటైన భారత్ స్త్రీ మహామండల్ ఏర్పడింది. పురుషుల అణచివేత నుండి మహిళలను తప్పించడంలో సహాయపడటంపై దృష్టి పెట్టింది. మహిళల సంఘాలు సాంప్రదాయకంగా పురుషుల సహాయంతో ప్రారంభమయ్యాయి, కొద్దిమంది మహిళలకు పని, విద్యను అందించాయి.[39] 1927లో, మహిళల విద్య సమర్ధించడానికి అఖిల భారత మహిళా సమావేశం (AIWC) ఏర్పడింది. 1952, 1960 మధ్య హిందూ కోడ్ ఆఫ్ బిల్లులను ఆమోదించడంలో సహాయపడింది.[40] స్వాతంత్య్రానికి మద్దతుగా భారతీయులు నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించడం పట్ల బ్రిటిష్ వలస పాలనను నిరసిస్తూ మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు.

1970లలో స్త్రీవాదం ఒక కొత్త తరంగం. భారతదేశంలో లింగ అసమానత , స్తబ్దమైన అభివృద్ధి వంటి సమస్యలకి ప్రతిస్పందనగా ఉంది.[41] భారతదేశంలో మహిళల స్థితిపై కమిటీ 1974లో ఒక నివేదికను విడుదల చేసింది, లింగ సమానత్వం దిశగా క్రియాశీలత తిరిగి పుంజుకోవడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. లింగ నిష్పత్తి, మరణాల రేటు, ఉపాధి, అక్షరాస్యత, వేతన వివక్ష వంటి అసమానతలతో సహా భారతదేశంలో పురుషులు, మహిళల మధ్య గణనీయమైన వ్యత్యాసాలను ఈ నివేదిక ఎత్తి చూపింది. ఈ నివేదిక భారతదేశంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షను సూచించడం ద్వారా మహిళా ఉద్యమానికి ఆజ్యం పోసింది.[42] యూనిఫాం సివిల్ కోడ్, మహిళల రిజర్వేషన్ బిల్లు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ మహిళల ఉద్యమం లింగ అసమానతలకు కేంద్రంగా పరిణమించింది.[43] భారతదేశంలో గ్రామీణ, పట్టణ, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో అనధికారిక, అధికారిక మహిళా సంస్థలు అభివృద్ధి చెందాయి. భారతదేశంలోని మహిళా సంస్థలు పర్యావరణం, పేదరికం, సాధికారత, మహిళలపై హింస వంటి వివిధ సమస్యలను పరిష్కరిస్తున్నాయి.[44] 1927లో స్థాపించబడిన ఏఐడబ్ల్యూసీ (AIWC), భారతదేశంలోని అత్యంత ప్రముఖ మహిళా సంస్థలలో ఒకటి ఇది భారతీయ మహిళల సాధికారత, విద్యపై దృష్టి సారించింది. AIWCకి భారతదేశంలో 100,000 మంది సభ్యులు, 500 శాఖలు ఉన్నాయి, ఇది శారదా చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం, హిందూ కోడ్ బిల్లుల ఆమోదం పొందడానికి సహాయపడింది.[45][46]

అట్టడుగు స్థాయినుంచి భారతీయ మహిళలు క్రియాశీలకం గా ఉండి గణనీయంగా పాల్గొంటున్నారు. 1970లలో ఉద్భవించిన చిప్కో ఉద్యమం భారతదేశంలోని మహిళా ఉద్యమంలో విజయానికి ఒక ఉదాహరణ. ఉత్తరాఖండ్‌లో అటవీ నిర్మూలనను మహిళలు నిరశించారు.అది ఈ ప్రాంత రక్షణకు దారితీసింది.[28] భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, మహిళా సంఘాలు మహిళలపై హింసకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించాయి. మహిళా ఉద్యమాలు అత్యాచారం, స్త్రీ మరణాలు, ఆడ భ్రూణహత్యలు, వరకట్న మరణాలు, సతి, గృహహింసలపై దృష్టి సారించాయి. [47] 1972లో మధుర అత్యాచారం సంఘటన, 1979లో తర్విందర్ కౌర్ వరకట్న మరణం, 1987లో సతి ఆచారంతో రూప్ కన్వర్ మరణం, 1992లో భన్వరీ దేవిపై సామూహిక అత్యాచారం, 2012లో న్యూఢిల్లీ సామూహిక అత్యాచార సంఘటన వంటి విషాదాలు ఉద్యమాన్ని అత్యాచారంపై దృష్టి సారించేవిధంగా చేసి, స్థానిక జాతీయ స్థాయిలో అనేక మహిళా సంఘాల ఆవిర్భావానికి దారితీసింది. [48]

మహిళల భాగస్వామ్యానికి సవాళ్లు

[మార్చు]

రాజకీయాల్లో మహిళల భాగస్వామ్య స్థాయి అధికంగా హింస, వివక్ష, నిరక్షరాస్యతలు, ఇంకా సాంస్కృతిక, సామాజిక అడ్డంకుల కారణంగా రూపొందించబడింది.

మూలాలు

[మార్చు]
  1. The Global Gender Gap Report 2012, World Economic Forum, Switzerland, page 16
  2. Government of India. "The Constitution of India". Ministry of Law and Justice. Retrieved 22 March 2014.
  3. "Constitution of India|Legislative Department | Ministry of Law and Justice | GoI". legislative.gov.in. Retrieved 2023-02-20.
  4. Constitution of India. "Directive Principles of State Policy". Government of India. Retrieved 22 March 2014.
  5. 5.0 5.1 Praveen, Rai (14 January 2011). "Electoral Participation of Women in India: Key Determinants and Barriers". Economic and Political Weekly. XVLI (3): 47–55.
  6. Mithra, H.N. (2009). The Govt of India ACT 1919 Rules Thereunder and Govt Reports 1920, ISBN 978-1-113-74177-6
  7. Chief Electoral Officer. "Voting Percentage in Various Lok Sabha Elections". Government of Uttarakhand, India. Retrieved 22 March 2014.
  8. 8.0 8.1 Rukmini, S (3 December 2013). "Who is behind the rise in voter turnouts?". The Hindu. Retrieved 22 March 2014.
  9. Election Commission of India. "Electoral Roll Data - 2013" (PDF). Retrieved 22 March 2014.
  10. Rukmini, S (7 November 2013). "Rising female voter turnout, the big story of 50 years". The Hindu. Retrieved 22 March 2014.
  11. Tembhekar, Chittaranjan (March 8, 2014). "EC to give photo voter slips". The Times of India. Retrieved 28 March 2014.
  12. Rout, Akshay. "Women's Participation in the Electoral Process". Election Commission of India. Retrieved 22 March 2014.
  13. 13.0 13.1 State-Wise Voter Turnout in General Elections 2014 Government of India (2014)
  14. "17th Lok Sabha to see more women power". Daily Pioneer. 25 May 2019. Retrieved 6 September 2019.
  15. United Nations Development Programme. "Gender Inequality Index". Human Development Indices: A statistical update 2012. Retrieved 22 March 2014.
  16. The Global Gender Gap Report 2012, World Economic Forum, Switzerland, page 16
  17. The Global Gender Gap Report 2013, World Economic Forum, Switzerland, Table 3b and 5, page 13 and 19
  18. 18.0 18.1 Rai, M. Shirin. "Reserved Seats in South Asia: A Regional Perspective". Women in Parliament: Beyond Numbers.
  19. PRS Legislative Research. "Women's Reservation Bill [The Constitution (108th Amendment) Bill, 2008]". PRSIndia.org. Retrieved 22 March 2014.
  20. "Nari Shakti Vandan Adhiniyam | Women's Reservation Bill Passed in Rajya Sabha | PM Modi | News18".
  21. Phukan, Sandeep (20 September 2023). "Lok Sabha passes historic women's reservation Bill". The Hindu.
  22. Raman, Vasanthi (25 September 2023). "The Implementation of Quotas for Women: The Indian Experience" (PDF). Centre for Women's Development Studies. International Institute for Democracy and Electoral Assistance.
  23. Ministry of Panchayati Raj. "Women Reservation in Panchayats". Press Information Bureau, Government of India. Retrieved 22 March 2014.
  24. Kaul, Shashi; Shradha Sahni (2009). "Study on the Participation of Women in Panchayati Raj Institution". Studies on Home and Community Science. 3 (1): 29–38. doi:10.1080/09737189.2009.11885273. S2CID 39386599.
  25. 25.0 25.1 Chattopadhyay, Raghabendra. "Women as Policymakers: Evidence from an India-Wide Randomized Policy Experiment".
  26. Sadan, Nirvachan. "List of political parties and election symbols-regarding" (PDF). Electionl Commission of India. Retrieved 24 March 2014.
  27. 27.0 27.1 Basu, Amrita. "Women, Political Parties and Social Movements in South Asia" (PDF). United Nations Research Institute for Social Development. Retrieved 24 March 2014.
  28. 28.0 28.1 Basu, Amrita. "Women, Political Parties and Social Movements in South Asia" (PDF). United Nations Research Institute for Social Development. Retrieved 24 March 2014.
  29. 29.0 29.1 Error on call to Template:cite paper: Parameter title must be specified
  30. 30.0 30.1 Goetz, Anne Marie (2009). Governing Women: Women's Political Effectiveness in Contexts of Democratization and Governance Reform. New York: Routledge. pp. Chapter 5.
  31. Raman, Nachammai (11 December 2007). "In India, a party for women only". The Christian Science Monitor. Retrieved 24 March 2014.
  32. Bhalotra, Sonia; Irm Clots-Figueras; Lakshmi Iyer (November 6, 2013). "Path-Breakers: How Does Women's Political Participation Respond to Electoral Success?". Harvard Business School. BGIE Unit Working Paper No. 14-035. SSRN 2350805.
  33. Spary, Carole (2014). "Women candidates and party nomination trends in India - evidence from the 2009 general election". Commonwealth & Comparative Politics. 52 (1): 109–138. doi:10.1080/14662043.2013.867691. S2CID 73688993. .. As mentioned earlier, only 5.5% of state legislators and 4.4% of candidates were women in our sample period, 1980-2007. Almost 70% of electoral races had no female candidates at all, and only 7% of races had more than one woman candidate. ...
  34. "50:50 is right, prove Seeman's women candidates in TN Lok Sabha polls". New Indian Express. 28 May 2019. Retrieved 5 May 2021.
  35. "Seeman wins no seats, but his party makes a mark". Times Of India. 3 May 2021. Retrieved 5 May 2021.
  36. "Tamil Nadu Assembly polls: NTK fields 234 candidates, 50% women". Times Of India. 9 March 2021. Retrieved 5 May 2021.
  37. "Renuka D'Silva is the new president of Goa Forward party". The Times of India. 2017-03-21. ISSN 0971-8257. Retrieved 2024-05-01.
  38. Vijayalakshmi, V (2005). "Feminist Politics in India: Women and Civil Society Activism" (PDF). Institute for Social and Economic Change. Working Paper. Retrieved 24 March 2014.
  39. Sen, Samita (April 2000). "Toward a Feminist Politics? The Indian Women's Movement in Historical Perspective". Policy Research Report on Gender and Development. Working Paper Series No. 9: 14.
  40. Basu, Aparna. "Indian Women's Movement" (PDF). Foundation Course, Human rights, Gender and Environment. University of Delhi. Retrieved 24 March 2014.
  41. Agnihotri, Indu; Vina Mazumdar (July 22, 1995). "Changing Terms of Political Discourse: Women's Movement in India, 1970s-1990s". Economic and Political Weekly. 30 (29): 1869–1878.
  42. Guha, Phulrenu; et al. (December 1974). "Towards Equality: Report of the Committee on the Status of Women in India" (PDF). Government of India. Ministry of Education and Social Welfare. Retrieved 25 March 2014.
  43. Phadke, Shilpa (October 25, 2003). "Women' Studies Reflects on the Women's Movement". Economic and Political Weekly: 4567. Retrieved 25 March 2014.
  44. Subramaniam, Mangala (November 2004). "The Indian Women's Movement". Contemporary Sociology. 33 (6): 635–639. doi:10.1177/009430610403300603. JSTOR 3593826. S2CID 77548925.
  45. O'Brien, Jodi (2009). "All India Women's Conference". Encyclopedia of Gender and Society. Thousand Oaks, CA: Sage Publications, Inc. doi:10.4135/9781412964517.n17. ISBN 9781412964517.
  46. All India Women's Conference. "Achievements". Retrieved 27 March 2014.
  47. Agnihotri, Indu; Vina Mazumdar (July 22, 1995). "Changing Terms of Political Discourse: Women's Movement in India, 1970s-1990s". Economic and Political Weekly. 30 (29): 1869–1878.
  48. Bagri, Thirani (8 March 2013). "Where is India's Feminist Movement Headed?". The New York Times. Retrieved 27 March 2014.