Jump to content

పోచంపల్లి (భూదాన్)

అక్షాంశ రేఖాంశాలు: 17°20′46″N 78°48′44″E / 17.3461°N 78.8122°E / 17.3461; 78.8122
వికీపీడియా నుండి
(భూదాన్ పోచంపల్లి నుండి దారిమార్పు చెందింది)
భూదాన్ పోచంపల్లి
రెవెన్యూ గ్రామం
భూదాన్ పోచంపల్లి is located in Telangana
భూదాన్ పోచంపల్లి
భూదాన్ పోచంపల్లి
భారతదేశంలో తెలంగాణ స్థానం
భూదాన్ పోచంపల్లి is located in India
భూదాన్ పోచంపల్లి
భూదాన్ పోచంపల్లి
భూదాన్ పోచంపల్లి (India)
Coordinates: 17°20′46″N 78°48′44″E / 17.3461°N 78.8122°E / 17.3461; 78.8122
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా
విస్తీర్ణం
 • Total28.42 కి.మీ2 (10.97 చ. మై)
Elevation
1,184 మీ (3,885 అ.)
జనాభా
 (2011)[1]
 • Total12,972
 • జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
508284
ప్రాంతపు కోడ్+91 8685
Vehicle registrationTS 30

బి.పోచంపల్లి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బి.పోచంపల్లి మండలానికి చెందిన గ్రామం.[2]

ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసారు. చేనేత కళాకారుల ప్రతిభతో ఈ పట్టణం సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. అప్పటి నిజాం రాజులతో పాటు అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతులు చేసింది. ఇది దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు పోచంపల్లిని సందర్శించారు.[3][4]

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో ఈ భూదాన్‌ పోచంపల్లి గ్రామం ప్ర‌పంచ ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికయింది.[5]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[6]

భౌగోళికం

[మార్చు]

భూదాన్ పోచంపల్లి 17°20′46″N 78°48′44″E / 17.34611°N 78.81222°E / 17.34611; 78.81222 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[7] ఈ పట్టణం 28.42 కి.మీ2 (10.97 చ. మై) విస్తీర్ణంలో ఉంది. సముద్రమట్టానికి 1,184 మీ (3,885 అ.) ఎత్తులో ఉంది. పోచంపల్లి చుట్టూ ఉత్తరాన బీబీనగర్ మండలం, దక్షిణాన చౌటుప్పల్ మండలం, పశ్చిమాన హయత్‌నగర్ మండలం, పశ్చిమాన ఘట్‌కేసర్ మండలం ఉన్నాయి.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 12,972 మంది జనాభా ఉంది. పట్టణ సాంద్రత 460/కి.మీ2 (1,200/చ. మై.)గా ఉంది.

భూదానోద్యమ ప్రారంభం

[మార్చు]

1951 ఏప్రిల్ 18 న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు. మొట్టమొదటి సారి భూదానోద్యమం ఇక్కడే నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటి సారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతన్ని గ్రామస్తులు స్వాగతించారు. కొంత కాలం పోచంపల్లిలో ఉన్నాడు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవటానికి వచ్చి 80 ఎకరాల (సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు) భూమి కావాలని అడిగారు. అప్పుడు వినోబా భావే అందరు గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి. భూస్వాములు తోటి పేదలకు సహాయ పడవచ్చుకదా అని అన్నారు. అప్పుడు వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తాను అన్ని వాగ్దానం చేశాడు. దీనితో, భారతదేశ భూసమస్యను పరిష్కరించే సామర్ధ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబాభావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైయింది.[8][9]

ప్రత్యేకత

[మార్చు]
  • 1999లో చితకింది మల్లేశం అనే నేతకారుడు ఆసుయంత్రాన్ని అభివృద్ధి చేయడంతో భూదాన్ పోచంపల్లిలోని చేనేత పరిశ్రమ వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఇండియా) గుర్తించింది.[10] 2017లో పద్మశ్రీ కూడా వచ్చింది.
  • కార్పోరేట్‌ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.[11]

అవార్డులు

[మార్చు]
  • ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో ఈ భూదాన్‌ పోచంపల్లి గ్రామం ప్ర‌పంచ ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికయింది. భార‌త‌దేశం నుంచి 3 గ్రామాలు పోటీప‌డ్డాయి. 2021 డిసెంబ‌ర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జ‌రిగే యునైటెడ్ నేష‌న్స్ వ‌ర‌ల్డ్ టూరిజం ఆర్గ‌నైజేష‌న్ 24వ సెష‌న్‌లో భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు.[12][13]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • దుర్గమ్మ దేవాలయం
  • పోచమ్మ దేవాలయం
  • బసవలింగేశ్వరస్వామి దేవాలయం
  • శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయం

విద్యాసంస్థలు

[మార్చు]
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • శాంతినికేతన్ స్కూల్
  • బాలికల ఉన్నత పాఠశాల
  • శ్రీ వెడెరరామ చంద్రారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. వెదిరె రామచంద్రారెడ్డి (భూదాన్ రామచంద్రారెడ్డి): భూదానోద్యమంలో భాగంగా పేదలకు తన భూమిని దానం చేసిన మొట్టమొదటి భూస్వామి.
  2. మృత్యుంజయ చిలువేరు: కార్టూనిస్ట్
  3. కైరంకొండ నరసింహులు: పోచంపల్లి పోతనగా పేరొందిన కవి, రచయిత.

అభివృద్ధి కార్యక్రమాలు

[మార్చు]

2022 ఆగస్టు 22న పట్టణంలో ఏర్పాటుచేసిన నేతన్న విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించి విగ్రహానికి గజమాల వేశాడు.[14] 6.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, రెండు కోట్ల రూపాయలతో సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మారెట్‌.. రెండు కోట్ల రూపాయలతో ధోబీఘాట్‌, 5.17 కోట్ల రూపాయలతో అన్ని వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశాడు.[15] ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా పరిషత్ అధ్యక్షులు ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ గూడూరి ప్రవీణ్, జౌళి శాఖ రాష్ట్ర కమిషనర్‌ బుద్ధ ప్రకాశ్‌, జిల్లా కలెక్టర్‌ వినయ్‌ క్రిష్ణారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావులతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[16]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook - Nalgonda" (PDF). Census of India. p. 13,248. Retrieved 11 February 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "Three Indian destinations in line for UNWTO's 'Best Tourism Village'; know about them here". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-09. Archived from the original on 2021-09-22. Retrieved 2021-11-08.
  4. "'బెస్ట్‌ విలేజ్‌' పోటీలో భూదాన్‌పోచంపల్లి". Sakshi. 2021-09-15. Archived from the original on 2021-10-28. Retrieved 2021-11-08.
  5. "Pochampally selected as UNWTO Best Tourism village from India". Telangana Today. 2021-11-16. Archived from the original on 2021-11-16. Retrieved 2021-11-17.
  6. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  7. "US Gazetteer files: 2010, 2000, and 1990". United States Census Bureau. 2011-02-12. Retrieved 2011-04-23.
  8. Bhoodan and the Landless, S.V. Khandewale and K.R. Nanekar, Popular Prakashan, 1973.
  9. India since independence - bipin Chandra
  10. Recognition of Asu Machine by National Innovation Foundation Archived 3 జూన్ 2012 at the Wayback Machine
  11. "పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు". Sakshi. 2021-11-04. Archived from the original on 2021-11-07. Retrieved 2021-11-08.
  12. India, The Hans (2021-11-17). "Pochampally best tourism village". www.thehansindia.com. Archived from the original on 2021-11-16. Retrieved 2021-11-17.
  13. "Pochampally village in Telangana selected as one of the best Tourism Villages by United Nations World Tourism Organisation". pib.gov.in. Retrieved 2021-11-16.
  14. telugu, NT News (2023-08-12). "Minister KTR | పోచంపల్లిలో నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-17.
  15. Velugu, V6 (2023-08-12). "నేతన్నలకు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్". V6 Velugu. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  16. telugu, NT News (2023-08-13). "నేతన్నలకే ఓనర్ షిప్". www.ntnews.com. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-17.

వెలుపలి లంకెలు

[మార్చు]