Jump to content

మంగళూరు

అక్షాంశ రేఖాంశాలు: 12°51′00″N 74°49′59″E / 12.85°N 74.833°E / 12.85; 74.833
వికీపీడియా నుండి
(మంగలూరు నుండి దారిమార్పు చెందింది)
  ?మంగళూరు
కర్ణాటక • భారతదేశం
మంగళూరు పణంబూర్ బీచ్‌లో సూర్యాస్తమయం
మంగళూరు పణంబూర్ బీచ్‌లో సూర్యాస్తమయం
మంగళూరు పణంబూర్ బీచ్‌లో సూర్యాస్తమయం
అక్షాంశరేఖాంశాలు: 12°51′00″N 74°49′59″E / 12.85°N 74.833°E / 12.85; 74.833
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
111.18 కి.మీ² (43 sq mi)
• 8.83 మీ (29 అడుగులు)
జిల్లా (లు) దక్షిణ కన్నడ జిల్లా
జనాభా
జనసాంద్రత
398,745 (2001 నాటికి)
• 3,586.5/కి.మీ² (9,289/చ.మై)
మేయరు విజయ అరున్
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 575001
• +0824
• KA-19
వెబ్‌సైటు: www.mangalorecity.gov.in


మంగళూరు (తుళు:కుడ్ల, ఆంగ్లము:Mangalore, కన్నడ: ಮಂಗಳೂರು, కొంకణి: కుడియాల్‌), పలకడం , నగరం కర్ణాటక రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరం కర్ణాటక రాష్ట్రానికి, భారత దేశానికి ఒక నౌకాశ్రయము ఇచ్చింది. ఈ నగరం భారత దేశ పశ్చిమమున అరేబియా సముద్రముతీరములో పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉంది.

మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని, అధికార, పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి, దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరృతి దిక్కులో ఉంది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి, గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.

మంగళూరు దేవాలయాలకు, బీచ్‌ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాషైన తుళు, కేరళకు సరిహద్దులో ఉండడం వల్ల మళయాళం, కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంకణి భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష హిందీ, ఆంగ్లము కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.

నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉంది.

మంగళూరు పేరు ఉన్న కథ

[మార్చు]

మంగళూరు నగరం పేరు, నగర దేవత మంగళాదేవి పేరు మీద పెట్టబడిందని చెబుతారు.[1]

ఇతర పేర్లు

[మార్చు]

మంగళూరు వివిధ సంస్కృతులకు అనేక శతాబ్దాలుగా నివాస స్థానం కావటం వల్ల ఆ నగరంలో నివసించే భిన్న భాషలవారు తమ తమ మాతృభాషల్లో పేరు ఇవ్వడంవల్ల మంగళూరుకు అనేకమైన పేర్లు వచ్చాయి. స్థానిక తుళు భాషలో మంగళూరును 'కుడ్ల' అని పిలుస్తారు. అంటే కూడలి అని అర్థం. మంగళూరు నగరం నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమ స్థానం కావటం ఈ పేరుకు కారణం. కొంకణి భాషలో మంగళూరును "కొడియల్" అని పిలిస్తారు. ముస్లింలలోని ఒక వర్గం వారు దీనిని మైకల అని వారి భాషలో పిలుస్తారు. దక్షిణ కేరళ ప్రాతంలోని ప్రజలు దీనిని "మంగళాపురం"గా సంబోధిస్తారు.

2006 సంవత్సరములో "సువర్ణ కర్ణాటక" ప్రణాళిక పేరుతో మంగళూరు నగరం పేరుని మంగలూరుగా కర్ణాటక ప్రభుత్వం మార్పు చేసింది దాని ప్రకారం ఆంగ్లంలో Mangalooru అని వ్రాయాలి.

[1]

భౌగోళిక ఉనికి

[మార్చు]

మంగళూరు Coordinates: Unknown argument format
{{#coordinates:}}: invalid latitude.[2] సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పట్టణం అరేబియా సముద్రం కొంకణ తీరములో గోవాకి దగ్గరలో ఉంది. మంగళూరు 3 జాతీయ రహదారుల ద్వారా దేశానికి కలుపబడుతోంది. NH-17 (1567 కి.మి.) మహారాష్ట్ర లోని పణవెల్ (ఎద్దపల్లి సమీపములో) నుండి ప్రారంభమై కేరళ లోని క్రణగాణురు జంక్షన్ వరకు వెడుతుంది, మంగళూరు మార్గమధ్యంలో (ఉత్తర-దక్షిణ) వస్తుంది. NH-48 మంగళూరు నుండి బయలు దేరి కర్ణాటక రాజధాని తూర్పు వైపుకు బెంగళూరు వైపుకు వెడుతుంది. NH-13 ఈశాన్య మార్గంలో షోలాపురుకు చేరుకొంటూ, మార్గమధ్యంలో మడికరి, మైసూరు పట్టణాల మీదుగా పోతుంది. మంగళూరుకి బెంగుళూరుకి మధ్య ప్రతి దినము 300 బస్సులు నడుస్తుంటాయి.

నగర పరిపాలన వ్యవస్థ

[మార్చు]
మంగళూరు నగర పాలిక చిత్రం

మంగళూరు నగర పరిపాలన మంగళూరు సిటి కార్పొరేషన్ (కన్నడలో 'మంగలూరు మహానగరపాలిక' గా పిలుస్తారు) ద్వారా జరుగుతుంది. ఈ నగర పురపాలక సంఘ పరిధులు దక్షిణాన ముక్కా (నేత్రావతి వంతెనకు ఉత్తర భాగం), కుడుపు తూర్పు ఉత్తరానకి .

మంగళూరు నగర పాలికకు 60 మంది ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లు అనే పేరుతో ఎన్నుకొంటారు. నగరంలో ఉన్న 60 వార్డులనుండి 60 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికౌతారు. నగరంలో ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మెజారిటి సంపాదించి ఉన్న పార్టిలోనే ఒక కార్పొరేటరు నగర మేయరుగా ఎన్నిక చేయబడతాడు.

మంగళూరు నగరపాలిక కార్యాలయం లాల్ బాగ్‌లో కలదు (చిత్రం ప్రక్కన ఉన్నది). ఈ నగరపాలిక కార్యాలయానికి సంబంధించిన ఉపకార్యాలయాలు సూరత్కల్, బికరనకట్టె లలో ఉన్నాయి.

మంగళూరు నగరం పార్లమెంటు లోని లోక్ సభకు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటుంది. ఒక స్థానం దక్షిణ నగరనుండి, మరో స్థానం ఉత్తర మంగళూరు, ఉడిపి లోక్ సభా స్థానం నుండి. కర్ణాటక శాసనసభకు (కన్నడ భాషలో విధాన సౌధ) ముగ్గురు ప్రతినిధులను ఎన్నుకొంటుంది. ( మంగళూరు, ఉల్లాల్, సూరత్కల్ అనే మూడు స్థానాలు).

మంగళూరు విద్యుత్తు సదుపాయం నిర్వహణ బాధ్యతలు కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPTCL) ద్వారా జరుగుతుంది. విద్యుత్తు సరఫరా బాధ్యతలు మంగళూరు ఎలక్ట్రిసిటి సప్లయి కంపెనీ (MESCOM) ద్వారా జరుగుతుంది. భారతదేశంలోని మిగతా నగరాల వలెనే వేసవి కాలములో మంగళూరు నగరం విద్యుత్తు కోతకు గురి అవుతుంది. మంగళూరు రిఫైనరి అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (MRPL), మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (MCF) వంటి పరిశ్రమలు తమకు కావలసిన విద్యుత్తుని తామే తయారు చేసుకుంటున్నాయి

పారిశుద్ధ్య నీరు నగర కార్పోరేషన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేయబడుతుంది. నీటిని నేత్రావతి నది నుండి సంగ్రహించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది.

జనాభా , అక్షరాస్యత

[మార్చు]

2001 జనాభా లెక్క ల ప్రకారం మంగళూరు జనాభా 3,98,745. అందు పురుషులు 50%, స్త్రీలు 50%. మంగళూరు అక్షరాస్యత జాతీయ సగటు (59.5%) కంటే చాలా ఎక్కువగా 83% వద్ద ఉంది. స్త్రీల అక్షరాస్యత 79%, పురుషుల అక్షరాస్యత 86%గా నమోదైంది. మంగళూరు జనాభాలో 9% మంది పిల్లలు ఆరు సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలవారు. ఇప్పటి జనాభా సుమారుగా 5,38,560 ఉండవచ్చని అంచనా.

పరిసర ప్రాంతాలు

[మార్చు]

మంగళూరు నగరం చుట్టుప్రక్కల అనేక దర్శనీయస్థలాలు ఉన్నాయి.

  • మంగళాదేవి దేవాలయం: మంగళూరు నగరం మధ్యలో ఉన్న మంగళాదేవి దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. మంగళాదేవి అమ్మవారు ఈ నగరంలో వెలియడం వల్ల ఈ నగరానికి మంగళూరు అని పేరు వచ్చింది
  • కద్రి దేవాలయం: నగర నడి బొడ్డుకు 5 కి.మి. దూరంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఈ దేవాలయంలో వెలసినది మంజునాథ స్వామి. ఈ దేవాలయం చాలా పెద్ద విస్తీర్ణములో ఉంది.
  • సెయింట్ అలోసియస్ చర్చి, కళాశాల: సెయింట్ అలోసియస్ చర్చి మంగళూరులో కల్లా చాలా అందమైన చర్చి. దీనికి అనుబంధంగా ఉన్న సెయింట్ అలోసియస్ కళాశాల నగరంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు గీసిన చిత్రాలు యేసుక్రీస్తు జీవితములోని ప్రధాన ఘట్టాలను ప్రతిఫలిస్తున్నాయి.
  • కొత్త మంగుళూరు రేవు: కొత్త మంగుళూరు కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. దేశంలోనే ఇది ೯వ పెద్ద రేవు. ಕಚ್ಚಾ ತೈಲ, సహజ వాయువు (LPG), చమురు, గ్రానైటు రాళ్ళు ఇక్కడ నుండి రవాణా అయ్యే ప్రధాన వస్తువులు.
  • గోకర్ణనాథేశ్వర: నగర కేంద్రము నుండి ೨ కి.మీ. దూరములో కుద్రళి అనే ప్రదేశంలో శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయము ఉంది. ఈ దేవాలయ నిర్మాణం ఈ మధ్యనే జరిగింది. ఈ దేవాలయాన్ని హిందియప్ప నిర్మించాడు. ఆలయాన్ని రాజీవ్‌ గాంధీ ప్రారంభించాడు.
  • సూరత్కల్ దీపస్తంభము
  • శరవు మహా గణపతి దేవాలయము నగరం నడిబొడ్దులో ఉన్న శరవు మహాగణపతి దేవాలయం చాలా ప్రాచీనమైనది, దేవాలయంలో ప్రధాన దైవం మంజునాధేశ్వర స్వామి, మహాగణపతి.

దర్శనీయ స్థలాలు

[మార్చు]
  • పణంబూర్ బీచ్‌
  • ఉల్లాల్ బీచ్‌
  • నేత్రావతి బ్రిడ్జి - కంకనాడి నుండి తొక్కట్టు వెడుతుంటే వస్తుంది.
  • కద్రి ఉద్యానవనం
  • లాల్‌ బాగ్
  • సుల్తాన్‌ బత్తెరీ

భాషలు , సంస్కృతి

[మార్చు]

మంగళూరు నగరం తుళు, కన్నడ, కొంకణి, బేరి బాషె మొదలగు భాషలలో మంగళూరు ప్రజలు సంభాషించగలరు, ఆంగ్ల భాషలో కూడా వారు సంభాషించగలరు. మంగళూరులో ఆధికారికంగా గుర్తింపబడిన భాష కన్నడ.

నగరానికి చెందిన ప్రముఖులు

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ

[మార్చు]

మంగళూరు నగర రవాణా వ్యవస్థ అంతా పైవేటు బస్సుల రూపంలో చాలా వరకు పైవేటు రంగంలో ఉంది. నగరంలోను, నగర పొలి మేరలలో చాలా గమ్యస్థానాలకు ప్రైవేటు బస్సులు నగర నడి బొడ్డైన టౌను హాలు వద్ద నున్న స్టేట్ బ్యాంకు నుండి నడుస్తాయి. నగరం దాటి బయటి ఊళ్ళకు కూడా బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. నగరాన్ని దాటి దక్షిణ కన్నడ జిల్లాలోని,, పొరుగు జిల్లాలలోని గమ్యస్థానాలకు వెళ్ళే బస్సులు రెండు రకాలు: ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులు. ప్యాసింజర్ సర్వీసు ప్రైవేటు బస్సులు సాధారణంగా మార్గమధ్యంలో వచ్చే అన్ని గ్రామాలలోని ప్రధాన కూడళ్ళలో నిలుస్తాయి. రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సాధారణంగా రెండు లేదా మూడు మార్గమధ్య పట్టణాలలో నిలుస్తాయి ( ఉదాహరణకు మంగళూరు నుండి ఉడిపి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌‌ బస్సు మంగళూరు విడిచి పెట్టాక ఉడిపి చేరే ముందు సూరత్కల్‌, పడుబిద్రి, కాపు అనే గ్రామాలలో మాత్రమే నిలుస్తుంది.

ఆటో రిక్షా ఇంకో రకమైన పబ్లిక్‌ రవాణా వ్యవస్థ. ఇక్కడ ఆటో లకు ఇంజన్లు వెనుక భాగంలో అమర్చబడి, తక్కువ శబ్దం చేస్తాయి. రెండు కి.మి. వెళ్ళడానికి సుమారుగా 11 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటో రిక్షాలన్నింటిలో బిల్లింగ్ మీటర్లు అమర్చారు, అందువల్ల ఎంత పైకం చెల్లించాలో ఆ మీటరు తెలియజేస్తుంది. కాని రాత్రి పూట (రాత్రి 9 గంటలనుండి తెల్లవారు జాము 6 గంటలవరకు) 1.5 శాతం మీటరు రీడింగ్‌ పై పైకం వసూలు చేస్తారు.

రాష్ట్రములోని దూర ప్రదేశాలకు బస్సు సౌకర్యాలు

[మార్చు]

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) మంగళూరు నుండి కర్ణాటక రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుంది. మంగళూరు బెంగళూరు మధ్య ప్యాసింజరు రైల్వే సౌకర్యం లేకపోవడం వల్ల కె.యస్‌.ఆర్‌.టి.సి. బస్సు ఈ రెండు నగరాల మధ్య చాలా బస్సులు నడుపుతుంది. అతిపెద్ద దూరమైన మార్గం మంగళూరు- అంకోలా-హుబ్లీ-బెల్గాం-పూణె-ముంబాయి ప్రైవేటు బస్సులు. కె.యస్‌.ఆర్‌.టి.సి. కూడా నడుపుతున్నాయి. మాములు బస్సులైతే 22 గంటలు, వోల్వో బస్సులైతే 16 గంటలు తీసుకొంటుంది గమ్యస్థానానికి వెళ్ళడానికి.

రైలు రవాణా సౌకర్యము

[మార్చు]

కొంకణ్‌ రైల్వే నిర్మాణానికి మునుపు దక్షిణం నుండి (కేరళ) వచ్చే రైలు బండ్లకు మంగళూరు రైల్వే స్టేషనే చివరి గమ్యస్థానం. బ్రిటిషు వారు దేశం నలుమూలల రైల్వేలను విస్తరించిన మంగళూరు, ముంబాయి ల మధ్య, మంగళూరు, హాసన్‌ ల మధ్య రైల్వే వ్యవస్థను పెద్దగా అభివృద్ధి చేయలేదు.

స్వాతంత్ర్యం వచ్చాక మంగళూరు, హాసన్‌ పట్టణాల మధ్య మీటర్ గేజ్‌ రైల్వే లైను పశ్చిమ కనుమల లో వేశారు. పశ్చిమ కనుమల మధ్య, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఉన్న ఈ రైల్వే లైను ఎక్కువకాలం సర్వీసుకి నోచు కోలేదు. మీటర్ గేజ్ పట్టీలు నిర్మూలించి, బ్రాడ్‌ గేజ్‌ వేయడానికి ప్రారంభం జరిగిన రైల్వే లైను నిర్మాణం ఆదిలోనే నిలిచిపోయింది. ప్రాజెక్టు నడపడానికి సరైన నిధులు లేకపోవడం, రాజకీయ నాయకుల నేతృత్వం ఈ ప్రాజెక్టు మీద సరిగ్గా లేకపోవడడం వంటివి ముఖ్యమైన కారణాలు. ( చివరకు ప్రాజెక్టు 2006లో పూర్తి అయ్యాక ప్యాసింజర్‌ సర్వీసు 2006 డిసెంబరు నుండి ప్రారంభించవలసి ఉంది. వార్తాపత్రికలలో వచ్చే వార్తలు బట్టి 2007 మే నుండి హాసన్‌, మంగళూరు ల మధ్య పూర్తి సర్వీసులు నిలకొల్పబడాలి.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా మంగళూరు, ముంబాయి రైల్వే సర్వీసులు అభివృద్ధికి నోచులేదు. చివరకు 1990-98 సంవత్సరాల మధ్య మంగళురు, ముంబాయి ల మధ్య కొంకణ్‌ రైల్వే నిర్మాణం పూర్తి అయి, 1998 సంవత్సరంలో రైలు సర్వీసులు ప్రారంభించబడ్డాయి. ఈ సర్వీసులు మొదలు పెట్టాక ఉత్తర భారత దేశానికి కేరళ మధ్య ప్రయాణ సమయం 12 గంటల వరకు తగ్గిపోయింది. అయితే కేరళ నుండి ముంబాయి, ఉత్తర భారత దేశానికి వెళ్ళే రైలు బళ్ళు మంగళూరు రైల్వే స్టేషను నుండి కాక మంగళూరు పొలిమేరలో ఉన్న కంకనాడి రైల్వే స్టేషను గుండా పోతాయి. ‍

విమాన రవాణా సౌకర్యము

[మార్చు]
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము

మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన బజ్‌పేలో ఉంది. 2005 సంవత్సరము వరకు విమానాశ్రయ రన్‌ వే 1.6 కి.మి. మాత్రమే ఉంది. బోయింగ్ 737 మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉంది. 2006 జనవరి 10 న అనేక రకాలైన పెద్ద విమానాలు కూడా రావడానికి వీలుగా రన్‌ వే సామర్థ్యం పెంచడం జరిగింది. ఆరోజు మొదటగా కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్ వారి విమానం ఎయిర్ బస్‌ 319, 320 మంగళూరు విమానాశ్రయంలో నిలిచింది..[3] సరికొత్త 2.9 కి.మి. సామర్థ్యం ఉన్న అంతర్జాతీయ రన్‌ వేని 2006 మే 10 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. ఈ ప్రణాళిక పూర్తిగా జరిగితే మంగళూరు విమానాశ్రయం కర్ణాటక రాష్ట్రంలో రెండు రన్‌వేలు ఉన్న విమానాశ్రయంగా నిలుస్తుంది.[4], రన్‌వే అంతా కాంక్రీటుతో నిర్మితమై ఉంటుంది.[5]

ఆర్థిక వ్యవస్థ - బ్యాంకింగ్‌ రంగం

[మార్చు]

ఇందిరా గాంధీ జాతీయం చేసిన 19 బ్యాంకులలో రెండు బ్యాంకుల స్థాపన 20వ శతాబ్దం మొదటి భాగంలో మంగళూరు నగరంలోనే జరిగింది. ఆ రెండు బ్యాంకులు ఏవనగా:-

మంగళూరులో స్థాపించబడిన ఇంకో బ్యాంక్‌ (జాతీయం చేయబడనిది)

  • [[కర్ణాటక బ్యాంక్‌]], (1924 సంవత్సరములో స్థాపించబడి జాతీయం చేసే ప్రక్రియ నుండి తప్పించుకొన్న ప్రైవేటు బ్యాంకులలో ఈ బ్యాంకు ఒకటి)

విద్యాసంస్థలు

[మార్చు]

మంగళూరు పట్టణం జనాభాలో మధ్య తరగతికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. 20 వ శతాబ్దం మెదట్లో బ్యాంకింగు రంగం బాగా అభివృద్ధి చెందడం నగర అభివృద్ధికి తోడ్పడింది. మంగళూరు ప్రజలు విద్యారంగంపై ఎప్పుడూ చాలా శ్రద్ధ చూపించేవారు అందువలన అనేక రంగాలలో విద్యాసంస్థలు మంగళూరులో ఉన్నాయి.

కస్తుర్బా మెడికల్‌ కాలేజి
కస్తుర్బా డెంటల్‌ కాలేజి
ఏనోపాయా మెడికల్‌ కాలేజి
ఏనోపాయా డెంటల్‌ కాలేజి
ఏ.బి.షెట్టి డెంటల్‌ కాలేజి
కె.యస్‌.హెగ్డే మెడికల్‌ కాలేజి
కర్ణాటక పాలిటెక్నిక్‌ కాలేజి (కద్రి ఉద్యానవనం ఎదురుగా ఉన్నది)
సెయింట్‌ అలోషియస్‌ డిగ్రీ కాలేజి
అనేక ఫిజియోతెరపీ కాలేజీలు
నిప్టి (NIFT)

1980 సంవత్సరము నుండి మొదలుగా అనేక ప్రొఫెషనల్ కాలేజిలు వివిధ రంగాలో ( వైద్య కళాశాల, దంత వైద్య కశాళాల, ఇంజనీరింగు కళాశాల, హోటలు మేనేజిమెంటు) స్థాపించబడ్డాయి. ఈ ప్రొఫెషనల్ కాలేజీలలో చదువకోవడానికి దేశం నలు మూలల నుండి విద్యార్థులు అసంఖ్యాకంగా వస్తారు. మంగళూరు విశ్వవిద్యాలయం 10 సెప్టెంబరు 1980న ఊరి పొలిమేరలలో స్థాపించారు. మంగళూరు విశ్వవిద్యాలయం దక్షిణ కన్నడ, ఉడిపి, కొడగు జిల్లాలలోని విద్యార్థుల ఉన్నత విద్యాసౌకర్యాలను చూస్తుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రాసాదంలో అత్యాధునిక విద్యాబోధన, పరిశోధన అవకాశాలు ఉన్నాయి. మంగళూరు విశ్వవిద్యాలయం అధునిక విశ్వవిద్యాలయం అయినా ఈ విశ్వవిద్యాలయానికి అనుసంధానముగా ఉన్న కళాశాలలు చాలా ప్రాచీనమైనవి. ఈ యూనివర్సిటీ 28 డిపార్టుమెంట్లతో 118 కళాశాలను అనుసంధానిస్తూ, స్నాతకోత్తర ( పోస్ట్ గ్రాడుయేట్) స్నాతక (గ్రాడుయేట్) కళాశాలలను పర్యవేక్షిస్తోంది. ముఖ్యమైన విద్యారంగాలు కళలు, వాణిజ్య శాస్త్రం, విజ్ఞానశాస్త్రం, న్యాయ శాస్త్రం.

శీతోష్ణస్థితి , వాతావరణం

[మార్చు]
కద్రి పార్కు చిత్రం

డిసెంబరు నుండి ఫిబ్రవరి నెలల మధ్య వాతావరణం చాలా అహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలలలో మంగళూరు ఉష్ణోగ్రతలు, గాలిలోని తేమ సగటు స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. పగటి అత్యధిక ఉష్ణోగ్రతలు 30 °C రాత్రి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు 20 °C కంటే తక్కువగా ఉంటాయి. వేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. వేసవి కాలములో అత్యధిక ఉష్ణోగ్రతలు 38 °C ని దాటుతాయి. గాలిలో తేమ కూడా 90 శాతానికి చేరుకొంటుంది. వేసవి కాలము తరువాత ఋతుపవనాలు మొదలవుతాయి. భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం మంగళూరులో పడుతుంది. 4000 మి.మీ. వర్షపాతం జూన్‌-సెప్టెంబరు నెలలమధ్య పడుతుంది. సెప్టెంబరు నెలతో వర్షాలు తగ్గిపోతాయి. అక్టోబరులో వర్షం పడడం కొద్దిగా అరుదు.

మూలాలు

[మార్చు]
  1. "మహతోభారా శ్రీ మంగళాదేవి, దేవాలయం,మంగళూరు". Our Karnataka.com. Archived from the original on 2006-10-24. Retrieved 2006-11-07.
  2. "Falling Rain Genomics, Inc - Mangalore". Archived from the original on 2007-10-16. Retrieved 2007-07-03.
  3. "Kingfisher Creates History - Airbus A-319 Trial Flight Lands at Bajpe". DaijiWorld. 2006-01-13. Archived from the original on 2008-04-05. Retrieved 2006-11-03.
  4. "New runway at Bajpe airport meets all norms". The Hindu. 2006-09-21. Retrieved 2007-02-08.[permanent dead link][permanent dead link]
  5. "Pilot training programme at Bajpe airport from Sunday". The Hindu. 2007-01-04. Archived from the original on 2007-10-01. Retrieved 2007-02-08.

బయటి లింకులు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=మంగళూరు&oldid=4339154" నుండి వెలికితీశారు