ముచ్చ సేనాని
ముచ్చ సేనాని రేచర్ల బమ్మసేనానికి కుమారుడు లేదా మనుమడుగా భావిస్తున్నారు. అతను కాకతి మొదటి ప్రోలరాజు (1052-1076) వద్ద చమూపతిగా (సామంతునిగా) పనిచేశాడు. అతను కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. వేములవాడ చాళుక్య రాజైన భద్రగుణ్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించడంలో ఇతడు ముఖ్య భూమిక పోషించాడు. చక్రకూటము, కొంకణము, కొర్పర్తి, గుణసాగరము, వేములవాడ, మొదలగు ప్రాంతములను సాధించుటలో ఇతను మొదటి ప్రోలరాజునకు చాలా సహాయం చేసాడు. ఇతనికి అరిగజ కేసరి అను బిరుదు ఉంది. ఇతను విరియాల వంశజులతో కలసి కాకతి రాజ్య విస్తరణకు పాటుపడినాడు. ఇతను సైన్యాధిపతిగా చేసాడు.
అతని తండ్రి రేచర్ల బమ్మసేనాని రేచర్ల రెడ్డి వంశ మూల పురుషుడు. ఇతడినే బమ్మిరెడ్డి (1035-1055) అని పిలుస్తారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి.[1]
అతని కుమారుడు ఒకటో కాట సేనాని రెండో బేతరాజు (1076-1108) వద్ద సేనానిగా పనిచేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "కాకతీయుల సామంతులు". www.notificationsadda.in. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-22.