Jump to content

నరేంద్ర మోదీ స్టేడియం

వికీపీడియా నుండి
(మోటెరా స్టేడియం నుండి దారిమార్పు చెందింది)

నరేంద్ర మోదీ స్టేడియం (గతంలో మోటెరా స్టేడియం) అనేది భారతదేశంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.[1][2] ఇది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉంది. టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ20 ఇంటర్నేషనల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.[3]

1982 లో నిర్మించిన ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం అని ఉండేది. 2020 ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం స్టేడియం పేరును మార్చారు. దాని సామర్థ్యాన్ని పెంచడానికి, దాని సౌకర్యాలను ఆధునీకరించడానికి 2015 - 2020 మధ్య గణనీయంగా పునర్నిర్మాణాలు జరిగాయి. పునరుద్ధరించిన స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించాడు.

స్టేడియంలో 360-డిగ్రీల LED స్కోర్‌బోర్డ్, నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, ప్రాక్టీస్ గ్రౌండ్‌లు, ఇండోర్ క్రికెట్ అకాడమీ, అనేక హాస్పిటాలిటీ బాక్స్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.

క్రికెట్‌తో పాటు, నరేంద్ర మోడీ స్టేడియం కచేరీలు, ప్రదర్శనలు వంటి ఇతర కార్యక్రమాలను నిర్వహించింది. ఇది అహ్మదాబాద్‌లో ఒక ప్రముఖ మైలురాయిగా మారింది. క్రికెట్ పట్ల భారతదేశ అభిరుచికి చిహ్నంగా మారింది.

స్టేడియం రూపురేఖలు, సౌకర్యాలు

[మార్చు]

ఈ స్టేడియం 63 ఎకరాల భూమిలో ఉంది. పాత స్టేడియంలోని ఒక ప్రవేశం ఉండగా, ఇందులో మూడు ప్రవేశాలున్నాయి. వీటిలో ఒకదానికి మెట్రో లైన్ ఉంది. ఇందులో ఒక్కొక్క దానిలో 25 మంది ఉండగలిగే 76 కార్పొరేట్ పెట్టెలు,[4] 55-గది క్లబ్‌హౌస్, ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్,[4][5] నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్స్‌లో సాధారణ ఫ్లడ్‌లైట్లకు బదులుగా పైకప్పుపై LED లైట్లు పెట్టడం ఈ స్టేడియం. ఈ స్టేడియాన్ని స్తంభాలు లేకుండా నిర్మించారు. స్టేడియంలోని ఏ ప్రదేశం నుండి అయినా ప్రేక్షకులకు అడ్డంకులేమీ లేకుండా మైదానం మొత్తం కనిపిస్తుంది

ప్రధాన మైదానం కాకుండా, స్టేడియంలో అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఒలింపిక్-పరిమాణంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ క్రికెట్ అకాడమీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులు, స్క్వాష్ అరేనా, టేబుల్ టెన్నిస్ ప్రాంతం, 3D ప్రొజెక్టర్ థియేటరు, మూడు ప్రాక్టీస్ మైదానాలు, 50 గదులతో క్లబ్‌హౌస్ ఈ సౌకర్యాల్లో కొన్ని.[6] 3,000 కార్లు, 10,000 ద్విచక్ర వాహనాలు పట్టే పార్కింగ్ స్థలం ఉంది. స్టేడియంలో ఏకకాలంలో దాదాపు 60,000 మంది ప్రజలు వెళ్ళేందుకు వీలుగా రూపొందించిన భారీ ర్యాంప్ కూడా ఉంది. స్టేడియం మొత్తం వైశాల్యం 32 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. ప్రధాన మైదానంలో 11 సెంటర్ పిచ్‌లు ఉన్న ప్రపంచంలోని ఏకైక క్రికెట్ స్టేడియం ఇది.[7]

ప్రపంచ కప్ లలో ఆటలు

[మార్చు]

భారతదేశంలో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లన్నిటి లోనూ సర్దార్ పటేల్ స్టేడియంలో వన్డే ఇంటర్నేషనల్ పోటీలు జరిగాయి

1987 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
1987 అక్టోబరు 26
జింబాబ్వే 
191/7 (50 ఓవర్లు)
v
 భారతదేశం
194/3 (42 ఓవర్లు)
 భారతదేశం 7 వికెట్లతో గెలిచింది
సర్దార్ పటేల్ స్టేడియం, మోతేరా, అహ్మదాబాదు
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్, డికీ బర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కపిల్ దేవ్
  • భారత్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది

1996 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
1996 ఫిబ్రవరి 14
న్యూజీలాండ్ 
239/6 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
228/9 (50 ఓవర్లు)
 న్యూజీలాండ్ 11 పరుగులతో గెలిచింది
సర్దార్ పటేల్ స్టేడియం, మోతేరా, అహ్మదాబాదు
అంపైర్లు: బి.సి.కూరే, స్టీవ్ రాండెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నాథన్ ఆస్టిల్
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది

2011 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
2011 ఫిబ్రవరి 21 (D/N)
ఆస్ట్రేలియా 
262/6 (50 ఓవర్లు)
v
 జింబాబ్వే
171 (46.2 ఓవర్లు)
 ఆస్ట్రేలియా 91 పరుగులతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
Attendance: 18,569
అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, అశోక డిసిల్వా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వాట్సన్
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది

2011 మార్చి 4 (D/N)
జింబాబ్వే 
162 (46.2 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
166/0 (33.3 ఓవర్లు)
 న్యూజీలాండ్ 10 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
Attendance: 7,000
అంపైర్లు: Aleem Dar, మారాయిస్ ఎరాస్మస్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ గప్టిల్
  • జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది

ముఖ్యమైన ఘటనలు

[మార్చు]

పాత మైదానంలో (సర్దార్ పటేల్ స్టేడియంగా ఉన్నప్పుడు) ఇక్కడ జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు

  • మొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ 2021 ఫిబ్రవరి 24న భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగింది [8]
  • సునీల్ గవాస్కర్ 1986-87లో పాకిస్థాన్‌పై టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేశాడు.[9]
  • ఈ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన కపిల్ దేవ్, 1994లో సర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమించేందుకు టెస్ట్ క్రికెట్‌లో తన 432వ వికెట్‌ను సాధించాడు [9]
  • 1999 అక్టోబరులో, సచిన్ టెండూల్కర్ తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీని సాధించాడు.
  • సచిన్ టెండూల్కర్ 2009 నవంబరు 16న శ్రీలంకపై స్టేడియంలో తన 20 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. అదే ఆటలో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 30,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఒక రోజు క్రికెట్‌లో 18,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
  • 2008లో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో AB డివిలియర్స్ తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు.

ప్రస్తుత మైదానంలో

[మార్చు]

రికార్డులు

[మార్చు]

టెస్ట్ మ్యాచ్ రికార్డులు

[మార్చు]
  • అత్యధిక ఇన్నింగ్స్ మొత్తం : శ్రీలంక 760/7d – భారత్ v శ్రీలంక, 2వ ఇన్నింగ్స్, 2009 నవంబరు 16
  • అత్యల్ప ఇన్నింగ్స్ మొత్తం : భారత్ 76 – భారత్ v సౌతాఫ్రికా, 1వ ఇన్నింగ్స్, 2008 ఏప్రిల్ 3
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు : మహేల జయవర్ధనే 275 (435) (4సె-27 6సె-1) – శ్రీలంక v భారత్, 2009 నవంబరు 16
  • అత్యుత్తమ బౌలింగ్ : (ఇన్నింగ్స్‌లో) కపిల్ దేవ్ 9/83 – భారత్ v వెస్టిండీస్, 1983 నవంబరు 12 (ఒక మ్యాచ్‌లో) అక్షర్ పటేల్ 11/70 – ఇండియా v ఇంగ్లాండ్, 2021 ఫిబ్రవరి 13
  • అత్యధిక పరుగులు : రాహుల్ ద్రవిడ్ (భారత్) 771 పరుగులు (మ్యాట్: 7 ఇన్: 14 హెచ్‌ఎస్: 222 సగటు: 59.30 ఎస్ఆర్: 49.10 100సె-3 50సె-1), సచిన్ టెండూల్కర్ - 642 పరుగులు, వివిఎస్ లక్ష్మణ్ - 574 పరుగులు
  • అత్యధిక వికెట్లు : అనిల్ కుంబ్లే (భారతదేశం) 36 వికెట్లు (మ్యాట్:7 పరుగులు:964 BBI:7/115 BBM: 10/233 Ave:26.77 Econ: 2.29 SR: 70.1 5W/I: 3 10W/M:1), హర్భజన్ సింగ్ - 29 వికెట్లు, కపిల్ దేవ్ - 14 వికెట్లు

వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ రికార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Narendra Modi Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-07-08.
  2. "Narendra Modi Stadium". GCA Motera Stadium. Retrieved 28 February 2021.
  3. "Check all the venues of Indian Indian Premier League | IPLT20.com". www.iplt20.com. Retrieved 2022-05-29.
  4. 4.0 4.1 Kumar, Anish (22 February 2020). "Motera Stadium: All you need to know about world's largest cricket venue". Business Standard India. Retrieved 8 March 2021.
  5. "WORLD'S LARGEST CRICKET STADIUM OPENS IN AHMEDABAD". globenewswire. 23 February 2020. Retrieved 8 March 2021.
  6. "Kem chho Trump! World's largest cricket stadium all set to host POTUS". Business Today. February 19, 2020. Retrieved 25 March 2021.
  7. Singh, Navya (24 February 2021). "Motera Cricket Stadium, World's Largest, Renamed As Narendra Modi Stadium". thelogicalindian.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 24 February 2021.
  8. "India vs England: A Guide To Motera Stadium". NDTV. Retrieved 24 February 2021.
  9. 9.0 9.1 "Sardar Patel Stadium in Motera to be demolished". ESPNCricinfo. Retrieved 11 September 2015.
  10. "Final (N), Ahmedabad, May 29, 2022, Indian Premier League (Riyan Parag 15*, Obed McCoy 8*, Mohammed Shami 0/33) - Live, RR vs GT, Final, live score, 2022". ESPNcricinfo. Retrieved 2022-05-29.
  11. camille.jensen (2022-06-28). "New world record attendance set in Populous-designed cricket stadium". Populous (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-02.
  12. "Indian Premier League Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-05-29.
  13. "IPL 2023 Final, CSK vs GT: MS Dhoni scripts history, plays 250th match and 11th final". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-06-02.
  14. "IPL 2023 Orange Cap Winner: Shubman Gill eclipses Jos Buttler's record, falls short of Virat Kohli's mark". Zee Business. 2023-05-29. Retrieved 2023-06-02.