Jump to content

కొణతాల రామకృష్ణ

వికీపీడియా నుండి
(రామకృష్ణ కొణతాల నుండి దారిమార్పు చెందింది)
కొణతాల రామకృష్ణ
1989-91
అంతకు ముందు వారుపెతకంశెట్టి అప్పలనరసింహం
నియోజకవర్గంఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం
1991-96
తరువాత వారుచింతకాయల అయ్యన్నపాత్రుడు
నియోజకవర్గంఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం
2004-09
మినిస్టర్వాణిజ్య పన్నుల మంత్రి
అంతకు ముందు వారుదాడి వీరభద్రరావు
నియోజకవర్గంఅనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననంజనవరి 04,1957
గవరపాలెం (అనకాపల్లి),అనకాపల్లి,అనకాపల్లి జిల్లా
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీజనసేన పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిశ్రీమతి పద్మావతి
సంతానం2
తల్లిదండ్రులుకొణతాల సుబ్రహ్మణ్యం
నివాసంగవరపాలెం (అనకాపల్లి)
వృత్తివ్యాపారవేత్త మరియు విద్యావేత్త

కొణతాల రామకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యుడు, రాజకీయ నాయకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

కొణతాల రామకృష్ణ 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కొణతాల సుబ్రహ్మణ్యం. ఇతని విద్యాభ్యాసం అనకాపల్లిలోని "అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజి"లో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.కాం. పట్టా పొందాడు. ఇతడు వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా సేవలను అందించాడు. ఇతనికి 1982లో పద్మావతితో వివాహం జరిగింది. వీరికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు.[1]అతను గవర నాయుడు కమ్యూనిటీకి చెందినవాడు[2],అనకాపల్లి ప్రాంతంలో బలమైన వ్యాపార కులం[3][4]

రాజకీయ రంగం

[మార్చు]

ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో 1980వ దశకంలో చేరాడు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.అప్పలనరసింహంపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచి 9వ లోక్‌సభకు ఎన్నికైనాడు. తిరిగి 1991లో పదవ లోక్‌సభకు అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1990, 1992 సంవత్సరాలలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీతరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయాడు. తిరిగి 2004లో దాడి వీరభద్రరావుపై 17వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. తిరిగి 2009లో శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు,తెలుగు దేశం అభ్యర్థి దాడి వీరభద్ర రావు,తనకు మధ్య జరిగిన త్రిముఖ పోరు స్వల్ప ఓట్లు తేడ తో గంటా శ్రీనివాసరావు గెలిచాడు. ఇతడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించాడు. రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన రామకృష్ణ అతని మరణానంతరం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించాడు. ఇతని తమ్ముడు కొణతాల రఘునాథ్‌ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వై. ఎస్. విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించాడు.[5].విశాఖపట్నం,అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.అతను తన కులం మీద మాత్రమే కాకుండా ఇతర కులాల్లో కూడా ఫాలోయింగ్‌ను అనుభవించాడు[4].అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు జనవరి 25న జనసేన పార్టీలో చేరారు.[6]దాడి మరియు కొణతాల రాజకీయ ప్రత్యర్థులు.[7]

ఎంపీగా పోటీ[8] :

[మార్చు]
సంవత్సరం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1989 అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 299109 పెతకంశెట్టి అప్పలనరసింహం తెలుగు దేశం పార్టీ 299100
వీసం సన్యాసి నాయుడు స్వతంత్ర అభ్యర్థి 35388
1991 అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 261311 పెతకంశెట్టి అప్పలనరసింహం తెలుగు దేశం పార్టీ 250153
వీసం సన్యాసి నాయుడు భారతీయ జనతా పార్టీ 45731
1996 అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం అయ్యన్న పాత్రుడు చింతకాయల తెలుగు దేశం పార్టీ 327290 కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 277118
మల్ల సాంబశివరావు ఎన్టీఆర్ టీడీపీ(ఎల్పీ) పార్టీ 45986
గొట్టుముక్కల శ్రీహరి రాజు భారతీయ జనతా పార్టీ 19880
భీమశెట్టి కృష్ణరావు స్వతంత్ర అభ్యర్థి 1328

ఎమ్మెల్యేగా పోటీ[9] :

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1999 అనకాపల్లి దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 52750 కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 49039
2004 అనకాపల్లి కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 63277 దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 46244
2009 అనకాపల్లి జి.శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ 58568 కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 47702
దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 28528
2024 అనకాపల్లి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ


మూలాలు

[మార్చు]
  1. web master. "KONATHALA, SHRI RAMA KRISHNA". PARLIAMENT OF INDIA LOK SABHA. భారతదేశం. Retrieved 22 January 2021.
  2. Telugu, TV9. "Andhra Pradesh Konathala Rama Krishna Election Result: AP Konathala Rama KrishnaProfile contesting in Assembly Election Profile Information, latest news, Photos, Videos in Telugu". TV9 Telugu. Retrieved 2024-06-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Ex YSRCP leader Konatala Ramakrishna may join Janasena Party". The Times of India. 2024-01-17. ISSN 0971-8257. Retrieved 2024-02-26.
  4. 4.0 4.1 "New JS entrant Konathala to contest from Anakapalli". The Times of India. 2024-02-25. ISSN 0971-8257. Retrieved 2024-02-26.
  5. Staff Reporter (15 March 2019). "YSRCPలోకి కొణతాల రామకృష్ణ?". సమయం. No. telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ex-minister-konathala-ramakrishna-to-join-ysrcp/articleshow/68418739.cms. Retrieved 22 January 2021.
  6. "Ex YSRCP leader Konatala Ramakrishna may join Janasena Party". The Times of India. 2024-01-17. ISSN 0971-8257. Retrieved 2024-02-26.
  7. Desk, Tupaki (2018-08-20). "Why Every Party Is Running After These Two Leaders?". english.tupaki.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-26.
  8. "Anakapalli (Andhra Pradesh) Lok Sabha Election Results - Anakapalli Parliamentary Constituency, Winning MP and Party Name". www.elections.in. Retrieved 2023-08-08.
  9. "Anakapalli Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Anakapalli, Andhra Pradesh". Elections in India. Retrieved 2023-08-08.