రెండవ అలంఘీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Alamgir II
14th Mughal Emperor
పరిపాలన2 June 1754 – 29 November 1759
పూర్వాధికారిAhmad Shah Bahadur
ఉత్తరాధికారిShah Alam II
రాజప్రతినిధిImad-ul-Mulk (1754–1756)
Najib-ul-Daula (1756–1759)
Imad-ul-Mulk (1759)
జననం(1699-06-06)1699 జూన్ 6
Multan, Mughal Empire
మరణం1759 నవంబరు 29(1759-11-29) (వయసు 60)
Kotla Fateh Shah, Mughal Empire
Burial
SpousesSayyid Begum
Zinat Mahal
Faiz Bakht Begum
Azizabadi Mahal
Latifa Begum
Zinat Afraz Begum
Aurangabadi Mahal
వంశముMirza Abdullah Ali Gouhar Bahadur a.k.a. Shah Alam II
Mirza Muhammad Ali Asghar Bahadur
Mirza Muhammad Harun Hidayat Bakhsh Bahadur
Mirza Tali Murad Shah Bahadur
Mirza Jamiyat Shah Bahadur
Mirza Muhammad Himmat Shah Bahadur
Mirza Ahsan-ud-Din Muhammad Bahadur
Mirza Mubarak Shah Bahadur
12 daughters including:
Zuhra Begum
Names
Aziz-ud-din Alamgir II
రాజవంశంTimurid
తండ్రిJahandar Shah
మతంIslam

" అజిజ్- ఉద్- దిన్- ఆలంఘీర్ " (1699 జూన్ 6 జననం - 1759 నవంబరు 29 మరణం) (عالمگير ثانی) మొఘల్ చక్రవర్తిగా 1754 జూన్ 3 నుండి 1759 నవంబరు 29 వరకు పాలించాడు. ఆయన జహందర్ షా కుమారుడు.అజిజ్ - ఉద్- దిన్ జహందర్- షా రెండవ కుమారుడు. ఆయన గజీ ఉద్ దిన్- దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ సాయంతో " అహ్మద్ షా బహదూర్ "ను 1754లో సింహాసనం నుండి పతనం చేసి మొఘల్ సిహాసనం అధిష్టించాడు. ఆయన తనజీవితంలో అధికకాలం జైలులోనే గడిపిన కారణంగా ఆయనకు రాజ్యపాలనలో కాని యుద్ధభూమిలో కాని తగినంత నైపుణ్యం లభించలేదు. ఆయన అత్యంత బలహీన పాలకుడిగా అధికారం అంతటినీ తన వజీర్ " గజీజ్ - ఉద్- దిన్ "కి కట్టబెట్టాడు. 1756లో " అహ్మద్ షాహ్ అబ్దాలి " భారతదేశం మీద దండెత్తి డిల్లీని ఆక్రమించి ( మధుర ఉత్తరప్రదేశ్) ను దోచుకున్నాడు." రెండవ గజీ-ఉద్-దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ "తో చేతులు కలిపిన మరాఠీలు అత్యంత శక్తివంతులై ఉత్తరభారతదేశం అంతటి మీద ఆధిక్యత సాధించారు. మధుర విస్తరణ శిఖరాగ్రానికి చేరుకుంది. శక్తివంతమైన పాలకుడు లేక బలహీనపడి ఉన్న మొఘల్ సాంరాజ్యానికి మరాఠీలు శక్తివంతులు కావడం సమస్యాకరంగా మారింది.రెండవ ఆలంఘీర్ , అప్పుడే వజీరుగా తలెత్తుతున్న " గజీ ఉద్- దీన్ ఫెరోజ్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " మద్యవిబేధాలు అధికం అయ్యాయు. ఈ సమయంలో రెండవ ఆలంఘీర్‌ను " గజీ ఉద్- దీన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ " , మరాఠీ నాయకుడు సదాశివరావ్ భౌ కలిసి హత్యచేసారు. రెండవ ఆలంఘీర్ కుమారుడు అలీ గౌహర్ ఢిల్లీ పాలకుల హింస నుండి తప్పించుకున్నాడు. మూడవ షాజహాన్ మొఘల్ సింహాసనం అధిష్టించాడు.

ఆరంభకాల జీవితం

[మార్చు]

" అజిజ్- ఉద్- దిన్ బెగ్ మిర్జా " (రెండవ ఆలంఘీర్) 1699 జూన్ 6న ముల్తాన్‌లో జన్మించాడు. ఆయన జహందర్ షాహ్ (మాజ్- ఉద్- దిన్) రెండవ కుమారుడు. రెండవ ఆలంఘీర్‌ 7 సంవత్సరాల వయసులో ఉండగా ఆయన ముత్తాత ఔరంగజేబు మరాఠీలతో యుద్ధంచేస్తూ డెక్కన్‌లో మరణించాడు. ఆయన తాత మొదటి బహదూర్ షా (మొఘల్ చక్రవర్తి) మరణించిన తరువాత ఆలంఘీర్ తండ్రి " జహందర్ షా "మొఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించాడు. తరువాత జరిగిన వారసత్వ యుద్ధంలో జహందర్ షాను ఫర్రుక్‌సియార్ ఓడించాడు." అజిజ్ - ఉద్- దీన్ " 1714 లో ఖైదుచేయబడి అప్పుడే తలెత్తిన వజీరు " మూడవ గజీ- ఉద్-దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ "(ఇమాద్ - ఉల్- ముల్క్) సాయంతో 1754 విడుదల చేయబడ్డాడు. వజీరు మూడవ గజీ- ఉద్-దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ రెండవ ఆలంఘీర్‌ను నామమాత్రపు చక్రవర్తిని చేసి తెరవెనుక పాలనాధికారం కొనసాగించాడు. 1754 లో వజీరు చేత అజీజ్ - ఉద్-దీన్‌కు రెండవ ఆలఘీర్ అనే బిరుదుతో గౌరవించబడ్డాడు. ఆయన ఔరంగజేబులా అధికారకేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాడు.

Imad ul-Mulk (a persecutor of the Mughal imperial family) holds a banquet.

" వజీరు మూడవ గజీ- ఉద్-దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " ఆదర్శరహిత వ్యక్తిగా , అత్యంత స్వార్ధపరుడుగా విమర్శించబడ్డాడు.ఆయన తన పోరాటాల కొరకు మరాఠీ కూలీసైన్యాలను ఏర్పాటుచేసుకున్నాడు.[1] సాంరాజ్య ఆదాయాన్ని వజీరు చేజిక్కించుకుని చక్రవర్తి రెండవ ఆలంఘీర్ కుటుంబాన్ని అలమటింపజేసాడు. వజీరు మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ పెద్ద కుమారుడు రెండవ షాహ్ ఆలం (అలీ గౌహర్)ను హింసించాడు. తరువాత రెండవ ఆలంఘీర్ , " మూడవ గజీ ఉద్ - దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " మద్య అభిప్రాయబేధాలు తీవ్రమైయ్యాయి. చివరకు వజీరు మూడవ గజీ ఉద్ - దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ రెండవ ఆలంఘీరును (1759) హత్యచేసాడు.

పాలన

[మార్చు]

రెండవ ఆలంఘీర్ పాలన క్లిష్టసమయం ఎదుర్కొన్నప్పుడు మొఘల్ సాంరాజ్య అధికారం తిరిగి కేంద్రీకృతం చేయబడింది. ప్రత్యేకంగా నవాబులు మరాఠీలను ఎదుర్కొనడానికి ఐఖ్యత అవసరమని భావించి మొఘల్ చక్రవర్తిని తృప్తిపరచడానికి ప్రయత్నించారు. ఈ అభివృద్ధి చర్యలు మరాఠీలబలంతో అధికారం చేజిక్కించుకోవలని ఎదురుచూస్తున్న " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " ను అసహనానికి గురిచేసాయి.

దుర్రానీ ఎమిరేట్‌తో కూటమి

[మార్చు]
Timur Shah Durrani was the son-in-law of the Mughal Emperor Alamgir II and the brother-in-law of Shah Alam II.

1755 లో మొఘల్ సాంరాజ్యానికి చెందిన వైశ్రాయి " ముయిన్ ఉల్- ముల్క్ " (మిర్ మన్ను) మరణించిన తరువాత ఆయన భార్య ముఘ్లం బేగం వారసత్వపోరు జరగకుండా ఆపడానికి , తూర్పు భూభాగంలో తలెత్తిన సిక్కుల తిరుగుబాటు నివారించడానికి గత్యంతరం లేని పరిస్థితిలో " అహమ్మద్ షాహ్ దుర్రాని " సహాయం కోరింది. 1756 లో అహ్మద్ షాహ్ దుర్రానీ , ఆయన సైన్యాన్ని లాహోరుకు నడిపించి ఆయన కుమారుడైన " తైమూరు షాహ్ దుర్రానీ " కొత్త వైశ్రాయిగా నియమించబడ్డాడు. కొత్త వైశ్రాయికి " జహాన్ ఖాన్ " రక్షణగా నియమించబడ్డాడు. అలాగే అదినా బెగ్‌ను డోయాబ్ ఫౌజుదార్‌గా నియమించాడు. తరువాత అహ్మద్ షాహ్ దుర్రానీ తూర్పు పంజాబు ప్రాంతంలో హిందూ , సిక్కు నివాసులను దోచుకున్నాడు. 1757 అక్టోబర్‌లో దుర్రానీ ఢిల్లీ వైపు సైన్యాలను నడిపించాడు. మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ సభాసదులైన షాహ్ వాలియుల్లాహ్ , నజీబ్- ఉల్ - దౌలా వంటి ప్రముఖులు , రాజకుటుంబీకులతో కలిసి " అహ్మద్ షాహ్ దుర్రానీ " ని కలిసి సంప్రదించడానికి వచ్చాడు. తరువాత ఆయన మరాఠీల సహాయంతో " మూడవ గజీ ఉద్- దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " అధికారాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అహ్మద్ షాహ్ దుర్రానీ కుమారుడు తైమూర్ షాహ్ దుర్రానీతో రెండవ ఆలంఘీర్ కుమార్తె " జుహ్రా బేగం " తో వివాహం నిర్ణయించిన తరువాత అహ్మద్ షాహ్ దుర్రానీ సంబంధాలు మరింతగా బలపడ్డాయి. అహ్మద్ షాహ్ దుర్రానీ మునుపటి మొఘల్ చక్రవర్తి " ముహమ్మద్ షాహ్ " కుమార్తె అయున హద్రత్ బేగంను వివాహం చేసుకున్నాడు. తరువాత అహ్మద్ షాహ్ దుర్రానీ తన సైన్యాలను కుమారుడైన తైమూర్ షాహ్ దుర్రానీ నాయకత్వంలో వదిలి కాబూలుకు వెళ్ళాడు. తరువాత తైమూర్ షాహ్ దుర్రానీ తండ్రి వదిలి వెళ్ళిన సైన్యాలను లాహోరు సైన్యంతో విలీనం చేసాడు. తరువాత వారు జాంజమా ఫిరంగిని కనిపెట్టారు.

ఢిల్లీని స్వాధీనం చేసుకొనుట (1757)

[మార్చు]
Patthargarh fort (literally meaning: "stone stronghold") outside Najibabad, built by Najib ad-Dawlah in 1755, during the reign of the Mughal Emperor Alamgir II.

1757 జూలైలో రఘునాథరావు నాయకత్వంలో మరాఠీలు దుర్రానీ, మొఘల్ సామ్రాజ్యాధినేతల జరిగిన వివాహసంబంధిత కూటమిని వ్యతిరేకిస్తూ " మూడవ గజీ ఉద్- దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " నాయకత్వంలో సైన్యాలతో ఎర్రకోట ఎదురుగా 30 కి.మీ దూరంలో మకాం వేసి యమునాతీరంలో ఉన్న గ్రామాలను ఆక్రమించుకున్నారు. తరువాత అధికారరహితంగా ఉన్న రెండవ ఆలంఘీరు పాలనను వ్యతిరేకిస్తూ రఘునాథరావు ఢిల్లీని ఆక్రమించుకోవడానికి ప్రణాళికవేసాడు. వారు ఆక్రమించుకున్న సమయంలో " మిర్ బక్షీ " (మొఘల్ సామ్రాజ్య ఖజానా అధికారి) " నజీబ్ ఉల్ దౌలా " తన సహచరులైన కుతుబ్ షాహ్, అమన్ ఖాన్, మొఘల్ సైన్యంలో 2,500 గారిషన్లు ఢిల్లీ నగరంలో ఉన్నాయి. మరాఠీలు పడవలకు నిప్పు అంటించి ఢిల్లీ నగరానికి ఆహారసరఫరా అందకుండా చేసారు. నజీబ్ - ఉల్ - దుల్లా సైన్యాలు ఎర్రకోటకు దూరంగా నిలిపి ఉంచబడ్డాయి. హెరాత్ సమీపంలో తిరుగుబాటుదారుల అణిచివేత కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న దుర్రానీ సహాయం ఢిల్లీపాలకులకు సకాలంలో అందలేదు. నజిద్ - ఉల్- దుల్లా 5 మాసాలకాలం మరాఠీ కూటమి దోపిడీదారులను అడ్డగించిన తరువాత లొంగిపోయాడు. అయన ఓటమిని అంగీకరించి నజీబాబాదును వదిలివెళ్ళాడు.ఇమాద్- ఉల్- ముల్క్ బలహీనమైన రెండవ ఆలంఘీరును మరాఠీల సహాయంతో కూలత్రోసి " మిర్ బక్షీని " సింహాసనం మీద అధిష్టింపజేసి తరువాత మొఘల్ రాజకుటుంబీకులను ఊచకోతకోయడం ప్రారంభించాడు. [2]

మరాఠీలతో పోరు

[మార్చు]

ఢిల్లీ మీద నియంత్రణ కోల్పోయిన తరువాత నజీబ్-ఉల్- దౌలా, కుతుబ్ ఖాన్, మొఘల్ సంరాజ్యం ఫౌజుదార్ (సిర్హింద్) అబ్దుస్ సమద్ ఖాన్ ఆయన సహాయకులు మరాఠీకూటమిని ఎదుర్కొనడం కొనసాగాగించారు. ఇరుపక్షాలు షరంపూర్, షాహాబాదు మర్కండా వద్ద తలపడ్డాయి. ప్రతిస్పందనగా మరాఠీలు తరయోరి, కర్నాల్, కుంజ్పురాలను స్వాధీనం చేసుకున్నారు.[2]1756లో రెండవ ఆలంఘీర్ విశ్వసనీయులైన కర్నూలు నవాబు, కడపా నవాబు, సావంపూర్ నవాబులను 1757 వరకు మరాఠీ సైన్యాధ్యక్షుడు బాలాజీ రావు దళాలు దోచుకున్నాయి.

Mughal artillerymen under the command of Siraj-ud-Daula during the Battle of Plassey.

బెంగాల్ నష్టం

[మార్చు]

రెండవ ఆలంఘీర్ మొఘల్ సామ్రాజ్యానికి వార్షికంగా 2 మిలియన్ల " మాములు " కప్పంగా చెల్లించే బెంగాలు నవాబు మరణానికి విచారించాడు. ఆయన తరువాత " సిరాజ్ - ఉద్ - దౌలా "ను బెంగాలు నవాబుగా నిర్ణయించారు. అయినప్పటికీ కొత్తగా నియమించబడిన బెంగాల్ నవాబుకు అంతర్గత శత్రువుకు అధికం అయ్యారు. రెండవ ఆలంఘీర్ బెంగాలు నవాబుకు విధించిన " ఫిర్మన్ " కట్టడాన్ని బెంగాలు ప్రముఖులు వ్యతిరేకించారు.అంతర్గత సంఘర్షణల ఫలితంగా బెంగాలు నవాబు మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ , సలాబత్ జంగ్‌ అనుమతి తీసుకోకుండా కలకత్తాను ఈస్టిండియా కంపెనీతో విలీనం చేసాడు. 1757లో క్లైవ్ సిరాజ్ - ఉద్ - దౌలాను " ప్లాస్సే యుద్ధంలో " ఓడించి తిరిగి కలకత్తాను స్వాధీనం చేసుకున్నాడు. సైన్యం అంతా నిర్మూలం అయిన తరువాత సిరాజ్ - ఉద్- దౌలా పారిపోయాడు. అయినప్పటికీ సిరాజ్ - ఉద్ -దౌలా కిరాతకంగా " మిర్ జాఫర్ " చేత చంపబడ్డాడు.మరణించిన సిరాజ్- ఉద్- దౌలా బాధాతారహిత చర్య మొఘల్ రాజసభలో విమర్శకు గురైంది. ఘులాం హుస్సేన్ తబాతాబై , రెండవ ఆలంఘీర్ " మిర్ జాఫర్ "ను బెంగాల్ నవాబుగా గుర్తించడానికి నిరాకరించారు. ఫలితంగా మిర్ జాఫర్ రాజకుటుంబానికి వ్యతిరేరంగా " మూడవ గజీ ఉద్ - దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ "తో కూటమిగా చేరాడు.

దక్కన్‌లో ఆధిక్యత

[మార్చు]

రెండవ ఆలంగీర్ పాలనా కాలమంతా ఫ్రెంచి సైనికాధికారి మార్క్విస్ దే బుస్సీ కాస్టెల్నూ, థోమస్ ఆర్థర్ కొమ్టే దే లాల్లీ, వారి అనుయాయులైన సలాబత్ జంగ్, హైదర్ అలీ తిరుగుబాటుదారులైన మరాఠీలకు వ్యతిరేకంగా సైన్యాలను నడిపించారు. వారి ప్రయత్నాలు సాధనలు మొఘల్ సామ్రాజ్యంలో పలుకుబడి అధికం చేసింది. 1756లో సలాబత్ జంగ్ సైన్యం అత్యధికంగా " కటియోక్స్" (భారీ తుపాకులు) ఉపయోగించబడ్డాయి. అవి భూమి మీద ప్రయోగించబడినప్పుడు ఫిరంగులకంటే వేగవంతంగా విధ్వంసం సృష్టిస్తాయి.[3] ఈ కొత్త ఆయుధాలు పూర్తిగా మరాఠీల శక్తిని కృంగదీసాయి. ప్లాసీ యుద్ధం జరిగిన వెంటనే ఫ్రెంచి సైనికాధికారి బుస్సీకి మొఘల్ చక్రవర్తి, రెండవ ఆలంగీర్ " సైఫుద్దౌలా ఉమ్దాతుల్ ముల్క్" , "మున్సబుదార్ ఆఫ్ 7000" బిరుదులు ఇచ్చి సత్కరించాడు.ఆయన హైదర్ జంగ్ సాయంతో బ్రిటిష్ సర్కారు నుండి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నాడు. అయినప్పటికీ 1758లో ఫోర్డ్ ఉత్తర సర్కార్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సలాబత్ జంగ్ భయంతో ఈస్టిండియా కంపెనీతో రాజీ కుదుర్చుకుని బ్రిటిష్ రాజకీయ రక్షణను గుర్తించాడు. అతిత్వరలో ఆయన సోదరుడు నిజాం అలీ ఖాన్, సలాబత్ జంగ్‌ను పడగొట్టాడు.

భోపాల్ నవాబు

[మార్చు]

1758లో ముఘల్ సైనికాధికారి , భోపాల్ నవాబు తన సవతితల్లి మమోలాభాయి మోసపూరిత దాడికి గురైయ్యాడు. 1758లో రైసెన్ కోట వద్ద మమోలా భాయి మొఘల్ సైన్యంతో తలపడింది. ఆగ్రహించిన మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ ఫైజ్ మొహమ్మద్ ఖాన్‌ను భోపాల్ నవాబుగా ప్రకటిస్తూ భోపాల్ నవాబు ఫైజ్ మొహమ్మద్ ఖాన్‌కు " బహదూరు " బిరుదు ఇచ్చి సత్కరించాడు. అయినప్పటికీ కోట మాత్రం మమోలా భాయి , తిరుగుబాటు దారుడైన నానాసాహెబ్ పేష్వా ఆధీనంలో ఉండి పోయింది. రెండవ ఆలంఘీర్ విషాదకరంగా హత్యచేయబడిన తరువాత , సదాశివరావు భోపాలును బెదిరించిన తరువాత ఫైజ్ మొహమ్మద్ ఖాన్ రైసెన్ కోటను త్వరితగతిలో (1760) స్వాధీనం చేసుకున్నాడు. మూడవ పానిపట్టు యుద్ధంలో ఫైజ్ మొహమ్మద్ ఖాన్ నాయకత్వంలో నడిచిన మొఘల్ సైన్యం మరాఠీలకు రావలసిన సరఫరాలను ఆటంకపరిచిందని విశ్వసిస్తున్నారు.

మరాఠీల ముందడుగు

[మార్చు]
Maratha Confederacy at its zenith in 1760, the Peshwa discussed abolishing the Mughal Empire and placing Vishwasrao on the imperial throne in Delhi.

1758లో రఘునాథరావు నాయకత్వంలో మరాఠీలు వజీరు " మూడవ గజీ ఉద్- దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " చేత దోచుకొనబడిన మొఘల్ సాంరాజ్య సంపదను సేకరించిన తరువాత లాహోరును ఆక్రమించుకుని బాలుడైన తైమూర్ షాహ్ దుర్రానీనిని పదవీచ్యుతుని చేయడానికి వజీరుతో కలిసి కుట్రసాగించారు. రఘునాథరావు జహాన్ ఖాన్ , తైమూర్ షాహ్ దుర్రానీలను పదవీ చ్యుతులను చేసారు. తైమూరు షాహ్ దుర్రానీ , ఆయన సైన్యం సిఖ్ , మరాఠీల చేత లాహోరు నుండి పషావరుకు తరిమివేయబడ్డారు. ఈ విజయం పోరాటపఠిమ కలిగిన పేష్వాను ఢిల్లీ ఆక్రమణకు ప్రేరణ కలిగించింది. తరువాత " విశ్వనాథరావు "ను మొఘల్ సింహాసనం అధిష్టింపజేయడానికి సమాలోచనలు జరిగాయి.[4]

హత్య

[మార్చు]

1759 వేసవిలో అకస్మాత్తుగా రాకుమారుడు " మూడవ షాహ్ ఆలం " (అలీ గౌహర్) ఢిల్లీ నుండి పారిపోయాడు." మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " , సదాశివరావు రెండవ ఆలంఘీర్ తమను అధికారం నుండి తొలగించడానికి ముందుగా రాకురుని పంపించాడని భావించారు.1759 శీతాకాలంలో నిశితంగా పరిశీలించిన తరువాత ఇమాద్- ఉల్ ముల్క్ , సదాశివరావు మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ , ఆయన కుటుంబంలో ముఖ్యమైన వారిని చంపడానికి కుట్రచేసారు.[5]

Silver rupee issued in the name of Alamgir II, date of AH 1172 (c. 1758).

అహ్మద్ షా దుర్రానీ దాడి తరువాత కొత్తగా నియమితుడైన " ప్రధాన వజీరు " నజీబ్ ఉద్ దౌలా " ఫౌజీదార్లు, నవాబులు, నిజాములను సమైక్యం చేసి మిగిలిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసాడు.బలవంతంగా అధికారం నుండి తొలగించబడిన " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " తనకుతానుగా మరాఠీల నాయకుడు సదాశివరావు భావుతో కూటమి 15 రోజులపాటు తిరుగుదాడిచేసాడు.దాడిలో నజీద్ ఉద్ దౌలాను ఓడించి ఉత్తరదిశగా నడిచారు. " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " రెండవ ఆలంఘీర్ " దుర్రానీని తిరిగి పిలుస్తాడని లేక తనకుమారుడైన రెండవ షాహ్ ఆలం సహాయంతో తనను మరాఠీశక్తి నుండి దూరంచేస్తాడని భయపడ్డాడు.అందువలన " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ , ఆయన కుటుంబసభ్యులను హత్యచేయడానికి కుట్ర చేసాడు.ఆలి గౌర్ వంటి రాకుమారులు నిస్సహాయులై హత్యనుండి తప్పించుకున్నారు. 1759లో రెండవ ఆలంఘీర్ ఒక భక్తుడు తనను కలవడానికి వచ్చాడని చెప్పాడు. మతసంబంధిత వ్యక్తులను కలడానికి రెండవ ఆలంఘీర్ ఆసక్తి చూపేవాడు. ఆలంఘీర్ కోట్ల ఫతేహ్ షాహ్ వద్ద ఆయనను కలవడానికి ఏర్పాటు చేసాడు. అక్కడ రెండవ ఆలంఘీరును " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ " వరుసగా తిరిగి తిరిగి పొడిచి చంపాడు.మొఘల్ చక్రవర్తి మరణానికి మొఘల్ సామ్రాజ్యం అంతా (ప్రత్యేకించి ముస్లిం ప్రజలు ) విచారించింది. మరణం తరువాత " మూడవ పానిపట్టు యుద్ధం " నికి సిద్ధం చేసారు. ప్రతీకారంతో రగిలిన ముస్లిం ప్రజలు 1761లో రెండవ ఆలంఘీర్ కుమారుడైన రెండవ షాహ్ ఆలం మొఘల్ సింహాసనం అధిష్టింపచేసారు.1759లో ఆలంఘీర్ హత్యజరిగిన తరువాత సదాశివరావు భావు స్వల్పకాల అధికారం శిఖరాగ్రం చేరుకుంది. ఆయన " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ "కు లంచం ఇవ్వడం లేక అధికారం నుండి తొలగించడం ద్వారా మొఘల్ సాంరాజ్యాన్ని తొలగించి విశ్వాసరావును ఢిల్లీ సింహాసనం అధిష్టించేలా చేయాలని ప్రయత్నించాడు. [4]

మరణం తరువాత

[మార్చు]

సదాశివరావు భావు తరువాత సరికొత్త చక్రవర్తిగా రెండవ షాజహాన్ను ఎంచుకున్నాడు. తరువాత ఆయన మొఘల్ ఆభరణాలు , మొఘల్ రాజ్యసభ అలంకరణ సంపదను దోచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించాడు. తరువాత ఆయన మొఘలులు ఆగ్రా , ఢిల్లీ లలో నిర్మించిన మసీదులు, సమాధులు , మందిరాల రూపురేఖలను మార్చడానికి ప్రయత్నించాడు.తరువాత ఆయన మోతీ మసీదు పవిత్రతను భగ్నంచేసి విలువైన సంపద అలకరణ కళాఖండాలను దోచుకున్నాడు.[6] రెండవ ఆలంఘీర్ అల్లుడు " తైమూర్ షాహ్ దుర్రానీ " 1760లో మరాఠీల చేతిలో ఓటమి పొందిన తరువాత అహ్మద్ షా దుర్రానీ ఆగ్రహించి మునుపటికంటే అధికంగా సైన్యసమీకరణ చేసాడు. ఇందుకు ప్రతిచర్యగా " మూడవ గజీ ఉద్ దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ " , " సదాశివరావు భావు " నేరాలు చేయడానికి ఉద్యుక్తులు అయ్యారు.నజీద్ ఉద్ దౌలా , ఆయన కూటమి సభ్యులు ముస్లిం ప్రముఖులు ఢిల్లీని తిరిగి ఆక్రమించుకుని " రెండవ షా ఆలం "ను నామమాత్రపు మొఘల్ చక్రవర్తిగా సిహాసం అధిష్టింపచేసారు. దక్షిణప్రాంతంలో హైదర్ ఆలీ , ఆయన సైనికదళం తీవ్రంగా మరాఠీలను ఎదుర్కొన్నాడు.రెండవ షా ఆలం మరాఠీల పతనం ఎదురుచూస్తూ " షుజా - ఉద్- దౌలా "ను ప్రధాన వజీరుగా , " ముక్తర్ ఖాస్ "ను ప్రధాన రాజప్రతినిధిగా నియమించాడు.[7][8] ఈ చర్యలు మత , రాజకీయ విబాధాలు కలిగించి 1761లో " పానిపట్టు యుద్ధం " జరగడానికి దారితీసింది.

విదేశీ సంబంధాలు

[మార్చు]
A portrait of Marquis de Bussy-Castelnau.

1755లో డీ బుస్సీ కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ నుండి ఒక లేఖను అందుకున్నాడు. మరాఠీ కుట్రను భగ్నం చేయడానికి ఫ్రెంచి సహాయం కావాలని ఆ లేఖలో రెండవ ఆలంఘీర్ అభ్యర్థించాడు.ఆ లేఖలో రెండవ ఆలంఘీర్ ఢిల్లీ రక్షణ కొరకు 1000 మంది శక్తివంతులైన వీరులను పంపగలరా అని డీ బుస్సీని అడిగాడు. బదులుగా సైన్యనిర్వహణ కొరకు అవసరమైన ధనసహాయం చేస్తానని అలాగే కర్నాటకా యుద్ధాలలో ఫ్రెంచి ఈశ్టిండియా కంపెనీ వారికి సహకరిస్తానని, వివాదాల పరిష్కారానికి కృషిచేస్తానని సూచించాడు.[9]1757లో మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ దుర్రానీ, మొఘల్ సామ్రాజ్యం మద్య సురక్షిత వివాహసంబంధాలను ఏర్పాటు చేసి ఇరుపక్షాల మద్య శాంతిని నెలకొల్పడంలో విజయం సాధించాడు.[10] 1757లో తైమూర్ షాహ్ దుర్రానీ మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంఘీర్ కుమార్తె గౌహర్ అఫ్రోజ్ బేగాన్ని వివాహం చేసుకున్నాడు. [ఆధారం చూపాలి] 1757లో!అలాగే అహ్మద్ షాహ్ దుర్రానీ మునుపటి మొఘల్ చక్రవర్తి కుమార్తె "హజరత్ బేగం "ను వివాహం చేసుకున్నాడు.[11]

మోసాలు

[మార్చు]

రెండవ ఆలంఘీర్ చిన్నవయసు నుండి భక్తుడు. ఆయన ఎప్పుడూ ప్రార్థనలను క్రమంతప్పక ఆచరించే వాడు. మోతి మసీదులో తరచుగా ఉత్సవాలు చక్కగా నిర్వహించేవాడు. సూఫీ తత్వవేత్తలకు ఆయన స్నేహితుడు, పోషకుడుగా ఉన్నాడు. ఆయన తగినంత రక్షణ లేకుండా పలు మసీదులలో ప్రార్థనలు జరపడానికి వీధులలో నడిచివెళ్ళేవాడు.

ఇవి కుడా చూడండి

[మార్చు]

మూలాల జాబితా

[మార్చు]
  1. http://www.emotional-literacy-education.com/classic-books-online-a/tfmeh10.htm
  2. 2.0 2.1 Jaswant Lal Mehta. Advanced Study in the History of Modern India 1707–1813. Retrieved 31 జనవరి 2014.
  3. Kaushik Roy (30 మార్చి 2011). War, Culture and Society in Early Modern South Asia, 1740-1849. Retrieved 31 జనవరి 2014.
  4. 4.0 4.1 Elphinstone, Mountstuart (1841). History of India. John Murray, Albermarle Street. p. 276.
  5. "Alamgir II (Mughal emperor) - Encyclopedia Britannica". Britannica.com. 21 నవంబరు 2012. Retrieved 31 జనవరి 2014.
  6. Shaharyar M. Khan (20 అక్టోబరు 2000). The Begums of Bhopal: A History of the Princely State of Bhopal. Retrieved 31 జనవరి 2014.
  7. Raghunath Rai. History. Retrieved 31 జనవరి 2014.
  8. Hermann Kulke, Dietmar Rothermund. A History of India. Retrieved 31 జనవరి 2014.
  9. Sarojini Regani. Nizam-British Relations, 1724–1857. Retrieved 31 జనవరి 2014.
  10. S.R. Sharma. Mughal Empire in India: A Systematic Study Including Source Material. Retrieved 31 జనవరి 2014.
  11. Students' Britannica India. Retrieved 31 జనవరి 2014.

వెలుపలి లింకులు

[మార్చు]

Media related to రెండవ అలంఘీర్ at Wikimedia Commons

అంతకు ముందువారు
Ahmad Shah Bahadur
Mughal Emperor
1754–1759
తరువాత వారు
Shah Alam II