Jump to content

లయన్స్ క్లబ్

వికీపీడియా నుండి
(లయన్సు క్లబ్ నుండి దారిమార్పు చెందింది)
లయన్సు క్లబ్ ఇంటర్నేషనల్
దస్త్రం:Lions Clubs International logo.svg
Lions Clubs International Logo
లక్ష్యం"We Serve"
ఆవిర్భావంజూన్ 7, 1917
రకంSecular service club
ప్రధానకార్యాలయాలుఓక్ బ్రూక్, ఇల్లినాయిస్, అమెరికా
సభ్యత్వం1,368,683
Founderమెల్విన్ జోన్స్
జాలగూడుhttp://www.lionsclubs.org
A 2018 stamp of India dedicated to the 100th anniversary of Lions Clubs International
2018లో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 100 వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన పోస్టల్ స్టాంప్

లైన్స్ క్లబ్ (లయన్సు క్లబ్; Lions Clubs International) ఒక అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ. Lions Clubs International (LCI) లయన్సు క్లబ్ ఇంటర్నేషనల్, మతాతీత సేవాసంస్థ (మన భారతదేశ రాజ్యాంగం కూడా మతాతీత రాజ్యాంగం). 206 దేశాలలోని, 44,500 లయన్సు క్లబ్బుల ద్వారా, 13 లక్షల మంది సభ్యులు సేవలు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని, ఇల్లినాయిస్ లోని 'ఓక్ బ్రూక్' ముఖ్య కేంద్రంగా 'లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్' పనిచేస్తున్నది. ఈ సంస్థ, స్థానిక ప్రజల అవసరాలను గమనించి, వీలైతే స్థానికంగా, లేదంటే, అంతర్జాతీయంగా, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సహాయంతో, ఆ అవసరాలను తీర్చుతుంది. విశాఖపట్నంలోని కేన్సర్ ఆసుపత్రిని, జగ్గంపేటలోని కంటి ఆసుపత్రిని లయన్స్ క్లబ్ ఈ విధంగానే నెలకొల్పి, ప్రజలకు అంధుబాటులోకి తెచ్చింది.

  • 2011 మార్చి 31 నాటికి లయన్స్ (లైన్స్) క్లబ్ ఇంటర్నేషనల్ (206 దేశాలు) లో 46,046 క్లబ్బులలో 13,58,153 సభ్యులు ఉన్నారు.

చరిత్ర

[మార్చు]
  • లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 1917 జూన్ 7 న మెల్విన్ జోన్స్, చికాగోకి చెందిన వ్యాపారి, స్థాపించాడు. మెరికల్లాంటి వ్యాపారులు, తమ వ్యాపార రంగంలో, తమ తెలివితేటలతో, తమ శ్రమ తో, తమ శక్తితో, విజయం సాధిస్తున్నారు. ఇవే శక్తి యుక్తులను, ఈ వ్యాపారులు, మన సమాజం అభివృద్ధికి, సమాజంలో బ్రతుకుతున్న ప్రజల అభివృద్ధికి ఎందుకు కృషి చేయకూడదు? అని తోటి వ్యాపారులను మెల్విన్ జోన్స్ ప్రశ్నించాడు. 'ఏదో ఒక సేవ, సమాజంలోని ఎవరికో ఒకరికి, చేయక పోతే, మనం కూడా అభివృద్ధి చెందలేమని, సమాజం అభివృద్ధి చెందితేనే, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు. ఆ మాటలతో, లయన్సు క్లబ్బు సభ్యులు (వీరిని 'లయన్సు' అంటారు. వీరి పేరు ముందు 'లయన్' అని చేరుస్తారు) సమాజ సేవ యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. ఆనాటి నుంచి 'లయన్స్ క్లబ్' అంటే 'సమాజ సేవ', 'ప్రజా సేవ' లకి ప్రతిరూపంగా మారింది. రోగులకు, 'రెడ్ క్రాస్', 'రెడ్ క్రిసెంట్', 'నర్సుల సేవలు' ఎలాగో; 'సమాజ సేవ', 'ప్రజా సేవ' లకు 'లయన్స్ క్లబ్' కూడా అలాగే. 'లయన్సు' ముఖ్య ఉద్దేశం ' మేము సేవ చేస్తాము'. అందుకే 'లయన్సు క్లబ్బు' ల సేవా ప్రణాళికలలో కొన్నింటిని చూడండి.

'లయన్సు క్లబ్బుల సేవా ప్రణాళికలు

[మార్చు]
  • కంటిచూపు పరీక్షలు, కంటిచూపు ఆపరేషన్లు చేయించటం, కంటి అద్దాలు ఇవ్వటం.
  • చెవిటి వారికి పరీక్షలు జరిపించి వారికి చెవిటి మిషన్లు ఇవ్వటం.
  • అవిటి వారికి (కాళ్ళు లేనివారికి) కేలిపర్స్ (చంక కర్రలు), మూడు చక్రాల బళ్ళు ఇవ్వటం.
  • మూగవారికి, పరీక్షలు జరిపి వారికి 'స్పీచ్ థెరపీ' ఇప్పించటం.
  • రక్తదానం శిబిరాలు నిర్వహించి, రక్తదానాన్ని ప్రోత్సహింఛటం.
  • 'చక్కెర వ్యాధి' ఉన్నవారికి, 'కేన్సర్' రోగులకు, 'ఎయిడ్స్' రోగులకు, 'కుష్ఠు; రోగులకు, పరీక్షలు జరిపించటం, వైద్యం చేయించటం.
  • కొన్నిచోట్ల 'అంబులెన్స్ ' సేవలు అందించటం.
  • 'అనాధాశ్రమా'లకు, 'వృద్ధాశ్రమా'లకు, సహాయం చేయటం.
  • ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాలు, తుపాన్ల వలన బాధలు పడ్డావారికి సహాయం చేయటం.
  • వాతావరణ కాలుష్యం, వాతావరణ పరిరక్షణ.
  • ప్రపంచ శాంతి కోసం ప్రార్థించుటం, కృషి చేయుట.
  • నాయకత్వ లక్షణాలు పెంపొందించుట.

భారతదేశంలోని లయన్స్ డిస్ట్రిక్టుల వివరాలు

[మార్చు]
  • భారతదేశంలోని రాష్ట్రాలు, ప్రాంతాలు, అవి ఏయే లయన్స్ డిస్ట్రిక్టుల పరిధిలోకి వస్తాయి, ఆ లయన్స్ డిస్ట్రిక్టుల తాలుకు మెయిన్ డిస్ట్రిక్టుల వివరాలు దిగువ పట్టికలో చూడండి.
లయన్ (లైన్స్) జిల్లా ప్రాంతం మెయిన్ డిస్ట్రిక్ట్
321ఎ1 ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల లోని కొంత ప్రాంతం [1] Archived 2011-03-04 at the Wayback Machine 321 ఎ
321ఎ2 ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోని కొంత ప్రాంతం 321 ఎ
321ఎ3 ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల లోని కొంత ప్రాంతం 321 ఎ
321బి1 ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల లోని కొంత ప్రాంతం [2] 321 బి
321బి2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం 321 బి
321సి1 ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం 321 సి
321సి2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం 321 సి
321డి హిమాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల లోని కొంత ప్రాంతం 321 డి
321ఇ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల లోని కొంత ప్రాంతం 321 ఇ
321ఎఫ్ పంజాబ్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం, చండీగడ్ 321 ఎఫ్
322ఎ జార్ఖండ్ రాష్ట్రం 322 ఎ
322బి1 కోల్‌కత్తా (కలకత్తా) లోని కొంత ప్రాంతం, కోల్‌కత్తా పరిసర ప్రాంతాలు [3] 322 బి
322బి2 కోల్‌కత్తా (కలకత్తా) లోని కొంత ప్రాంతం, కోల్‌కత్తా పరిసర ప్రాంతాలు 322
322సి1 పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం. 322 సి
322సి2 ఒడిషా రాష్ట్రం 322 సి
322సి3 పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం. 322 సి
322డి 7 ఈశాన్య రాష్ట్రాలు (భారతదేశం). 322 డి
322ఎఫ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, భూటాన్ లోని కొంత ప్రాంతం. సిక్కిం రాష్ట్రం. 322 ఎఫ్
323ఎ2 తూర్పు ముంబై ప్రాంతం. మహారాష్ట్ర లోని కొంత భాగం. 323 ఎ
323ఎ3 లయన్స్ క్లబ్ ఆఫ్ ముంబై, కార్టర్ రోడ్[4] 323 ఎ
323బి గుజరాత్ రాష్ట్రం లోని కొంత భాగం. 323 బి
323సి మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల లోని కొంత భాగం. 323 సి
323డి1 మహారాష్ట్ర లోని సోలాపూర్, సంగ్లి, కొల్హాపూర్, సతారా, రత్నగిరి, సింధుదుర్గ్ రెవెన్యూ జిల్లాలు, పూనా జిల్లాలోని బారామతి, ఇందపూర్ తాలూకాలు. 55 లయన్స్ క్లబ్బులు, 24 లయనెస్ క్లబ్బులు, 5 లియో క్లబ్బులు ఉన్నాయి. మొత్తం సభ్యులు 1853.[5] 323 డి
323డి2 మహారాష్ట్ర లోని కొంత భాగం. 323 డి
323ఇ1 రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల లోని కొంత భాగం. 323 ఇ
323ఇ2 రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల లోని కొంత భాగం. 323 ఇ
323ఎఫ్1 గుజరాత్ రాష్ట్రం లోని కొంత భాగం. 323 ఎఫ్
323ఎఫ్2 గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం. డామన్, దాద్రా, నాగర్ హవేలి. 323 ఎఫ్
323జి1 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొంత భాగం 323 జి
323జి2 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొంత భాగం 323 జి
323హెచ్1 మహారాష్ట్ర రాష్ట్రంలోని కొంత భాగం 323 హెచ్
323హెచ్2 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొంత భాగం 323 హెచ్
323జె గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం, కేంద్రప్రభుత్వపాలనలోని డయ్యు లోని కొంత భాగం 323
324ఎ1 చెన్నై (మద్రాసు) లోని కొంత భాగం 324 ఎబి
324ఎ2 పాండిచెర్రీ లోని కొంత భాగం 324 ఎబి
324ఎ4 చెన్నై (మద్రాసు) లోని కొంత భాగం. తమిళనాడు లోని కొంత భాగం. 324 ఎ
324ఎ5 చెన్నై (మద్రాసు) లోని కొంత భాగం. తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఎ
324ఎ6 చెన్నై (మద్రాసు) లోని కొంత భాగం. తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఎబి
324ఎ8 చెన్నై (మద్రాసు) లోని కొంత భాగం. తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఎ
324బి1 తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 బి
324బి2 తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 బి
324బి3 తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 బి
324బి4 తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. అండమాన్, నికోబార్ దీవుల లోని కొంత భాగం 324 బి
324బి5 తమిళనాడు రాష్ట్రం లోని కొంత భాగం. 324 బి
324సి1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. పాండిచెర్రి. 324 సి
324సి2 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల లోని కొంత భాగం. 324 సి
324సి3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324సి4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324సి5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324సి6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324సి7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324సి8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324సి9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొంత భాగం. 324 సి
324డి1 కర్ణాటక రాష్ట్రం లోని కొంత భాగం. 324 డి
324డి2 కర్ణాటక రాష్ట్రం లోని కొంత భాగం. గోవా రాష్ట్రంలోని కొంత భాగం 324 డి
324డి6 కర్ణాటక రాష్ట్రం లోని కొంత భాగం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొంత భాగం 324 డి
324ఇ1 కేరళ రాష్ట్రం లోని కొంత భాగం. ఈ లయన్స్ డిస్ట్రిక్ట్ లో 88 క్లబ్బులు ఉన్నాయి. ఈ వెబ్‌‍సైట్ చూడండి.[6] 324 ఇ
324ఇ2 కేరళ రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఇ
324ఇ3 కేరళ రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఇ
324ఇ4 కేరళ రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఇ
324ఇ5 కేరళ రాష్ట్రం లోని కొంత భాగం. 324 ఇ

అంతర్జాతీయ సమావేశాలు

[మార్చు]
  • అంతర్జాతీయ సమావేశాలు (International Convention) ప్రతీ సంవత్సరం, ప్రపంచంలోని ఏదో ఒక నగరంలో జరుగుతుంది. ఈ సమావేశంలో లయన్సు క్లబ్ సభ్యులు, ప్రపంచంలోని ఇతర లయన్సు క్లబ్ సభ్యులను కలుసుకుంటారు. రాబోయే సంవత్సరానికి, అధికార్లను ఎన్నుకుంటారు. లయన్సు క్లబ్ ఊరేగింపులలో పాల్గొంటారు. రాబోయే సంవత్సరానికి చేయవలసిన పనుల ప్రణాళికలను చర్చించి, నిర్ణయిస్తారు. డబ్బు సేకరణ కోసం, విరాళలకోసం కూడా చర్చిస్తారు. సావనీర్స్ ప్రచురణకోసం కూడా చర్చిస్తారు. మొట్టమొదటి సమావేశం 1917 లో, డల్లాస్ (టెక్సాస్) లో జరిగింది. 2006 సమావేశం, న్యూ ఆర్లియన్స్ లో జరగవలసి ఉండగా, 'కత్రినా' తుపాను మూలంగా, 'న్యూ ఆర్లియన్స్' నగరం అతలాకుతలం అయ్యింది. అందుకని బోస్టన్ లో జరిగింది.

పాత సమావేశాలు

[మార్చు]
  • పాత సమావేశాలు, సమావేశాలు జరిగిన సంవత్సరం, ప్రాంతాలు దిగువ చూడండి.
  • 93వ 2010 సిడ్నీ, ఆస్ట్రేలియా
  • 92వ 2009 మిన్నెపొలిస్, మిన్నెసొట, యు.ఎస్.ఏ
  • 91వ 2008 బాంగ్‌కాక్, థాయిలాండ్
  • 90వ 2007 చికాగొ, ఇల్లినాయి, యు.ఎస్.ఏ
  • 89వ 2006 బోస్టన్, మసాఛుసెట్స్, యు.ఎస్.ఏ
  • 88వ 2005 హాంగ్ కాంగ్
  • 87వ 2004 డెట్రాయిట్, మిచిగాన్, యు.ఎస్.ఏ
  • 86వ 2003 డెన్వెర్ కొలరాడొ, యు.ఎస్.ఏ
  • 85వ 2002 ఒసాకా, జపాన్
  • 84వ 2001 ఇండియానాపొలిస్, ఇండియానా, యు.ఎస్.ఏ
  • 83వ 2000 హొనొలులు, హవాయి, యు.ఎస్.ఏ
  • 82వ 1999 సాన్ డియాగొ, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ
  • 81వ 1998 బర్మింగ్ హాం, యునైటెడ్ కింగ్‌డమ్
  • 80వ 1997 ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, యు.ఎస్.ఏ
  • 79వ 1996 మాంట్రియల్, క్విబెక్, కెనడా
  • 78వ 1995 సియోల్, దక్షిణ కొరియా
  • 77వ 1994 ఫోనిక్స్, అరిజోనా, యు.ఎస్.ఏ
  • 76వ 1993 మిన్నెపొలిస్, మిన్నెసోట, యు.ఎస్.ఏ
  • 75వ 1992 హాంగ్ కాంగ్
  • 74వ 1991 బ్రిస్బన్, ఆస్ట్రేలియా
  • 69వ 1986 న్యూ ఆర్లియన్స్, లూసియానా, యు.ఎస్.ఏ
  • 68వ 1985 డల్లాస్, టెక్సాస్, యు.ఎస్.ఏ
  • 35వ 1952 మెక్సికో సిటీ, మెక్సికో
  • 01వ 1917 డల్లాస్, టెక్సాస్

జరగబోయే 'లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశాలు'

[మార్చు]
సంవత్సరం నగరం, దేశాం తేదీ, నెల
2011 సీటెల్, వాషింగ్టన్ 4-8 జూలై
2012 బుసన్, కొరియా 22-26 జూన్
2013 హాంబర్గ్, జర్మనీ 5-9 జూలై
2014 టొరంటో, కెనడా 4-8 జూలై
2015 హనొలులు, హవాయి 26-30 జూన్
2016 ఫుకుఒక, జపాన్ ఇంకా నిర్ణయించలేదు
2017 చికాగొ, అమెరికా (యు.ఎస్.ఏ) 30 జూన్ - 4 జూలై

లయనిజం వ్యాప్తి

[మార్చు]

ఆధారాలు

[మార్చు]
  • లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, ది లయన్ ఇండియన్ మేగజైన్ 'ది లయన్'.[7]
  • లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ (వికిపీడియా) [8]
  • లయన్స్ క్లబ్స్ క్వార్టర్లీ వీడియో మేగజైన్[9]
  • లయన్స్ క్లబ్స్ సభ్యుల వివరాలు [10]
  • ‍'మెల్విన్ జోన్స్' జీవితచరిత్ర [11]
  • 'లియో క్లబ్స్' [12]
  • లయన్స్ డిస్ట్రిక్ట్ 324ఇ1 [13]
  • లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఛారిటబుల్ ఐ హాస్పిటల్ (కంటి ఆస్పత్రి), రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా [14] Archived 2020-10-25 at the Wayback Machine