వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జె.వి.ఆర్.కె.ప్రసాదు గారి పని వివరాల పై చర్చ[మార్చు]

  1. కృష్ణా జిల్లాకు సంబంధించిన గ్రామాల సమాచారాన్ని పంపించగలరు. పని చేస్తాను. JVRKPRASAD (చర్చ) 01:24, 4 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
    మీ ఈమెయిలైడీని నాకు పంపించండి.__చదువరి (చర్చరచనలు) 02:54, 17 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
    మీకు మెయిల్ చేశానండి.JVRKPRASAD (చర్చ) 03:28, 17 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
    నాకు మరో రెండు జిల్లాలు అనగా గోదావరి జిల్లాలు కేటాయించండి. వీలయినంత తొందరగా చేస్తాను.JVRKPRASAD (చర్చ) 06:24, 17 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
    చదువరి గారు, నాకు మరి కొన్ని జిల్లాలు కేటాయించండి, ప్రస్తుతము నేను ఎడమ చేతితో పని చేస్తున్నాను. నా కుడి చేతితో పని ఎప్పటికి చేస్తానో తెలియడంలేదు. ఈ పని నాకు కాస్త సులువుగా ఉంటుంది. ఈ పని అందంగా సాధ్యమైనంత వరకు చేస్తున్నాను. దయచేసి సమయము గూర్చి ఆలోచించకండి. మొత్తం పని ఇచ్చినా చేస్తాను. నాకు కాస్త ఒక వరస పనిగా ఉంటుంది. ముందుగానే నాకు కేటాయించగలరు. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 03:40, 26 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
    అలాగే సార్. నెల్లూరు జిల్లా సగం పంపిస్తాను.__చదువరి (చర్చరచనలు) 03:48, 26 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చదువరి గారు, కృష్ణా జిల్లా గ్రామాలు - 500 వరకు పూర్తి చేశాను. JVRKPRASAD (చర్చ) 12:41, 1 నవంబర్ 2017 (UTC)
    చదువరి గారు, నెల్లూరు జిల్లా 600 వరకు పూర్తి చేశాను. ప్రస్తుతము దగ్గర పెండింగ్ ఏమీ లేవండి. JVRKPRASAD (చర్చ) 11:07, 18 నవంబర్ 2017 (UTC)
    JVRKPRASAD గారూ, నెల్లూరు జిల్లాలో మిగిలిపోయిన ఫైళ్ళన్నిటినీ పంపించాను.__చదువరి (చర్చరచనలు) 14:41, 18 నవంబర్ 2017 (UTC)
    చదువరి గారు, నెల్లూరు జిల్లా ఫైళ్ళన్నిటినీ 100% వరకు పూర్తి చేశాను.JVRKPRASAD (చర్చ) 01:01, 28 నవంబర్ 2017 (UTC)
    JVRKPRASAD గారూ, పాత కరీంనగర్ జిల్లా ఫైళ్ళన్నిటినీ పంపించాను. వీటిలో 6 కొత్తజిల్లాల ఫైళ్ళు పూర్తిగానో పాక్షికంగానో ఉన్నాయి.__చదువరి (చర్చరచనలు) 04:22, 28 నవంబర్ 2017 (UTC)
    చదువరి గారు, కృష్ణా జిల్లా గ్రామాలు మిగతావి కావాలండి. ఈ జిల్లావి నా దగ్గర పెండింగ్ ఏమీ లేవు.JVRKPRASAD (చర్చ) 11:35, 28 నవంబర్ 2017 (UTC)

జె.వి.ఆర్.కె.ప్రసాదు గారి ప్రగతి[మార్చు]

Caption
క్ర.సం జిల్లా జిల్లా పేజీ తయారీ జిల్లా మూస తయారీ / సవరణ పూర్తయిన మండలాల పేజీల సవరణ పూర్తయిన మండలాల మూసల తయారీ / సవరణ పూర్తయిన గ్రామాల పేజీల సవరణలు
1 కృష్ణా జిల్లా (968 పేజీలు) పూర్తైంది వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు 52% పైగా అయింది ( 500 వరకు గ్రామాల పేజీల సవరణలు పూర్తి చేశాను)
2 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (1177 పేజీలు) పూర్తైంది 100% అయింది ( 1177 గ్రామాల పేజీల సవరణలు పూర్తి చేశాను)

(ప్రధాన పేజీనుండి తరలించబడినది).. తరలించినది. --అర్జున (చర్చ) 04:16, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఫైళ్లు[మార్చు]

రాజశేఖర్ గారూ, విజయనగరం ఫైళ్ళను ఈ సరికే వెంకట రమణ గారికి పంపేసాను. మరేదైనా జిల్లాను ఎంచుకోండి. విశాఖపట్నం జిల్లాలో సగం ఫైళ్ళు పంపించమంటారా?__చదువరి (చర్చరచనలు) 17:39, 25 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా. విశాఖపట్నం జిల్లావి నాకు పంపించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 03:28, 26 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, నా దగ్గర మీ ఈమెయిలైడీ లేదు. పంపించండి. __చదువరి (చర్చరచనలు) 03:44, 26 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

భారత జనగణన సమాచారంలో సమస్యలు[మార్చు]

భారత జనగణన సమాచారం ప్రాతిపదికల్లోనే ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఇవి మనం తీర్చగలిగినవి కావు. కానీ తెలుసుకోదగ్గవి. కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

  • ఈ సమస్య ప్రధానంగా పంచాయితీ గ్రామం, రెవెన్యూ గ్రామాలకు సంబంధించినది. భారత జనగణన వారు రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. సాధారణంగా పత్రికలు, ఇతర సమాచార మాధ్యమాలు మాట్లాడేది, ప్రజలు మాట్లాడుకునేది పంచాయితీ గ్రామం గురించే. రెవెన్యూ గ్రామం లెక్కల వరకే. ఈ భేదాన్ని ఈ భేదంలో ఏర్పడుతున్న సమస్యలను ఇక్కడ చదవవచ్చు
  • సి. రామచంద్రయ్య (16 September 1995). "Revenue Village vs Real Village: Under-Enumeration and Non-Enumeration under Srisailam Project". Economic and Political Weekly. Retrieved 2 July 2018. {{cite journal}}: Cite has empty unknown parameter: |1= (help)

దీనికి నా దగ్గర పరిష్కారం లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్న విషయం గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:32, 2 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కావలసిన సవరణలకు ఉదాహరణలు.[మార్చు]

ప్రాజెక్టు పరంగా సవరణలకు గురైన గ్రామాలు
ప్రాజెక్టు పరంగా సవరణలకు గురికాని గ్రామాలు

--అర్జున (చర్చ) 12:43, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుపై స్పందన[మార్చు]

అర్జున[మార్చు]

నాకు అర్ధమైనంతవరకు ప్రాజెక్టుని విశ్లేషించి వివరాలు చేరుస్తున్నాను. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అందరూ స్పందించనపుడే, ఈ ప్రాజెక్టునుండి నేర్చుకున్నవి ముందు ప్రాజెక్టులకి ఉపయోగపడతాయి.

బాగా జరిగినది
  • ప్రాజెక్టులో ఎక్కువమంది పాల్గొనటం
  • ప్రాజెక్టులో పాల్గొన్నవారి కృషిని వికీ పతకాలతో గుర్తించడం
  • ప్రాజెక్టు పని పురోగతిని సమీక్షించేప్రయత్నం చేయడం
  • ప్రాజెక్టు పని నాణ్యతని పరీక్షించే ప్రయత్నం చేయడం. (పరిచయ వాక్యాలలో మండలాల దోషాలు కొన్ని చోట్ల గమనించి, హెచ్చరికలు చేయడం జరిగింది.)
  • ప్రాజెక్టు సందేహాలకు కొన్ని విధానాలపై చర్చ చేయడం, విధానాలు చేయడం.
  • సాఫ్ట్వేర్ తో వాక్యస్థాయిలో అనువాదం సరిగానే జరిగింది.
మరింత బాగా జరగవలసినది
  • ప్రాజెక్టు గురించి ప్రారంభంలో రచ్చబండలో ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయం. ఇన్ని వేలపేజీల సవరించబడేటప్పుడు, తగినంత చర్చలు అవసరము. పైలట్ ప్రాజెక్టు చేసినతరువాత కూడా రచ్చబండలో ప్రస్తావించినట్లు కనబడలేదు. ఒకరు ప్రారంభించారు, మిగతావారు ప్రశ్నించకుండా అనుసరిస్తే నాణ్యత కుంటుపడే అవకాశాలే ఎక్కువ. ఇంతకు ముందు వికీయేతరులు గూగుల్ అనువాద వ్యాసాలు చేసినట్లు గానే , వికీలోఅనుభవంవున్న వారు ఇలా చేయటం సరికాదు.
  • జనగణన నుండి చేర్చిన అంశాలన్నిటికీ ఏక రీతి ప్రాధాన్యత ఇవ్వడం. జనగణనలో నిర్దిష్టమైన జనాభా సంఖ్యలు, భూమికి సంబంధించిన గణాంకాలకుండే నాణ్యత మిగతా వాటికి వుండనవసరములేదు. అవి దానికి నియమించిన వ్యక్తి అభిప్రాయాలను బట్టి చేర్చినవి. ఎందుకంటే వాటిని ధృవీకరించే మూలాలు సర్వేలో ఇవ్వవలసిన అవసరంలేదు. నేను సవరించిన అంశాలలో కొన్ని అసత్యాలను, వైరుధ్యాలను గమనించి తొలగించటం జరిగింది.
  • ఇంతకు ముందు ఆదర్శ గ్రామాలని చర్చకువచ్చినవాటి లోటుపాట్లను, ఈ ప్రాజెక్టు మదించి, దిశానిర్దేశము చేయకపోవడం.
  • వేగంగా యాంత్రికంగా మార్పులు చేయటం కాకుండా, వ్యాసానికి తగిన సమయం కేటాయించి. చేర్చబోయే అంశాలకు చెందిన వివరాలుంటే, వాటిని సమన్వయం చేసి, వ్యాసం అభివృద్ధి చేసే బాధ్యతని నిర్దేశించకపోవటం.
  • ముగింపు పై ధ్యాసలేకపోవడం. (ప్రాజెక్టు పేజీని పూర్తి బాధ్యతతో సమీక్ష వరకు నిర్వహించకపోవటం)
  • చర్చలలో ఇతర వాడుకరులు స్పందించమని కోరినా, ప్రాజెక్టు నిర్వాహకులు(?) పట్టించుకోకపోవడం.
  • ఆంగ్ల పేర్లను, తెలుగు పేర్లకు మార్చే ప్రక్రియపై వివరాలు చేర్చలేదు. అలాగే స్ప్రెడ్షీట్ నుండి వాక్యాల తయారీకి అవసరమైన స్క్రిప్టు వివరాలు చేర్చలేదు. పేరా స్థాయిలో వ్యాస సమగ్రత కొన్ని చోట్లకుంటుపడింది. (మండల కేంద్రానికి వాక్యాలు చేర్చేటప్పుడు, మండల కేంద్రానికి దూరం సున్న అని చేర్చడం లాంటివి), ఈ సాఫ్ట్వేర్ ముందు ముందు కూడా వివిధ రకాలుగా ఉపయోగపడవచ్చు. దీనిని భద్రపరచకపోతే ముందు మరల అనవసర పని చేపట్టవలసివస్తుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. --అర్జున (చర్చ) 03:55, 7 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్[మార్చు]

అర్జున గారి సమీక్ష చదివాను. ఆయనకు అర్థమైనంతలో రాశానన్నారు. ఆయనకు అంతగా అర్థం కాలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే:
  • జరిగింది ఏమిటో తెలుసుకోకపోవడం: ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే ఆలోచన విత్తనంగా ఉన్న దశలో ఒకసారి, ప్రాజెక్టు ఉపపేజీ రూపొందించేప్పుడు ఒకసారి, ఈనాడు చూస్తున్న వ్యాసాలు ఒకరూపుకు వస్తున్నప్పుడు మరోసారి, పనిచేస్తున్న దశలో చేయికలపమని ఇంకోసారి ప్రాజెక్టు గురించి చెప్పి, భాగస్వాములు కమ్మని రచ్చబండలోనే ఆహ్వానించిన సందర్భాలు ఎన్నో ఉండగా, ఆ పోస్టులన్నీ ఇప్పటికీ అలానే ఉండగా "ప్రాజెక్టు గురించి ప్రారంభంలో రచ్చబండలో ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయం." అనేయాలంటే చేస్తున్న విశ్లేషణ మీద చులకన భావమైనాఉండాలి, లేకపోతే తెలుసుకోనక్కరలేకుండా స్పందించేయవచ్చు లెమ్మనుకునైనా ఉండాలి.
  • తెలిసింది కూడా పక్కన పెట్టేయడం: "ప్రాజెక్టు సందేహాలకు కొన్ని విధానాలపై చర్చ చేయడం, విధానాలు చేయడం." బావుందని చెప్తూ "చర్చలలో ఇతర వాడుకరులు స్పందించమని కోరినా, ప్రాజెక్టు నిర్వాహకులు(?) పట్టించుకోకపోవడం." మరింత బాగా జరగాల్సిన జాబితాలో రాయడం చాలా తమాషాగా ఉంది. ప్రాజెక్టు నిర్వాహకులు, పాల్గొన్నవారు ఎప్పుడు ఎవరు చర్చ ప్రారంభించినా పాల్గొన్నారని ఇక్కడ, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మధ్యలో ఒకసారి రవిచంద్ర ప్రారంభించిన చర్చకు స్పందించి ప్రాజెక్టు మధ్యలో ఆపి, తోటి వాడుకరులు ఏమైనా మంచి సూచనలు చేస్తే ఆ ప్రకారం పోదామని కూడా ఆలోచించాం. అది అలా ఉంచి మేమే ఎన్నో సందర్భాల్లో చర్చ లేవదీసి ప్రాజెక్టును, పనులను మెరుగుపరిచామన్నది ఇక్కడ, ఇక్కడ చూసి ఉండొచ్చు. ఇవన్నీ అలా ఉండగా ఆయనే "కొన్ని విధానాలపై చర్చ చేయడం" అని ఓపక్క అంటూ ప్రాజెక్టు నిర్వాహకులు పట్టించుకోలేదని నెపం తోయడం చూస్తే ఏవో పాసింగ్ కామెంట్స్ తరహాలోని ఒకటి రెండు సందర్భాలను ఎక్కడన్నా ఉంటే వాటిని పట్టుకును రాసినట్టుందే కానీ సమగ్రమైన సమీక్ష చేసి మాట్లాడుతున్నట్టు లేదు.
  • ఆధారాలు లేని జనరలైజేషన్లు చేయడం: "వేగంగా యాంత్రికంగా మార్పులు చేయటం కాకుండా, వ్యాసానికి తగిన సమయం కేటాయించి. చేర్చబోయే అంశాలకు చెందిన వివరాలుంటే, వాటిని సమన్వయం చేసి, వ్యాసం అభివృద్ధి చేసే బాధ్యతని నిర్దేశించకపోవటం." ఇదొక జనరలైజేషన్. మనం 2016 నుంచి తెలంగాణ గ్రామాల వ్యాసాల్లో జిల్లాల విభజన ప్రతిఫలించుకోలేకపోతే ఈ ప్రాజెక్టులో భాగంగానే జాగ్రత్తగా, ఎక్కడెక్కడి జీవోలో వెతుక్కొచ్చి నానా తంటాలు పడి పూర్తిచేసినాకా, తెలంగాణ జిల్లాల, మండలాల, గ్రామాల మార్పుచేర్పుల జిల్లాల వారి సమీక్ష చేసి లేని వ్యాసాలు తయారుచేసి, ఉన్నవి ఓ ఒద్దికకు తెచ్చి పనిచేసినాకా, నిర్జన గ్రామాలు (లింకు) అర్థంపర్థం లేకుండా తయారుచేస్తుంటే ఆపి, వివరాలు లేని పంచాయితీ గ్రామాలకు వ్యాసాలు ఇప్పటికి అవసరమా లేదా చర్చించి చర్యలు తీసుకున్నాకా - మీరు రాసిన వాక్యం అవేమీ లెక్కకు తీసుకోకుండా ఊరికే జనరలైజేషన్ చేసేయొచ్చులే అన్న ధోరణిలో ఉందని తోటి సభ్యులకు అర్థం కాక మానదు.
  • పాలసీలూ అక్కరలేదు, అధ్యయనాలూ లేవు. అభిప్రాయాలనే పరిగణించమంటున్నారు: 2011 జనగణన సమాచారంలో ఫలానా ఫలానా అంశాల్లోని డేటానే నాణ్యంగా ఉంది తప్ప మిగతా అంతా నాణ్యత లేకుండా, వ్యక్తి అభిప్రాయాలు బట్టి వచ్చాయి, అవి విజ్ఞాన సృష్టికి పనికిరావు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? సమాన్యంగా అలాంటి పరిశీలనలు పరిశోధకులు ఓ పద్ధతి ప్రకారం చేస్తారు. వందలాది గ్రామాలు శాంపిల్ గా తీసుకుని జనగణన సమాచారంతో క్షేత్రస్థాయిలో 2011 నాటికి అసలు గ్రామంలో ఏమేమి ఉన్నాయి, అవి జనగణనలో ఎలా తేడాగా ఉన్నాయని చూసి, ఆపైన జనగణన సాగిన పద్ధతి ఏమిటన్నది చూడడానికి సర్వేలో పాల్గొన్న అనేకమంది ప్రభుత్వోద్యోగులను ఇంటర్వ్యూలు చేసి ఏదైనా జర్నల్లోనో,సిద్ధాంత గ్రంథంగానో ప్రచురిస్తారు. అలాంటి అధ్యయనాలు ఇదిగో జనగణనలో ఉన్న ఈ అంశాలు ఎందుకూ పనికిమాలినవి, నాణ్యతలేనవి అని చెప్పివుంటే వాటిని ఉదహరిస్తూ ప్రభుత్వం ప్రతీ పదేళ్ళకు భారతదేశవ్యాప్తంగా చేయించి, పలు పాలసీ నిర్ణయాలకు వాడుకునే ఈ భారీ జనగణన సమాచారాన్ని కొట్టిపారేయాలి. "పలు జనాభాపరమైన, సామాజిక-ఆర్థిక లక్షణాల విషయంలో గ్రామాల స్థాయిలో సమాచారాన్ని ఇచ్చే, అతి ముఖ్యమైన, ఆమాటకొస్తే ఏకైక వనరు జనగనణ సమాచారం" "(It (Census data) is the most important, rather the only source that provides village level information for several demographic and socio-economic characteristics.)" రెవెన్యూ విలేజ్ వర్సెస్ రియల్ విలేజ్ వ్యాసం, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 1995లో సి.రామచంద్రయ్య అనే పరిశోధకుడు చెప్పడాన్ని నేను ఉదహరిస్తూ అడుగుతున్నాను- అలా ఈ జనగణన పనికిమాలిన సమాచారం అనడానికి ఏ అధ్యయనాలూ ఎందుకు ఉదహరించరూ? లేవా? అక్కరలేదా? మన అభిప్రాయాలను మించిన అధ్యయనాలు అక్కరలేదా? తమాషా ఏమిటంటే ఒక మూలానికి నాణ్యత ఉందా లేదా పరిశీలించే మనిషి కనీసం తన పరిశీనను ఓ పరిశోధనతోనో, మరో నమ్మదగ్గ మూలంతోనో సమర్థించుకోవాలని కూడా అనుకోకపోవడం.
  • ఆదర్శ వ్యాసం అని ఏవేవో ముందుకు తేవడం: ఆదర్శ వ్యాసం పస ఏమిటో నేను ఈ మధ్యే చెప్పాను, అప్పుడు దాన్ని చూసి నేర్చుకొమ్మన్నది అర్జునగారే. ఎన్నో పాలసీ ఉల్లంఘనలు జరిగినాయని నేను అక్కడే ఏయే వాక్యాలు ఏయే పాలసీలకు విరుద్ధంగా ఉన్నాయన్నది చెక్కాబద్దగా సూటిగా వివరిస్తూ నేను రాశాను. అంతకుముందు ఆ గ్రామ వ్యాసాన్ని ఆదర్శ వ్యాసమని అంతా అంటారనీ, దాన్ని చూసి ఏది వికీపీడియా వ్యాసమవుతుందో నేర్చుకోండని స్థూల దృష్టితో అక్కడా, "ఆదర్శ గ్రామాలని చర్చకువచ్చినవాటి లోటుపాట్లను, ఈ ప్రాజెక్టు మదించి, దిశానిర్దేశము చేయకపోవడం" బావులేదని ఇక్కడా చెప్పడం ఈ స్పందన నాణ్యతని మరీ దిగజార్చింది.
ఈ విధంగా ఉందీ సమీక్ష. --పవన్ సంతోష్ (చర్చ) 10:41, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు తెలిపిన సమాచారం ఉపయోగంగా వుంది. సంబంధిత లింకులు ప్రాజెక్టు పేజీలో చేర్చాను. --అర్జున (చర్చ) 23:58, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు[మార్చు]

గ్రామ వ్యాసాల పేజీలనందు డేటాను చేర్చుటలో నేను గమనించిన విషయాలు, జరిగిన పనులు, నాస్పందనలు.
నేను ఈ ప్రాజెక్టుపనిలో 2017 అక్టోబర్ మాసంలో ప్రవేశించాను.అప్పటి నుండి రోజుకు 12 గం.కు. పైగా నిర్విరామకృషితో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామవ్యాసల సవరణలు చేపట్టాను.
  • తెవికీలో రెగ్యులరుగా సవరణలు చేసే చురుకైన వాడకరులు కొరత ఉంది.
  • ఉన్నపాటి కొద్దిమంది చురుకైన వాడకరులలో గ్రామ వ్యాసాల అభివధ్దిపై అతితక్కువ మందికి మాత్రమే ఆసక్తి ఉంది. ఏ వ్యాసాలైనా అభివృద్ధి చెందాలంటే చురుకైన తెవికీ వాడకరులు కావాలి అని మనందరం గ్రహించాలి.
  • 2017 అక్టోబర్ కు ముందు 95% గ్రామ వ్యాసాలు చాలా కొద్ది సమాచారంతో కొన్ని, ఏక వ్యాక్యంతో కొన్ని, కొన్ని ఖాళీ విభాగాలతో ఉన్నవి
  • రచ్చబండలో గతంలో జరిగిన చర్చలు పరిశీలించగా, ఒకానొక దశలో కొంతమందికి వీటిని తొలగిస్తేనే మంచిదనే అభిప్రాయం కలిగినట్లు గతంలో జరిగిన రచ్చబండ చర్చలు ద్వారా తెలుస్తుంది.
  • అలాంటి వ్యాసాలకు పవన్ సంతోష్ గారి పట్టుదలతో, తనకు వచ్చిన ఆలోచనలతో భారత జనగణన వారి ఫైళ్ళనుండి డేటాను సేకరించి, గ్రామాల పేజీల్లో చేర్చే పనికి పూనుకొని, బాస్కరనాయుడు గారి సహకారంతో మాదిరి వ్యాసం తయారుచేయించి, చదువరి గారు గ్రామాల పేజీల ప్రాజెక్టు విభాగం రచ్చబండ 55 నందు ఈ పని విజయవంతంగా పూర్తి కావాలంటే వాడుకరులందరి భాగస్వామ్యం కావాలి అని కోరారు.అదే విభాగంలో పవన్ సంతోష్ గారు భాగస్వామ్యానికి ఆహ్వానం కోరుతూ దయచేసి ఆసక్తికల సభ్యులందరూ ముందుకురావాల్సిందిగా మనవి అని కోరారు.
  • మాదిరి వ్యాసం మీదకానీ, వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చే ప్రాజెక్టు మీదకానీ గతంలో ఎవరైనా, ఏమీ అభ్యంతరాలు తెలుపలేదు.
  • వేలాది గ్రామాలకు భారత జననగణన డేటాతో మాదిరి వ్యాసం వికీకరించి భాగస్వామ్యం అయిన వాడకరులకు శ్రమకోర్చి అందరికి సవ్యసాచిలాగా చదువరిగారు అందించినందుకు ఈ సందర్బంగా వారిని అభినందిస్తున్నాను.
  • భారత జననగణన సెమీ డేటా ఎక్కించేముందు వ్యాసాలలో మీడియా ఫైల్స్ అస్తవ్యస్తంగా ఉన్నవి.వాటిని సరియైన క్రమంలో కూర్పు చేసాను.కొన్ని గ్రామ వ్యాసాలకు సంబందించిన మీడియా ఫైల్స్ గుర్తించి వ్యాసాలలో ఎక్కించాను. ప్రస్తుతం తెలంగాణ గ్రామ వ్యాసాల నందు (నేను తెలంగాణ గ్రామాలనందు మాత్రమే పని చేసినందున వాటి స్థితి మాత్రమే తెలుసు) మీడియా ఫైల్స్ ఒక క్రమ పద్దతిలో ఉన్నవి.
  • ఈ ప్రాజెక్టు పనిలో భాగంగా అనేక తప్పుడు ఇంటర్నల్ లంకెలు సరిచేసాను.అంతేగాదు వ్యాసాలలో అనేక ఎర్రలింకులు కనపడేవి.వాటికి సరియైన లంకెలుగా మార్చుట జరిగింది.ఈరోజు తెలంగాణ వ్యాసాలలో లంకెలు 99% సరియైన లింకులుగా ఉన్నవని ఘంటాపదంగా చెప్పుతున్నాను.
  • ఒకే గ్రామానికి, ఒకే మండలంలో కొద్దిపాటి అక్షరబేదాలుతో గతంలో ఎడాపెడా వ్యాసాలు సృష్టించబడినవి. అవసరమైన వాటిని దారిమార్పుగా మార్చుట జరిగింది. కొన్నిటిని తొలగించటానికి ప్రతిపాదించుట జరిగింది.
  • భారత జననగణన డేటా ప్రకారం రెవెన్యూ గ్రామాలుకు మాత్రమే వ్యాసం పేజీలు సృష్టించవలసి ఉండగా, అవగాహనలేక శివారు గ్రామాలుకు, నివాస ప్రాంతాలుకు వ్యాసాలు సృష్టించి అన్నింటిని రెవెన్యూ గ్రామాలుగా సమాచారపెట్టెలు తగిలించి, మూసలలో కూర్పు చేయుట గమనించాను. వాటిని పునర్య్వస్థీకరణ జి.ఓ.ల ప్రకారం అన్ని జిల్లాలలో మార్పులు, చేర్పులు చేయుట ప్రాజెక్టు పనిలో సింహభాగం భాగస్వామ్యం అయ్యాను.అంతేగాదు తెలంగాణలోని 33 జిల్లాలకు,వాటిలోని మండలాలకు,గ్రామాలకు ప్రభుత్వ ఉత్తర్వులు మూలాలుగా కూర్పు చేసాను.
  • హైదరాబాదు జిల్లా ఉనికి అనగా మండలాలు గానీ,రెవెన్యూ గ్రామాలు ఉనికి గానీ తెవికీలో లేకపోతే వాటిని గుర్తించి ఒక స్వరూపం తెచ్చాను.
  • తెలంగాణ అన్నిజిల్లాలలోని గ్రామాలనందు భారత జనగణన డేటాను పేజీలో చేర్చేపని పూర్తికాగా, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని గ్రామాలనందు పూర్తికాగపోగా, ప్రస్తుతం పని స్తంభించిందనుకుంటున్నాను.
  • తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు,మండలాలు,గ్రామాలు నందు పునర్య్వస్థీకరణ ప్రకారం మార్పులు,చేర్పులు చేసేటప్పుడు, అలాగే భారత జనగణన డేటా నింపేటప్పుడు గ్రామ, మండల వ్యాసాలనందు కొన్ని పాటించవలసిన పద్దతులు, నియమాలు అవసరమని, గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకు కొన్ని మార్పులు తప్పనిసరిగా అవసరమని గమనించి,నాకు తెలిసినంతవరకు ఆలోచించి, గుర్తించి గ్రామ మండల వ్యాసాలకు మార్గదర్శకాలు, వర్గాలు ఉండవలసిన సరియైన క్రమ పద్దతిని తయారుచేసి , చదువరి గారూ, ప్రణయ్ రాజ్ గారూ, పవన్ సంతోష్ గారు సంయుక్తంగా పరిశీలించిన తదుపరి తగిన సూచనలు పరిశీలన/చర్చ నిమిత్తం రచ్చబండలో పవన్ సంతోష్ గారి ద్వారా ప్రతిపాదించాను.ఆ చర్చలో విశ్వనాథ్ గారు తప్ప ఎవరూ స్పందించలేదు.పనుల వత్తిడివలనగానీ, ఇతరత్రా కారణాల వలనగానీ ఎవరూ స్పందించలేదని భావించి, మరియొకసారి కాలనిర్ణయం పొడిగించి, స్పందించవలసినదిగా అభ్యర్థించినా ఎవ్వరు స్పందించలేదు.వాటికి లోబడి నేను గ్రామవ్యాసాలకు మార్పులు చేసాను.తెలుగు వికీపీడియాలో వ్యాసాలు మెరుగ్గా ఉండాలనే మనందరం కోరుకుంటున్నాం. రచ్చబండలో సముదాయం నిర్ణయించిన మార్గదర్శకాలు, సూచనలు చాలావరకు వాడకరులమైన మనం పాటించలేదని నేను గుర్తించాను.
  • తగినన్ని వనరులు అనగా తగిన సమాచారం, సవరణలకు అవసరమైన తగినంతమంది వాడుకరులు లేకుండా, మన స్వగ్రామానికి మనం ఇష్టపడి సవరించిన వ్యాసమో , లేక అబిమానంమీద కొంత కష్టపడి తయారు చేసిన వ్యాసంతో పోల్చి ఈ వ్యాసాలే బాగున్నాయి, మిగిలినవి వ్యాసలు ఏమీ బాగాలేవని నిర్థారణ చేయుట సరియైన అభిప్రాయం కాదని నేను అనుకుంటున్నాను.పోనీ అందుకు సరియైన పరిష్కారమార్గం, ఆచరణయోగ్యమైంది చూపబడలేదనికూడా గమనించాను.
  • గత కొద్దికాలం క్రిందటనుండి రచ్చబండలో గ్రామ వ్యాసాల బాగోగులపై చదువరి, అర్జున, పవన్ సంతోష్, చంద్రకాంతారావు గారల మద్య త్రీవమైన దోరణిలో జరిగిన ఎడాపెడా చర్చలు నేను చదివాను. అర్థం చేసుకున్నాను.
  • ఆ చర్చలులో భాగంగా ఒకరు ఇద్దరు మినహా మిగిలిన వాడకరులు నాతో సహా ఎవ్వరూ స్పందించలేదు.ఆచరణ వేరు.మాటలు వేరు.పనులు జరగటానికి నిర్వాహకత్వం లేదా నాయకత్వం వహించుట వేరు.ఇవి అన్ని సజావుగా జరగటానికి అసలైన లోపం ఏక్కడ ఉందో కనుగొని ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను.
  • ఆ చర్చలు పర్యవ్వసానంగా ప్రస్తుతం ఇప్పడు ఉన్న గ్రామ వ్యాసాల స్థానంలో, ఇంకా మెరుగైన వ్యాసాలలాగా అభివృద్ధి చేయుటకు ఇప్పుడు ఉన్న వ్యాసాలు నచ్చని గౌరవ వికీపీడియన్స్ పరిష్కారం మార్గం కనుగొనగలరని నేను భావిస్తున్నాను.

పై విషయాలు ఏ ఒక్కరి గౌరవ వికీపీడియన్సును దృష్టిలో పెట్టుకొని ఉద్దేశించి రాయలేదని మనవి.2017 అక్టోబరు నుండి సుమారు 18 మాసాలకు పైగా డేటా ఎక్కించే పనితోపాటు,తెలంగాణ జిల్లాలు, మండలాలు పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు ప్రకారం నిర్విరామంగా రోజుకు 12 గంటలకు పైగా పనిచేసి, ఒక దశకు చేరుచున్న సమయంలో ఇటీవల జరిగిన రచ్చబండ చర్చలలో ఏమి ఉంది ఆ వ్యాసాలలో అనే ఒక మాటకు ఆవేదన చెంది, అదే ఆవేదన నా భావాల రూపంలో అభిప్రాయాలు బయటపెట్టాను. ఇంతేకాదు నాతోపాటు మరికొంత మంది గౌరవ వికీపీడియన్స్ ఆంద్రప్రదేశ్,తెలంగాణ గ్రామాల వ్యాసాలలో పాలుపంచుకున్నారు.వార్కి ఈ అవేదన ఉంటుందని నేను భావిస్తున్నాను.నేను మార్పులు, చేర్పులు చేసేటప్పుడు నాకు తెలియని, అవగాహనలేని పొరపాట్లు ఏమైనా జరిగితే జరిగి ఉండవచ్చు. అంత మాత్రంచేత వ్యాసాలపై శ్రద్ద లేదని భావించకండి.పెద్దమనసుతో పరిశీలించండి. ఈపనులపై నాకు తెలియని,అవగాహనలేని విషయాలపై ఎప్పటికప్పుడు విసుగుపడకుండా సలహాలు సూచనలు అందజేసిన చదువరి, పవన్ సంతోష్ గార్లకు ధన్వవాదాలు.

ప్రస్తుతం జరుగుచున్న పని, నేను చేస్తున్న పని.

తెలంగాణలోని మండలాలకు ప్రత్యేకంగా సృష్టించిన మండల వ్యాసాల లంకెలు ఆ మండలంలోని గ్రామాలకు కలుపబడుతుంది. ఇది కొద్దిరోజులలో అయిపోతుంది.నేను అనుకున్న ప్రకారం, నాకు చేతనైనంతవరకు చేసాను.ఆ తరువాత తెలంగాణ గ్రామ వ్యాసాలకు నేనుగా చేయవలసింది ఏమీ లేదని భావిస్తున్నాను.మరియెకసారి ప్రాజెక్టు పని పూర్తి వివరాలు, తగిన గణాంకాలు మీ ముందుంచగలవాడును

దీనిపై గౌరవ వికీపీడియన్స్ మంచీ చెడూ స్పందనలు తెలియజేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:33, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:00, 9 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటికే ప్రాజెక్టు గురించిన సరియైన సమాచారం సులువుగా అందే వీలు లేక, కొన్ని అనుమానాలు, అపోహలతో చర్చలు సరిగా జరగలేదు. అందువలన మీకు మరియు ఇతర సభ్యులకు అవేదన కలిగించటంలో నాకు భాగం వున్నందుకు క్షంతవ్యుడిని. నేను ఇంతకు ముందే తెలిపినట్లు, ప్రాజెక్టు నిర్వహణ సరిగా జరగలేదనే నా అభిప్రాయానికి నిర్వహణ పేజీని సరిగా నిర్వహించకపోవడం మూలం. దానిని వీలైనంతవరకు సరిచేయటానికే నా ప్రయత్నం. నేను కృషి చేసిన పేజీలు, ఈ ప్రాజెక్టు వలన, మరియు ఇతర సభ్యుల బాటు పనివలన అస్తవ్యస్తంకావడంతో నాకు ఆవేదన కలిగి, వాటి గురించి స్పందించమని కోరినా, ఎవరూ పట్టించుకోకపోవడంతో నాకు కొన్ని అపోహలు కలిగినమాట వాస్తవం. అయితే ప్రస్తుత స్పందనల ద్వారా కొన్ని అపోహలు దూరమైనందులకు సంతోషం. అయితే నిర్హేతుకంగా వ్యాఖ్యలు చేయలేదనడానికి, నా చర్చలు, సవరణ లింకులు, గ్రామాల ప్రాజెక్టులో సమాచారపెట్టెకు కావలసిన సాంకేతిక పని చేయడం మీకు తెలిసినదే. ఇతర సభ్యులు స్పందనలకొరకు కొంతకాలం వేచి చూసి, వీలైతే అందరి అభిప్రాయాలతో మీరే ఈ ప్రాజెక్టుకి అధికారిక సమీక్ష చేసి, ఆ తరువాత ముందు పనులు ప్రారంభించవచ్చు.--అర్జున (చర్చ) 02:24, 9 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీ స్పందనలకు ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 16:20, 12 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు సమీక్షకు తోడ్పాటు[మార్చు]

చదువరి, User:JVRKPRASAD, User:యర్రా రామారావు, User:కె.వెంకటరమణ, User:T.sujatha, పవన్ సంతోష్, User:Rajasekhar1961, User:Pranayraj1985, User:Nagarani Bethi, User:Bhaskaranaidu, మరియు ఇతరత్రా ఆసక్తిగల సభ్యులకు, ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల చర్చలలో పాలుపంచుకున్న వారందరికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీ కృషికి ధన్యవాదాలు. ప్రాజెక్టువివరాలు సరిగా లభించక ఇటీవలి చర్చలు మంచి ఉద్దేశాలతో ప్రారంభమైనా కొంతవరకు పెడదారిన పట్టడంలో నా పాలుకూడా వున్నందుకు చింతిస్తున్నాను. మీకు కలిగిన ఆవేదనకు నా క్షమాపణలు. ముందు జరగవలసిన కృషికి తోడ్పాటుగా, నా వంతు ఈ పేజీ నిర్వహణలో తోడ్పడుతున్నాను. మీ కృషి గురించిన వివరాలు, ప్రాజెక్టుపై మీ స్పందనలు చేర్చి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు సరియైన సమీక్షకు తోడ్పడాలని కోరుతున్నాను. ఇప్పటికే ప్రాజెక్టు పై స్పందించిన వారు కూడా ప్రాజెక్టు పేజీలో మార్పులు, చేర్పులు చేయమని మనవి.--అర్జున (చర్చ) 04:47, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, స్పష్టత కోసం అడుగుతున్నా నంతేనండి... ఈ ప్రాజెక్టులో భాగంగా పేజీల్లో చేరుస్తున్న సమాచారం టెలిఫోన్ డైరెక్టరీ లాగా ఉంది అని అన్నారు కదా.., ఆ అభిప్రాయాన్ని మీరు మార్చుకున్నట్టేనా? __చదువరి (చర్చరచనలు) 08:30, 13 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. లేదండి, ప్రాజెక్టు నిర్వహణ గురించి ముఖ్యంగా ప్రాజెక్టు ప్రారంభంలో నిర్వహణ గురించి నేను చేసిన వ్యాఖ్యలు సరియైనవి కావునని తెలిసినందున, వాటిని ఉపసంహరించుకుంటున్నాను. నేను ప్రస్తుతం పర్యటనలో వున్నందున ఇంటర్నెట్ లభ్యత సరిగా లేనందున ప్రస్తుతం నేను ఇంకేమీ వివరించదలచుకోవటం లేదు. ముందు జరిగే కృషి వలన వచ్చే మార్పులు, నా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జరుగుతాయని అనుకుంటున్నాను.--అర్జున (చర్చ) 16:37, 13 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాజెక్టు మౌలిక ఉద్దేశాన్ని, జరిగిన తీరునే ప్రశ్నించే స్థాయిలో వెలువరించిన మీ అనుమానాలు మీవరకూ ఐనా తీరడం, ఉపసంహరించుకోవడం నాకు వ్యక్తిగతంగా సంతోషకరమైన సంగతి. ఈ మీ స్పందన చాలా హుందాగా ఉంది. ధన్యవాదాలతో మీ పవన్ సంతోష్ (చర్చ) 07:17, 16 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చిన పనిపై స్థితి నివేదిక[మార్చు]

ఈ ప్రాజెక్టు పనిభాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాల వ్యాసాల పేజీలలో భారత జననగణన సెమీడేటా ఎక్కించే పనిని 2017 నవంబరులో చేపట్టి 2019 జూన్ నాటికి పూర్తిచేయబడింది., తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలపై స్థితి వివరాల నివేదిక చూడండి. గౌరవ వికీపీడియన్స్ దీనిపై తగుసూచనలతో స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:50, 30 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారికి, మీ ప్రగతి నివేదిక బాగుంది. డేటా లేనందున పేజీలు సృష్టించకపోవడం డేటా ఎక్కించకపోవటంలో స్పష్టత లేదు. 2018,2019 లో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వలన కొత్తగా చేరిన రెవిన్యూ గ్రామాలు, 2011 జనగణన డేటాలో లేనందున ఈ పరిస్థితికి కారణంగా నేను భావిస్తున్నాను. అయితే ప్రభుత్వ వుత్తర్వుల ప్రకారం రెవిన్యూ గ్రామాలన్నింటికి మొలక పేజీయైనా సృష్టించితే కాలక్రమంలో జనగణన డేటాతో తాజా పరచబడతాయి. --అర్జున (చర్చ) 03:46, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ డేటా లేనందున పేజీలు సృష్టించకపోవడం అనే దానిపై ప్రాజెక్టు పేజీలోని ఇక్కడ గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:29, 6 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ డేటా ఎక్కించకపోవటం అనే దానిపై ప్రాజెక్టు పేజీలోని ఇక్కడ గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:44, 6 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొన్ని గమనింపులు[మార్చు]

జనగణన విభాగం ఆధారిత విభజనలు వికీపీడియాకు ముఖ్యంగా పట్టణాల వర్గంలో వచ్చే వ్యాసాలకు సరియైనవి కావు. అద్దంకివ్యాసం జనం చూస్తారు కాని, అద్దంకి(దక్షిణ), అద్దంకి(ఉత్తర) జనగణన విభజనలకు చూడరు. ఇట్టి పరిస్థితులున్నచోట సంబంధిత విభజన వ్యాసాలను ప్రధానవ్యాసాలతో విలీనం చేయాలి. అర్జున (చర్చ) 11:25, 23 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారూ, అద్దంకి(దక్షిణ), అద్దంకి(ఉత్తర) రెవెన్యూ లెక్కలు ప్రకారం అధికారికంగా ఇవి రెండు రెవెన్యూ గ్రామాలు.అధ్దంకి అనేది ప్రధాన గ్రామ వ్యాసం.అవసరమైతే దీనిని "అద్దంకి పురపాలక సంఘం" వ్యాసంగా మార్చవచ్చు.లేదా పట్టణ వ్యాసంగా పరిగణించవచ్చు.విలీనంనకు అవకాశంలేదు.అవి అధికారికంగా ఆ పేర్లతో ఉన్న రెవెన్యూ గ్రామాలు.ఇలా నేను పరిశీలించిన ప్రకారం కొన్ని మండలాలలో ఉన్న సందర్బాలు ఉన్నవి.మండలంలోని రెవెన్యూ గ్రామాలు మూసలో అద్దంకిని తొలగించవలసియున్నది.--యర్రా రామారావు (చర్చ) 14:02, 23 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, మీ స్పందనకు ధన్యవాదాలు. అద్దంకి పురపాలకసంఘ పరిధిలోకి ఇవి రావు అనేది నిజమైతే , వాటిని అలావుంచవచ్చు. అర్జున (చర్చ) 15:36, 23 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారూ, ఎప్పడూ గ్రామ పంచాయితీలు,పురపాలకసంఘాలు రెవెన్యూ గ్రామ పరిధికి చెందుతాయిగానీ, రెవెన్యూ గ్రామాలు ఎప్పడూ గ్రామ పంచాయితీ, పురపాలక సంఘ పరిధి క్రిందకు ఉండవు.రెండు చానల్స్ వేరు.అలాగే నార్త్ వల్లూరు,సౌత్ వల్లూరు ఇవి రెండు కూడా అధికారిక రెవెన్యూ గ్రామాలు.--యర్రా రామారావు (చర్చ) 06:01, 26 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, మీ వ్యాఖ్య అర్ధమైంది. అయితే అద్దంకి పురపాలకసంఘం ఏ రెవిన్యూగ్రామాల పరిధిలోకి వస్తుందో తెలపగలరా?--అర్జున (చర్చ) 05:29, 27 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, అద్దంకి ప్రస్తుతం పురపాలక సంఘంగా మార్పుచేయలేదని తెలిసింది.నగర పంచాయితీ అని మాత్రమే తెలుస్తుంది.ఇది అద్దంకి సౌత్, అధ్దంకి నార్త్ పరిధిలో ఉందని అనుకోవాలి.ఇలా ఉన్నప్పుడు అధ్దంకి పాక్షికంగా రెండు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉందనుకోవాలి.మండలంలోని రెవెన్యూ గ్రామాలు అనే విషయానికి వస్తే సంఖ్యపరంగా అద్దంకి సౌత్,అద్దంకి నార్త్ లను రెండుగా ప్రభుత్వ లెక్కలలో ఉంటుంది.నాకు తెలిసినంతవరకు తెలియపరుస్తున్నాను. --యర్రా రామారావు (చర్చ) 17:30, 28 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, ధన్యవాదాలు, నా పరిశోధనలో, అద్దంకి పట్టణం వేరే పట్టణ/గ్రామ హద్దుగా, భూపటలంతో అనుసంధానం చేసిన రెవిన్యూ రికార్డులను బట్టి తెలుస్తున్నది. చూడండి అద్దంకి హద్దుల పటం. రెవిన్యూ శాఖ వారి రికార్డులలో అద్దంకి ఒక రెవిన్యూ గ్రామంగానే హద్దులకొరకు వాడుతున్నట్టుంది. (నేను గతంలో ఇంటర్నెట్ నుండి పొందిన MPHS అధికారిక శాఖ జాబితాలో అద్దంకి గ్రామంగా చేర్చబడినది.) (చర్చ) 00:29, 29 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
లింకు దొరికింది. రెవిన్యూ శాఖ వారిది.అర్జున (చర్చ) 11:00, 29 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు,అద్దంకి మండలహద్దుల ప్రకారం మీరు చెప్పినది సరియని తెలుస్తున్నది. అయితే గ్రామ హద్దులపటంలో పట్టణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నారు. --అర్జున (చర్చ) 06:43, 6 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మనకు భూమికి ఎలా సర్వే నెంబర్లు ఉంటాయో, గ్రామానికి ఒక సర్వే నంబరు ఉంటుంది.లోగడ మనం గ్రామ కంఠం అనే మాట తరుచూ వింటుంటాం.గ్రామ కంఠం సర్వే నంబరులో గ్రామ పరిధి ఉంటుంది.ఆ రకంగా గ్రామ కంఠం హద్దులు అని నేను భావిస్తున్నాను. గ్రామం పెరిగితే ఇతరుకు చెందిన భూములు ప్రభుత్వం తీసుకొని బలహీన వర్గాలు ఇండ్లు కట్టిస్తారని మీకు తెలుసు.--యర్రా రామారావు (చర్చ) 06:56, 6 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారికి, గ్రామ హద్దు గ్రామస్తుల గృహాల సముదాయ హద్దులుగా అనిపించటం లేదు. నేను పుట్టిన గ్రామం పరీక్షగా చూశాను.. గ్రామస్తులు వ్యవసాయం చేసుకొనే భూములతో పాటుగా అనిపిస్తుంది. లింకు ప్రకారం గ్రామకంఠం అంటే గ్రామంలో వుండే ప్రభుత్వభూమి అని తెలుస్తున్నది --అర్జున (చర్చ) 03:59, 8 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సరిదిద్దే ప్రక్రియకు పైలట్ ప్రాజెక్టు[మార్చు]

సమచారపెట్టె సమస్యతో పాటు జనగణన వివరాలను వీలైతే సరిదిద్దే వివరాల కొరకు ప్రకాశం జిల్లా పైలట్ ప్రాజెక్టు చూడండి.--అర్జున (చర్చ) 09:21, 30 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న జనన గణన డేటా ఎక్కించే పని పూర్తి చేయుట[మార్చు]

తెలంగాణ గ్రామాలలో డేటా ఎక్కించే పని పూర్తిగా 100 శాతం పూర్తైనది.ఆంద్రప్రదేశ్ గ్రామాలలో 82 శాతం పని మాత్రమే పూర్తైనది. రెండు రాష్ట్రాలలో పని పూర్తైనప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టు లక్ష్యం నేరవేరినట్లుగా నేను భావిస్తున్నాను.దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గ్రామాలలో చేసిన అనుభవాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామాల పెండింగులో నున్న పనులు ఈ రోజు నుండి (2019-08-09) చేపడుతున్నాను.సూచనలు, సలహాలు ఇవ్వగలరు.ఆసక్తి ఉన్న గౌరవ వికీపీడియన్స్ ఎవరైనా పాల్గోనాలనుకుంట్ వారు వారి సమ్మతిని దిగువ తెలియజేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:36, 9 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]