Jump to content

వైద్యశాస్త్రం

వికీపీడియా నుండి
(వైద్యము నుండి దారిమార్పు చెందింది)
ఒక డాక్టరు రోగికి చికిత్స చేస్తున్న దృశ్యం

వైద్యం లేదా వైద్య శాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం.మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనే పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది.

వివిధ రకాల వైద్యవిధానాలు‎

[మార్చు]

దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్నట్లుగా వైద్యవిధానాలు ఏవైనా రోగిని స్వస్థత చేకూర్చేందుకే అనే విషయం గుర్తించాలి. ఒక వైద్య విధానముతో లొంగని జబ్బు మరొక విధానముతో తగ్గవచ్చును . ఈ క్రింద పేర్కొన్నవి కొన్ని ముఖ్యమైనవి .

విద్య

[మార్చు]

వివిధ రకాల వైద్య పద్ధతులకు వివిధ స్థాయిలలో విద్యావకాశాలున్నాయి.

పారా మెడికల్ /డిప్లొమా

[మార్చు]

సహాయ ఆరోగ్య లేక పారా మెడికల్ సిబ్బంది శిక్షణకు సంవత్సర, రెండేళ్ల కాల కోర్సులున్నాయి. వీటిని ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ [1] నియంత్రిస్తుంది. వీటికి ఇంటర్ ఉత్తీర్ణత అర్హత. ఇవేకాక, స్వతంత్ర ప్రతిపత్తిగల, ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్,[2] హైద్రాబాద్ లో వైద్య ప్రయోగశాల సాంకేతిక శాస్త్రంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు (లాబ్ టెక్నీషియన్) 10 వతరగతి విద్యార్హతగా నిర్వహించుతున్నది.

నర్సింగ్

[మార్చు]

1947లో ఏర్పడిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ [3] నర్సింగ్ విద్యను పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వైద్యవిద్యా సంచాలకుని కార్యాలయం నియంత్రిస్తుంది. ప్రవేశాలను ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ఇంటర్లో మార్కులు ఆధారంగా నిర్వహిస్తుంది.

బి.ఎస్సి నర్సింగ్
4 సంవత్సరాల పాఠ్యవిషయము. దీనిలో నర్సింగ్ (శుశ్రూష) అంటే ఏమిటి, ప్రథమ చికిత్స ఎలా చేయాలి తదితర విషయాల సిద్దాంతాలు, ప్రయోగాలుంటాయి. ఇంటర్ లో శాస్త్ర విజ్ఞాన విషయాలలో, ఇంగ్లీషులో 50 శాతం మార్కులుండి, 17 సంవత్సరాల కనీస వయస్సు కలవారు ప్రవేశానికి అర్హులు.
బి.ఎస్సి (మెడికల్ టెక్నాలజీ)
4 సంవత్సరాల పాఠ్యవిషయం. రోగ నిర్ధారణ పరీక్షలు వైద్య ప్రయోగశాలలో ఏ విధంగా చేయాలో నేర్పుతారు. రసాయన, సూక్ష్మక్రిములకు సంబంధించిన, జీవజ్ఞానానికి సంబంధించిన విషయాలుంటాయి. ఇంటర్ విజ్ఞాన విషయాలు, వృత్తి ఇంటర్ (మెడికల్ లాబ్ టెక్నాలజీ), మెడికల్ లాబ్ టెక్నాలజీ డిప్లోమా విద్యార్థులు అర్హులు.
జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ
3.5 సంవత్సరాల పాఠ్యవిషయము. సాధారణ శుశ్రూష మంత్రసానిత్వము అనే ఈ కోర్సుకి, ఇంటర్ ఏ విషయంలో నైనా, సహాయ శుశ్రూష మరియ మంత్రసానిత్వము వృత్తి విద్య చేసిన వారు అర్హులు

మందుల విజ్ఞానం (ఫార్మసీ)

[మార్చు]

1949లో ఏర్పడిన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా [4] ఫార్మసీ విద్యను నియంత్రిస్తుంది.

డి.ఫార్మ్
రెండు సంవత్సరాలు మూడునెలల కోర్సు. ఇంటర్ శాస్త్ర విజ్ఞాన విషయాలు ఐచ్ఛికాంశాలుగా చదివిన విద్యార్థులు దీనిలో చేరవచ్చు.
బి.ఫార్మ్
4 సంవత్సరాల కోర్సు.ఇంటర్ శాస్త్ర విజ్ఞాన విషయాలు ఐచ్ఛికాంశాలుగా చదివిన విద్యార్థులు దీనిలో చేరవచ్చు
ఫార్మ్.డి
6 సంవత్సరాల కోర్సు.దీనిలో చివరి సంవత్సరం ఆసుపత్రి శిక్షణ వుంటుంది. దీని తరువాత డాక్టరేట్ (Ph.D) చేయటానికి వీలవుతుంది. దీనిలో ఉత్తీర్ణులైనవారు పేరు ముందు డాక్టర్ అవే గౌరవ పదంచేర్చుకోవచ్చు. ఆసుపత్రి ఫార్మసీ, సముదాయ ఫార్మసీ, క్లినికల్ పరిశోధన, నియంత్రణ, కొత్త మందుల అభివృద్ధి, నాణ్యత నియంత్రణ లాంటి అన్ని విధాల ఫార్మసీ సేవలలో అనుభవంపై ప్రత్యేకంగా శిక్షణ వుంటుంది. ఇంటర్ శాస్త్ర విజ్ఞాన విషయాలు ఐచ్ఛికాంశాలుగా చదివిన విద్యార్థులు దీనిలో చేరవచ్చు
ఫార్మ్.డి (పోస్ట్ బాకలరేట్)
3 సంవత్సరాల కోర్సు. ఇది బి.ఫార్మ్ పూర్తయినవారు ఫార్మ్.డిలో 4 సంవత్సరంలో చేరటానికి అనువుగా వున్నకోర్సు.

వైద్యం

[మార్చు]
ఎమ్.బి.బి.ఎస్. (MBBS)

ఈ విద్యని భారతీయ వైద్య మండలి [5] నియంత్రిస్తుంది. చాలా రాష్ట్రీయ విద్యాలయాలు, జాతీయ విద్యాలయాలలో ఇది చదవవచ్చు. ప్రథమ సంపర్క వైద్యునికి కావల్సిన జ్ఞానం, నైపుణ్యతలు, నడవడిక సమకూరేటట్లుగా విద్యావిషయాలుంటాయి. 4.5 సంవత్సరాల చదువు తర్వాత ఒక సంవత్సరం ఆసుపత్రిలో శిక్షక వైద్యుడిగా పనిచేయాల్సివుంటుంది. శరీర నిర్మాణం, మానవ జీవక్రియలు, జీవరసాయన శాస్త్రం, మానవీయ శాస్త్రాలు, సముదాయ ఆరోగ్యం, రోగము, సూక్ష్మజీవ శాస్త్రం, మందుల శాస్త్రము, నేరపరిశోధనలో సహకరించే వైద్య విషయాలు, రసాయనాల విషతుల్యత, సముదాయ ఆరోగ్యం, వైద్యం, శస్త్ర చికిత్స, అనుబంధ విషయాలు ఈ కోర్సులో భాగం.

బిడిఎస్ (‌BDS)

ఈ విద్యని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా [6] నియంత్రిస్తుంది. దంత వైద్యునిగా విద్యార్థిని తయారు చేసేది ఈ బిడిఎస్ [7] కోర్సు. ఆసుపత్రి శస్త్రచికిత్స శిక్షణ (హౌస్ సర్జన్) తో కలిపి 5 సంవత్సరాలు. ఎంబిబిఎస్ లో విషయాలన్నీ దీనిలో వుంటాయి. ఇవికాక, డెంటల్ మెటీరియల్స్, ఓరల్ పాథాలజీ, ఓరల్ సర్జరీ వుంటాయి. రెండో ఏడాది నుండే ప్రయోగ అనుభవం వుంటుంది.అందుకని కోర్సు ముగిసేసరికి ఉపాధికి తయారుగా వుంటారు. నిపుణుడైన వైద్యుని దగ్గర రెండేళ్లు పనిచేస్తే చికిత్సా విధానాలపై అవగాహన కలుగుతుంది. జనాభాలో 90 శాతం మంది దంత సమస్యలకు లోనవ్వుతున్నారు. అయితే లక్ష మందికి కూడా ఒక్క దంత వైద్యుడు లేరు.అందువలన ప్రభుత్వ ఉద్యోగమే కాక ప్రైవేటు ప్రాక్టీస్ కు అవకాశాలెక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంబిబిఎస్ తో సమానంగా జీత భత్యాలుంటాయి.

ఇంటర్ జీవ, భౌతిక, రసాయనిక శాస్త్ర ఐచ్ఛికాంశాలతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారిని ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రవేశపరీక్షని ఎమ్సెట్ అంటారు.

ఉపాధి

[మార్చు]

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ వనరులు

[మార్చు]
  1. "ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ బోర్డ్". Archived from the original on 2010-09-23. Retrieved 2010-10-11.
  2. "ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్". Archived from the original on 2019-11-22. Retrieved 2020-05-30.
  3. "ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్". Archived from the original on 2010-02-17. Retrieved 2010-10-11.
  4. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
  5. "మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా". Archived from the original on 2009-11-03. Retrieved 2010-10-11.
  6. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
  7. డెంటిస్ట్రీ, డా ఎఎస్ నారాయణ, ఆంధ్రజ్యోతి దిక్చూచి 28 జూన్ 2010
  • Feyerabend, Paul K. 2005. Science, history of the philosophy of. Oxford Companion to Philosophy. Oxford.
  • Papineau, David. 2005. Science, problems of the philosophy of. Oxford Companion to Philosophy. Oxford.
  • Popper, Karl [1959] (2002). The Logic of Scientific Discovery, 2nd English edition, New York, NY: Routledge Classics, 3. ISBN 0-415-27844-9. OCLC 59377149.
  • Richard P. Feynman. "The Pleasure of Finding Things Out

ఉపయుక్త గ్రంథ సూచి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]