శర్మిష్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె. వారి గురువు శుక్రాచార్యుడు. సాధుస్వభావం కలిగినది.శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శర్మిష్ఠ యయాతి మహారాజుని గంధర్వ వివాహం చేసుకుని నలుగురు కుమారులను కంటుంది.1a

దేవయానితో తగవు[మార్చు]

ఒక రోజు రాక్షసరాజ వృషపర్వుని పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయానితోనూ వేయి మంది చెలికత్తెలతోనూ వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి.

దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది.

దేవయాని వద్ద దాస్యం[మార్చు]

శుకృడు దేవయానిని ఎంత అనునయించినా దేవయాని తాను పట్టిన పట్టు వదల లేదు. వారు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.

దేవయాని శర్మిష్ఠల వివాహం[మార్చు]

దేవయాని తన చెలికత్తెలతో అదే వనవిహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయాతిని చూసింది. దేవయాని యాయాతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నది. ఆమె యయాతితో తామిరువురికి ఒకసారి పాణి గ్రహణం జరిగింది కనుక తనను అతడు వివాహం చేసుకోవాలని కోరింది. యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు. పట్టువదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రిచే అందుకు అంగీకారాన్ని పొంది యయాతిని వివాహమాడింది. యయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుకృడు శర్మిష్ట వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు.

యయాతి శాపం[మార్చు]

దేవయానీ యయాతికి యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శర్మిష్ట తన జీవితం వృధా అయినందుకు బాధ పడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజుని కలసి దేవయాని చెలికత్తె కనుక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన దృహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు పుత్రులను పొందింది. మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది. కానీ శర్మిష్ట పుత్రులను అడిగి విషయం గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు యయాతికి " వృద్దుడివి కమ్మని " శాపం ఇచ్చాడు. శాపవశాన వచ్చిన ముసలితనాన్ని తీసుకొమ్మని కోరగా దేవయాని కుమారులైన యదువు, తుర్వసు నిరాకరించారు. అలాగే శర్మిష్ట కుమరులైన దృహ్యుడు, అనువు కూడా నిరాకరించారు. అయినప్పటికీ శర్మిష్ఠ కుమారులలో ఒకడైన పూరుడు మాత్రం కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వానాన్ని తాను గ్రహించి వేయి సంవత్సరములు రాజ్యపాలన సాగించాడు.

యదువంశ రాజులు[మార్చు]

తరువాత యయాతి పూరునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చి కృతజ్ఞతగా అతనిని చక్రవర్తిని చేసాడు. యయాతి కోరికకను నిరాకరించిన అతని కుమారులు నలుగురికి శాపం ఇచ్చాడు. శాపకారణంగా యదు వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు, తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు, ద్రూహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజలయ్యారు, అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు. శర్మిష్ట కుమారునికి రాజ్యం ఇవ్వనచ్చని ప్రజలకు నచ్చ చెప్పి యయాతి తపోవనానికి వెళ్ళి వేయి సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గలోకానికి పోయాడు. భారతంలో శర్మిష్ఠ పాత్ర తరువాత కనిపించదు.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శర్మిష్ట&oldid=3993211" నుండి వెలికితీశారు