Jump to content

సమగ్ర రైలుపెట్టెల కర్మాగారం

వికీపీడియా నుండి
(సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము నుండి దారిమార్పు చెందింది)
సమగ్ర రైలుపెట్టెల కర్మాగారం is located in Chennai
సమగ్ర రైలుపెట్టెల కర్మాగారం
Location in Chennai

సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తమిళనాడు రాజధాని చెన్నై లో పెరంబూరులో కలదు.ఇక్కడ రైలు పెట్టెలను తయారుచేస్తున్నారు.ఈ కర్మాగారాన్ని 1952లో భారతీయ రైల్వేలు స్థాపించినప్పటికి తన ఉత్పతులను 1955 అక్టోబర్ 2 నుండి ఆరంభించింది.ఈ రైలు పెట్టెల కర్మాగారము భారతీయ రైల్వేల అవసరాలు తీర్చడమేగాక విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది.ఈ సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2503 భోగిలను చేసి ఒక కొత్త రికార్డును స్థాపించింది.

చరిత్ర

[మార్చు]

సమగ్ర రైలు పెట్టెల కర్మాగారాన్ని 1952లో భారతీయ రైల్వేలు స్థాపించింది.1955 అక్టోబర్ 2 తన మొదటి రైలుభోగీని దక్షిణ రైల్వే జోన్ కొరకు అందించింది.

తయారీ

[మార్చు]

ఈ సమగ్ర రైలు పెట్టెల కర్మాగారములో రెండు డివిజన్లు కలవు.అవి షెల్ డివిజన్,ఫర్నిషింగ్ డివిజన్.షెల్ డివిజన్ లో భోగీల యొక్క బయట భాగాలను ఒక అస్థిపంజరం వలె కలుపుతారు.ఆ తరువాత ఫర్నిషింగ్ డివిజన్ లో మిగతా లోలోన కావలిసిన మిగతా విడిభాగాలను అమర్చి భోగీలను తయారుచేస్తారు.ఇక్కడ మొదటి, రెండవ తరగతి కోచ్ లు,పాంట్రీకార్ లు,సరుకు రవాణా పెట్టెలు,సమర్బన్ పెట్టెలు ఇలా 170రకాలకు పైగా పెట్టెలను తయారుచేస్తున్నారు.ఈ సమగ్ర రైలు పెట్టెల కర్మాగారములో సుమారు 11,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.ఈ సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము అధిక వేగంతో ప్రయాణం చేయు ఎల్.హెచ్.బి భోగీలను తయారుచేయు ఆర్డర్ కూడా లభించింది.2013-14 ఆర్థిక సంవత్సరంలో 25 ఎల్.హెచ్.బి భోగీలను ,228 ఏ.సి భొగీలను,1185 సాధారణ భోగీలను ఉత్పత్తి చేసింది.2014-15 ఆర్థిక సంవత్సరంలో 300 ఎల్.హెచ్.బి భోగీలను ఉత్పత్తి చేసి వాటి సంఖ్యను 2016-17 ఆర్థిక సంవత్సరానికి 1000 ఎల్.హెచ్.బి భోగీల తయారిని లక్ష్యంగా పెట్టుకున్నారు.2017-18 ఆర్థిక సంవత్సరంలో సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) 2503 భోగిలను చేసి ఒక కొత్త రికార్డును స్థాపించి,2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆసంఖ్య ను 3000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎగుమతులు

[మార్చు]

సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన ఉత్పత్తులను శ్రీ లంక,నైజీరియా,ఉగాండా,థాయ్ లాండ్,అంగోలా,బంగ్లాదేశ్,వియత్నాం,టాంజానియా,తైవాన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది.

మ్యూజియం

[మార్చు]

ఒక ప్రాంతియ రైల్వే మ్యూజియంను కర్మాగారమువద్ద కలదు.ఇందులో భారతీయ రైల్వేలకు సంబంధించిన పాతకాలం నాటి కొన్ని తరగతుల రైలు పెట్టెలను ప్రదర్శనలో వుంచారు.

వివాదాలు

[మార్చు]

కోల్‌కతా మెట్రో రైల్వేలకు సంబంధించిన రైలు పెట్టెలను సరిగా తనిఖి చేయలేదని కొన్ని అప్పటి దినపత్రికలు ప్రచురించాయి.

ములాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]