Jump to content

హోమో హ్యాబిలిస్

వికీపీడియా నుండి
(హోమో హాబిలిస్ నుండి దారిమార్పు చెందింది)

హోమో హ్యాబిలిస్
Temporal range: 2.3–1.5 Ma
KNM-ER 1813 క్రేనియమ్ (రూపం) పక్క నుండి దృశ్యం. నాటుర్మ్యూజియమ్ సెంకెన్‌బర్గ్
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: క్షీరదాలు
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Homo
Species:
H. habilis
Binomial name
Homo habilis
లూయీ లీకీ తదితరులు., 1964

హోమో హ్యాబిలిస్ అనేది హోమో జీనస్‌కు చెందిన ప్రాచీన జాతి. ఇది సుమారు 21 - 15 లక్షల సంవత్సరాల క్రితం, ప్లైస్టోసీన్ భౌగోళిక యుగపు గెలాసియన్, తొలి కలాబ్రియన్ దశలలో నివసించింది.[1]

ఈ జాతికి చెందిన టైప్ స్పెసిమెన్ (జాతికి గుర్తింపుగా వాడే శిలాజం - జాతికి పెట్టే పేరు ఈ శిలాజ లక్షణాల నుండే ఏర్పడుతుంది) OH 7. దీన్ని 1960 లో టాంజానియాలోని ఓల్డువాయ్ గార్జ్‌లో కనుగొన్నారు. ఇది ఓల్డోవాన్ రాతి పనిముట్ల పరిశ్రమతో సంబంధం కలిగి ఉంది; ఈ శిలాజాలను హోమో జీనస్‌లో ఒక ప్రత్యేక జాతిగా గుర్తిస్తూ 1964 లో దీనికి హెచ్. హ్యాబిలిస్ (" హ్యాండీ మ్యాన్") అనే రెండు పదాల పేరు పెట్టారు.[2] రూపం లోను, శరీర నిర్మాణం లోనూ హెచ్. హ్యాబిలిస్, ఆస్ట్రలోపిథెకస్కు, హోమో ఎరెక్టస్కూ మధ్య నున్న జాతి.

కేవలం శిలాజ ఆధారాలు ఉన్నంత మాత్రాన ఓ కొత్త జాతిని సృష్టించవచ్చా, సృష్టిస్తే, దాన్ని హోమో జీనస్‌లో చేర్చాలా లేక అస్ట్రలోపిథెకస్ జీనస్‌లో చేర్చాలా, హోమోలో చేరిస్తే హోమో రుడాల్ఫెన్సిస్ ను ఇందులోకి కలిపెయ్యాలా, లేక హెచ్. హ్యాబిలిస్ హెచ్. రుడాల్ఫెన్సిస్ లు రెండూ తొలి హోమో ఎరెక్టస్ నుండి శరీర నిర్మాణ పరంగా పరిణామం చెందినట్లుగానే చూడాలా.. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే.[3]

హోమో జాతి వర్గీకరణ, అసలు దాన్ని తలపెట్టిన నాటి నుంచీ కూడా వివాదాస్పదం గానే ఉంది.[4] దీన్ని మొట్టమొదటి హోమో ("మానవ") జాతిగా వర్గీకరించడానికి అనుకూలంగా ఉన్న ఒక ప్రధాన వాదన, అది పనిముట్లను ఉపయోగించడం. అయితే, 1990 లో, ఆస్ట్రలోపిథెకస్ జీనస్ లోని కొన్ని జాతులు అంతకంటే ముందే (33.9 లక్షల సంవత్సరాల క్రితం) పనిముట్లను వినియోగించినట్లు కనుగొన్నారు.[5][6]

హోమోగా వర్గీకరణ

[మార్చు]
దస్త్రం:MEH Homo habilis Daynes.jpg
KNM-ER 1813 కపాలం ఆధారంగా ఎలిసబెత్ డేనెస్ (2010) నిర్మించిన ఆడ వయోజన హెచ్. హ్యాబిలిస్

దీన్ని ఆస్ట్రలోపిథెకస్ జీనస్‌లో కాకుండా, హోమో జీనస్‌లో ఎందుకు చేర్చాలి అనే శాస్త్రచర్చ జరిగింది.[7][8] చిన్న పరిమాణం కలిగి ఉండడం, ఆదిమ లక్షణా లుండడం వలన కొందరు నిపుణులు (రిచర్డ్ లీకీ కూడా ఉన్నాడందులో) హెచ్. హ్యాబిలిస్ ను ప్రజాతి హోమో లో కాకుండా ఆస్ట్రలోపిథెకస్‌లో చేర్చి ఆస్ట్రాలోపితిసస్ హ్యాబిలిస్ అని పిలవాలని ప్రతిపాదించారు.[9]

హెచ్. హ్యాబిలిస్ ఉనికిని సూచించిన మొట్టమొదటి పాలియోఆంత్రోపాలజిస్టు లూయిస్ లీకీ (రిచర్డ్ లీకీ తండ్రి). అతని భార్య మేరీ లీకీ 1955 లో మొదటగా హెచ్. హ్యాబిలిస్ ఉనికిని కనుగొన్నారు: రెండు హోమినిన్ పళ్ళు. తరువాతి కాలంలో వీటిని "పాల పళ్ళు" గా వర్గీకరించారు. అందువల్ల దీన్ని శాశ్వత దంతాల మాదిరిగా టాక్సాతో అనుసంధానించడం కష్టమని భావించారు.

హెచ్. హ్యాబిలిస్ పొట్టిది. దేహ పరిమాణంతో పోలిస్తే ఆధునిక మానవుల కన్నా చాలా పొడవైన చేతులు ఉన్నాయి; అయితే, దీని ముఖం, దీని పూర్వీకులుగా భావించిన ఆస్ట్రాలోపిథెసీన్స్ కంటే తక్కువగా పొడుచుకు వచ్చి ఉంటుంది. హెచ్. హ్యాబిలిస్ కపాల పరిమాణం ఆధునిక మానవుల పరిమాణంలో సగం కంటే కొంచెం తక్కువ. కోతిలాంటి శరీరనిర్మాణం ఉన్నప్పటికీ, హెచ్. హ్యాబిలిస్ అవశేషాల వద్ద తరచుగా ఆదిమ రాతి పనిముట్లు కనిపించాయి. (ఉదా టాంజానియా లోని ఓల్దువాయ్ గార్జ్. కెన్యా లోని తుర్కానా సరస్సు).

హోమో హ్యాబిలిస్ మరింత సున్నితమైన మరింత అధునాతనమైన హోమో ఎర్గాస్టర్ కు పూర్వీకుడని భావించారు. ఈ హోమో ఎర్గాస్టరే హోమో ఎరెక్టస్ కు మూల పురుషుడు. తెలిసిన శిలాజాలన్నీ ఈ జాతికి సరిగ్గా ఆపాదించబడ్డాయా లేదా అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. కొంతమంది పాలియోఆంత్రోపాలజిస్టులు, ఆస్ట్రలోపిథెకస్, హోమో ల శిలాజాలనే ఈ జాతిగా పొరబడుతున్నారనీ, కాబట్టి ఈ టాక్సన్‌ చెల్లదనీ భావించారు .[10] 2007 లో జరిపిన కొత్త పరిశోధనలు, హెచ్. హ్యాబిలిస్, హెచ్. ఎరెక్టస్ లు సమకాలికులనీ, హెచ్. ఎరెక్టస్ కు హెచ్. హ్యాబిలిస్ పూర్వీకుడనే భావన సరి కాదనీ, అవి రెండూ ఒకే పూర్వీకుడి నుండి వచ్చిన జాతులేననీ సూచించాయి.[11] ఒకవేళ హెచ్. ఎరెక్టస్ కు, హెచ్. హ్యాబిలిస్ కూ పూర్వ సంబంధం ఉందనుకున్నా, హెచ్ హ్యాబిలిస్ లోని ఒక సమూహం హెచ్. ఎరెక్టస్ గా పరిణామం చెంది ఉండవచ్చు, మిగిలిన హ్యాబిలిస్ సమూహం అలాగే, అంతరించిపోయే వరకూ, కొనసాగి ఉంటుంది.[12]

జార్జియా లోని ద్మానిసిలో కనుగొన్న శిలాజాలకు పంటి అరుగుదల వంటి భౌతిక లక్షణాల్లో భిన్నత్వం ఉంది. దీన్ని బట్టి, కొందరు శాస్త్రవేత్తలు తొలి హోమో జీనస్‌కు చెందిన సమకాలిక సమూహాలైన హోమో ఎర్గాస్టర్, హోమో హ్యాబిలిస్, హోమో రుడాల్ఫెన్సిస్ వంటివన్నీ ఒకే జాతికి చెందినవేననీ, ఇవి హోమో ఎరెక్టస్ జాతికే చెందుతాయనీ చెప్పారు. అంటే ఈ "జాతుల" మధ్య ఉన్న వ్యత్యాసాలు సుదీర్ఘ కాలం పాటు సాగిన ఒక వంశ పరిణామాన్ని సూచిస్తాయే తప్ప జాతిని ప్రత్యేకంగా చూపించే మార్పులేమీ కావు.[3][13][14][15]

శరీర నిర్మాణం

[మార్చు]

హెచ్. హ్యాబిలిస్ మెదడు పరిమాణం 550 సెం.మీ.3 నుండీ 687 సెం.మీ.3 వరకు ఉంది. గతంలో ఇది 687 సెం.మీ.3 నుండి 363 సెం.మీ.3 వరకూ ఉంటుందని భావించారు.[8][16]

2015 లో చేసిన వర్చువల్ పునర్నిర్మాణంలో ఎండోక్రానియల్ పరిమాణం 729 సెం.మీ.3 824 సెం.మీ.3 మధ్య ఉండవచ్చని అంచనా వేసారు. ఇది, గతంలో ప్రచురించిన విలువ కంటే పెద్దది.[17]

హెచ్ హ్యాబిలిస్ మెదడు పరిమాణం 640 సెం.మీ.3 . ఇది ఆస్ట్రలోపిథెసిన్‌ల పరిమాణం కంటే సగటున 50% పెద్దది. కానీ ఆధునిక హోమో సేపియన్ల (1,350 నుండి 1,450 సెం.మీ.3) కంటే బాగా చిన్నది. ఈ హోమినిన్లు ఆధునిక మానవుల కంటే పొట్టివి. వీటి ఎత్తు 1.3 మీ. కంటే ఎక్కువ కాదు .

హెచ్. హ్యాబిలిస్ శరీర నిష్పత్తి క్రానియోడెంటల్ ఆధారాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇది హెచ్. ఎరెక్టస్‌తో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని సూచిస్తోంది.[18]

2018 లో చేసిన ఆస్ట్రలోపిథెకస్ సెడీబా శరీర నిర్మాణ అధ్యయనంలో ఆ. సెడీబా, హోమో హ్యాబిలిస్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ రెండింటికీ భిన్నంగా, కానీ వీటితో బాగా దగ్గరి సంబంధం కలిగి ఉందని తేలింది.[19]

హోమో హ్యాబిలిస్ KNM-ER 1813. పోత పోసినది కాదు

ఆహారం

[మార్చు]

దంతాల అరుగుదలకు సంబంధించిన సూక్ష్మ-ఆకృతుల విశ్లేషణలను పరిశీలిస్తే, హోమో హ్యాబిలిస్ (అలాగే ఇతర ప్రారంభ హోమో- క్లాస్ హోమినిన్స్) గట్టి ఆహారాలను తినే అలవాటు లేదు అని తెలుస్తోంది. ఈ విశ్లేషణ ప్రకారం దని ఆహారం గట్టి ఆహారానికి, ఆకులకూ మధ్య ఉండేదని తెలుస్తోంది.[20] ఆహారాన్ని నమలడం వలన పళ్ళపై ఏర్పడే సూక్ష్మమైన "గుంటల"ను పరిశీలించడమే ఈ విశ్లేషణ లోని విశేషం. ఇది విశేషంగా ఆమోదం పొందిన విశ్లేషణ పద్ధతి. ఈ కొలతలు హోమో హ్యాబిలిస్‌లో మాంసాహార, శాకాహారాలు రెంటినీ తినేదని తెలుపుతున్నాయి.[21]

ప్రవర్తన

[మార్చు]
దస్త్రం:Homo habilis.JPG
హోమో హ్యాబిలిస్ ఫోరెన్సిక్ పునర్నిర్మాణం. జర్మనీ, హెర్న్ లోని ఎల్డబ్ల్యుఎల్-మ్యూజియం ఫర్ ఆర్కియాలజీ, (2007 ఛాయాచిత్రం) లో ఉంది.[22]

హోమో హ్యాబిలిస్ దిగువ పాతరాతియుగపు ఓల్దువాయ్ పనిముట్లను వాడడంలో ప్రావీణ్యం సంపాదించినట్లు భావిస్తున్నారు. ఇది రాతి పెచ్చులను వాడింది. హెచ్. హ్యాబిలిస్ ఈ రాళ్లను చంపిన జంతువుల కండలు కోసేందుకు, చర్మాన్ని వలిచేందుకూ ఉపయోగించారు.[23] ఈ రాతి పెచ్చులు గతంలో ఉపయోగించిన ఏ పనిముట్ల కంటే కూడా ఆధునికమైనవి. ప్రతికూల పరిసరాల్లో జీవించేందుకు గతంలోని ఇతర ప్రైమేట్లకు లేని అనుకూలత ఈ పనిముట్ల ద్వారా హెచ్. ఎరెక్టస్ కు కలిగింది. రాతి పనిముట్ల సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన మొట్టమొదటి హోమినిన్ హెచ్. హ్యాబిలిస్సా కాదా అనేది వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఆస్ట్రలోపిథెకస్ గార్హిని, రాతి పనిముట్లతో సహా కనుగొన్నారు.

హెచ్. హ్యాబిలిస్ తెలివితేటలు, సంఘ నిర్మాణం ఆస్ట్రలోపిథెసీన్లు, చింపాంజీల కంటే అధునాతనమైనదని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. హెచ్. హ్యాబిలిస్ పనిముట్లను ప్రధానంగా చచ్చిన జంతువుల మాంసాన్ని కోసేందుకు వాడారు తప్ప, స్వీయరక్షణకు గాని వేటకు గానీ వాడలేదు. డైనోఫెలిస్ వంటి పెద్ద వేటాడే జంతువులకు హెచ్. హ్యాబిలిస్ ప్రధానమైన ఆహారంగా ఉండేదని చెప్పేందుకు తగినన్ని శిలాజ ఆధరాలున్నాయి. .[24] దీన్ని బట్టి, హెచ్. హ్యాబిలిస్ దాని సోదర జాతులు లేదా వారసుల లాగా వేటగాడు కాదని తెలుస్తోంది.

హోమో హ్యాబిలిస్ పరాంత్రోపస్ బోయిసీ వంటి ఇతర హోమో -లాంటి ద్విపాద ప్రైమేట్ల సమకాలికంగా జీవించింది. వీటిలో కొన్ని అనేక సహస్రాబ్దాల పాటు మనగలిగాయి. అయితే, ఇవన్నీ శిలాజ రికార్డుల నుండి అదృశ్యమై పోగా, హెచ్. హ్యాబిలిస్ మాత్రం బహుశా దాని పనిముట్ల కారణంగా గానీ, ప్రత్యేకమైన ఆహారం అంటూ లేకపోవడం వలన గానీ కొత్త జాతులకు పూర్వగామిగా మారింది. హెచ్. హ్యాబిలిస్ 500,000 సంవత్సరాల పాటు ఆఫ్రికాలో హెచ్. ఎరెక్టస్‌తో కలిసి జీవించి ఉండవచ్చు.[25]

శిలాజాలు

[మార్చు]
దస్త్రం:Homme d'Olduvai.jpg
OH 7 పునర్నిర్మాణం: పుర్రె, ముఖ పునర్నిర్మాణం, కళాత్మక చిత్రం ( సిన్క్వాంటెనైర్ మ్యూజియం, బ్రస్సెల్స్, 2016 ఛాయాచిత్రం)

OH 7 17.5 లక్షల సంవత్సరాల నాటిది, దీనిని మేరీ, లూయిస్ లీకీ 1960 నవంబరు 4 న టాంజానియాలోని ఓల్దువాయి గార్జ్ వద్ద కనుగొన్నారు. ఇది దంతాలన్నిటితో కూడిన దవడ; దంతాల పరిమాణం చిన్నగా ఉండడంతో, బాల్యంలో ఉన్న ఈ వ్యక్తి మెదడు పరిమాణం 363 సెం.మీ.3 ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేసారు. 1964 లో, ఎడమ చేతికు చెందిన 20 కి పైగా శకలాలు కనుగొన్నారు. లీకీ, పాలియోంటాలజిస్ట్ జాన్ నేపియర్, పాలియోఆంత్రోపాలజిస్ట్ ఫిలిప్ టోబియాస్ లు వీటిని హోమో హ్యాబిలిస్‌కు చెందినవిగా గుర్తించారు. OH 7 ను ఈ జాతికి చెందిన టపు ఫాసిల్‌గా వర్గీకరించడంలో సహాయపడ్డారు.[26]

OH 7 హోమో హ్యాబిలిస్ చేతికి ఖచ్చితమైన పట్టు, ఎత్తులు ఎక్కేందుకు అవసరమైన అనుసరణలు ఉన్నాయి. మానవుడి లాగా వెనక కాళ్ళు కొద్దిగా ఎక్కువ పొడుగ్గాను, చింపాంజీ లాగా ముంజేయి, వెనక చేయి నిష్పత్తీ ఉన్నాయి.

OH 24 (ట్విగ్గీ) టాంజానియాలోని ఓల్డువాయి గార్జ్ వద్ద 1968 అక్టోబరులో కనుగొన్న 18 లక్షల సంవత్సరాల వయస్సు గల కపాలం. ఇది రూపు మారి ఉంది. మెదడు పరిమాణం 600 సెం.మీ.3 కంటే కొద్దిగా తక్కువ.   మరింత ప్రాచీన ఆస్ట్రాలోపిథెసిన్‌ల సభ్యులతో పోలిస్తే ముఖం ముందుకు పొడుచుకు రావడం కొంచెం తగ్గింది.

KNM-ER 1813

[మార్చు]

KNM-ER 1813 సాపేక్షంగా పూర్తిగా ఉన్న కపాలం. ఇది 19 లక్షల సంవత్సరాల నాటిది. కెన్యా లోని, కూబి ఫోరా వద్ద 1973 లో కనుగొన్నారు. మెదడు సామర్థ్యం 510 సెం.మీ.3 . ఇంతకు ముందు కనుగొన్న హెచ్. హ్యాబిలిస్ రూపాల వలె ఇది ఆకట్టుకోలేదు.

KNM-ER 1805

[మార్చు]

KNM-ER 1805 అనేది 1974 లో కెన్యాలోని కూబి ఫోరాలో కనుగొన్న 17.4 లక్షల సంవత్సరాల క్రితం నాటి మూడు కపాలపు ముక్కలు. మొదట్లో దీన్ని హెచ్. ఎరెక్టస్‌కు చెందినదని భావించారు.

1986 లో OH 62 ను ("ఓల్దువాయ్ హోమినిడ్ స్పెసిమెన్ 62" ) డోనాల్డ్ జోహన్సన్, టిమ్ వైట్ లు ఓల్దువాయ్ గార్జ్‌లో కనుగొన్నారు. సుమారు 18 లక్షల సంవత్సరాల వయస్సు గల ఈ శిలాజాల్లో, ముఖ్యమైన ఎగువ, దిగువ అవయవాలు - భుజం ఎముక, తొడ ఎముక ఉన్నాయి.[27] ఈ కనుగోలు అప్పట్లో కొంత చర్చను లేవదీసింది.[28] OH 62 ముందు వెనుక కాళ్ళ నిష్పత్తిని బట్టి దాని నడకతీరును అంచనా వేసారు. తొలి విశ్లేషణల్లో ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ AL 288-1 (" లూసీ ") తో పోలికలపై దృష్టి పెట్టారు. చాలా కొలతలలో- కొలిచినవిగానీ, అంచనా వేసినవి గానీ - OH 62 ఎగువ అవయవం AL 288-1 తో సమానంగా గానీ, దాని కంటే పెద్దదిగా గానీ ఉంది. అయితే దాని కింది అవయవాల అవశేషాలు (ప్రధానంగా తొడ ఎముక) చిన్నదిగా ఉంది. ప్రత్యేకించి, 264 మిల్లీమీటర్ల పొడవున్న భుజం ఎముక, AL 288-1 తొడ ఎముక (280 మిమీ) కన్నా చిన్నదైన తొడ ఎముకల (తొడ ఎముక ముక్క మాత్రమే దొరికింది) మధ్య నిష్పత్తిని చూస్తే ఇది సుమారు 0.95 ఉంది. ఇది ఆధునిక మానవుల నిష్పత్తి (సగటున 0.72) కంటే ఆధునిక చింపాంజీల ఇండెక్సుకు (సగటున 1.00) దగ్గరగా ఉంది. AL 288-1 నిష్పత్తి 0.85. అంటే ఇది AL 288-1 కంటే ప్రాచీనమైనది.[29]

KNM-ER 1813 .

ఎల్‌డి 350-1

[మార్చు]

LD 350-1 అనేది 2013 లో కనుగొన్న ఒక శిలాజ దవడ ఎముక. ఇది 28 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. ఆస్ట్రలోపిథెకస్, హెచ్. హ్యాబిలిస్ లకు మధ్యదని కొందరు అన్నారు. ఈ శిలాజాన్ని ఇప్పటి వరకు తెలిసిన హోమో జాతికి పూర్వపు సాక్ష్యంగా పేర్కొన్నారు. అడవులను, నీటివనరులనూ అంతరించి, వాటి స్థానంలో సవానాలు ఏర్పడిన ప్రధాన శీతోష్ణస్థితి మార్పు తర్వాత ఈ వ్యక్తి నివసించాడని భావించారు.[30]

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Friedemann Schrenk, Ottmar Kullmer, Timothy Bromage, "The Earliest Putative Homo Fossils", chapter 9 in: Winfried Henke, Ian Tattersall (eds.), Handbook of Paleoanthropology, 2007, pp. 1611–1631, doi:10.1007/978-3-540-33761-4_52. This date range overlaps with the emergence of Homo erectus. New York Times article Fossils in Kenya Challenge Linear Evolution published 9 August 2007.
  2. Wood, Bernard "Fifty Years After Homo habilis", Nature. 3 April 2014. pp. 31–33.
  3. 3.0 3.1 Margvelashvili, Ann; Zollikofer, Christoph P. E.; Lordkipanidze, David; Peltomäki, Timo; León, Marcia S. Ponce de (2013-10-02). "Tooth wear and dentoalveolar remodeling are key factors of morphological variation in the Dmanisi mandibles". Proceedings of the National Academy of Sciences (in ఇంగ్లీష్). 110 (43): 17278–83. Bibcode:2013PNAS..11017278M. doi:10.1073/pnas.1316052110. ISSN 0027-8424. PMC 3808665. PMID 24101504. Archived from the original on 2020-12-02. Retrieved 2019-12-04.
  4. Collard, Mark; Wood, Bernard (2015). "Defining the Genus Homo". Handbook of Paleoanthropology. pp. 2107–2144. doi:10.1007/978-3-642-39979-4_51. ISBN 978-3-642-39978-7.
  5. Jones, S.; Martin, R.; Pilbeam, D., eds. (1994). The Cambridge Encyclopedia of Human Evolution. Cambridge: Cambridge University Press. ISBN 978-0-521-32370-3.
  6. McPherron, Shannon P.; Zeresenay Alemseged; Curtis W. Marean; Jonathan G. Wynn; Denne Reed; Denis Geraads; Rene Bobe; Hamdallah A. Bearat (2010). "Evidence for stone-tool-assisted consumption of animal tissues before 3.39 million years ago at Dikika, Ethiopia". Nature. 466 (7308): 857–860. Bibcode:2010Natur.466..857M. doi:10.1038/nature09248. PMID 20703305.
  7. Wood and Richmond; Richmond, BG (2000). "Human evolution: taxonomy and paleobiology". Journal of Anatomy. 197 (Pt 1): 19–60. doi:10.1046/j.1469-7580.2000.19710019.x. PMC 1468107. PMID 10999270. p. 41: "A recent reassessment of cladistic and functional evidence concluded that there are few, if any, grounds for retaining H. habilis in Homo, and recommended that the material be transferred (or, for some, returned) to Australopithecus (Wood & Collard, 1999)."
  8. 8.0 8.1 Australian Museum: http://australianmuseum.net.au/Homo-habilis.
  9. Miller J. M. A. (2000). "Craniofacial variation in Homo habilis: an analysis of the evidence for multiple species". American Journal of Physical Anthropology. 112 (1): 103–128. doi:10.1002/(SICI)1096-8644(200005)112:1<103::AID-AJPA10>3.0.CO;2-6. PMID 10766947.
  10. Tattersall, I., & Schwartz, J. H., Extinct Humans, Westview Press, New York, 2001, p. 111.
  11. F. Spoor; M. G. Leakey; P. N. Gathogo; F. H. Brown; S. C. Antón; I. McDougall; C. Kiarie; F. K. Manthi; L. N. Leakey (2007-08-09). "Implications of new early Homo fossils from Ileret, east of Lake Turkana, Kenya". Nature. 448 (7154): 688–691. doi:10.1038/nature05986. PMID 17687323.
  12. F. Spoor; M. G. Leakey; P. N. Gathogo; F. H. Brown; S. C. Antón; I. McDougall; C. Kiarie; F. K. Manthi; L. N. Leakey (2007-08-09). "Implications of new early Homo fossils from Ileret, east of Lake Turkana, Kenya". Nature. 448 (7154): 688–691. doi:10.1038/nature05986. PMID 17687323. "A partial maxilla assigned to H. habilis reliably demonstrates that this species survived until later than previously recognized, making an anagenetic relationship with H. erectus unlikely" (emphasis added).
  13. Lordkipanidze, David; Ponce de León, Marcia S.; Margvelashvili, Ann; Rak, Yoel; Rightmire, G. Philip; Vekua, Abesalom; Zollikofer, Christoph P. E. (2013-10-18). "A Complete Skull from Dmanisi, Georgia, and the Evolutionary Biology of Early Homo". Science (in ఇంగ్లీష్). 342 (6156): 326–331. Bibcode:2013Sci...342..326L. doi:10.1126/science.1238484. ISSN 0036-8075. PMID 24136960.
  14. "New Fossil May Trim Branches of Human Evolution - Science Friday". Science Friday (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-01-30.
  15. "Dmanisi Human: Skull from Georgia Implies All Early Homo Species were One | Anthropology | Sci-News.com". Breaking Science News | Sci-News.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-01-30.
  16. Brown, Graham; Fairfax, Stephanie; Sarao, Nidhi. Tree of Life Web Project: Human Evolution. Link: http://tolweb.org/treehouses/?treehouse_id=3710 Archived 2020-06-06 at the Wayback Machine.
  17. F. Spoor; P. Gunz; S. Neubauer; S. Stelzer; N. Scott; A. Kwekason; M. C. Dean (2015). "Reconstructed Homo habilis type OH 7 suggests deep-rooted species diversity in early Homo". Nature. 519 (7541): 83–86. doi:10.1038/nature14224. PMID 25739632.
  18. Body Proportions of Homo Habilis Reviewed, Martin Haeusler, Journal of Human Evolution, Vol 46, Issue 4, p 433-465, pub APR 2004
  19. Jeremy M. DeSilva (ed.), Special Issue on Australopithecus sediba, PaleoAnthropology (2018), doi:10.4207/PA.2018.ART111.
  20. Ungar, Peter (9 February 2012). "Dental Evidence for the Reconstruction of Diet in African Early Homo". Current Anthropology. 53: S318–S329. doi:10.1086/666700.
  21. Ungar, Peter; Grine, Frederick; Teaford, Mark; Zaatari, Sireen (1 January 2006). "Dental Microwear and Diets of African Early Homo". Journal of Human Evolution. 50 (1): 78–95. doi:10.1016/j.jhevol.2005.08.007. PMID 16226788.
  22. by W. Schnaubelt & N. Kieser (Atelier WILD LIFE ART); see Westfalen_in_der-Alt-und_Mittelsteinzeit, Landschaftsverband Westfalen-Lippe, Münster (2013), fig. 42.
  23. Pollard, Elizabeth (2014-12-16). Worlds Together, Worlds Apart. 500 Fifth Avenue, New York, N.Y. 10110. p. 11. ISBN 978-0-393-91847-2.{{cite book}}: CS1 maint: location (link) CS1 maint: location missing publisher (link)
  24. Hillary Mayell. "Killer Cats Hunted Human Ancestors". National Geographic News. Retrieved 2008-02-15.
  25. Urquhart, James (8 August 2007). "Finds test human origins theory". BBC News. Retrieved 27 July 2007.
  26. "Alice Roberts - Evolution The Human Story - 2011.pdf".
  27. Donald C. Johanson; Fidelis T. Masao; Gerald G. Eck; Tim D. White; Robert C. Walter; William H. Kimbel; Berhane Asfaw; Paul Manega; Prosper Ndessokia (21 May 1987). "New partial skeleton of Homo habilis from Olduvai Gorge, Tanzania". Nature. 327 (6119): 205–209. doi:10.1038/327205a0. PMID 3106831.
  28. Wood, Bernard (21 May 1987). "Who is the 'real' Homo habilis?". Nature. 327 (6119): 187–188. doi:10.1038/327187a0. PMID 3106828.
  29. "Relative Limb Strength and Locomotion in Homo habilis", Ruff, Christopher, American Journal of Physical Anthropology, 138:90–100 (2009)
  30. "Vertebrate fossils record a faunal turnover indicative of more open and probable arid habitats than those reconstructed earlier in this region, in broad agreement with hypotheses addressing the role of environmental forcing in hominin evolution at this time." DiMaggio E. N.; Campisano, C. J.; Rowan, J.; Dupont-Nivet, G.; Deino, A. L. (2015). "Late Pliocene fossiliferous sedimentary record and the environmental context of early Homo from Afar, Ethiopia". Science. 347 (6228): 1355–9. doi:10.1126/science.aaa1415. PMID 25739409.