బరంపురం

వికీపీడియా నుండి
(Brahmapur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బ్రహ్మపుర
బ్రహ్మపుర
బరంపూర్
నగరం
బరంపురం రైల్వే స్టేషన్
బరంపురం రైల్వే స్టేషన్
Nickname: 
BAM
దేశం భారతదేశం
రాష్ట్రంఒడిషా
జిల్లాగంజాం
Government
 • మేయర్శివ్ శంకర్ దాస్
Elevation
26 మీ (85 అ.)
జనాభా
 (2011)
 • Total3,55,823
 • Rank120
భాషలు
 • అధికారికఒడియా, ఆంగ్లం
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
760001 -760010
టెలిఫోన్ కోడ్0680
Vehicle registrationOR-07/ OD-07

బ్రహ్మపుర లేక బరంపూర్ ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని ఒక ప్రాచీన పట్టణం. ఈ నగరాన్ని సిల్క్ సిటీ (పట్టు నగరం) అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఒడిషా రాజధాని భువనేశ్వర్ నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

బ్రిటిష్ పాలన కాలంలో బ్రహ్మపుర మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. 1936లో బ్రహ్మపూర్ ఒడిషాలో విలీనం చేయబడింది. శ్రీకాకుళాన్ని కూడా ఒడిశాలో కలపాలని ఉద్యమాలు జరుగుతున్నా గవర్నర్ ఆ డిమాండ్‌ను సంతృప్తి పరచలేదు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని , దక్షిణ ఒడిషా ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ధి చెందాయి.

రోడ్డు

[మార్చు]

బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంది. జాతీయ రహదారి 5 (భారతదేశం) (చెన్నై– కోల్‌కతా) ,జాతీయ రహదారి -59 (గోపాల్‌పూర్– అహ్మదాబాద్) , ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉంది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.

రైలు

[మార్చు]

బరంపురం రైల్వేస్టేషను కోల్‌కతా , చెన్నై మహానగరాలను కలుపుతూ సాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్కు అనుసంధానమై ఉంది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు , పట్టణాలైన కొత్త ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగలూరు, భువనేశ్వర్, చెన్నై, కటక్, ముంబాయి, నాగ్‌పూర్, పూనా, పూరి, విశాఖపట్నం, కోల్‌కతా, రాయ్‌పుర్, సంబల్‌పుర్ లను సులభంగా చేరుకోవచ్చు.

సముద్రం

[మార్చు]

ఈ పట్టణంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. అవి అత్యంత పురాతన ఓడరేవు ఐన గోపాల్‌పూర్ , పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ద్వారా నిర్మితమైన శాటిలైట్ రేవు బాహుదా మౌత్ (ముహన్) ఈ రెండు ఓడరేవులు.

ప్రముఖులు

[మార్చు]

మూలాలు, ఆధారాలు

[మార్చు]
  • బరంపురం, జయంతి కామేశం పంతులు గురించిన సమాచారం - ఆదిభట్ల నారాయణదాసు గారి నా యెరుక పుస్తకం పేజీలు 27,28,29
  • వ్యాసమంజరి (శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి) లో సంపుటం-242,245 పేజీలు
  • ఒడిషా నుంచి వ్యాసవారధి -

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బరంపురం&oldid=4247327" నుండి వెలికితీశారు