Jump to content

కరీంనగర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°26′59″N 79°08′48″E / 18.449649°N 79.146652°E / 18.449649; 79.146652
వికీపీడియా నుండి
(Karimnagar Mandal నుండి దారిమార్పు చెందింది)
కరీంనగర్
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°26′59″N 79°08′48″E / 18.449649°N 79.146652°E / 18.449649; 79.146652
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం కరీంనగర్
గ్రామాలు 1
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 35 km² (13.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 3,63,106
 - పురుషులు 1,82,609
 - స్త్రీలు 1,80,497
అక్షరాస్యత (2011)
 - మొత్తం 76.74%
 - పురుషులు 85.81%
 - స్త్రీలు 67.27%
పిన్‌కోడ్ {{{pincode}}}

కరీంనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ప్రధాన కార్యాలయం కరీంనగర్. ఈ మండలం కరీంనగర్ లోక‌సభ నియోజకవర్గం, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఈ మండలంలో కరీంనగర్ తో కలిపి 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో రెండు నిర్జన గ్రామాలు.ఇది పూర్తిగా పట్టణ ప్రాంతంతో ఉన్న మండలం.

మండల చరిత్ర పూర్వాపరాలు

[మార్చు]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో 29 (అందులో 2 నిర్జన గ్రామాలు) రెవెన్యూ గ్రామాలుతో ఉండేది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలంలోని 14 గ్రామాలతో కరీంనగర్ గ్రామీణ మండలం, 12 గ్రామాలతో కొత్తపల్లి మండలం కొత్తగా ఏర్పడ్డాయి.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 3,63,106 - పురుషులు 1,82,609 - స్త్రీలు 1,80,497.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 35 చ.కి.మీ. కాగా, జనాభా 2,61,185. అందులో పురుషులు 1,31,817 కాగా, స్త్రీలు 1,29,368. మండలంలో 62,497 గృహాలున్నాయి.[4]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

రవాణ సదుపాయాలు

[మార్చు]

రోడ్డు మార్గం

[మార్చు]

కరీంనగర్ మండల ప్రధాన కేంద్రం నుండి రహదారి ద్వారా ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. కరీంనగర్ నగరం గుండా వెళ్ళే రాష్ట్ర రహదారులు రాష్ట్ర రహదారి 1, తెలంగాణ రాజీవ్ రహదారి హైదరాబాద్ - కరీంనగర్ - మంచిర్యాల హైవే బొగ్గు బెల్ట్ కారిడార్, రాష్ట్ర రహదారి 7, 10, 11, జాతీయ రహదారి జగిత్యాల - కరీంనగర్ - వరంగల్ - ఖమ్మంలను కలిపే హైవే 563 ఉంది.

విమాన ప్రయాణం

[మార్చు]

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డు మార్గంలో 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. జిల్లా కలెక్టరేట్ లోపల నగరంలో మూడు హెలిప్యాడ్‌లు ఉన్నాయి. కరీంనగర్‌కు సమీపంలో రామగుండం, వరంగల్ విమానాశ్రయాలు ఉన్నాయి.

రైల్వే మార్గం

[మార్చు]

కరీంనగర్ రైల్వే స్టేషన్ న్యూ డిల్లీ - చెన్నై ప్రధాన మార్గంలో పెద్దపల్లి - నిజామాబాద్ విభాగంలో ఉన్న నగరానికి రైలు అనుసంధానించబడి ఉంది.ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఉంది. కరీంనగర్ ముంబై వంటి నగరాలకు వారపు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో, హైదరాబాద్ కాచిగూడ ప్రయాణీకులతో, తిరుపతి బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో, నిజామాబాద్ రైలుతో అనుసంధానించబడి ఉంది.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కరీంనగర్
  • గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. https://www.censusindia.gov.in/2011census/dchb/2803_PART_B_DCHB_Karimnagar.pdf
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]