అంబాలిక మహాభారతంలోని పాత్ర. ఆమె విచిత్ర వీర్యుని భార్య. పాండురాజు తల్లి.
అంబాలిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబిక ఈమెకు అక్కలు. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు.
అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు.
విచిత్ర వీర్యుడు క్షయరోగంతో నిస్సంతుగా మరణించాడు. వంశవృద్ధి కోసమని అతడి తల్లి సత్యవతి తన తొలిపుత్రుడైన వ్యాసుని కోరింది.
అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించేందుకు అతడు అంగీకరించాడు.అంబాలిక వ్యాసుని చూడడంతోనే భయంతో తెల్లబారింది. ఆ కారణాన ఆమెకు, పాండురోగం కారణాన తెల్లబారిపోయిన చర్మంతో పాండురాజు పుట్టాడు.
సూచనలు క: కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు కురుకు కొన్ని తరాల తరువాతి రాజు, శంతనుడు. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
గ: విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు చ: కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు. డ: పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు.యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు,వాయుదేవుని వలన భీముడు,ఇంద్రుని వలన అర్జునుడు,కవలలైన నకులుడు, సహదేవుడు మాద్రికి అశ్వనీదేవతల వలన కలిగారు. త: దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు. న: పాండవులకు ద్రౌపది ద్వారా కలిగిన కుమారుల వివరాలు: ** యుధిష్ఠిరుడు వలన ప్రతివింధ్యుడు, భీముడు వలన శ్రుతసోముడు ,అర్జునుడు వలన శ్రుతకర్ముడు, నకులుడు వలన శతానీకుడు, సహదేవుడు వలన శ్రుతసేనుడు జన్మించారు.