అర్జునుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలి ద్వీపంలో అర్జునుని శిల్పం.

అర్జునుడు పాండవ మధ్యముడు. మహాభారత ఇతిహాసములో ఇంద్ర దేవేంద్రుడు అంశ,అంటే అవతారం అని అర్థం అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు. పాండు రాజు సంతానం. కుంతికిఇంద్రుడుకి కలిగిన సంతానం.

జననం

[మార్చు]

పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీదేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమధర్మరాజును ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; భీముడు జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు.అలాగే కుంతి మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారిమాత్రమే ఇది పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకొమ్మనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ప్రార్థంచి ఇద్దరు పిల్లలను పొందింది. ఇలా పంచపాండవుల జననం జరిగింది.

వ్యక్తిత్వం

[మార్చు]
అర్జునుడు సుభద్రల అన్యోన్యతను చిత్రించిన రాజా రవి వర్మ.

మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ,, ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని వివాహమాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన సాత్యకి అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి, మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించవలసి వచ్చింది.

విద్యార్థిగా

[మార్చు]

అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు. చిన్నపుడు అత్యుత్తమ విద్యార్థి. చిత్రాంగద, సుభద్ర భార్యలుగా కలరు.

కర్తవ్య పాలనలో

[మార్చు]
మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడు.

పాండవులు తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపది సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహాయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది, యుధిష్టురుడు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోయి నందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు. కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపటం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని పశువులను దొంగలించిన వారికోసం వెళ్ళాడు. ఆ పని పూర్తయిన వెంటనే ధర్మరాజు, ద్రౌపదితో సహా కుటుంబం మొత్తం వారిస్తున్నా ఒక సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ విధించుకున్నాడు.

అరణ్య వాసం , అజ్ఞాతవాసం

[మార్చు]

అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరించాడు. అరణ్యవాసం విదించిన ఐదవ సంవత్సరంలో హిమలయాలకు వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.

యుద్ధం

[మార్చు]
శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం

మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి,, బావయైన శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతిలో భగవద్గీత అంటారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన గ్రంథం.

యుద్ధానంతరం

[మార్చు]
అశ్వమేధ యాగ సందర్భంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు-రాజ్మానామా నుండి ఒక దృశ్యం

మహాభారత సంగ్రామానంతరం పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. గొప్ప విజయం, కౌరవులకు మద్ధతు పలికిన అనేక మంది రాజలను ఓడించడం, మొదలైన అనేక కారణాల వల్ల వారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించారు.

ఇతర పేర్లు

[మార్చు]
  1. పార్థుడు
  2. జిష్ణు
  3. కిరీటి
  4. విజయుడు
  5. కపిధ్వజుడు
  6. సవ్యసాచి
  7. బీభత్సుడు
  8. ఫల్గుణుడు
  9. ధనంజయుడు
  10. గాండీవి
  11. శ్వేతవాహనుడు
  12. గూడకేశుడు