ఉత్తరాంధ్ర
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఉత్తరాంధ్ర | |
---|---|
ప్రాంతం | |
Nickname: కళింగాంధ్ర | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | దస్త్రం:Andhraseal.pngఆంధ్ర ప్రదేశ్ |
జిల్లాలు | |
భాషలు | |
• అధికారికం | తెలుగు |
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
అతిపెద్ద నగరం | విశాఖపట్నం |
ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) అనేది ఆంధ్ర రాష్ట్రం లోని ఉత్తర భాగం. ఉమ్మడిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగా పరిగణించబడేవి.[2] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన వీటితోపాటు కొత్తగా ఏర్పడిన,పార్వతీపురం మన్యం జిల్లా ,అల్లూరి సీతారామరాజు జిల్లా ,అనకాపల్లి జిల్లా కూడా ఉత్తరాంధ్రలో భాగమే. ఈ ఆరు జిల్లాలని కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఇక్కడి భాష తెలుగు.
సంస్కృతి
[మార్చు]భాష
[మార్చు]పుణ్యక్షేత్రాలు
[మార్చు]సింహాచలం దేవస్థానం, రామతీర్ధం, పుణ్యగిరి, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, కనకమహాలక్ష్మి అమ్మవారు, పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దేవాలయం, విజయనగరం పైడితల్లి అమ్మవారు, రామతీర్థం ఆలయం ప్రసిద్ధ మైన పుణ్యక్షేత్రాలు
ఆహారపుటలవాట్లు
[మార్చు]ఈ ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తారు. దీనినే బెల్లం పప్పుగా వ్యవహరిస్తారు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.
మెంతులని ఉపయోగించి మెంతిపెట్టిన కూర, ఆవాలని ఉపయోగించి ఆవపెట్టిన కూర, నువ్వులని ఉపయోగించి నువ్వుగుండు కూర లని తయారు చేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం చేస్తారు.
పూరి, పటోలిలు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. పండగలకి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసమున్న తర్వాత బియ్యపు పిండితో చేయబడే ఉప్పిండిని సేవిస్తారు. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారుని తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసుని చేస్తారు.
ఇక్కడి ఊరగాయ తయారీలో స్వల్ప తేడాలు ఉన్నాయి.. నువ్వుల నూనెలో ఉప్పు, ఆవపిండి, కారం కలిపిన మామిడి ముక్కలని నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆ పై ఊరబెడతారు. దీని వలన బంగాళాఖాతం నుండి వచ్చే తేమ వలన ఊరగాయ చెడిపోకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ ప్రక్రియ వలన ఊరగాయ మరింత ముదురు రంగులోకి మారటమే కాకుండా ఊరగాయ రుచిలో తీపి పెరుగుతుంది.
వాతావరణం
[మార్చు]నైఋతి రుతుపవనాల వలన వర్షపాతం 1000-1100 ఎంఎం వరకు నమోదౌతుంది. అత్యధిక ఉష్ణోగ్రత 33-36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ నమోదౌతుంది. ఇక్కడి భూమి ఎర్ర రేగడి నేలలు కలిగి ఉంటుంది. వరి, వేరుశెనగ, చెరుకు, నువ్వులు, సజ్జలు ఎక్కువగా పండుతాయి.
వ్యవసాయాధారిత పరిశ్రమలు
[మార్చు]చక్కెర, జౌళి, జీడిపప్పు, పాలు/పాల ఉత్పత్తులకై ఈ ప్రాంతంలో అనేక సహకార కార్మాగారాలు గలవు.
విద్యాసంస్థలు
[మార్చు]- ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
- ఆంధ్ర వైద్య కళాశాల
- బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
- జే ఎన్ టి యు, విజయనగరం
- గీతం (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్), విశాఖపట్నం
- దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
- ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, విశాఖపట్నం
- రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, శ్రీకాకుళం
- ఐఐఎం, విశాఖపట్నం
ప్రముఖులు
[మార్చు]చలన చిత్ర రంగం
[మార్చు]నేపథ్య గాయకులు
[మార్చు]కథా రచయితలు
[మార్చు]సహాయ నటులు
[మార్చు]సంగీత దర్శకులు
[మార్చు]హాస్య నటులు
[మార్చు]గేయ రచయితలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Area of Andhra Pradesh districts
- ↑ "Uttarandhra in a State of Plenty, Penury". The New Indian Express. Archived from the original on 2016-06-03. Retrieved 2016-05-08.
వెలుపలి లంకెలు
[మార్చు]- మూలాలు లేని వ్యాసాలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- కోస్తా
- ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు