కూచిపూడి (మొవ్వ మండలం)
కూచిపూడి (మొవ్వ మండలం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°15′22.320″N 80°54′54.468″E / 16.25620000°N 80.91513000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మొవ్వ |
విస్తీర్ణం | 2.57 కి.మీ2 (0.99 చ. మై) |
జనాభా (2011) | 3,941 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (4,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,865 |
• స్త్రీలు | 2,076 |
• లింగ నిష్పత్తి | 1,113 |
• నివాసాలు | 1,087 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 521136 |
2011 జనగణన కోడ్ | 589686 |
కూచిపూడి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మొవ్వ నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1087 ఇళ్లతో, 3941 జనాభాతో 257 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1865, ఆడవారి సంఖ్య 2076. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 823 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 279. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589686[2].సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]ఈ గ్రామానికి సమీపంలో పెడసనగల్లు, అగినిపర్రు, అయ్యంకి, మొవ్వ, కృష్ణాపురం గ్రామాలు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి మొవ్వలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మొవ్వలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మచిలీపట్నంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు విజయవాడలోనూ ఉన్నాయి. శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్తు ఓరియంటల్ ఉన్నత పాఠశాల
- ఈ పాఠశాలను 30 లక్షల రూపాయల సిలికానాంధ్ర సంఘం నిధులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినారు. [8]
- ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసే విధంగా సక్సెస్ పాఠశాల గా మార్పుచేస్తున్నారు. [9]
- శ్రీమేధా పబ్లిక్ స్కూల్
- మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]కూచిపూడిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]కూచిపూడిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]కూచిపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 36 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
- బంజరు భూమి: 24 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 191 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 33 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 182 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]కూచిపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 182 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]కూచిపూడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]గ్రామ చరిత్ర
[మార్చు]ప్రఖ్యాత భారతీయ నృత్యరీతి కూచిపూడి నృత్యం పుట్టింది ఈ గ్రామంలోనే. కూచిపూడి నాట్య ఆద్యులు శ్రీ సిద్ధేంద్రయోగి, ఈ గ్రామంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజున జన్మించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో సాంప్రదాయ నాట్యకుటుంబాలకు చెందిన నాట్యాచార్యులు, మాఘ శుద్ధ ఏకాదశినాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రతి సంవత్సరం ఆ రోజున మేళతాళాలతో వేదమంత్రాలతో ఊరేగింపు నిర్వహించుచున్నారు. [11]
తెలుగు వారి ప్రత్యేకతలలో ఒకటిగా, భారతదేశంలోని శాస్త్రీయ నృత్యరీతుల్లో భాగంగా పేరొందిన కూచిపూడి నాట్యరీతికి కూచిపూడి గ్రామమే పుట్టినిల్లు. సిద్ధేంద్ర యోగి ప్రారంభించి విస్తరించిన ఈ రీతి కూచిపూడి ప్రాంతంలో శతాబ్దాల కాలాన్ని అధిగమించి ఇప్పటికీ అనూచానంగా వస్తున్న కళగా నిలిచింది. కూచిపూడి నాట్యరీతి, కూచిపూడి భాగవతుల ప్రశస్తి వంటివి 1500ల నాటికే ఉన్నట్టు మాచుపల్లి కైఫీయతు వల్ల తెలుస్తోంది. సిద్ధవటం పరిపాలకుడైన సామంతుడు సంబెట గురవరాజు చేస్తున్న అసభ్య కార్యాలు, ఘోరాలు ప్రదర్శనగా 1506-09 కాలం నాటి విజయనగర చక్రవర్తి వీర నరసింహరాయల ఎదుట ప్రదర్శించగా ఆయన నిజానిజాలు విచారించి, చేసిన ఘోరాలకు గురవరాజును పట్టి మరణశిక్ష వేసి వధించారు. ఈ విషయాన్ని వివరిస్తూన్న ఆ కైఫీయత్తు వల్ల కూచిపూడి వారికి 1500 నాటికే చాలా ప్రఖ్యాతి ఉన్నట్టు తెలుస్తోంది.[3]
కూచిపూడి నృత్య విశేషాలు
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన శ్రీ కురవి సదాశివ శాస్త్రి, విజయలక్ష్మి దంపతుల ప్రథమకుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్యప్రసాద్, ప్రస్తుతం గంపలగూడెం మండల పరిషత్తు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన వీరికి కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి " ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం" లభించింది. ఆయన ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శనకు ఈ పురస్కారం ఇచ్చారు. 3 దశాబ్దాలుగా వీరు 800 పైగా ప్రదర్శనలిచ్చారు. ఇటీవల న్యూడిల్లీలో అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి లీలాశాంసన్ నుండి వీరు ఈ పురస్కారం అందుకున్నారు. 2011వ సంవత్సరానికి సంబంధించి వీరికి ఈ పురస్కారం ఇచ్చారు. [2]
- శ్రీ చింతా సీతారామాంజనేయులు గారు (90) కూచిపూడి గ్రామంలో 1922 సెప్టెంబరు 19న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సీతమ్మ & నారాయణమూర్తి. వీరిది నాట్యాచార్యుల కుటుంబం. వీరు 1959 నుండి గుడివాడలో ఉంటున్నారు. వీరు "కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం-2013"కి ఎంపికైనారు. త్వరలో వీరు భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీగారి చేతులమీదుగా, ఈ పురస్కారం క్రింద రు. ఒక లక్ష రూపాయల నగదు మరియూ తామ్రపత్రం అందుకుంటారు. కూచిపూడి నాట్యంలో, 70 సంవత్సరాలకు పైగా నాట్యసేవలందించినందుకు వీరిని ఈ పురస్కారం వరించింది. కూచిపూడి నాట్యసంప్రదాయంలోని స్త్రీపురుషపాత్రధారణలతోపాటు, నాట్యాచార్యులుగా గూడా జాతీయస్థాయిలో అరుదైన కళాకారులుగా వీరు వినుతికెక్కారు. 90 ఏళ్ళ వయసులోనూ వీరు చిన్నారులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పించుచున్నారు. [3]
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]బ్యాంకులు
[మార్చు]సప్తిగిరి గ్రామీణ బ్యాంక్. 5.
శ్రీ సిద్ధేంద్ర యోగి ఉద్యానవనం
[మార్చు]రైతుబజార్
[మార్చు]కూచిపూడి గ్రామంలో 46.50 లక్షల రూపాయల మార్కెటింగ్‌శాఖ నిధులతో నూతనంగా నిర్మించిన రైతుబజార్‌ను, 2017,జూన్-6న ప్రారంభించారు. [14]
గ్రామ పంచాయతీ
[మార్చు]- 2001 నుండి 2006 వరకు, ఈ గ్రామ పంచాయతీకి పెనుమూడి కాశీవిశ్వనాథం సర్పంచిగా పనిచేసాడు. [5]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కందుల జయరాం, సర్పంచిగా ఎన్నికైనాడు. [6]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ గంగా బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]కూచిపూడి గ్రామంలోని ఈ ఆలయ వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి ఫాల్గుణ బహుళ విదియ వరకు జరుగును. 251వ వార్షికోత్సవం, 2014,మార్చ్-12 నుండి 18 వరకూ జరుగును. [4]
శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం
[మార్చు]కూచిపూడిలోని దుర్గానగర్‌లో వేంచేసియున్న దుర్గాదేవి ఆలయ వార్షిక ఉత్సవాలను, 2017,ఫిబ్రవరి-18వతేదీ శుక్రవారం నిర్వహించెదరు. శుక్రవారం ఉదయం విఘ్నేశ్వరపూజ, పంచామృతాభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చన, గ్రామోత్సవం అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. ఈ ఉత్సవాలను గ్రామపెద్దలు, ఈ ఆలయంలో, 60 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా నిర్వహించుచున్నారు. [13]
శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]కూచిపూడి గ్రామంలో, శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం ప్రక్కనే గల ఈ ఆలయంలో, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్యస్వామివారల వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం, మాఘ శుద్ధ పౌర్ణమికి (ఫిబ్రవరి నెలలో) కన్నులపండువగా నిర్వహించెదరు. [12]
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]గ్రామ విశేషాలు
[మార్చు]- కూచిపూడి గ్రామాన్ని, అమెరికాకు చెందిన సిలికానాంధ్ర సంస్థ దత్తత తీసుకున్నది. ఈ గ్రామంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. [6]
- ఈ గ్రామానికి చెందిన మల్లేడ రఘురాం, అను 11 సంవత్సరాల వయసుగల బాలుడు, ఐదు సంవత్సరాల క్రితం, ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఆరంభించి, కఠోరసాధన చేయుచూ, నైపుణ్యాని సాధించి, పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పతకాలు సాధించడమేగాక, కరాటేలో బ్లాక్ బెల్ట్ కైవసం చేసుకున్నాడు. [7]
- ఈ గ్రామంలోని ఇటుకరాళ్ళతో కట్టిన బావిని, 1883 లో వేదాంతం కుటుంబీకులు త్రవ్వించారు. ఆ రోజులలో శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారి శ్రీచక్ర స్నాన ఘట్టాన్ని ఇక్కడే నిర్వహించేవారు. 1946లో ఈ బావిని శ్రీ వేదాంతం మల్లుభట్టు పునరుద్ధరించారు. తాజాగా, శ్రీ కూచిభొట్ల ఆనంద్, ఈ బావిని పునరుద్ధరించడానికి నిర్ణయించారు. [9]
- ఈ గ్రామంలోని ఇందిరానగర్ కు చెందిన చర్మకారుడు శ్రీ కొమ్మమూరి వందనం కుమారుడు జయకర్, యు.జి.సి.ప్రకటించే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషికి ఎంపికైనాడు. ఇతనికి రెండు సంవత్సరాలపాటు ప్రతి నెలా 25,000 రూపాయలు అందుతుంది. [10]
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3615. ఇందులో పురుషుల సంఖ్య 1766, స్త్రీల సంఖ్య 1849, గ్రామంలో నివాసగృహాలు 1010 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 257 హెక్టారులు.
మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
వెలుపలి లింకులు
[మార్చు][2] ఈనాడు కృష్ణా, 2013,అక్టోబరు-23; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా, 2013,నవంబరు-24; 1&16 పేజీలు. [4] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-7; 6వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-12; 11వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-30; 11వపేజీ [7] ఈనాడు అమరావతి; 2015,మే-28; 38వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,జూన్-16; 38వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,జులై-19; 28వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2016,జనవరి-14; 24వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-19; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-22; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-17; 2వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2017,జూన్-7; 15వపేజీ.