కోసూరు
కోసూరు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°12′25.380″N 80°58′7.572″E / 16.20705000°N 80.96877000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మొవ్వ |
విస్తీర్ణం | 12.81 కి.మీ2 (4.95 చ. మై) |
జనాభా (2011) | 5,099 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,577 |
• స్త్రీలు | 2,522 |
• లింగ నిష్పత్తి | 979 |
• నివాసాలు | 1,563 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 521150 |
2011 జనగణన కోడ్ | 589691 |
కోసూరు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన మొవ్వ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1563 ఇళ్లతో, 5099 జనాభాతో 1281 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2577, ఆడవారి సంఖ్య 2522. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1236 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 72. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589691[2].సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]ఈ గ్రామానికి సమీపంలో చిలకలపూడి, కాజ, చిట్టూరు, ఘంటసాల, ఘంటసాలపాలెం గ్రామాలు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి మొవ్వలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మొవ్వలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మచిలీపట్నంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు విజయవాడలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]కోసూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]కోసూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]కోసూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 188 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 14 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 15 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1 హెక్టార్లు
- బంజరు భూమి: 27 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1031 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 47 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1013 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]కోసూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.గోపాలం చెరువు.
- కాలువలు: 1013 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]కోసూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మౌలిక వసతులు
[మార్చు]శాఖా గ్రాంధాలయం
[మార్చు]ఈ గ్రామంలో స్వాతంత్ర్యం రాకముందే ఈ గ్రంథాలయాన్ని ఒక పూరిగుడిసెలో నడిపేవారు. అనంతరం 1955లో గ్రామస్థులు గ్రంథాలయం కొరకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకున్నారు. దీనిని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పగించారు. అనంతరం కాలక్రమేణా ఈ భవనం శిథిలమవడంతో రు. 10 లక్షల వ్యయంతో ఒక నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు పూర్తి చేసారు. ఈ నూతన భవనాన్ని 2016, మార్చ్-13న ప్రారంభించెదరు. [6]&[9]
శుద్ధజల కేంద్రం
[మార్చు]ఈ గ్రామంలో విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజలకేంద్రాన్ని, 2017, ఆగస్టు-12న ప్రారంభించారు. [11]
బ్యాంకులు
[మార్చు]ఇండియన్ బ్యాంక్.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో చిందా వీరవెంకటనాగేశ్వరరాజు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా తాతా అంజయ్య ఎన్నికైనాడు. [7]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ రుక్మిఈ సత్యభామా సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. [4]
శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం
[మార్చు]ఈ ఆలయ పంచమ వార్షికోత్సవాలు, 2014, మార్చ్-6, గురువారం నుండి 10వ తేదీ సోమవారం వరకూ, 5 రోజులపాటు, వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజు, 10వ తేదీ, సొమవారం నాడు మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.తొలుత విశేషహోమం, చండీహోమం, గోపూజ, హోమరక్షధారణ, వేద ఆశీర్వచనం, మంగళహారతి నిర్వహించారు. [2]
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు
[మార్చు]మేకా నరసయ్య
[మార్చు]ఈ గ్రామంలో మేకా నరసయ్య (97) స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతని భార్య శాయమ్మ (92). నరసయ్య 1917 సెప్టెంబరులో ఈ గ్రామంలో ఒక రాజకీయ కుటుంబంలో జన్మించారు. 1929 లో మహాత్మా గాంధీ ఖద్దరు ఉద్యమంలో భాగంగా, మొవ్వ మండలంలోని నిడుమోలు, అవురుపూడి, చినముత్తేవి, కూచిపూడి, పెదపూడి, మొవ్వ, కొడాలి గ్రామాల మీదుగా ఘంటసాల గ్రామానికి వచ్చినపుడు, ఇతను తొలిసారిగా గాంధీజీని ఘంటసాలలో కలుసుకున్నారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటరులో, 1930 లో తోట నరసింహనాయుడు కాంగ్రెస్ జండా ఎగురవేసిన సమయంలో ఇతను అక్కడ ఉన్నాడు. 1934లో అస్పృస్యతా నివారణలో భాగంగా నిర్వహించిన ఉద్యమంలో మహాత్మా గాంధీజీని మచిలీపట్నంలో రెండవసారి కలుసుకున్నాడు. బందరు సమీపంలోని చిన్నాపురంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో ఆయన చింతల వెంకటరామయ్యతో కలిసి పాల్గొన్నారు. గొట్టిపాటి బ్రహ్మయ్య శాసనసభ్యునిగా చల్లపల్లి రాజాపై పోటీ చేయగా, ఆ ప్రచారంలో భాగంగా సరోజినీ నాయుడు మొవ్వ గ్రామానికి విచ్చేసినప్పుడు, ఇతను గూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. ఇతని భార్య శాయమ్మ, 12 సంవత్సరాల వయసు నుండి రాట్నంపై నూలు వడికింది. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది. ఈ దంపతులిరువురూ, ఇప్పటివరకు ప్రతి ఎన్నికలలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వీరిని 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, 15-8-2015న కృష్ణా జిల్లా కలెక్టరు ఏ. బాబు చేతులమీదుగా సన్మానించాడు.[3]&[5] ఇతను 99 సంవత్సరాల వయసులో, 2016, జనవరి-24న అనారోగ్యంతో కన్నుమూసారు. [8]
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5625. ఇందులో పురుషుల సంఖ్య 2809, స్త్రీల సంఖ్య 2816, గ్రామంలో నివాసగృహాలు 1579 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1281 హెక్టారులు.
మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లింకులు
[మార్చు][2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మార్చ్-11; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-14; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మే-6; 38వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-16; 27వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-3; 24వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016, జనవరి-27; 41వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మార్చ్-5; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, జూలై-3; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఆగస్టు-13; 2వపేజీ.