Jump to content

నరసింహ రాజు

వికీపీడియా నుండి
నరసింహ రాజు
జననం
వేటుకూరి నరసింహరాజు

(1951-12-26) 1951 డిసెంబరు 26 (వయసు 72)
విద్యపీయూసీ
వృత్తినటుడు
పిల్లలుజగదాంబ (కూతురు)

నరసింహ రాజు ఒక ప్రముఖ తెలుగు నటుడు.[1] 1970 వ దశకంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. 1978 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆంధ్రా కమల్ హాసన్ గా పేరు పొందాడు.[1] సుమారు 110 చిత్రాల్లో నటించాడు. అందులో 90 సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.[2] పలు టీవీ ధారావాహికల్లో కూడా నటించాడు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

నరసింహ రాజు డిసెంబరు 26, 1951 న పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో జన్మించాడు. అప్పట్లో ఆయన తండ్రి గారిది కలిగిన కుటుంబమే. కానీ దానగుణంతో చాలావరకు ఆస్తులు పోగుట్టుకున్నది ఆ కుటుంబం. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి కలిగింది. పీయూసీ అయిన తర్వాత ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయాడు. మళ్లీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చెన్నైకి తిరిగి వచ్చి అవకాశాలు దొరకబుచ్చుకున్నాడు.[2]

ఈయనకు ఒక కూతురు జగదాంబ. ఒక కొడుకు. కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తుంది. కొడుకు కెనడాలో బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ లో మేనేజరుగా పనిచేస్తున్నాడు.

సినిమా కెరీర్

[మార్చు]

నరసింహ రాజు 1974 లో విడుదలైన నీడలేని ఆడది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో కథానాయికగా నటించిన ప్రభ కు కూడా అది మొదటి సినిమానే. ఇది వందరోజులు ఆడి మంచి విజయం సాధించింది. కానీ ఒక ఏడాది పాటూ అవకాశాలు రాలేదు. మళ్లీ అదే నిర్మాతలే అమ్మాయిలూ జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత దాసరి నారాయణ రావు తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చాడు. మరి కొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. 1970 వ దశకం రెండో అర్ధ భాగంలో సుమారు 20 సినిమాల్లో నటించాడు. 1978లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి ముందుగానే కొన్ని సినిమాల్లో నటించిన ఉన్న నరసింహరాజు విఠలాచార్య దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణకు వెళ్ళి అవకాశం కోసం అడగగా ఆయన జగన్మోహిని చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పాడు. కథానాయకుడి ఎంపికకు చాలా మందిని అనుకున్నా చివరకు ఈయనకు ఆ అవకాశం దక్కింది. 1993 నుంచి చిత్ర రంగానికి దూరమై టీవీ సీరియళ్ళపై మొగ్గు చూపించాడు.[2] ఎండమావులు, పంజరం, సుందరకాండ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సీరియళ్ళు.

అత్తవారిల్లు

సినిమాల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "తెలుగు సినీ నటుడు నరసింహ రాజు". nettv4u.com. Archived from the original on 27 July 2017. Retrieved 17 September 2016.
  2. 2.0 2.1 2.2 "వెండితెర కన్నా బుల్లితెర మిన్న". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 23 September 2016.
  3. "ఆ హీరోలిద్దరూ నాకు ఎలాంటి ద్రోహం చేయలేదు!". eenadu.net. ఈనాడు. 10 April 2018. Archived from the original on 10 April 2018. Retrieved 10 April 2018.