ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ru:Удьйогапарва
పంక్తి 116: పంక్తి 116:




{{మహాభారతం}}[[en:Udyoga Parva]]
{{మహాభారతం}}
[[en:Udyoga Parva]]
[[ru:Удьйогапарва]]

20:36, 7 అక్టోబరు 2010 నాటి కూర్పు

గమనిక : ఈ వ్యాసం రెండు భాగాలుగా ఉన్నది. రెండవ భాగం కొఱకు ఉద్యోగ పర్వము-2 చూడండి.


ఉద్యోగ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కధాంశం. సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి. సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాఘం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశాడు.


ప్రధమాశ్వాసం

ఉత్తరాభిమన్యుల వివాహం గడిచినాలుగు రోజుల తరవాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్టి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి " పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందంరికి తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిణి అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింపచేయాలి. పాడవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయయాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జ్యూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు శకుని,దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు షాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం వారి బలపరాక్రమాలను ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుఖషినాపురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము " అన్నాడు. అప్పుడు బలరాముడు లేచి " తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఊచితం. ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. సుయోధనుని అతిశయానికి లోబడి ధమనందనుడు సౌమ్యం ప్రదర్శించి రాజ్యాన్ని కోల్పోయాడు. సుయోధనునికి జూదవిద్యలో ప్రావీణ్యం లేదు కనుక శ్డకునిని నియమించాడు. అతని ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరం చేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు కనుక దూత వినయంతో కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి " అన్నాడు.

సాత్యకి ఆవేశం

బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి " బలరామా! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. అయినా నిన్నని ఏమి లాభం. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి.ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని జూదానికి పిలిచి కపట జూదం ఆడి అతడి రాజ్యలక్షిమి అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించ లేదా? ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు లేకున్న యాచనతో పని లేదు పాండవులు యుద్ధంలో వారిరాజ్యాన్ని పొందగలరు. భీమార్జునలను ఎదిరించి నిలవగలవారు లేరు. సుయోధనుడు సోదరసమేతంగా వారి చేతిలో హతుడగుట నిక్కము. నేను వారితో ఉండగా యుద్ధభూమిలో నిలువగలవాడెవడు. విరాటుని పరాక్రం తక్జ్కువా? పాచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి యాచన వలదు " అన్నాడు.

దృపదుడు తనా అభిప్రాయం వెలిబుచ్చుట

సాత్యకి మాటలను ప్రోత్సహిస్తూ ద్రుపదుడు లేచి " సాత్యకి చెప్పింది సమయోచితంగా ఉంది. బలరాముని మాటలుంగీకరించడం వీలుకాదు. సుయోధనుడు మంచి మాటలతో వినకుంటే యుద్ధ్మే శరణ్యం. భీష్మ, ద్రోణాదులు సుయోధనుని ఆశ్రయంలో ఉన్నారు కనుక వారు అతనికి సహాయంగా ఉంటారు. అశ్వథ్థామకు సుయోధనుడంటే అభిమానం మెండు కనుక అతడు సుయోధనుని వైపు యుద్ధం చేస్తాడు. పుత్రప్రేమను జయించలేని ద్రోణుడూ సుయోధనుని వీడడు. కృపాచార్యుని బంధుత్వం అతడిని సుయోధనుని వైపు కట్టుబడేలా చేస్తుంది. దృతరాష్ట్రునికి పుత్రుడంటే విపరీతమైన ప్రేమ కనుక అతడు సుయోధనుని అకృత్యాలను ఖండించి రాజ్యభాగాన్ని పాండవులకు ఇప్పించలేడు. శకుని మేనల్లుని అకృత్యాలను పెంచి పోషిస్తాడు, కర్ణుడు యుద్ధోన్మాది అతడు సుయోధనుని యుద్ధానికే ప్రోత్సహిస్తాడు దుశ్శాసనాది సోదరులు అన్నఆజ్ఞ మీరరు కనుక సుయోధనుడు సంధికి అనుకూలంగా స్పందించడు. యుద్ధం అనివార్యం సుయోధనుడు ఇప్పటికే ఆప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. రాజులు ముందుగా అడిగిన వారికే సహాయపడతారు కనుక మనము రాజుల సహాయాన్ని ముందుగా కోరడం మంచిది. వెంటనే మనం మన మిత్ర రాజులైన కేకయరాజు, జరాసంధుని కుమారుడు, దుష్టకేతు మొదలైన వారికి సమాచారం అందించి సహాయం కోరడం తక్షణ కర్తవ్యం " అని చెప్పాడు దృపదుడు ఆపై తన పక్కనే ఉన్న బ్రాహ్మణుని చూపి " ఇతడు నాకు అగ్ర పురోహితుడు. ఇతడు చతురసంభాషణలో ఘటికుడు. ఇతడు భీష్మ, ద్రోణ, దృతరాష్ట్రాదులతో యుక్తంగా మాటాడగలడు. ఇతడి అన్ని విషయములు చెప్పి మన దూతగా దృతరాష్ట్రుని వద్దకు పంపుతాము " అన్నాడు.

దృపదుడు దూతను పంపుట

శ్రీకృష్ణుడు దృపదునితో " ధర్మజా! మీరు దృపదుడు చెప్పిన మాట జరిగేలా చెయ్యండి. పెళ్ళికి వచ్చిన వారము ఎక్కువరోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు మేము వెళతాము " అని దృపదుని చూసి " మీరు అందరికి గురు స్థానంలో ఉన్నారు. మీ మాట అంటే దృతరాష్ట్రునికి మన్నన, భీష్ముడు మిమ్ము ఆదరిస్తాడు, ద్రోణ, కృపులతో మీకు స్నేహం ఉంది. కనుక పాండవుల తరఫున దూతను పంపు భాద్యత మీదే. మీ మాట మేము అంతా ఆదరిస్తాము. మీరు కోరినట్లు సుయోధనుడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు. మీరంతా మీమీ నగరాలకు వెళ్ళి యుద్ధ సన్నాహాలు చెయ్యండి " అని శ్రీకృష్ణుడు తన వారితో ద్వారకకు వెళ్ళాడు. పాండవులు , దృపదుడు, విరాటుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాలు చారుల ద్వారా తెలుసుకుని దుర్యోధనుడు తాను కూడా యుద్ధ సన్నాహాలు చెయ్యడం మొదలు పెట్టాడు. పాండవుల తరఫున దూతగా వెళ్ళు బ్రాహ్మణుని పిలిచి దృపదుడు " విప్రోత్తమా! నీవు మాకు హితుడవు, బుద్ధి కుశలత కలవాడవు, చరురభాషణలో నేర్పరివి, సమయస్పూర్తి కలవాడవు, ఉన్నతకుల సంజాతుడవు మాకు సన్నిహితుడవు కనుక నిన్ను దూతగా పంపుతున్నాను. ధర్మరాజు ధర్మాత్ముడు దుర్యోధనుడు కుటిలుడు. నీవి దృతరాష్ట్రునితో మాట్లాడి పాండవుల రాజ్యం ఇమ్మని అర్ధించాలి. పాందవులు అడవులలో పడిన కష్టాలు చెప్పి అక్కడి వారిని ఒప్పించాలి. శ్రీకృష్ణాదులు పలికిన పలుకులు సమయోచితంగా తెలియజేయాలి. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల మనసెరిగి మాట్లాడాలి. దైవకృప వలన సుయోధనుడు అంగీకరిస్తే అందరికీ క్షేమమే. విప్రుడు అందరి వద్ద శలవు తీసుకుని హస్థినకు వెళ్ళాడు.

సహాయార్ధియై దుర్యోధనుడు ద్వారకకేగుట

హస్థినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దూర్యోధనుడు మనసు మార్చుకుని తనే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆసమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంపై కూద్చున్నాడు. తరవాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునిని వైపు చూసి తరవాత దుర్యోధనుని చూసాడు. ఇద్దరినీ తగురీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. సుయోధనుడు ముందుగా " కృష్ణా! పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే పైగా నేను ముందు వచ్చాను ముందుగా వచ్చిన వారిని ఆదరించడం లోక నీతి కనుక నాకు నీ సహాయాన్ని అందించ కోరుతున్నాను. అందుకు శ్రీకృష్ణుడు " సుయోధనా నీవు ముందు ఏతెంచిన మాట వాస్తవం. కాని నేను ముందుగా అర్జునిని చూసాను కనుక మీ ఇద్దరికి సహాయాన్నందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన " నారాయణ " నామంగల పదివేల మంది యుద్ధవిద్యానిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక వైపు ఉంటాను అయితే నేను మాత్రం యుద్ధం చేయను. ఆయుధం పట్టను కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోడి. అర్జునుడు చిన్నవాడు కనుక అత్సడు ముందు కోరుకోవడం ధర్మం " అన్నాడు. వెంటనే అర్జునుడు " నాకు శ్రీకృష్ణుడు కావాలి " అన్నాడు. సుయోధనుడు మనసులో సంతోషించి పది వేల సైన్యం తీసుకుని బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. బలరాముడు " సుయోధనా! అభిమన్యుని వివాహసమయంలో నేను నిన్ను సమర్ధించాను. అందుకు కొందరు వ్యతిరేకించారు. నాకు కృష్ణుడంటే అభిమానం. అందుకని అప్పుడే నేను ఏమి అనలేక పోయాను. కనుక నేను ఎవరి పక్షం వహించను ఊరక ఉంటాను " అన్నాడు. సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్ధించాడు. కృతవర్మ ఒక అక్షౌహిణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకుని సుయోధనుడు హస్థినకు తిరిగి వెళ్ళాడు.

అర్జునుని అంతర్యం

శ్రీకృష్ణుడు " అర్జునా! అదేమిటి నన్ను కోరుకున్నావు. ఆయుధము పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకు మేలు ఏమిటి " అన్న్నాడు. అర్జునుడు " కృష్ణా నిన్ను యుద్ధంలో గెలువగల మొనగాడెవడు. నిన్ను ఎదిరించి నేను గెలువగలనా? పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది కను7క నీ తోడ్పాటు చాలు. దానితో నేను యుద్ధం చేసి రాజ్యం హస్థగతం చేసుకుని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నీవు గెలిచిన రాజ్యానికి ధర్మజుని రాజుని చేయడం ధర్మమా? నీవు మాకు పక్క బలంగా ఉంటే చాలు. నా చిరకాల వాంఛ అయిన నీ సార్ధ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదేచాలు " అన్నాడు. శ్రీ కృష్ణుడు " అర్జునా! నీ కోరిక తప్పక తీరుతుంది. నీకు సారధ్యం వహించి విజయలక్ష్మిని నీకు స్వంతం చేస్తాను. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాము పద " అని అర్జునినితో ఉపప్లావ్యం చేరాడు.

శల్యుడు సుయోధనునికి సాయం అందించుట

ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వెళ్ళి పాండవులకు సైన్య సహాయం చేయమని ధర్మజుని కోరిక వెలిబుచ్చారు. శల్యుడు ఆనందంగా సైన్య సమేతుడై ఉపప్లావ్యం చేరాడు. చారుల ద్వారా విషయం గ్రహించిన సుయోధనుడు శల్యుడు వచ్చు మార్గంలో తన మనుషుల ద్వారా వారి సైన్యానికి సకల మర్యాదలు, సౌకర్యాలు సమకూరేలా చేసాడు. విందులూ , వినోదాలు ఏర్పాటు చేసి రాజమర్యాదలు చేసాడు. ఇవి చూసిన శల్యుడు " ఈ మర్యాదలు చేస్తున్న వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లను చేసిన ధర్మరాజు అమాత్యులను పిలిపించండి " అన్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు వెళ్ళి అవన్నీ తాను చేసినట్లు చెప్పాడు. శల్యుడు సంతోషించి " నీకు ఏమి కావాలో కోరుకో " అన్నాడు. అందుకు సుయోధనుడు " ఆర్యా ! నీకు మేము పాండవులు ఒకటే కదా ! కనుక నన్ను కూడా వారితో సమానంగా ఆదరించండి " అని అడిగాడు. శల్యుడు " సుయోధనా! నీవు చెప్పినది నిజం. నాకు మీ ఇరువురి నడుమ భేదం లేదు.నీకు ఏమి కావాలో కోరుకో " అన్నాడు. సుయోధనుడు " నీ సహాయ సహకారలందించడం కంటే కావలసినది ఏముంది " అన్నాడు. శల్యుడు అందుకు సమ్మతించాడు. ఆ తరవాత శల్యుడు నేను ధర్మరాజు వద్దకు వెడుతున్నాను. అతనిని దర్శించిన తరవాత నీ దగ్గరకు వస్తాను " అన్నాడు. సుయోధనుడు " అలాగే వెళ్ళండి కాని నాకిచ్చిన మాట మరవ వద్దు " అన్నాడు. శల్యుడు అందుకు అంగీకరించి ధర్మరాజు చూడటానికి ఉపప్లావ్యం చేరాడు. ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు ఈతర బంధు మిత్రులతో శల్యునికి సాదర స్వాగతం పలికాడు. శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకుని " ధర్మరాజా! కష్టసాధ్యమైన అరణ్యవాసాన్ని, అంతకటే కష్టమైన అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసారు. మీరు నమ్ముకున్న సత్యనిష్ట్హా, ధర్మ నిష్ఠకు నిలబడ్డారు " అని శ్లాఘించి సుయోధనునికి ఇచ్చిన వరాన్ని వివరించాడు. ధర్మరాజు " మీరు సుయోధనునికి ఇచ్చిన వరం మంచిదే. కాని దానిని నెరవేర్చండి. అలాగే నా కోరిక నెరవేర్చండి. రాబోవు యుద్ధంలో అర్జునునకు శ్రీకృష్ణుడు సారధ్యం వహిస్తున్నాడు. సుయోధనుని పక్షంలో మీకంటే సారధ్యంలో నేర్పరి లేడు. కర్ణుడు అర్జునుని మీద పగద్వేషంతో రగిలి పోతుంటాడు. కనుక కర్ణునికి మిమ్మల్ని సారధ్యం చేయమంటే ఆ బాధ్యత తీసుకుని కర్ణుని మనసులో అనుక్షణం కలత కలిగిస్తూ అవసర సమయంలో సహాయ నిరాకరణ చేసి అర్జునిని కాపాడండి.ఐది అకృత్యం అని తలపక నా కోరిక మన్నించండి " అని కోరాడు. శల్యుడు ధర్మరాజు అంతర్యం గ్రహించాడు " ధర్మనందనా! సుయోధనుడు కోరితే కర్ణునికి సారధ్యం వహించి నీ కోరిక నెరవేరుస్తాను. కర్ణుని వంటి దుర్మార్గునికి కర్ణకఠోరమైన నా మాటలతో కలత కలిగించి అర్జునిని చేతిలో ఓడిపోయేలా చేస్తాను " అన్నాడు. " ధర్మజా! ఇదే కాదు నీవు ఇంకేమి కోరినా చేస్తాను. మీకు జరిగిన అవమానం అడవులలో మీరు పడిన కష్టాలు మరవడం ఎవరి తరం? నువ్వే కాదు ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా ఇలాగే అనుభవించాడు. విధి రాతను తప్పించడం పరమ శివునకు కూడా సాధ్యం కాదు కదా? " అన్నాడు.

ఇంద్రుడు పదవీచ్యుడై తిరిగి పట్టాభిషిక్తుడగుట

శల్యుని మాటలు విన్న ధర్మరాజు " మహానుభావా! ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాలపాలయ్యారు. కొంచం వివరించండి " అన్నాడు. శల్యుడు ఇలా చెప్పసాగాడు. దేవతలలో త్వష్ట అనే వాడు ఉన్నాడు. అతడు ఊత్తముడు. అతడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లోగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విష్యం ఒక సంవత్సరం రహస్యంగా దాచాడు. తరవాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.

వృత్తాసుర వధ

ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు ఇంద్రుని చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేసాడు. అధిక బల సంపన్నుడైన వృత్తుడు ఇంద్రుని జయించి అతనిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకుపక్రమించి గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మంధర పర్వత శిఖరానికి చేరి వృత్తుని చంపే ఉపాయంకోసం ఆలోచించారు. అందరూ మహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంతమయ్యేలా చేస్తాను " అన్నాడు. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి " ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. వృత్తుడు అందుకు అంగీకరిస్తూ " బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను " అన్నాడు. వృత్తుడు మత్రి చేసుకున్నా ఇంద్రుడు మాత్రం వృత్తుని సంహరించే మార్గం అనేషిస్తూ ఉన్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తుని అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తనవజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆనురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు.

నహుషుడు

ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషాధచలంలో తలదాచుకున్నాడు.దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడి కోసం అన్వేషిస్తూ భూలోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కుర్చోమని అర్ధించారు. నహుషుడు మాత్రం అందుకు అంగీకరించ లేదు ఇంద్ర పదవి అధిష్టించేంత సామర్ధ్యం తనకు లేదన్నాడు. యముడు, అగ్ని, వరూణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషూడు దానితో అధిక బలసంపన్నుడైనాడు. నహుషూడు ఇంద్రపదిని అధిష్టించి ధర్మ పరుడై సమస్త లోకాలను పాలిస్తున్నాడు. కిన్నెరలూ, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విధ్యాధరులు, గంధర్వులు, గరుడులూ సమస్త దేవతల నుండి తేజో భాగములు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు, తుంబురు నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు, రంభ, మేన్క, తిలోత్తమా, ఊర్వశి మొదలైన అప్సరసలు నాట్యంతో వినోదం కలిగిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్క్క సారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగిచూసింది.

నహుషుడు శచీదేవిని కోరుట

నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. అతడు దేవతలను పిలిచి " నేను స్వర్గాధిపతిని అందరూ నన్ను చూడటానికి వచ్చారు. కాని శచీ దేవి మాత్రం నా వద్దకు రాలేదు. వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి " అని ఆజ్ఞాపించాడు. అది విని శచీదేవి భయపడి దేవ గురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి " అమ్మా! శచీదేవి ఊరడిల్లుము. నీభర్త తిరిగి రాగలడు. నేను నిన్ను కాపాడతాను " అన్నాడు. ఇది తెలిసిన నహుషుడు " నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా? " అని ఆగ్రహించగా దేవతలు " దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీలను కోరుట తగదు " అని నచ్చ చెప్పారు. అందుకు నహుషుడు నవ్వి " ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్ప లేదు? మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకు రండి " అన్నాడు. దేవతలు మునులతో బృహస్పతి వద్దకు పోయి " గురుదేవా! ఇంద్రపదవిలో ఉన్న నహుషుడు శచీదేవిని కోరడానికి అర్హుడు. కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి " అని ప్రార్ధించారు. బృహస్పతి నవ్వి " నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోక హితమా? ఇంతటి మహా కార్యాన్ని ఆచరించ వలసినదే కాని శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు కనుక నేను ఆమెను పంపను " అన్నాడు. మునులు " అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి " అని అర్ధించారు. బృహస్పతి " ఒక పని చేద్దాము శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి కొంత సమయం అడుగుతుంది. ఆ తరవాత జరగ వలసినది ఆలోచిస్తాము " అన్నాడు. బృహస్పతి ఆదేశానుసారం శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది " నేను ఇంద్ర పత్నిని ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలియలేదు. నా మనసు శంకిస్తుంది ఏవిషయం తెలియకుండా తొందరపడకూడదు. నాకు కోత సమయం కావాలి " అన్నది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూత్రిని కలుసుకుని ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు.

శచీదేవి ఇంద్రుని వద్దకు పోవుట

విష్ణుమూర్తి " ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించండి అతని పాపం పోతుంది " అన్నాడు. మునులు అలాగే ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించారు. ఇంద్రుని పాపం పరిహారం కాగానే అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవ్వరికీ చెప్పకనే వెళ్ళి పోయాడు. ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలత పడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెను సాక్షార్కరింప చేసుకుంది. ఉపశ్రుతి " అమ్మా శచీదేవి! నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నీవు నా వెంట వచ్చిన ఎడల నీ భర్తను చూడగలవు " అని ఉపశ్రుతి శచీదేవిని హమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఉన్న సరోవరంలో ప్రవేశించారు. ఆ తరువాత ఒక తామరపుష్ప కాడలో ప్రవేసించారు. అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుని చూపి ఉపశ్రుతి " అమ్మా! నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు " అని చెప్పి ఉపశ్రుతి అదృశ్యమైంది. ఇంద్రుడు ఆశ్చర్యపడి " నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు " అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినది అంతా చెప్పి " నాధా! నీవు నహుషుని చంపి నన్ను రక్షించాలి " అని వేడుకుంది. ఇంద్రుడు " దేవీ ! నహుషుడు ఇప్పుడు నా కంటే బలవంతుడు. దేవతలు ఋషులు అతనికి తమ శక్తులు ప్రసాదించారు. కనుక అతను అజేయుడు. శత్రు శక్తి సంపన్నుడై ఉన్నప్పుడు వేచి ఉండటం రాజ నీతి. అతనికి నీ మీద మోహం కలిగింది మనం దానిని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి " నీవు నన్నుపొందాలంటే సప్తఋషి వాహనంపై రమ్మని చెప్పు దానితో అతని పుణ్యం క్షీణించి పతనం కాక తప్పదు.ఆ పై నేను అతనిని జయించడం సులువు " అన్నాడు. అందుకు అంగీకారం చెప్పి శచీదేవి అమరావతికి తిరిగి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు.శచీదేవి " మహేంద్రా! నేను పెట్టిన గడువు ఇంకా మిగిలి ఉంది. ఆ గడువు తీరగానే నీవు సప్తఋషి వాహనం మీద వస్తే నేను నిన్ను వరించగలను " అని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు మరచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగారు. శచీదేవి " బృహస్పతి వద్దకు పోయి నన్ను నా నాధుని రక్షించండి " అని అడిగింది. బృహస్పతి " శచీదేవీ! చింతించ పని లేదు నహుషుడు ఋషి వాహనంతో శక్తిని కోల్పోతాడు " అన్నాడు.

బృహస్పతి ఇంద్రుని వెతికించుట

బృహస్పతి అగ్ని దేవుని పిలిచి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్ని ఒక స్త్రీ రూపం ధరించి మనోవేగంతో అంతా వెతికి చూసాడు. అష్ట దిక్కులు, భూమి , అంతరిక్షం, కొండలు అడవులు ఎక్కడ వెతికినా ఇంద్రుని జాడ తెలియ లేదు. అగిని " దేవగురూ! నాకు సాధ్యమైనంత వెతికాను ఎక్కడా కనిపించ లేదు.సృష్టి క్రమంలో నీటి నుండి అగ్ని బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాళ్ళ నుండి లోహములు పుట్టాయి. ఆ విధంగా పుట్టిన వాటికి తమ ప్రతాపం ఎక్కడ చెల్లినా తమ జన్మ స్థానంలో చెల్లదు. కనుక నాకు జలప్రవేశం నిషిద్ధం కనుక అక్కడ నేను వెతకలేను " అన్నాడు. బృహస్పతి " అగ్ని దేవా! నీకు సకల చరాచరములలో ప్రవేశం కలదు. నీవు చేరజాలని ప్రదేశం లేదు. నీకు నేను నీటిలో ప్రవేశించే అర్హత కలిగిస్తాను. అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు " అన్నాడు. ఆ తరవాత అగ్ని జలరాశులలో కూడా వెతికి తామర తూడులో ఉన్న ఇంద్రుని కనుగొన్నాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతనితో " ఇంద్రా! నీ తప్పు ఏమీ లేదు. వృత్తాసురుని వధ ఎలా పాపం ఔతుంది. నీ తప్పు లేకనే నువ్వు పదవి త్యజించావు. మార్గాంతరం లేక నహుషునికి పదవి ట్టి పెడితే అతడు దేవతలు ఇచ్చిన శక్తితో బలగర్వితుడై ప్రవర్తిస్తున్నాడు. తనను మోయడానికి ముని పల్లకి ఉపయోగించి తన శక్తి క్షీణింప చేసుకున్నాడు కనుక ఇది అతనిని జయించడానికి తగిన సమయం. నీవు వచ్చిన సమయంలో నహుషుడు బలవంతుడు కాని ఇప్పుడు అతడు శక్తి హీనుడు. అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నీవు ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడవు కనుక నీవు వచ్చి నహుషుని జయించి నీ పదవిని తిరిగి స్వీకరించు " అన్నాడు. అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుని వద్దకు వచ్చారు. అందరూ నహుషుని జయించే ఉపాయం గురించి ఆలోచిస్తున్న సమయంలో అగస్త్యుడు అక్కడకు వచ్చి " ఇంద్రా నహుషుడు పదవీ బ్రష్టుడు అయ్యాడు. ఇక నీవి నీ సింహాసనం అధిష్టించ వచ్చు " అన్నాడు.

నహుషుడు పదవీ భ్రష్టుడు అగుట

ఇంద్రుడు అగస్త్యునకు నమస్కరించి నహుషుడు ఎలా పదవీచ్యుతుడైనాడు చెప్పని అడిగాడు. అగస్త్య్డుడు " మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయసంలో ఒకనాడు నహుషుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్టి జరుపుతున్న సమయంలో ఋషులు ఇలా అడిగాడు " గోసంప్రోక్షణమందు బ్రాహ్మణమములయిన మంత్రములు చెప్పబడినవి అవి నీకు ప్రమాణ భూతములా " అని అడిగారు. అందుకు నహుషుడు " గర్వంతో అవి నాకు ప్రమాఆణమలు కావు " అన్నాడు. నేను అతనికి అడ్డు చెపుతూ " ఋషులచే అభినందితమైన నిందించుట అజ్ఞానము " అన్నాను. అందుకు నహుషుడు కోపించి నా తలపై తన్నాడు. దానితో అతని పుణ్యమూ, తేజమును కోల్పోయాడు. అప్పుడు నేను " నహుషా మునులను వాహనంగా చేసుకుని వారిని అవమానించావు. వారు గౌరవించు మంత్రములు ప్రమాణములు కాదని నిరసించావు. నన్ను అవమానించావు కనుక నీవు పదవీ భ్రష్టుడివై ఇంద్రలోకం నుండి పతనమై భూలోకమున సర్ప రూపమున అనేక సంవత్సరములు నివసించెదవు కాక " అని శపించాను. నహుషుడు నన్ను పరి పరి విధాల ప్రార్ధించగా అతడికి శాపవిమోచనం చెప్పాను. ధర్మపరుడు సత్పురుషుడైన యుధిష్టరుని చూసిన తరవాత అతని పాపములు పరిహారమై పుణ్యలోక ప్రాప్తి కాగలదు అని చెప్పాను " అన్నాడు. ఇంద్రుడు అగస్త్యుని పూజించాడు. అమరావతి అంతా అక్కడికి వచ్చి ఇంద్రుని అభినందించింది. ఇంద్రుడు అమరావతికి పోయి ఇంద్ర పదవిని అధిష్టించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు " అని వివరించాడు. శల్యుడు మరలా " ధర్మరాజా! ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం జరిగినప్పుడు అజ్ఞాతవాసం అనుభవించాడు. కనుక మీరు మీ దురవస్థకు దుఃఖించ వలదు. దుర్యోధనుడు నహుషుని వలె నశించక తప్పదు " అన్నాడు. ధర్మరాజు శల్యునికి కర్ణుని నిరుత్సాహ పరచడం గురించి గుర్తు చేసాడు. శల్యుడు అందుకు అంగీకారం తెలిపి సేనలతో హస్థినకు బయలు దేరాడు.

సేనలసమాయత్తం

సాత్యకి ఒక అక్షౌహిని సేనతో పాండవుల వద్దకు వచ్చాడు. చేధి దేశాధీశుడు దుష్టకేతు, జరాసంధుని కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అక్షౌహిని సేనతో వచ్చి కలిసారు. కేకయ రాజులు కూడా ఒక్క అక్షౌహినితో కలిసాడు. ద్రుపదుడు బంధువులతో ఒక్క అక్షౌహినితో కలిసాడు. పర్వత రాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. విరాట రాజు తన సైన్యముతో కలిసాడు. పాండ్యరాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. ఇలా పాండవ సైన్యం ఏడు అక్షౌహినులైంది. ఇక సుయోధనుడు కూడా తన సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు. భగదత్తుడు ఒక్క అక్షౌహినితోను, కాంభోజరాజు సుదక్షిణుడు ఒక్క అక్షౌహినితోను, భూరిశ్రవుడు ఒక్క అక్షౌహినితోనూ, శల్యుడు ఒక్క అక్షౌహినితోను, సింధురాజు జయద్రధుడు ఒక్క అక్షౌహినితోనూ, మాహిష్మతీపతి నీలుడు ఒక్క అక్షౌహినితోనూ, యాదవరాజు కృతవర్మ ఒక్క అక్షౌహినితోను, అవంతీరాజులు విందాను విందులు తలా ఒక్క అక్షౌహినితోనూ , వివిధదేశముల నుండి వచ్చిన సైన్యం మూడు అక్షౌహినులయ్యాయి. మొత్తం పదకొండు అక్షౌహినుల సైన్యం కౌరవపక్షాన చేరింది.

ద్రుపదరాజు పంపిన పురోహితుని రాయభారం

ద్రుపదరాజు పంపిన పురోహితుడు హస్థినకు చేరాడు. అతడు భీష్ముని, ద్రోణుని, కృపాచార్యులను, విదురుని కలుసుకుని తరవాత దుర్యోధనుని కలుసుకున్నాడు. మరునాడు దృతరాష్ట్రసభలో " దృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వారి పుత్రులైన కౌరవ, పాండవులకు రాజ్యంపై సమాన హక్కు ఉందని మీకంతా తెలుసు. పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు వాటి నుండి వారు తప్పించుకున్న విధం మీకు తెలుసు. పాడవులు తమ బాహు బలంతో సంపాదించిన రాజ్యం కుట్రపన్ని దుర్యోధనుడు అపహరించిన విషయం మీకు తెలుసు. వీటుఇన అంగీకరించిన దృతరాష్ట్రుని ఏమనాలి. పాండవపత్నిని సభలో వలువలు వలిచి అవమానించిన విషయం, వారి రాజ్యం అపహరించిన విషయం ఎలా మరువగలము. ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాత వాసాలు ముగించుకుని వారి రాజ్యభాగం కోరుతూ సంధి నిమిత్తం నన్ను పంపారు. కౌరవ, పాండవ ప్రవర్తను ఎరిగిన మీరు దృతరాష్ట్రునికి నచ్చ చెప్పటం మంచిది కాదా! పాండవులు బల హీనులు కారు. వారి వైపు ఏడు అక్షౌహినుల సైన్యం ఉంది. మీ బలం పదకొండు అక్షౌహినులు అనుకుంటున్నారేమో సాత్యకి, భీముడు ఒక్కొక్కరు వెయ్యి అక్షౌహినులకు సమం. అర్జునిని ఎదిరించి నిలువగలిగిన వీరూడు ముల్లోకాలలో లేడు. అన్నిటికి మించి చతురోపాయములో సమర్ధుడైన శ్రీకృష్ణుడు వారి వైపు ఉండగా వారిని విజయలక్ష్మి వరించకుండా ఉండ కలదా? వారిని పిలిపించి వారి రాజ్య భాగం ఇప్పించి అందరూ క్షేమంగా సుఖంగా ఉండండి " అని చెప్పి కూర్చున్నాడు.

దృతరాష్ట్ర సభలో సంధివిషయంలో చలరేగిన వివాదాలు

బ్రాహ్మణుని మాటలు విన్న భీష్ముడు లేచి " పాండవులు శ్రీకృష్ణునితో కలసి ఉండటం వారు శాంతియుతంగా సమస్యా పరిస్కారానికి దారుల్కు వెదకడం అదృష్టం. మీ మాటలు వినడానికి కొంత కటువుగా ఉన్నాఆమోదయోగ్యం. పాడవులు అనుభవించిన కష్టాలు మనందరికి తెలుసు. కనుక వారిని సగౌరంగా పిలిచి వారి రాజ్య భాగాన్ని ఇవ్వడం సముచితం. కాని పక్షంలో ఆగ్రహించిన అర్జునిని బాణాగ్నికి సర్వం ఆహుతి కాక తప్పదు " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు లేచి " అందరికి తెలిసిన విషయాన్ని మాటి మాటికి ప్రస్తావించడం వ్యర్ధం. దుర్యోధనుని కొరకు శకుని జూదం ఆడాడు ధర్మరాజు సకలము ఓడాడు. ఇందులో అపరాధం లేదు. అనుకున్న ప్రకారం అజ్ఞాత వాసం ముగియకనే రాజ్యభాగం కోరడం తప్పు. విరాటుడు, ద్రుపదుడు సహాయంగా ఉన్నారని రాజ్యభాగం అడగటంలో ఏమి న్యాయం ఉంది? ఇంత అన్యాయం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? " అన్నాడు. అందుకు భీష్ముడు బాధపడుతూ " కర్ణా! ఏమిటిది? పెద్ద వీరుడి మాదిరి మాట్లాదుతున్నావు. గోగ్రహణంలో అర్జునుడు మనందరిని గెలిచాడు. ఇప్పుడు నువ్వు మాటలతో గెలుస్తున్నావు. గోగ్రహణ సమయంలో సుయోధనునికి నేను అజ్ఞాత వాసం ముగిసిందని చెప్ప లేదా ఇప్పుడు మరలా ఆ ప్రస్తావన ఎందుకు ? " అని కోపంగా అన్నాడు. దృతరాష్ట్రుడు భీష్ముని శాంతింప చేసాడు " విప్రోత్తమా! మీరు చెప్పింది సావధానంగా ఉన్నాను. తగు విధంగా ఆలోచించి మేము ఒక సౌమ్యుని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట తెలియచేస్తాము. మీరు వెళ్ళి రండి " అన్నాడు.

సంజయుని సంధి కొరకు ఉపప్లావ్యం పంపుట

దృతరాష్ట్రుడు సంజయుని పిలిచి " సంజయా! పాండు రాజకుమారులు ఉపప్లావ్యంలో ఉన్నారు. నీవు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో వారితో అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకున్నందుకు అభినందిస్తున్నాని చెప్పు. సుయోధనుడు వివేచనా శూన్యుడు కనుక ఇన్ని అనర్ధాలు జరిగాయి అని తెలుపుము. ధైర్యవంతులు, ఉత్సాహవంతులు అయిన పాడవుల దోషం ఏమీ లేదని చెప్పు. పాలు, నీళ్ళ లాగా అన్నదమ్ములను కలిసి ఉండమని చెప్పు. వారు వారి తండ్రి రాజ్యభాగానికి అర్హులని చెప్పు. మనలను అసత్యవాదులని పాండవులు నమ్మరు. కాని ధర్మాత్ముడైన ధర్మరాజుకు రాజ్యభాగం ఇవ్వకుండా ఉండలేము కదా. మేము గర్వించి ఇవ్వకున్న శ్రీకృష్ణుని సారధ్యంలో అర్జునుడు ముల్లోకాలను క్షోభపెట్టగలడు. భీముని తలచిన దడ పుడుతుంది. నకుల, సహదేవుల పరాక్రమం సామాన్యం కాదు. ద్రుపద, సాత్యకులు తక్కువ వారు కాదు. వారి మిత్రులు కేకయ రాజు, పాడ్యుడు ఎవరికీ తీసి పోరు. ఇక ధర్మజుని ఆగ్రహం ఎదుర్కొనుట్ రుద్రునికైనా సాధ్యం కాదు. కనుక ధర్మజుని వద్దకు వెళ్ళి అతని తమ్ములకు ఆగ్రహం కలుగకుండా ప్రీతి కలిగేలా మాట్లాడు. శాంతి కలిగేలా మాట్లాడి కార్యం సఫలం చేసుకుని రా " అన్నాడు.

సంజయుని రాయభారం

సంజయుడు ఉపప్లావ్యం చేరి అర్జునినితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో " ధర్మజా! నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి దృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగ క్షేమం కనుక్కు రమ్మని నన్ను పంపాడు " అన్నాడు. ధర్మరాజు " మా పెదనాన దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు పెదనాన మిమ్ము పంపడం మా అదృష్టం. మా పెదనాన క్షేమమా, వారి పుత్రులు క్షేమమా, మనుమలు క్షేమమా, భీష్మ ద్రోణ, కృప అశ్వథామలు క్షేమమా? కౌరౌవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? మేమిచ్చిన దానములు వర్ధిల్లుతున్నాయా ? ప్రజలు మమ్ము తలచుకుంటున్నారా? కార్యానికి, ఖడ్గానికి ఒక్కే మంత్రం చెప్పే కర్ణూదూ క్షేమమేనా? సంజయా మనం మధ్యస్థులం అర్జునిని గాండీవానికి ఎదురు నిలబడ కలిగిన వారు ఉన్నారా ? " అన్నాడు. సంజయుడు దానిలో అంతరార్ధం అర్ధం చేసుకుని తన వాదన వినిపించడం మొదలు పెట్టాడు " ధర్మజా! సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దురంహంకారులు, నీతి మంతులు, సత్వసంపన్నులు ఇలా అనేక ప్రవృత్తులు కలవార్ ఉన్నారు కదా! వారు ఒకరి మాట ఒకరు వినరు కనుక నేను చెప్పేది విను. ధర్మజా! నీవు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేసావు కాని వృద్ధుడైన దృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు.కొడుకుల మాట కాదన లేక పోతున్నా మనసులో మధన పడుతున్నాడు. కనుకజాత శత్రువైన నీవు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానంతిరిగి స్వీకరించడం ధర్మమా? హస్థినాపుర ప్రజలు శత్రువులు ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజా! శ్రీకృష్ణుని సమక్షంలో నిడు సభలో నీతమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను " అనగానే ధర్మరాజు " సంజయా నీవు చెప్పదలచినది చెప్పవచ్చు " అన్నాడు. సంజయుడు అందరిని ఒక్క సారి పరికించి " మీ పెదనాన దృతరాష్ట్రుడు శాంత చిత్తుడై ఇరుపక్షములకు సంధి చేయమని నన్ను పంపాడు. ఇది మనం సంయమనం పాటించ వలసిన సమయం. ధర్మస్వరూపులు, శాంత స్వభావులూ ాయిన మీకు సుయోధనుని వలన కల్మషం అంటినది. దానినినీవు తుడిచి వేయాలి. యుద్ధం వలన జన నష్టం, జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరిని పోగొట్టుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు.మీకు శ్రీకృష్ణుడు పెట్టనికోట, దృపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు ఇక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించ లేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ,కర్ణ, శల్యులు అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములూ, కుమారులు అజేయులు. సోమదత్త, బాహ్లికులను శివుడు కూడా జయించ లేరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది. కృష్ణార్జునలారా మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాడవులు వారి బంధు మిత్రులందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా శాంతించండి ఆగ్రహమును వీడండి మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు " అని పలికి కూర్చున్నాడు.

సంజయునికి ధర్మజుని స్పందన

ధర్మరాజు " సంజయా! నా మాటలలో యుద్ధం అన్న మాట ధ్వనించిందా? మాకు మాత్రం యుద్ధమంటే ప్రియమా? యుద్ధానికి దిగకనే కార్య సాఫల్యత కలిగితే కావలసిన దేముంది. భీమార్జునులు జనహితమైన పనులే చేస్తారు కాని అప్రియములు చేయరు. దురాశకు పోయి యుద్ధానికి దిగితే యుద్ధం దుఃఖం కాక సుఖం ఇస్తుందా? సంజయా! మా పెదనాన దృతరాష్ట్రుడు తాను అక్రమ మార్గాన నడుస్తూ నన్ను ధర్మ మార్గాన నడవమనడం న్యాయమా? తాము ఉత్తమ మార్గాన నడుస్తూ ఎదుటి వారికి చెబితే బాగుంటుంది. ఇప్పుడు మాకు సంపద లేదు, బలం లేదు. మమ్ము పిలిచి ఆదరించడానికి దృతరాష్ట్రుడు వెర్రి వాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు అప్పుడే పెద్దల మాటలు వినని వాడు ఇప్పుడు వింటాడా? జూదపు సిరికి ఆశపడకూడదని విదురుడు అప్పుడు చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. అతడు సుయోధనుడు విషం తాగమన్నా త్రాగుతాడు కాని మంచి మాటలు వింటాడా? దృతరాష్ట్రునికి సుయోధనుడు అత్యంత పరాక్రమ వంతుడని నమ్మకం. సుయోధనుడు కర్ణుని బుజబలంతో రాజ్యం నిష్కంటకం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతడు అర్జునికి, శ్రీకృష్ణునికి భయపడడు. దృతరాష్ట్రుడు దుర్యోధనుడు,దుశ్సాసనుడు, కర్ణాదుల మాటలు వింటాడు కాని మంచి మాటలు వినరు. అన్నీ తెలిసిన నీవు ఇలా మాట్లాడటం అవివేకమా లేక లౌకికమా? భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాశ బంధితులై కళ్ళు కానని వారికి అర్జునిని గాండీవ కాంతులు పూర్తిగా గుడ్డి వారిని చేయక మానవు . సంజయా ! మా పరాక్రమం పొగుడుతూనే వారితో పోరి గెలవలేమని చెప్తున్నావు. నీకు పక్షపాత బుద్ధి ఏల. యుద్ధంలో గెలువగలమా లేదా అన్నది విడువుము. నీవు గుణవంతుడవు కనుక మా కోపం పోయేలా మాట్లాడావు. మేము ఇప్పటి వరకూ ఎవరికీ అపకారం చేయ లేదు ఇక ముందు అలాగే సహనంగా ఉంటాము. నిజంగా దృతరాష్ట్రుడు మంచి వాడై మా మీద ప్రేమ ఉంటే మమ్ములను పిలిచి గౌరవించి మారాజ్యభాగం మాకు ఇచ్చి బంధుత్వం నిలుపమని చెప్పు. ఇంద్రప్రస్థం కాని వేరొకూరు కాని మాకిమ్మని చెప్పు " అన్నాడు.

సంజయుని ప్రతి స్పందన

సంజయుడు లేచి ఎన్ని తప్పులనైనా సహించి ఓర్పు వహించగలవు కనుకైన్ని మాటలు చెప్పాను.నీవు నమ్మిన సత్యం అహింసలే నీకు సపదలు. కౌరౌవులు మీకు రాజ్యభాగం ఇవ్వకున్న మీకు ఆ నెత్తురు కూటికన్నా బిక్షమెత్తి జీవించుట మేలు కదా? రాజసూయం నిర్వహించిన నీ చరిత్ర హింసతో కళంకితం కాకూడదు. నీతో మాయాజూదం ఆడి నిన్ను అవమానపరచిన కౌరౌలను లోక నిందితులను చేసావు. అరణ్యములలో కష్టాలు అనుభవించిన నీవు ఇలా నీచమైన యుద్ధానికి తలపడి బంధు మిత్రులను చంపుట ధర్మం కాదు. హాలాహలం దిగమింగిన ఈశ్వరుడిలా నీవు నీ కోపాన్ని దిగమింగి నీ కీత్రి సాధకం చేసుకో " అన్నాడు.

సంజయునికి ధర్మజుడు బదులిచ్చుట

సంజయుని మాటలు విన్న ధర్మరాజు " సంజయా! నీవు పలికింది నిజమే. కొన్ని కర్మలు పైకి ధర్మంగా కనపడినా తరచి చూసిన అధర్మములని తెలుస్తాయి. కనుక నన్ను నిందించదలచుకున్న నేను చేసినది అధర్మం అని నిరూపించి నిందించు. నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినది అహింస పరమ ధర్మమే. లోక కంటకులను, వంశనాశకులను, పాపాత్ములను నిర్మూలించి ప్రజలను రక్షించుట క్షత్రియ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. కర్తవ్యాకర్తవ్యములను, ధర్మాధర్మములను నిర్ణయించుటకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉచితానుచితములు చెప్పగల దిట్ట. అతని ఆధ్వర్యంలో అంధక, భోజక, యదు, వృష్టి, సృంజయ, కేకయ, నడుచుకుంటున్నారు. మాకు అతని మాట శిరోధార్యం " అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు " సంజయా! నేను ఎల్లప్పుడూ పాండవుల మేలు కోరుతుంటాను. దృతరాష్ట్రుడు కూడా పాండవుల మేలు కోరు వాడు. అతనికి కీడు తలపెట్టడం భావ్యం కాదు. అతడు ఇప్పుడు తెలివి తెచ్చుకుని పాడవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీవూ నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీ శాంతి వచనాలు సంతోషం కలిగించాయి.పైకి సవ్యంగా కనిపిస్తున్నా ధర్మరాజు మాటలు సంధి పొసగదని తెలుస్తూ ఉంది. ధర్మరాజు మాటలు సరి అయినవే. దుర్మధాంధుడైన దుర్యోధనుడు, కొడుకు మాటలు మాటలు విని అధర్మాన్ని ఆచరించే దృతరాష్ట్రుని తీపి మాటలకు పాండవులు రాజ్య భాగం వదులుతారా? గతాన్ని మరచి పాండవులు కౌరవులతో సఖ్యంగా బ్రతకాలని అనుకుంటున్నారు. అది వారి కరుణ గొప్పతనం.ధర్మం ప్రకారం తమ తండి రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వాఋ యుద్ధానికి సన్నద్ధం కావడం అధర్మమా? అవమానాలు నిరంతరం సహిస్తూ బతకడం కంటే యుద్ధం చేయడం మేలు అని నాకు అనిపిస్తుంది. ధర్మరాజు యుద్ధం క్షత్రియ ధర్మం కాదా? అని అడిగాడు కదా! ద్విజులకు ధర్మాధర్మాలు నిర్ణయించిన పెద్దలు క్షత్రియులు యాచించ కూడదు వారు ఇవ్వడమే కాని తీసుకోకూడదు అని చెప్పిన విషయం లోక విదితం. వర్ణాశ్రమ ధర్మ రక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా? ధర్మంగా సంపాదించిన సంపదను అధర్మ మార్గాన కాజేసిన వారిని శిక్షించడం ధమమని శాస్త్రాలు భోదించ లేదా? సంజయా! ఇక్కడ వచించిన ధర్మాలు కౌరవులకు చెప్పలేదా ? వారు కాదా అధర్మంగా ప్రవర్తించినది. నిండు సభలో ద్రౌపదిని వలువలు లాగి అవమానించి పాండవులకు అవమానం కలిగించినది.లోకంలో జూదం ఎవరూయ ఆడలేదా వారిని ఇలాగే అవమానించారా? " అని శ్రీకృష్ణుడు సంజయుని నిలదీసాడు. సంజయుడు " కృష్ణా! నీవే ఇలా మాట్లాడితే సంధి ఎలా పొసగుతుంది? " అన్నాడు. శ్రీకృష్ణడు " ఆ రోజు సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు నోరు మెదిపారా? కుమారుల అకృత్యాలను దృతరాష్ట్రుడు ఆపగలిగాడా! దుశ్శాసనుడు ద్రౌపదిని నిందిస్తూ సభకు ఈడ్చుకు వస్తుంటే మామగారైన దృతరాష్ట్రుడు ఎలా సహించాడు ఆమె ఏడ్పులు వినిపించ లేదా ? విని ఓర్చుకున్నాడా! ఇప్పుడు తగుదునమ్మా అని పాండవుల యోగక్షేమం కనుక్కుని రమ్మన్నాడా! భార్యను అవమానిస్తుంటే పాండవులు మిన్న కున్నారు. ఆమె తనను తాను రక్షించుకున్నది కాబట్టి కౌరవులు బ్రతికి పోయారు లేకుంటే ఆరోజే చచ్చి ఊరకుండే వారు.పాండవులు ఎల్ల కాలం ఇలాంటి అవమానాలను సహించి ఊరకుండవలసినదేనా ! సభలో కర్ణుడు " జూదంలో నీ భర్తలు నిన్ను ఓడారు కనుక వారు ఉండీ లేనట్లే కనుక సభలో నీకు నచ్చిన వారిని భర్తగా ఎంచుకో అనలేదా ! " శూలాలలా ఆ మాటలు ద్రౌపదిని బాధించిన విషయం నీకు తెలవదా? దుశ్శాసనుడు " ఇక్కడ రోషం ఉన్న మగాడెవరు? నీకు భర్తలు ఉండీ లేనట్లే " అన లేదా? పాండవులు అప్రయోజకులే అయినా అలా మాట్లాడటం వలన వారికి కలిగిన మేలు ఏమి? ఆ తరవాత జరిగినవి సభలో చెప్పతగినవి కాదు. ఈ సంధి పొసగదు. అయినా పాండవులకు నచ్చ చెప్పి నేను ఒప్పించి హషినకు వస్తాను.కౌరవులకు బుద్ధి చెప్పి వారి రాజ్య భాగం వారికిమ్మని అడుగుతాను ఇస్తారా బ్రతికి పోతారు.ఏమైనా కుటిలోపాయం చేసారా పాండవుల బాణాగ్నికి వారు సమూలంగా నాశనం కావడం తథ్యం. అలా జరగదని ఆశిస్తున్నాను. సంజయా! సుయోధనుడు రోషంతో కూడిన మహా వృక్షం దానికి కాండం కర్ణుడు, కొమ్మలు శకుని ఫల పుష్పాదులు దుశ్శాసనాది సోదరులూ ఇతరులు దానికి మూలం దృతరాష్ట్రుడు. అలాగే ధర్మరాజు ధర్మము అనే మహావృక్షం దానికి అర్జునుడు కాండం భీముడు శాఖోపశాఖలు ఫలపుస్పాలు నకుల సహదేవులు ఈ వృక్షానికి మూలం సద్భ్రాహ్మణులు, వేదములు. నిష్పక్షపాతంగా యోచించి రెండింటిలో ఏది మేలో నీవే చెప్పు. దృతరాష్ట్రుడు అతని కుమారులు పాండవులు అందులో తిరిగే సింహాలు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవి లేక సింహాలు మనజాలవు. కనుక రెండు ఒకరిని ఒకరూ ఆశ్రయించుకుంటే అందరికీ మేలే. నేను హషినకు వస్తాను దృతరాష్ట్రుడు పాండవులను కుమారులలా ఆదరిస్తే వారు కౌరవులను అనుసరించి ఉంటారు.నా మాట అంగీకరిస్తాడో లేదో చూసి కర్తవ్యం నిర్ణయిస్తానని దృతరాశ్హ్ట్రునికి చెప్పు " అన్నాడు. సంజయుడు " నేను వచ్చిన పని సఫలం అయిందని ఆశిస్తాను " అని దృపదాదులను చూసి " నాకు అనుజ్ఞ ఇస్తే నేను పోయి వస్తాను . ధర్మజా! నా పలుకులలో తప్పేమి లేదు కదా? " అన్నాడు. ధర్మరాజు " సంజయా! నీ పలుకులలో అనుచితంలేదు అధర్మమైన మాటలు నీవు చెప్పవు కదా! నీ ఓర్పు నేర్పు ఎవరికి ఉంటాయి చెప్పు. నీవు హస్థినకు పోయి తాత భీష్మునకు , గురువు ద్రోణునకు, కృపాచార్యునకు నా నమస్కారాలు అందచెయ్యి.మా తండ్రి దృతరాష్ట్రునికి నమస్కరించానని చెప్పు . దుర్యోధనుని సోదర సమేతంగా క్షేమమడిగానని చెప్పు. విదురుని , శల్యుని వినయంగా అడిగినట్లు చెప్పు. అశ్వథామను అక్కున చేరుకున్నానని చెప్పు. బాహ్లికుని, సోమదత్తుని ప్రియంగా పలుకరించానని చెప్పు. కర్ణుడు, శకుని, సైంధవుడు, కృతవర్మలకు వృద్ధులైన రాజులకు మాతో యుద్ధం చేయ సిద్ధమైన సకల రాజులకు ఎవరికి తగినట్లు వాఋఇకి సముచిత రీతిలో వినయంగా, వాత్సల్యంగా, బంధుప్రీతిగా నా ప్రణామములు అందచెయ్యి. శత్రువులను జయించి మేము దాసదాసీ జనములను ఉదాసీనపరచకుండా ఆదరించగలమని చెప్పు.మా తండ్రి దృతరాష్ట్రుడు సభలో ఉండగా " అనఘా! శంతనుని రాజ్యాన్ని కాపాడుతున్న నీవు మమ్మునాదరించి చిన్న వయస్సులోనే మారాజ్య భాగాన్ని మాకిచ్చి ఆదరించావు.అలాగే ఇప్పుడు మాకు సంధి చేసి సకల ప్రజానీకాన్ని రక్షించి రాజ్యాన్ని అధర్మం నుండి కాపాడమని చెప్పు. అలా చేస్తే బ్రాహ్మణులు , రాజులు సంతోషిస్తారని చెప్పు అలాగే తాత భీష్మునితో " పాండవులు ఇప్పటికీ శాంతి కాముకులని చెప్పు. యుద్ధం తలపెట్టరని చెప్పు. సుయోధనునితో ' మేము అత్యంత బలవంతులమైనా మమ్ములను రాజ్యం నుండి వెళ్ళగొట్టిన నీ వెర్రి తనం, అడవులలూ వెన్నంటి వచ్చి మమ్ము కష్టపెట్టిన నీ దుసుతనం, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన నీ తులువతనం ధర్మరాజు సహించాడు అని చెప్పు. అతనిని అతని సోదరులను యుద్ధభూమిలో మరణించ వలదని చెప్పు, పరుల సొమ్ముకు ఆశించక మా రాజ్యభాగం మాకిచ్చి క్షేమంగా ఉండమని చెప్పు, యుద్ధానికి దూరంగా ఉండటం వారికే మేలని చెప్పు, సుయోధనునికి ఎవరూ చెప్పేవారు లేక నేను పెద్ద వాడిని కనుక చెప్తున్నాను, మావైపు ఉన్న ధర్మం అతని వైపు ఉన్న అధిక బలాన్ని మహా వీరులను హరించగలదని చెప్పు, శ్రీకృష్ణుడు మా పక్షంలో ఉన్నందున మేము జయించగలమని చెప్పు. నా మాట మన్నించి యుద్ధానికి దూరంగా ఉండి అందరినీకాపాడమని చెప్పు. ఎవరి రాజ్యం వారు చేస్తూ సఖ్యంగా సుఖంగా ఊందామని చెప్పానని చెప్పు, మాకు అర్ధరాజ్యం ఇవ్వ లేకున్న కుశస్థలి, వృక్షస్థలి, వాసంతి వారణావతం ఇచ్చి యుద్ధాన్ని నివారించిన బంధు మిత్రులు క్షేమంగా ఉండగలరని చెప్పు. ఇందు వలన కురు, పాంచాల, మత్స్య, యాదవ, వృష్టి రాజులు పరస్పరం సఖ్యంగా ఉండగలరని చెప్పు.సంజయుడు " ధర్మజా! మీరు ఆనతి ఇచ్చిన ప్రకారం చేస్తాను. మీ తండ్రి గారికి, మీకు, మీ సోదరులకు, వాసు దేవునికి ప్రియంకలిగేలా చేస్తానని విశ్వసిస్తున్నాను " అన్నాడు.అర్జునుడు " మిత్రమా! నీవు నాకు బాల్య మిత్రుడవు. నీ మంచితనం మాకు తెలుసు. ఆ రోజు ధర్మరాజు దయాగుణం అనే అంకుశంతో భీముని ఆపాడు.ఈ రోజు అదే జరుగుతుంది.ఇక సుయోధనునికి విచారమెందుకు వెళ్ళిరా " అన్నాడు. సంజయుడు అందరి వద్ద శలవు తీసుకుని హషినకు బయలుదేరాడు.

ద్వితీయాశ్వాసం

ఆ విధంగా సంజయుడు ధర్మజుని వద్ద శలవు తీసుకుని ఉపప్లావ్యం వదిలి హషినాపురం చేరాడు.దృతరాష్ట్రుని అంతఃపురానికి వెళ్ళి దర్శించాడు. దృతరాష్ట్రుడు సంజయుని చెంతన కూర్చుండజేసి జరిగిన విషయం వివరించమని అడిగాడు. సంజయుడు " మహారాజా! ధర్మరాజు మీ క్షేమం మీ కుమారుల క్షేమం అడిగాడు " అన్నాడు. దృతరాష్ట్రుడు " సంజయా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమేనా? అతని బంధు మిత్రులు అతని పట్ల ప్రీతితో మెలగుతున్నారు కదా " అన్నాడు.సంజయుడు " మహారాజా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమే. ధర్మరాజుకు దైవ చింతన మెండు కదా. అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కనుక భారం నీమీద పెట్టాడు. నీవు నీ కొడుకులను నమ్మావు. అతడేమో కర్ణుని, శకుని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు. కడుపుకు అన్నం తినేవాడు నీ కొడుయ్కులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరకుంటారా? లోకంలో ఎవరికి కొడుకులు లేరా కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరక ఉండేవారు ఎవరనా ఉంటారా? ప్రజలంతా నిన్ను తిడుతుంటే విన లేక చెవులు తూట్లు పడుతున్నాయి. నువ్వూ , నీకుమారులు శకుని ఆడించినట్లు ఆడుతున్నారు. పాండవులు మంచి వాఋ కనుక సరి పోయింది. లేకున్న మీరంతా ఈ సరికి నాశనం అయి ఉండే వారు. సుయోధనుడు ధర్మరాజు శాంతగుణాన్ని పిరికితనం అనుకుంటున్నారు. అది పొరబాటు. ధర్మరాజు తన తమ్ములను అదుపులో పెడుతున్నారు కనుక మీరు జీవించి ఉన్నారు. లేకున్న ఈ సరికి మీరు ప్రాణాలతో ఉండే వారు కాదు. జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది. అది కార్చిచ్చులా ఇప్పుడు రగులుతుంది. ధర్మరాజు మెత్తని పులి, అవసరం వచ్చినప్పుడు అతడి తిరగబడితే అతనిని ఆపగలవారు లేరు " అన్నాడు.

దృతరాష్ట్ర విదురుల ఆలోచన

దృతరాష్ట్రుడు వెంటనే విదురుని మందిరానికి పిలిపించి " విదురా! సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మనసు వికలమయింది నిద్ర రావడం లేదు " అన్నాడు. విదురుడు " దృతరాష్ట్రా! బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీడు, ఇతరుల డబ్బు అపహరించ కాచుకున్న వాడు, ధనం సంపద పోగొట్టుకున్న వాడు, కామంతా కైపెక్కిన వాడు నిద్రపట్టక అవస్థ పడతాడు. వీటిలో నీకు ఏ దోషం ఉంది. ఇతరుల సొమ్ము అపహరించి నీవు ఒక్కడివే అపహరించాలని అనుకున్నావు అందుకే నీకు నిద్ర రావడం లేదు " అన్నాడు. దృతరాష్ట్రుడు " అది కాదు విదురా! ధర్మరాజు మనో గతం అవగతంకాక నిద్ర రావడం లేదు అన్నాడు. విదురుడు " రాజా! నీ బంధువు, హితుడు, సేవకుడు, శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలపెడతాడా? అతని రాజ్యాన్ని అతనికి ఒప్పగించి ఇప్పటికైనా నీవు నీ కుమారులు చేసిన తప్పు సరిదిద్దు. ధర్మరాజు నిన్ను పెదనాన వైనా తండ్రిలా చూస్తున్నాడు కనుక సహిస్తున్నాడు. నీవు రాజ్యభారాన్ని దుర్యోధన, శకుని, కర్ణ, దుశ్శాసనుల మీద మోపడం మంచికి కాదు అది నీకూ తెలుసు " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! రేపు సభలో సంజయుడు చెప్పినది విని మాకు ఏది క్షేమమో అది చేయించు. ఇప్పుడు నా మనసుకు శాంతి కలిగేలా నీ అమృత వచనం నా మీద కురిపించు " అన్నాడు.

విదురనీతి

దృతరాష్ట్రుడు అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది. విదురుడు " రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంప్దకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది. ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది. తాను ఒక్కడే తినడమూ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు.క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించుకుంటాడు. న్యార్జాతిమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడమూ వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోరు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానిమిచ్చి పిదప చింతించక ఉండుట, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది. స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.

దృతరాష్ట్రునికి విదురుడు బుద్ధిమతి చెప్పుట

విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు " విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. మనసుకు తగిలిన గాయం మాన్పవచ్చు కాని శరీరానికి తగిలిన గాయం మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపుమాటలు నీకు తెలియనివా? చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు.ధర్మనిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు.ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు. పూర్వం ప్రహ్లాదుడు రాక్షసకుంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాతరహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందు వలన అందరూ సుఖపడతారు. పెద్దలు లేని సభ సభ కాదు, న్యాయం మాటాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మద్యమము, భారంగా బ్రతుకు లాగుట అధమం. నీతి దూరులను ఉత్తములు మెచ్చరు. నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు. దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోతసహిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు కయ్యానికి పిలిచిన వారిని వదలరు. పాడవులు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమాను " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు. అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు.పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది " అన్నాడు. విదురుడు " రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు.ఉద్ధం నివారించడానికి కొడుకులను వదలమన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా! ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు బాగున్నాయి. అలాగే చేస్తాను " అన్నాడు.విద్రుడు " ఆ మాట మీద ఉండు దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా ధమరాజుతో సంధి చేసుకో " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.

సభలో సంజయుని సంధి ప్రస్థావన

మరునాడు దృతరాష్ట్రుడు సభ తీర్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వథామ, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శల్యుడు, దుర్యోధనాదులు సభప్రాంగణంలో ఉన్నారు. సంజయుడు సభను ఉద్దేశించి దృతరాష్ట్రునితో " రాజా! మీరు ఆదేశించినట్లు ఉపప్లావ్యం వెళ్ళి ధర్మరాజును చూసాను ధర్మరాజు పేరు పేరున మిమ్మలిని యోగక్షేమాలు అడిగాడు. నేను వివరించాను అలాగే కృష్ణార్జు నులను కలిసాను. శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు " సంజయా! అజాతశత్రువైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుట్టిన చందాన ఉంటుంది దానిని ఆర్పడం ఎవరి తరం కాదు. యుద్ద్ధం అనివార్యం అయితే మీరు మీ సమస్త సంపదలు యోగ్యులకు పంచి బంధు మిత్రులతో భోగములను అనుభవించి యుద్ధ భూమికి రండి. నాడు సభలో ద్రౌపది గోవిందా రక్షించు అని నన్ను వేడుకున్నది ఇంకా చెవిలో వినిపిస్తుంది. తీర్చలేని ఆ అప్పు తీర్చకనే నేను సారధ్యం వహిస్తున్నను. అర్జునుని గాండీవానికి కౌరవ సేన దగ్ధం కాక తప్పదు " అన్నాడు. అప్పుడు అర్జునుడు " సంజయా! ధరాజు అడిగినట్లు రాజ్య భాగం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు భీముడు నేను దుర్యోధనుని అకృత్యాలకు బదులు చెప్పక వదలము. దుర్యోధనుని యుద్ధభూమిలో అంపశయ్య మీద పరుండ చేయకుంటే ధర్మరాజు భూశయనం చేసిన దానికి అర్ధము లేదు. భీముడు యుద్ధ భూమిలో గధ తీసుకుని వీర విహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వక ఏమి చేస్తాడు. కౌరవులు మాటలతో సంధి చేయరు. కేవలం యుద్ధముతోనే మాటవింటారు. నకులసహదేవులు, అభిమన్యుడు, సాత్యకి యుద్ధ భూమిలో వీర విహారం చేస్తున్నప్పుడు సుయోధనుడు సంధి చేస్తాడులే. సుయోధనుడు మరణించిన తరవాత భీష్ముని మీదకు శిఖండి ఉరికినప్పుడైనా కౌరవులకు సంధి చేయక తప్పదు. ద్ష్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి యుద్ధానికి దిగినప్పుడైనా సంధి చేయక తప్పుతుందా? సుయోధనుడు మహాత్ముడైన శ్రీకృష్ణుని లక్ష్య పెట్టడు, మేము భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించి యుద్ధానికి దిగుతాము. మా రాజ్యభాగాన్ని అధర్మంగా అపహరించి నియమభంగం చేసి తిరిగి మా రాజ్యాన్ని మాకు ఇవ్వని కౌరవులను సంహరించి మా రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం గెలిచినట్లే కాని ఇందు అధర్మం ఏమీ లేదు. ఇలా నిండు సభలో దృతరాష్ట్రునికి చెప్పు .భీస్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వథామ, శల్యులు నిర్ణయించినది జరుగుతుంది. యుద్ధాన్ని నివారిస్తే సుయోధనుడు ఆయుష్మంతుడౌతాడు " అని చెప్పారు అన్నాడు.

భీష్ముడు

ఈ మాట్లు విన్న భీష్ముడు " శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణులు ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నిర్మూలించడానికి ప్రతి యుగంలోను అవతరిస్తారు. ఇప్పటికే కాలకేయులను, నివాతకవచులను సంహరించారు. వారిరువురు రెండుగా కనిపించే ఒకే శక్తి .వారిరువురిని గెలవడం హరునికైనా సాధ్యం కాదు. శ్రీకృష్ణుని సారధ్యంలో అర్జునుడు గండీవం ఎక్కు పెట్టినప్పుడు నీకు తెలుస్తుందిలే. అయినా సుయోధనా నీవు గర్విష్టివి నా మాటలు లెక్క చేయవు దుర్మార్గులైన కర్ణ, శకుని, దుశ్శాసనులమాటలు నీకు వీనుల విందులు. దీని ఫలితంగా యుద్ధ భూమిలో మా అందరి మరణ వార్తలు వింటావు " అనగానే కర్ణుడు లేచి " మీరు ఇలా మాటాడ తగునా నేనుేమి చేసాను ? సుయోధనుని కొలువులో ఉంటూ అతను పెట్టిన అన్నం తింటున్నను కనుక అతనికి హితముగా మాట్లాడుతాను. నేను దృతరాష్ట్ర సతీ, పుత్ర, పొఉత్రులకు హితము చేస్తాను లేకున్న సుయోధనుడు నన్ను ఇంత వాడిని చేస్తాడా? " అన్నాడు. భీష్ముడు " దృతరాష్ట్రా! ఈ కర్ణుడు పాండవులకు ఇసుమంత అయినా పోలడు. పాండవులను గెలుస్తానని ప్రగల్భాలు చేసే వీడిని నమ్మి సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి యుద్ధానికి దిగుతున్నాడు. పాండవులు ఎన్నో విజయాలు సాధించారు. వీడు ఇప్పటికి ఒక్క విజయం పొందాడా?ఉత్తర గోగ్రహణంలో వీడి తమ్ముని చంపి గోవులను అర్జునుడు తరలించుకు పోతుంటే అక్కడే ఉమ్డి వీడు ఏమి చేసాడు? ఘోషయాత్రలో నీకుమారుని ఓడింప చేసిన వీడు ప్రగల్భాలు పలుకుతుంటే నీవు వింటున్నావు " అన్నాడు. ద్రోణుడు లేచి " మహారాజా! భీష్ముడు మీకందరికి ఆప్తుడు ఇరువురికి కావలసిన వాడు. కనుక మీ హితవు కోరి సంధి చేయమంటున్నాడు. ఖాండవ వన దహనం మొదలు అర్జునిని విజయాలు ఆలోచించండి. ఎంతో మంది ధస్సు పట్టిన వీరులు ఉన్నా విజయుడు అన్న పేరు ఒక్క అర్జునినికి మాత్రమే దక్కింది . అర్జునుడు అన్నంత పని చేస్తాడు " అన్నాడు. భీష్మ ద్రోణుల మాటలు విననట్లే ఉన్న దృతరాష్ట్రుడు వారికి సమాధానం చెప్పక " సంజయా ! ధర్మరాజుకు మన సైన్యం గురించి తెలుసా? మనసైన్యం గురించి అతడు ఏమని అనుకుంటున్నాడు? అతని వైపు ఎవరు ఉన్నారు? " అని అడిగాడు. ఆ మాటలు విన్న సంజయుడు " దృతరాష్ట్రుడు ఇంత వెర్రి వాడా ! పాండవుల బలాబలాలు అడుగుతున్నారు. ఇతనికి ఏమి చెప్పి ఏమి ప్రయోజం " అనుకుని " దేవా! మరలా చెప్తున్నాను మీరు సగ భాగం ఇస్తే యుద్ధ మాట తలపెట్టడు. అతడు సంధికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం వస్తే అతడు ఎవరిని లక్ష్య పెట్టడు. నీకు తెలియనిది ఏమున్నది .బకుడిని, హిడింబుని, కీచకుని , కిమ్మీరుని వధించిన భీముడు వారి పక్షమే కదా! ఫాలాక్షుని ఓడించిన అర్జునుడు వారి పక్షమే ద్రుపది కుమారులు, అభిమన్యుని కుమారులు వారికి కాక ఎవరికి చేస్తారు. శ్రీకృష్ణుడు , సాత్యకి వారికి బాసటగా ఉన్నారు. ద్రుపదుడు, కేకయరాజులు, సరాసంధుని కుమారుడైన సహదేవుడు, జయత్సేనుడు, శిశుపాలుని కుమారురులు వృషభుడు, దృష్టకేతు, మాయావిద్య విసారధుడు భీముని కుమారుడు ఘటోత్కచుడు వారి పక్షాన తలపడటానికి సిద్ధం. ఇంఖా తీర్పు ఉత్తర దేశ రాజులు ధర్మరాజుకు సాయంగా ఉన్నారు. శ్రీకృష్ణుని సాయం కన్నా మించినది లేదు కదా! ధర్మరాజుకు మనతో పోరు సల్పడానికి ఇంకేమి కావాలి? " అన్నాడు సంజయుడు.

దృతరాష్ట్రుడు

ఇది విని దృతరాష్ట్రుడు " సంజయా! నీవు చెప్పినది నిజము. వారంతా ఒక ఎత్తు భీముడు ఒక ఎత్తు. అతడినితల్చుకుంటే భయంగా ఉన్నది. మనలో అతడిని ఎదుర్కోడానికి ఎవరున్నారు. చిన్నప్పటి నుండి అతడు నామాట వినడు. భీముని చేతిలో కష్టాలు పడుతూ కూడా సుయోధనుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాదు. వాడికి ఏ ఆయుధమూ పని లేదు. జరాసంధుని ఒక్క ఒక్క పోటుతో చంపాడు. వాడికి ఏ ఆయుధమూ పని లేదు చేతితోనే ఎందరినైనా చంపగలడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వాడికి అర్జునుడు సాయం ఉన్నాడు. ఇక ఏమి చెప్పను. అర్జునితో సమానంగా యుద్ధం చేసే వాడిని మనం చూసామా? అతనికి సారధి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముగ్గురూ కలిస్తే కౌరవ సేనను దహిస్తారు.వారి గురించి భీష్మ, ద్రోణులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అయినా వారు మన కొరకు యుద్ధం చేస్తారు. వారికి కురు పాండవులు సమానమే కదా? నా మాట నా కుమారులు వినరు. మొదటి నుండి విదురుడు చెప్పినది జరుగుతుంది సంజయా ! నేనేమి చేయను, నా కేది దారి నా కేది శరణ్యము . ధర్మరాజు వినయవంతుడు. అతనికి వుదురుడు , దృపదుడు, సోదరులు, శ్రీకృష్ణాదులు తోడు ఉండగా ధర్మరాజుతో పోరుకు తలపడటం మిడతలు పోయి మంటలూ పడటం లాంటిది. వంశ నాశనం తప్పదు శాంతి మార్గమే మేలు నాకుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. సంజయుడు " దేవా! మీరు చెప్పినది సబబు అప్పుడు ధర్మరాజుని వదిలావు కాని అతడు నిన్ను వదలక ఘోషయాత్రలో నీ కుమారులను రక్షించాడు. అతడు మిమ్ము ఎన్నటికీ అతిక్రమించడు. అతడిని పిలిపించి సంధి కావించండి " అన్నాడు.

సుయోధనుడు

దుర్యోధనుడు " తండ్రీ! మీ మాటలు విచిత్రముగా ఉన్నవి ఎక్కడో అడవులలో ఇడుములు పడుతున్న వారిని తెచ్చి కొంతమంది పిరికి వాళ్ళను జత చేసినంత మాత్రాన పాండవులు గెలుస్తారా? నీకు ఇంత భీతి వలదు మన బలాన్ని తక్కువగా ఛూడకు. మేము గెలుస్తాము. పరశురాముని గెలిచిన భీష్ముడు మన పక్షాన ఉన్నాడు. ద్రోణుడు, కృపాచారులు సామాన్యులా? ఈశ్వర వర ప్రసాదితుడి అశ్వథామ సామాన్యుడా? సహజ కవచ కుండల ధారి కర్ణుని ఎదిరించ గలవాడు పాండవులలో ఎవరు? బాహ్లికుడు, సింధురాజు, సోమదత్తుడు, గాంధారరాజు సామాన్యులా? వీరిని గెలుచుట పాండవులకు శక్యమా ? మీరు సందేహించకండి మేము వారి అడుగులకు మడుగులు వత్తము. యుద్ధము చేస్తాము పారి పోము ఇదే మా నిశ్చిత అభిప్రాయము. మా చేత బాధలు పడ్డవాళ్ళు దండెత్తి వస్తే పారిపోవడం చిన్నతనం కాదా? వారిని చూసి భయపడి మాకు తలవంపులు తేకండి. భీముడే కాదు నాతో తలపడి గధా యుద్ద్ధం చేయగల వాడు ముల్లోకాలలో లేడు. భీముని నేను చంపగలను అతడు మరణిస్తే పాండవ పక్షాన యుద్ధం చేయగల వారు లేరు. అందుకే ధర్మరాజు ఐదు ఊళ్ళు ఇమ్మని అడిగాడు. కర్ణుని వద్ద ఉన్న శక్తి అర్జునిని చంపుతుంది. భీష్మాదుల శరాగ్ని వారి సేనను నాశనం చేస్తుంది. ఇక నీమిగిలిన కుమారులు అత్యంత శక్తి మంతులు కారా? మన సైన్యం పదకండు అక్షౌహినులు వారి సైన్యం ఏడు అక్షౌహినులు ఇది తెలియక ఎందుకు దు॰ఖిస్తున్నావు? " అని సంజయుని చూసి " సంజయా! ఇంతకూ అల్లరి మూకను తయారు చేసుకున్న ధర్మరాజు ఏమంటున్నాడో చెప్పు" అన్నాడు. సంజయుడు చెప్పసాగాడు " సుయోధనా! పాండవులు యుద్ధంఅంటే భపడలేదు ఏదో పెండ్లికి పోతున్నట్లు భావిస్తున్నారు.అర్జునిని పాశుపతం, భీమ్కుని గధాయుధం నమ్మి యుద్ధానికి దిగుతున్నారు " అని చెప్పి దృతరాష్ట్రుని చూసి " దేవా! వారి మాటలను బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు దుష్టద్యుమ్నుని వంతు, దుర్యోధనుడు అతని తమ్ములు భీముని వంతు మీలోని యువకులు అభిమన్యుని వంతు, అశ్వత్థామ, కర్ణుడు, సైంధవుడు మొదలగు మహా వీరులు అర్జునిని వంతు కృతవర్మ సాత్యకి వంతు సోమదత్తుడు చేకితానుడు అనే యాదవ రాజు వంతు శకుని నకుల సహదేవుల వంతు, శల్యుని ధర్మరాజు సంహరిస్తాడు . ఇక మీరి ఆలోచించీ నిర్ణయించండి " అన్నాడు. అదివిన్న దృతరాష్ట్రుడు " అయ్యో ఇక నాకు దిక్కెవరు? ధర్మరాజు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చేయక పోవడం నా కర్మ. ఇక చెప్పకు అలా జరగాలంటే అలా జరుగుతుంది " అన్నాడు.అలా దుఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు " తండ్రీ మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాము కదా మా క్కంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు? నువ్వు ఎప్పుడూ వారిని పొగుడుతుంటావు ఈ రాజ్యం మాది మాకు దక్కాలని భగవంతుడు నిర్ణయించారు. భాదపడవద్దు " అన్నాడు. దృతరాష్ట్రుడు " సంజయా! చూసావా నా కొడుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పాండవుల వైపు వాఋఇని ఎవరు రెచ్చ కొడుతున్నారు? " అన్నాడు. సంజయుడు " దేవా! దుష్టధ్యుమ్నుడు పాండవులలో అగ్నిని రెచ్చ కొడుతుంటాడు. తాణు ఒక్కడే కౌరవ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు. ధర్మరాజు "నువ్వు అన్నంత పని చేస్తావు అంటాడు " అప్పుడు దుష్టధ్యున్ముడు నన్ను చూసి మహేశ్వరుడు, ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరి పోలు వారు కౌరవ సేనలో ఎవరున్నారు? ధర్మరాజును శరణు వేడి బ్రతకమని సుయోధనునికి చెప్పు " అన్నాడు.అది విన్న దృతరాష్ట్రుడు " కుమారా నీకు సగం రాజ్యం చాలదా? ధర్మరాజుకు సగరాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా పెద్దల మాటలు నీకు ఎందుకు విన్నవు? శకుని, కర్ణుల మాటలు ఎందుకు వింటావు " అన్నాడు.ఆమాటలకు కోపించిన దుర్యోధనుడు " నామాటలు ద్రోణుడు , భీష్మాదులు అంగీకరించడం లేదు. నేను ధర్మరాజుకు సూది మొన ఓపినంత భూమి కూడా ఇవ్వను కర్ణుడు, దుశ్శాసాదుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలుచుట నిశ్ఛయం. ఇదే నా నిర్ణయం " అన్నాడు.దృతరాష్ట్రుడు " కుమారా ! నా మాట విని యుద్ధం మాను.భీముడు యుద్ధరంగంలో నిన్ను నీ సైన్యాన్ని చీల్చి చెండాడు తున్నప్పుడైనా నా మాట వింటావా? అర్జునుడు ఛంఢ ప్రఛంఢుడై సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నామాట వింటావా? నీది కేవలం మానవ శక్తి పాండవులది దైవ శక్తి అర్జునుడు అగ్ని దేవుని వలన అక్షయతుణీరాన్నీ పొందాడు. వాయుదేవుడు, ఇంద్రుడు, యముడు, అశ్వినీ దేవతలు వారిని కాపాడుతుంటారు. కనుక వారిని చంపడం భీష్మునికి వీలు కాదు. దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు, కనుక అతడు దేవతలను మించిన వాడు. కనుక సాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! రాగద్వేషాలకు అతీతులైన దేవతలు వారికి ఎలా సాయం వస్తారు. వారు పక్షపాత బుద్ధి వహిస్తే వారికి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది? పాండవులకు దేవతల సాయం ఉంటే అరణ్యాలలో ఎందుకు కషట పడతారు? ఆత్మస్తుతి క్షమార్హం కాదు కాని నాకు కోపం వస్తే పాండవులను దేవతలు కూడా రక్షించ లేరు.ధర్మతనయుడు, అతని సోదరులు, పాంచాలురు, విరాటుడు, అతని తమ్ములు, కుమారులు వాసుదేవాది యాదవులు, కేకయ, పాండ్య, మగధ, చైద్య, ప్రముఖ వీరులు నా బారిన పడి అనగారి పోవడం మీరు వింటారు. వారి తేజస్సు , సొఉర్యము నాకు సాటి రావు, పితామహ, ద్రోణ , అశ్వథామ , కృపులకు తెలిసిన సమస్త అశ్త్రాలు నాకు తెలుసు " అన్నాడు.

కర్ణుడు భీష్ముడు

తరవాత కర్ణుడు లేచి " మిత్రమా! నాకు గురువుగారి కోపం కారణంగా అస్త్రషస్త్రాలు గుత్రుకు రావు అని లోకులు అంటారు. కాని ఆ మహాను భావుడు నాకు వాటి స్పురణ ప్రసాదించాడు. కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిశ్చయము. దేవతలకు కూడా నన్ను గెలవడం కష్టం అర్జునుడు ఎంత నేను పాండవులను గెలుచుట తధ్యం " అన్నాడు. భీష్ముడు లేచి " కర్ణా! యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించడం మా తరమా? పాండవులు యుద్ధంలో రాలి పోతారా? అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు. దేవేంద్రుడు ఇచ్చిన శక్తితో అర్జునుని చంపగలనని అనుకుంటున్నావు. శ్రీకృష్ణుని చేతిలో అది ముక్కలు కాక తప్పదు.అర్జునిని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశ్హనం చేస్తాడు. దృతరాష్ట్రా! దాయాదులు కలిసి ఉంటే క్షేమంగా ఉంటారు లేకున్న సస్తం కోల్పోతారు. కనుక సంధి చేసుకో " అన్నాడు.భీష్ముడు " సుయోధనా సంధి చేసుకుని ధర్మరాజుతో చేరు భీష్ముడు మన హితం కోరుతాడు. అతడి మాటను మన్నించు " అన్నాడు. సుయోధనుడు ఆ మాటలను లక్ష్యపెట్ట లేదు. ఆ మాటలకు కోపించిన " సుయోధనా! మాట్లాడవెందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించినపుడు నీ సైన్యం పారి పోలేదా? కర్ణుడు నీ చెంత ఉండి ఏమి చేసాడు. కాని ఇప్పుడు అలా కాదు శ్రీకృష్ణుని సారధ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. కర్ణా యుద్ధంలో మరణించి వీరుడవు అనిపించుకుంటావు. సుయోధనుని మరణానికి కారకుడవు అవుతావు " అన్నాడు.కర్ణుడు విరక్తిగా " సుయోధనా! భీష్ముని మాటలు నా మనసుని కలచి వేస్తున్నాయి. ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగు పెట్టను.ఆతరవాత నేను నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు " అని అస్త్ర సన్యాసం చేసిన కర్ణుడు ఇక అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళాడు.అప్పుడు భీష్ముడు నవ్వుతూ " అయ్యో సుయోధనా! ఇంతటి మహా వీరుడు అలిగితే ఎలాగా! కుమారా నీవు ఈ కర్ణును అండ చూసుకుని యుద్ధానికి దిగాతావు. అప్పుడు మా ప్రతాపములో వ్యత్యాసం చూడు. సుయోధనా! నేను, బాహ్లికుడు, ద్రోణుడు కలసి శత్రు నాశనం చేస్తాము " అన్నాడు. సుయోధనుడు కర్ణుడు పోయాడన్న బాధ భరించ లేక " తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు. మొదట నిన్ను, ద్రోణుని, బాహ్లికుని నమ్మాను. కాని ఇప్పుడు చెప్తున్నాను. కర్ణుడు, దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే నాకు వేరొకరితో పనిలేదు " అన్నాడు.సుయోధనుని మాటలకు కలత చెందిన దృతరాష్ట్రుడు " విదురా! నాకుమారుడు కర్ణునితో కలసి మృత్యు పాశంలో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలి చెప్పు " అన్నాడు. విదురుడు " మహారాజా! మన వాళ్ళు దుర్బలులై ఒకరిలో ఒకరు కలహించుకోవడం మనకు మరింత ప్రతికూలం అర్జునునకు అనుకూలం. మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు " అన్నాడు. దృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! మరలి వచ్చు నపుడు అర్జునుడు నీతో ఏమన్నాడో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " దేవా! అర్జునుడు నాతో " ధర్మరాజు న్యాగంగా మాకు రావలసిన రాజ్య భాగం అడుగుతున్నాడు. దర్పంతో ఇవ్వకుంటే మాచేత వారు యుద్ధభూమిలో చావక మానరు " అన్నాడు.

దృతరాష్ట్రుడు సంజయుని జయాపజయాలు వివరించమని కోతుట

ఆ పై దృతరాష్ట్రుడు " సభ ముగించాడు. అందరూ వెళ్ళిన తరవాత అక్కడ ఉన్న సంజయుని చూసి దృతరాష్ట్రుడు " సంజయా ! నీకు ఇరు పక్షాలలో ఉన్న వీరులందరూ తెలుసు. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా " అని అడిగాడు. సంజయుడు " దేవా ! ఈ విషయం నన్ను అడగడం కన్నా గాంధారిని, మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగడం మంచిది " అన్నాడు. వెంటనే దృతరాష్ట్రుడు " తన తండ్రి వ్యాసుని ధ్యానించాడు. గాంధారిని పిలిపించాడు. వ్యాసుడు స్సంజయుని ఛూసి " సంజయా! నీకు అన్నీ తెలుసు. నేను వినేలా దృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానం చెప్పు " అన్నాడు.సంజయుడు " దృతరాష్ట్రా ! నీవు కౌరవ పండవ సేనకు కల తారతమ్యం గురించి అడిగావు. పాండవ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. మీ పక్షాన ఎవరున్నరు చెప్పు. పాండవుల బలం శ్రీకృష్ణుడే . సమస్త లోకాలు ఒక పక్కన శ్రీ కృష్ణుడు ఒక పక్కన నిలిచినా శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సత్యం, ధర్మం , న్యాయం ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి జయం తప్పదు " అన్నాడు. దృతరాష్ట్రుడు " సంజయా! కృష్ణుని గురించి నాకు తెలియక పోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం " అన్నాడు. సంజయుడు " లోకంలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకో లేరు. విద్యా వినయ భూషితుడు తెలుసుకొనగలడు. దృతరాష్ట్రుడు " విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి వివరించు " అన్నాడు. సంజయుడు " దేవా ! ప్రతి మనిషికి సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ధర్మంగా ఉంటాను. అందువలన నేను విష్ణువును తెలుసుకున్నాను. నీకు గాని వేరెవరికైనా విష్ణువును తెసుకోవడానికి ఇది తక్క వేరు మార్గం లేదు. ఇందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు " అన్నాడు. దృతరాష్ట్రుడు " పక్కనే ఉన్న సుయోధనుని చూసి " నాయనా సుయోధనా ! సంజయుడు మన శ్రేయోభిలాషి. అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నీవు నీ తమ్ములతో క్షేమంగా ఉండండి " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! ఈ లోకాలు సర్వ నాశనం అయినా నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను " అన్నాడు. దృతరష్ట్రుడు నిర్వేదంగా " గాంధారి ! విన్నావా నీ కుమారుని మాటలు. వీడు దుర్మార్గుడు, నీతి బాహ్యుడు, గర్విష్టి, అసూయాద్వేహాలు కలవాడు నా మాట వినడు. వీడు చెడి పోతాడు. వీడికిక బ్రతుకు లేదు " అన్నాడు. గాంధారి " సుయోధనునితో " కుమారా సుయోధనా ! ఈ ఐశ్వర్యం , సంపద , రాజ్యం, నీ ఆయుషు ఎందుకు వదులు కుంటావు. దైవం భీముని రూపంలో నిన్ను చంపుతుంది. నీ లాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా ? " అన్నది. వ్యాసుడు " దృతరాష్ట్రునితో " నీకు శ్రీకృష్ణుడంటే భక్తి అందుకే సంజయుని రాయబారిగా పంపావు. సంజయుని మాట విని శ్రీకృషుని ఆశ్రయించు. రాగ ద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువ ఔతాడు. కామక్రోధాలతో అలమటించే వారికి అతను దూరంగా ఉంటాడు.అన్నాడు. దృతరాష్ట్రుడు " మీరు చెప్పినట్లే చేస్తాను " అన్నాడు. దృతరాష్ట్రుడు " శ్రీకృష్ణునికి వాసుదేవుడనే పేరు ఎలా వచ్చింది. సంజయుడు " శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు. సకల జగము అతనిలో ఉంటాయి కనుక అతనిని వాసుదేవుడంటారు. ఇందియ నిగ్రహంతో అతనిని ధ్యానిస్తే అతని వశం ఔతాడు. నీవు కూడా అన్ని చింతలు వదిలి అతనిని ధ్యానించు " అన్నాడు. దృతరాష్ట్రుడు " వ్యాసమహర్షీ ! నేను శ్రీకృష్ణుని శరణు వేడుతాను . శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని దర్శింల లేను. నిరంతరం కృష్ణుని సన్నిధిలో ఉండే వారు ఎంతటి పుణ్యాత్ములో కదా " అని విచారించాడు. అంతట వ్యాసుడు నిసిష్క్రమించాడు. దుర్యోధనుడు, గాంధారి, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళారు.



ఉద్యోగ పర్వం రెండవ భాగం కొరకు ఉద్యోగ పర్వము-2 చూడండి.

ఇవి కూడా చూడండి

మూలాలు


బయటి లింకులు