Coordinates: 14°55′N 78°01′E / 14.92°N 78.02°E / 14.92; 78.02

తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: zh:塔德帕特里
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Tadpatri
పంక్తి 65: పంక్తి 65:
[[es:Tadpatri]]
[[es:Tadpatri]]
[[it:Tadpatri]]
[[it:Tadpatri]]
[[ms:Tadpatri]]
[[new:ताडिपत्रि मण्डल, अनन्तपुर जिल्ला]]
[[new:ताडिपत्रि मण्डल, अनन्तपुर जिल्ला]]
[[pl:Tadpatri]]
[[pl:Tadpatri]]

04:42, 9 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

  ?తాడిపత్రి మండలం
అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్
అనంతపురం జిల్లా పటంలో తాడిపత్రి మండల స్థానం
అనంతపురం జిల్లా పటంలో తాడిపత్రి మండల స్థానం
అనంతపురం జిల్లా పటంలో తాడిపత్రి మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°55′N 78°01′E / 14.92°N 78.02°E / 14.92; 78.02
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం తాడిపత్రి
జిల్లా (లు) అనంతపురం
గ్రామాలు 27
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,37,811 (2001 నాటికి)
• 70150
• 67661
• 59.88
• 73.21
• 46.09


తాడిపత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలము.

తాడిపత్రి చరిత్ర

విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ,గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతము విజయనగర సామ్రాజ్యములో అంతర్బాగము.మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగానుప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది.దీనికి వేదకాలంలోభాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది.పూర్వం ఈ ప్రాంతంలోతాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని,తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు.క్రీ.శ.1350 ప్రాంతములోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశముతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతమును అభివ్ళద్ది గావించెను.


తాడిపత్రిలో శ్రీబుగ్గరామలింగేశ్వరాలయం,శ్రీచింతలవెంకటరమణస్వామిఆలయాలు చరిత్ర ప్రసిద్ది గాంచినఆలయాలు.క్రీ.శ.1460-1525 మద్యలో నిర్మించబడ్డాయి.వీటిలో బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్నివిజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు తాడిపత్రి కైఫీయత్ ద్వారా తెలుస్తున్నది. ఈరెండు దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతోఅలరారుతూ చూపరులకు నయనానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తి పారవశ్యములో ముంచివేస్తూవుంటాయి. ఈరెండు ఆలయాలే గాకశ్రీ వాసవి కన్యక పరమెశ్వరి అమ్మవారి ఆలయము, శ్రీ కోదండరామ రంగనాధ స్వామి అళ్వారుల ఆలయం,వ్యాసరాయ ప్రతస్టిత అంజనేయస్వామి దేవస్థానము,శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయము,రాఘవేంద్ర స్వామి ఆలయము, శ్రీ లలితా దేవి ఆలయము, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము, శిర్ది సాయి బాబా ఆలయము కూడా తాడిపత్రిలోగలవు.ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధఆలయం,ఓబుళేసు కోనఆలయాలు గలవు.

తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణము.ఇది చెన్నయి, ముంబై రైలు మార్గములో కడప, గుంతకల్ జంక్షన్ ల మధ్యన కలదు. అనంతపురం నుంచి 55 కి.మీ,కడపనుంచి 104 కి.మీ,బెంగుళూరు నగరంనుంచి 250కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ అనేక కడప బండల పాలిష్ ప్యాక్టరీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేకము కలవు. ఇక్కడ పెన్నా సిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు గలవు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడ అనేకము కలవు. ఇక్కడికి దాదాపు 25 కిలోమీటర్ల దూరములో ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు కలవు. 10 కి.మీ. దూరంలో ,హాజీవలీ దర్గా,15కి.మీ.దూరంలొ పప్పూరు గ్రామంలో శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి ,భీమలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి.

తాడిపత్రి మండలంలో అల్ట్రాటెక్ సిమెంట్(L&T)., పెన్నా సిమెంట్స్, SJK స్టీల్స్ (Kalyani Gerdau steel Ltd) వంటి కర్మాగారాలున్నాయి. కడప రాతికి కూడా తాడిపత్రి ప్రసిద్ధం. పట్టణం పరిసర ప్రాంతాలలో షుమారు 600 గ్రానైట్ ప్రోసెసింగ్ పరిశ్రమలు మరియు నల్ల రాతి పొలిష్ పరిశ్రమలు 1000 దాకా కలవు .

మండలంలోని గ్రామాలు

  బన్దర్లపల్లి

మండలంలోని పట్టణాలు

బన్దర్ల్పల్లి

ఇవి కూడా చూడండి