Jump to content

ఫెర్జాల్ జిల్లా

వికీపీడియా నుండి
ఫెర్జాల్ జిల్లా
మణిపూర్ రాష్ట్ర జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Coordinates (ఫెర్జాల్): 93° 11' 16.0440 East and 24° 15' 43.0524 N
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ఏర్పాటు2016
ముఖ్య పట్టణంఫెర్జాల్
విస్తీర్ణం
 • మొత్తం2,285 కి.మీ2 (882 చ. మై)
జనాభా
 • మొత్తం47,250
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్
ప్రధాన రహదారులుజాతీయ రహదారి-150, జాతీయ రహదారి-2

ఫెర్జాల్ జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం ఫెర్జాల్.[1]

భౌగోళికం

[మార్చు]

ఫెర్జాల్ జిల్లా మణిపూర్ రాష్ట్ర దక్షిణ భాగంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 1,037 మీటర్ల (3,402 అడుగుల) ఎత్తులో ఉంది. దీనికి తూర్పు వైపు చురచంద్‌పూర్ జిల్లా; ఉత్తరం వైపు తమెంగ్‌లాంగ్ జిల్లా, జిరిబం జిల్లాలు; పశ్చిమం వైపు అస్సాం రాష్ట్ర కచార్ జిల్లా; దక్షిణం వైపు సిన్లుంగ్ హిల్స్ (మిజోరాం) ఉన్నాయి. ఫెర్జాల్ జిల్లా 93°11'16.0440' తూర్పు రేఖాంశం, 24°15'43.0524' ఉత్తర అక్షాంశం మధ్య ఉంది. ప్రభుత్వ రికార్డు ప్రకారం, ఫెర్జాల్ జిల్లాలో సుమారు 200 గ్రామాలు ఉన్నాయి.

2016, డిసెంబరు 16న మణిపూర్ ముఖ్యమంత్రి ఓ. ఇబోబి సింగ్ ఫెర్జాల్ జిల్లా పరిపాలనా కేంద్రాన్ని ప్రారంభించాడు.[2]

వాతావరణం

[మార్చు]

ఈ జిల్లాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు కనీష్టంగా 3.4°C (38.1°F), గరిష్టంగా 34.1°C (93.4°F) ఉంటాయి. వార్షిక వర్షపాతం 670 నుండి 1,450 మి.మీ. (26 నుండి 57 అంగుళాలు) ఉంటుంది.

విస్తీర్ణం, జనాభా

[మార్చు]

ఇది 2,285 కి.మీ2 (882 చ.మై.) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 47,250 జనాభా ఉంది.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

ఈ జిల్లాను 4 ఉప విభాగాలుగా విభజించారు.[1]

  1. ఫెర్జాల్ ఉప విభాగం
  2. పర్బంగ్ ఉప విభాగం
  3. థాన్లోన్ ఉప విభాగం
  4. వంగై రేంజ్ ఉప విభాగం

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఈ జిల్లాలో హమరు, గాంగ్టే, పైట్, సిమ్టే, తడౌ (కుకి), వైఫీ, జూ వంటి తెగలకు చెందినవారు నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 80% భూభాగం అటవీప్రాంతంలో ఉండగా, మిగిలిన 20% సాగు కోసం ఉపయోగించబడుతుంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి కాగా, వరి, మొక్కజొన్న, అల్లం వంటివి ఇక్కడ ప్రధాన పంటలు.[1]

రవాణా

[మార్చు]

ఫెర్జాల్ జిల్లా రోడ్డుమార్గం ద్వారా రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరంతో కలుపబడివుంది. 2017లో ఇంఫాల్, ఫెర్జాల్ మధ్య బస్సు సర్వీసు ప్రారంభమైంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Pherzawl District Profile". Pherzawl District Website. Retrieved 2021-01-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Pherzawl District Inauguration (Night Programme)". YouTube. 2016-12-20. Retrieved 2021-01-10.
  3. https://web.archive.org/web/20180802201744/https://www.zoramobserver.com/manipur/first-view-of-pherzawl-bus-from-imphal//

ఇతర లంకెలు

[మార్చు]