ముహమ్మద్ రఫీ
మహమ్మద్ రఫీ | |
---|---|
మహమ్మద్ రఫీ
| |
వ్యక్తిగత సమాచారం | |
జననం | డిసెంబరు 24, 1924 |
ప్రాంతము | కోట్లా సుల్తాన్ సింగ్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1980 జూలై 31 | (వయసు 55)
సంగీత రీతి | హిందీ, ఉర్దూ , ప్రాంతీయ గాయకుడు |
వృత్తి | గాయకుడు |
వాయిద్యం | నేపధ్యగాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1944–1980 |
మహమ్మద్ రఫీ (Mohammed Rafi) (డిసెంబర్ 24, 1924 - జూలై 31, 1980) హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు.
ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా (బాలీవుడ్) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.
హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ, లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్, షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబిలీ హీరో అయ్యాడు. రఫీ, ముకేష్, మన్నాడే, కిషోర్ కుమార్, మహేంద్ర కపూర్ ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది.
రఫీ గురించి
[మార్చు]పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ, ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్. సెహ్ గల్ గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) గుల్ బలోచ్లో జీనత్ బేగం తోడుగా పాడనిచ్చాడు.
రఫీ పాడిన తెలుగు పాటలు
[మార్చు]రఫీతో జగ్గయ్య తొలి సారి తెలుగులో పాడించారు. భక్త రామదాసు (నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు నేపథ్యగానం చేశారు. ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు. (భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు.
రఫీ పాడిన ప్రముఖ భజన్ లు
[మార్చు]షకీల్ బదాయూనీ రచన చేస్తే, నౌషాద్ సంగీత దర్శకత్వం వహిస్తే రఫీ గానంచేస్తే ఇలాంటి భజన్ లే వుంటాయి మరి.
- హరీ ఓం, మన్ తడ్ పత్ హరీ దర్షన్ కో ఆజ్ (బైజూ బావరా)
- భగవాన్, ఓ దునియా కే రఖ్ వాలే, సున్ దర్ద్ భరే మేరే నాలే (బైజూ బావరా)
- సుఖ్ కే సబ్ సాథీ, దుఖ్ మే నా కోయీ, మేరే రామ్ తేరా నామ్ ఏక్ సాచా దూజా నా కోయీ (కోహినూర్)
రఫీ పాడిన కొన్ని మధుర హిందీ గీతాలు
[మార్చు]- ఏ దునియా ఏ మెహ్ ఫిల్, మెరే కామ్ కీ నహీఁ (హీర్ రాంఝా)
- సుహానీ రాత్ ఢల్ చుకీ, నా జానే తుమ్ కబ్ ఆవోగీ (దులారి)
- యే జిందగీ కే మేలే యే జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ నా హోంగే అఫ్సోస్ హమ్ నా హోంగే (మేలా)
- బాబుల్ కీ దువాయేఁ లేతీజా (నీల్ కమల్)
అవార్డులు , గుర్తింపులు
[మార్చు]సం. | పాట | సినిమా | సంగీత నిర్దేశకుడు | గేయరచన | ఫలితం |
---|---|---|---|---|---|
1977[2] | "క్యా హువా తేరా వాదా" | హం కిసీ సే కమ్ నహీఁ | ఆర్.డి.బర్మన్ | మజ్రూహ్ సుల్తాన్ పురి | గెలుపు |
సం. | పాట | సినిమా | సంగీత దర్శకుడు | గేయ రచన | ఫలితం |
---|---|---|---|---|---|
1960 | "చౌధవీఁ కా చాంద్ హో" | చౌధవీ కా చాంద్ | రవి | షకీల్ బదాయూని | గెలుపు |
1961 | "తేరి ప్యారీ ప్యారీ సూరత్ కో" | ససురాల్ | శంకర్-జైకిషన్ | హస్రత్ జైపురి | గెలుపు |
1961 | "హుస్న్ వాలే తెరా జవాబ్ నహీఁ" | ఘరానా | రవి | షకీల్ బదాయూనీ | ప్రతిపాదించబడింది |
1962 | "అయ్ గుల్ బదన్ అయ్ గుల్ బదన్" | ప్రొఫెసర్ | శంకర్-జైకిషన్ | హస్రత్ జైపురి | ప్రతిపాదించబడింది |
1963 | "మేరే మెహబూబ్ తుఝే" | మేరే మెహబూబ్ | నౌషాద్ అలీ | షకీల్ బదాయూనీ | ప్రతిపాదించబడింది |
1964 | "చాహూంగా మై తుఝే సాంఝ్ సవేరే" | దోస్తి | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | మజ్రూహ్ సుల్తాన్ పురి | గెలుపు |
1965 | "ఛూ లేనే దో నాజుక్ హోంటో కోం " | కాజల్ | రవి | షకీల్ బదాయూనీ | ప్రతిపాదించబడింది |
1966 | "బహారో ఫూల్ బర్సావో" | సూరజ్ | శంకర్-జైకిషన్ | హస్రత్ జైపురి | గెలుపు |
1968 | "దిల్ కే ఝారోంకే మే తుఝ్ కో" | బ్రహ్మచారి | శంకర్-జైకిషన్ | హస్రత్ జైపురి | గెలుపు |
1968 | "మై గావూ తుమ్ సోజావో" | బ్రహ్మచారి | శంకర్-జైకిషన్ | శైలేంద్ర | ప్రతిపాదించబడింది |
1969 | "బడీ మస్తానీ హై" | జీనే కీ రాహ్ | శంకర్-జైకిషన్ | ఆనంద్ బక్షి | ప్రతిపాదించబడింది |
1970 | "ఖిలోనా జాన్ కర్" | ఖిలోనా | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | ఆనంద్ బక్షి | ప్రతిపాదించబడింది |
1973 | "హమ్ కో తో జాన్ సే ప్యారీ" | నైనా | శంకర్-జైకిషన్ | హస్రత్ జైపురి | ప్రతిపాదించబడింది |
1974 | "అచ్ఛా హీ గువా దిల్ టూట్ గయా" | మా బహెన్ ఔర్ బీవీ | శారద | ఖమర్ జలాలాబాది, వేదపాల్ వర్మ | ప్రతిపాదించబడింది |
1977 | "క్యా హువా తేరా వాదా" | హమ్ కిసీ సే కమ్ నహీఁ | ఆర్.డి.బర్మన్ | మజ్రూహ్ సుల్తాన్ పురి | గెలుపు |
1977 | "పర్దా హై పర్దా" | అమర్ అక్బర్ ఆంథోనీ | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | ఆనంద్ బక్షి | ప్రతిపాదించబడింది |
1978 | "ఆద్మీ ముసాఫిర్ హై" | అప్నాపన్ | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | ఆనంద్ బక్షీ | ప్రతిపాదించబడింది |
1979 | "చలోరే డోలీ ఉఠావో కహార్" | జానీ దుష్మన్ | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | వర్మా మలిక్ | ప్రతిపాదించబడింది |
1980 | "మేరే దోస్త్ కిస్సా యే" | దోస్తానా | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | ఆనంద్ బక్షి | ప్రతిపాదించబడింది |
1980 | "దర్దే దిల్ దర్దే జిగర్ " | కర్జ్ | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | ఆనంద్ బక్షి | ప్రతిపాదించబడింది |
1980 | "మైనే పూఛా చాంద్ సే" | అబ్దుల్లా | ఆర్.డి.బర్మన్ | ఆనంద్ బక్షి | ప్రతిపాదించబడింది |
సం. | సినిమా | సంగీత దర్శకుడు | గేయరచన | ఫలితం |
---|---|---|---|---|
1957 | తుమ్ సా నహీఁ దేఖా | ఓ.పి.నయ్యర్ | మజ్రూహ్ సుల్తాన్ పురి | గెలుపు |
1965[4] | దోస్తి | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ | మజ్రూహ్ సుల్తాన్ పురి | గెలుపు |
1966[5] | ఆర్జూ | శంకర్-జైకిషన్ | హస్రత్ జైపురి | గెలుపు |
- సుర్ శ్రింగార్ అవార్డ్
సం. | సినిమా | సంగీత దర్శకుడు | గేయరచన | ఫలితం |
---|---|---|---|---|
1964 | చిత్రలేఖ | రోషన్ | సాహిర్ లూధియానవి[6] | గెలుపు |
- గౌరవాలు
- 1948 - స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పతాకాన్ని జవహర్లాల్ నెహ్రూ చేతుల ద్వారా ప్రదానం చేయబడింది.[7]
- 1967 - భారత ప్రభుత్వంచే పద్మశ్రీ బిరుదు ప్రదానం చేయబడింది.
- 2001 - హీరో హోండా, స్టార్ డస్ట్ మేగజైన్ లద్వారా "బెస్ట్ సింగర్ ఆఫ్ ద మిలీనియం గౌరవ ప్రదానం.[8]
- 2013 - CNN-IBN పోల్ లో గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హిందీ సినిమాగా ఎన్నికయ్యాడు.
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 633–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 September 2012.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;tribuneindia_sang_for_kishore
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Filmfare Awards list". The Times Of India. Archived from the original on 2012-07-08. Retrieved 2014-07-31.
- ↑ "1965- 28th Annual BFJA Awards - Awards For The Year 1964". Bengal Film Journalists' Association. Archived from the original on 8 జనవరి 2010. Retrieved 14 December 2008.
- ↑ "1966: 29th Annual BFJA Awards - Awards For The Year 1965". Bengal Film Journalists' Association. Archived from the original on 8 జనవరి 2010. Retrieved 22 October 2009.
- ↑ "His Voice swayed millions". Retrieved 25 December 2010.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;sangeetmahal_hall_of_fame
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Mohd Rafi and Lata: Singers of Millennium". Archived from the original on 13 మే 2014. Retrieved 25 October 2009.
బయటి లింకులు
[మార్చు]- మూలాల లోపాలున్న పేజీలు
- Pages using the JsonConfig extension
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- భారతీయ కళాకారులు
- ఉర్దూ సాహితీకారులు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- భారతీయ గజల్ గాయకులు
- 1924 జననాలు
- 1980 మరణాలు
- పంజాబ్ వ్యక్తులు
- హిందీ సినిమా నేపథ్యగాయకులు
- భారతీయ పురుష గాయకులు