రాయగఢ్
రాయగఢ్ | |
---|---|
Coordinates: 21°54′N 83°24′E / 21.9°N 83.4°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | రాయగఢ్ |
Elevation | 219 మీ (719 అ.) |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 496 001 |
ప్రాంతపు కోడ్ | 7762 |
Vehicle registration | CG 13 |
లింగనిష్పత్తి | 1000/985 ♂/♀ |
రాయగఢ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, రాయగఢ్ జిల్లాలోని నగరం. ఇది రాయగఢ్ జిల్లా ముఖ్యపట్టణం. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. రాయగఢ్, బొగ్గు నిల్వలకు, విద్యుత్ ఉత్పత్తికీ ప్రసిద్ధి చెందింది. దీనిని ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక రాజధానిగా భావించి సంస్కారధాని అని కూడా అంటారు.
జనాభా వివరాలు
[మార్చు]నగర జనాభాలో ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, హర్యానా, బీహార్ ప్రజలు ఉన్నారు. ప్రధానంగా మాట్లాడే భాషలు ఛత్తీస్‌గఢీ, హిందీ, ఒడియా. బెంగాలీ, తెలుగు, మరాఠీ మాట్లాడే ప్రజలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు.
2001 నాటి భారత జనగణన ప్రకారం,[1] రాయగఢ్ జిల్లా జనాభా 12,69,925. రాయగఢ్ నగరం జనాభా 3,64,287. నగర జనాభాలో పురుషులు 52%, మహిళలు 48% ఉన్నారు. సగటు అక్షరాస్యత 71%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీల అక్షరాస్యత 62%. జనాభాలో 80% హిందువులు, 15% క్రైస్తవులు, మిగిలిన 5% ఇతర మతాలకు చెందిన వారు. రాయగఢ్‌లో, 13% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
రవాణా
[మార్చు]రైల్వేలు
[మార్చు]రాయగఢ్ స్టేషను, హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గం లోని టాటానగర్-బిలాస్‌పూర్ సెక్షన్‌లో ఉంటుంది. ఇది బ్రాడ్ గేజ్ మార్గం. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, కొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లూ ఇక్కడ ఆగుతాయి, గోండ్వానా ఎక్స్‌ప్రెస్, జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు రాయగఢ్‌లో ఉద్భవించాయి.
రాయగఢ్ న్యూ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, కోట, పాట్నా, అహ్మదాబాద్, జైపూర్, భువనేశ్వర్, నాగపూర్, విశాఖపట్నం మొదలైన అనేక ప్రధాన నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇది బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌పై ఆధారపడాలి.
రాయగఢ్ ప్రధాన రైల్వే స్టేషను రాయగఢ్ నగరం నడిబొడ్డుకు సమీపంలో ఉంది. కిరోడిమల్ నగర్ రైల్వే స్టేషను రాయగఢ్ నగరంలోని శివారు చిన్న స్టేషన్. రాయగఢ్ రైల్వే స్టేషన్ అంబికాపూర్, సుర్గుజా, ధరమ్‌జైగర్, లైలుంగా, సారంగఢ్.వసమీప ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్నది రాయగఢ్ రైల్వే స్టేషన్‌లో మంచి వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉంది, అవసరమైనప్పుడు రాత్రిపూట పార్కింగ్ చేయవచ్చు.
కొండతరాయ్ విమానాశ్రయం రాయఘర్ నుండి 9 కి.మీ. దూరంలో ఉంది. 2017 మే నాటికి దేశీయ విమానాల కోసం రాష్ట్రంలోని రెండవ విమానాశ్రయంగా రాయ్‌గఢ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, 2013 జూలైలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో ఒక అవగాహన కుదుర్చుకుంది.[2] నాలుగు లైన్ల జాతీయ రహదారి 216 నగరం నుండి విమానాశ్రయాన్ని కలుపుతుంది.
భౌగోళికం, వాతావరణం
[మార్చు]రాయగఢ్ 21°54′N 83°24′E / 21.9°N 83.4°E వద్ద,[3] సముద్రమట్టం నుండి సగటున 215మీటర్ల ఎత్తున ఉంది. కేలో నది నగరం గుండా ప్రవహిస్తుంది. ఇది నగర దాని ప్రధాన నీటి వనరులలో ఒకటి.
కనిష్ట - గరిష్ట ఉష్ణోగ్రత పరిధి వేసవిలో 29.5 - 49°C ఉండగా, శీతాకాలంలో 8 - 25°C ఉంటుంది.
శీతోష్ణస్థితి డేటా - Raigarh (1981–2010, extremes 1951–2008) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.4 (92.1) |
39.4 (102.9) |
43.0 (109.4) |
46.0 (114.8) |
48.3 (118.9) |
47.2 (117.0) |
41.8 (107.2) |
39.0 (102.2) |
38.0 (100.4) |
38.6 (101.5) |
36.6 (97.9) |
34.4 (93.9) |
48.3 (118.9) |
సగటు అధిక °C (°F) | 27.9 (82.2) |
30.8 (87.4) |
35.5 (95.9) |
39.8 (103.6) |
41.4 (106.5) |
37.4 (99.3) |
32.2 (90.0) |
31.2 (88.2) |
32.2 (90.0) |
32.4 (90.3) |
30.3 (86.5) |
28.2 (82.8) |
33.3 (91.9) |
సగటు అల్ప °C (°F) | 13.3 (55.9) |
16.2 (61.2) |
20.5 (68.9) |
24.8 (76.6) |
27.5 (81.5) |
26.8 (80.2) |
25.1 (77.2) |
25.0 (77.0) |
24.6 (76.3) |
22.2 (72.0) |
17.5 (63.5) |
13.1 (55.6) |
21.4 (70.5) |
అత్యల్ప రికార్డు °C (°F) | 6.8 (44.2) |
7.8 (46.0) |
12.2 (54.0) |
14.4 (57.9) |
18.7 (65.7) |
19.5 (67.1) |
18.6 (65.5) |
18.4 (65.1) |
20.2 (68.4) |
13.4 (56.1) |
9.3 (48.7) |
6.4 (43.5) |
6.4 (43.5) |
సగటు వర్షపాతం mm (inches) | 16.7 (0.66) |
16.0 (0.63) |
14.3 (0.56) |
14.7 (0.58) |
34.5 (1.36) |
202.0 (7.95) |
403.5 (15.89) |
401.9 (15.82) |
230.7 (9.08) |
46.6 (1.83) |
11.3 (0.44) |
2.4 (0.09) |
1,394.7 (54.91) |
సగటు వర్షపాతపు రోజులు | 1.3 | 1.2 | 1.3 | 1.3 | 2.1 | 8.5 | 15.8 | 16.2 | 11.0 | 2.8 | 0.6 | 0.2 | 62.4 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 49 | 40 | 31 | 26 | 30 | 53 | 75 | 79 | 75 | 62 | 53 | 51 | 52 |
Source: India Meteorological Department[4][5] |
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Chhattisgarh's second airport worth Rs 280 crore in Raigarh soon". The Times of India. 24 July 2013. Archived from the original on 16 నవంబరు 2014. Retrieved 27 July 2013.
- ↑ Falling Rain Genomics, Inc - Raigarh
- ↑ "Station: Raigarh Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 641–642. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M43. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.