Jump to content

విజయ బాపినీడు

వికీపీడియా నుండి
విజయ బాపినీడు
జననం
గుత్తా బాపినీడు చౌదరి

(1936-09-22)1936 సెప్టెంబరు 22
మరణం2019 ఫిబ్రవరి 12(2019-02-12) (వయసు 82)
మరణ కారణంఅనారోగ్యం
విద్యబి. ఎ
విద్యాసంస్థసి.ఆర్.రెడ్డి కళాశాల
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-
తల్లిదండ్రులుసీతారామస్వామి, లీలావతి
బంధువులువల్లభనేని జనార్ధన్ (అల్లుడు)

విజయ బాపినీడుగా పేరు గాంచిన గుత్తా బాపినీడు చౌదరి (సెప్టెంబరు 22, 1936 - ఫిబ్రవరి 12, 2019) తెలుగు సినిమా దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు.[1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెం. 786, మగధీరుడు ముఖ్యమైనవి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. బాపినీడు తొలుత "అపరాధ పరిశోధన" అనబడు ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషముగా ఆకర్షించాయి. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.[2][3]

సినిమారంగ ప్రస్థానం

[మార్చు]

1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన కొడుకులు బాపినీడు చివరి చిత్రం.[4]

అంతేకాకుండా, రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా, భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్‌ను మాటల రచయితగా తెలుగు సినీంగానికి పరిచయం చేశాడు.[5]

సినిమాలు

[మార్చు]

మరణం

[మార్చు]

విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.
  2. "Stars: Star Interviews: Exclusive: Interview with Vijayabapineedu". Archived from the original on 2009-01-25. Retrieved 2015-12-26.
  3. Vijaya Baapineedu - IMDb
  4. ఈనాడు, తాజావార్తలు (12 February 2019). "దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత". Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.
  5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (12 February 2019). "ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత". Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.
  6. సాక్షి, సినిమా (12 February 2019). "ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత". Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.

ఇతర లింకులు

[మార్చు]