హదీసులు
వ్యాసాల క్రమం |
ముస్లింల పవిత్ర గ్రంథాలు |
---|
హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు, కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్, ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
సనద్, మతన్లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు
[మార్చు]సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి, సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.
క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.
(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది.[2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు, ఆచరణల సంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
సునన్ అబి దావూద్
[మార్చు](అబూ దావూద్)
సునన్ అల్-తిర్మజి
[మార్చు](అల్-తిర్మజి)
సునన్ నసాయి
[మార్చు](అల్-నసాయి)
సునన్ ఇబ్న్ మాజా
[మార్చు](ఇబ్న్ మాజా)
హదీసుల ప్రామాణికతలపై సందేహాలు శంకలు
[మార్చు]హదీసుల ప్రామాణికతలపై అనేక సందేహాలు, శంకలూ ఉన్నాయి. ఖురాను లాగా హదీసులు ప్రామాణికత్వాన్ని కచ్చితత్వాన్ని కలిగి లేవని, సందేహాలతో కూడి వున్నవని, ముస్లిం సముదాయాలలో అనేకులు భావిస్తారు.
షియా ముస్లింల ప్రామాణిక హదీసులు
[మార్చు]షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.
పేరు | సేకర్త | కొలమానం |
ఉసుల్ అల్-కఫి | హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి (329 AH) | 15,176 హదిత్ లు |
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ | ముహమ్మద్ ఇబ్న్ బాబుయా | 9,044 |
అల్-తహ్ ధిబ్ | షేక్ ముహమ్మద్ తూసీ | 13,590 |
అల్-ఇస్తిబ్సర్ | షేక్ ముహమ్మద్ తూసీ | 5,511 |
మూలాలు
[మార్చు]- ↑ "fatwa-online.com". Archived from the original on 2010-01-28. Retrieved 2008-12-25.
- ↑ ummah.net Archived 2010-01-31 at the Wayback Machine islamonline.com Archived 2007-09-27 at the Wayback Machine, sunnah.org Archived 2020-11-05 at the Wayback Machine, yarehman.com Archived 2010-04-05 at the Wayback Machine, inter-islam.org, fatwa-online.com Archived 2010-01-28 at the Wayback Machine