Jump to content

సియాంగ్ జిల్లా

వికీపీడియా నుండి
సియాంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
స్థాపన2015 నవంబరు 27
ప్రధాన కేంద్రంబోలెంగ్
విస్తీర్ణం
 • మొత్తం2,919 కి.మీ2 (1,127 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం31,920
 • జనసాంద్రత11/కి.మీ2 (28/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)

సియాంగ్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా.32-రుమ్‌గాంగ్, 35-పాంగిన్ అనే రెండు శాసనసభ నియోజకవర్గాలతో కూడిన అరుణాచల్ ప్రదేశ్‌ లోని పశ్చిమ సియాంగ్, తూర్పు సియాంగ్ జిల్లాలను విభజించడంద్వారా ఈ జిల్లా సృష్టించబడింది. ఈ జిల్లాను 2015 నవంబరు 27 న ముఖ్యమంత్రి నాబమ్ తుకి ప్రారంభించారు.[1]

ఈ జిల్లాలో ప్రవహించే సియాంగ్ నదినుండి ఈ జిల్లా పేరు వచ్చింది. సియాంగ్ అనే పదం ఆంగ్సీ హిమానీనదం ("ఆసి"అంటే ఆది మాండలికాలలో నీరు అని ఉద్భవించింది. "సి"అంటే "ఇది"అని అర్ధం, రెండోది ఆంగ్సీ అనే పదంనుండి తీసుకోబడింది) టిబెట్‌లోని బురాంగ్ ప్రాంతం లోని హిమాలయాల ఉత్తరభాగంలో యార్లుంగ్-త్సాంగ్పో నది, బ్రహ్మపుత్ర పారుదల ప్రధాన ఉపనది. ఈ ప్రాంతంలో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఆది తెగ నివసిస్తుంది.

స్థానం

[మార్చు]

భౌగోళికంగా, సియాంగ్ జిల్లా అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ ప్రదేశం మధ్యలో ఉంది.బోలెంగ్ సుమారు పసిఘాట్ నుండి 100 కి.మీ, అలోంగ్ నుండి 45 కి.మీ, పాంగిన్ నుండి 22 కి.మీ దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

సియాంగ్ జిల్లా ఏర్పాటుకు 2013 మార్చి 21న నాబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.[2] పద్దెనిమిది నెలల జరిగిన వాదనల మధ్య పాంగిన్ పట్టణం, జిల్లా తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా ప్రకటించారు. బోలెంగ్ పట్టణాన్ని జిల్లా ప్రధాన కార్యాలయంగా చేస్తామని ముఖ్యలు హామీ ఇచ్చారు.[3]

పాంగిన్లో మాట్లాడుతూ, సియాంగ్ జిల్లాను 2015 నవంబరు 27 న నబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ లోని 21 వ జిల్లాగా ప్రకటించారు.పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండేలా కొత్త జిల్లాను రూపొందించారు. పాఠశాల, ఆసుపత్రి, భవనాలు, వంతెనలు, రహదారులు నిర్మాణం, ఇతర పరిణామాలకోసం పాంగిన్లోని పెరామ్ వద్ద జిల్లా సచివాలయం, పాంగిన్లోని ఇతర కార్యాలయాలు ఒక చిన్నస్టేడియం నిర్మాణాలకు ఆ సమయంలో నిధులు మంజూరుకు వాగ్దానాలు చేయబడ్డాయి.[1]

భాషలు

[మార్చు]

ఆది, సినో-టిబెటన్ భాష, ఈ జిల్లా ప్రజలు మాట్లాడే భాష.

పరిపాలన

[మార్చు]

జిల్లా పరిధిలోకి వచ్చే ప్రధాన పరిపాలనా కేంద్రాలు రుమ్‌గాంగ్, కైయింగ్.ఇవి అదనపు ఉప అధికారి పర్వేక్షణలో ఉంటాయి. (ఎడిసి) జిల్లాలో కొత్త జిల్లాగా ఏర్పడేనాటికి 9 జిల్లా పరిషత్తులు ఉన్నారు. అవి జోమ్లో మొబుక్, రుమ్‌గాంగ్, కైయింగ్, పేయమ్, బోలెంగ్, రెబొ-పెరిగింగ్, సలీన్, కెబాంగ్.[3]

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి

  • బోలెంగ్ ఉప విభాగం:బోలెంగ్, రిగా, రెబో-పెరిగింగ్ ప్రాంతాలు
  • పాంగిన్ ఉప విభాగం: పాంగిన్, కెబాంగ్ ప్రాంతాలు
  • రమ్‌గాంగ్ ఉప విభాగం: జోమ్లో మొబుక్, రుమ్‌గాంగ్ ప్రాంతాలు కైయింగ్ ఉప విభాగం: కైయింగ్, పేయం ప్రాంతాలు

శాసన వ్యవస్థ

[మార్చు]

ఈ జిల్లాలో 2 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి:

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Siang becomes 21st district of Arunachal". The Arunachal Times. 28 November 2015.
  2. "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.
  3. 3.0 3.1 Amar, Sangno (1 December 2014). "Tension over district headquarters simmers at Pangin-Boleng". The Arunachal Times.

వెలుపలి లంకెలు

[మార్చు]