హజారీబాగ్
హజారీబాగ్ | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
నగరం | ||||||||
Coordinates: 23°59′N 85°21′E / 23.98°N 85.35°E | ||||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 53.94 కి.మీ2 (20.83 చ. మై) | |||||||
Elevation | 610 మీ (2,000 అ.) | |||||||
జనాభా (2011)[1] | ||||||||
• Total | 1,97,466 | |||||||
• జనసాంద్రత | 3,700/కి.మీ2 (9,500/చ. మై.) | |||||||
భాషలు | ||||||||
• అధికారిక | హిందీ, ఉర్దూ | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | ||||||||
Vehicle registration | JH-02 |
హజారీబాగ్ జార్ఖండ్ రాష్ట్రం, హజారీబాగ్ జిల్లాలోని నగరం. ఈ జిల్లాకు ముఖ్యపట్తణం. ఉత్తర చోటనాగ్‌పూర్ డివిజనుకు ప్రధాన కార్యాలయం. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. దీన్ని హెల్త్ రిసార్ట్‌గా పరిగణిస్తారు.[2] నగరం నుండి 17 కి.మీ. దూరంలో హజారీబాగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.[3]
భౌగోళికం
[మార్చు]దామోదర్ నదికి ఉపనది యైన కోనార్ నది నగరం గుండా ప్రవహిస్తుంది. హజారీబాగ్ ఇంతకు ముందు దట్టమైన అడవిగా ఉండేది. ఇప్పటికీ నగరం చుట్టూ అడవులున్నాయి.
రవాణా
[మార్చు]వైమానిక
[మార్చు]సమీప అంతర్జాతీయ విమానాశ్రయం రాంచీ లోని బిర్సా ముండా విమానాశ్రయం 102 కి.మీ. దూరంలో ఉంది. రాంచీ నుండి అన్ని ప్రధాన నగరాలకు సాధారణ విమాన సేవలు ఉన్నాయి.
రైలు
[మార్చు]80 కి.మి.. పొడవైన కోడెర్మా-హజారీబాగ్-బర్కకనా రైలు మార్గాన్ని 2015 ఫిబ్రవరిలో నిర్మించారు. కోడర్మా హజారీబాగ్ టౌన్ రైల్వే స్టేషన్ మధ్య రెండు రైళ్లు నడుస్తాయి. హజారీబాగ్ నుండి బర్కకానా జంక్షన్ వరకు రైలు మార్గం పూర్తైంది. ఈ రెండు పట్టణాల మధ్య రైళ్లు నడుస్తున్నాయి.
రోడ్డు
[మార్చు]హజారీబాగ్ జాతీయ రహదారి-33 పై ఉంది. హజారీ బాగ్ నుండి ప్రధాన నగరాలకు దూరాలు: రాంచీ 99 కి.మీ. (62 మై.), ధన్‌బాద్ 128 కి.మీ. (80 మై.) (GT రోడ్డు ద్వారా), బొకారో 116 కి.మీ. (72 మై.) (రామ్‌గఢ్ ద్వారా), గయా 130 కి.మీ. (81 మై.), పాట్నా 235 కి.మీ. (146 మై.), డాల్టోంగాంజ్ 198 కి.మీ. (123 మై.), కోల్‌కతా (ధన్‌బాద్-అసన్సోల్-గోవిందపూర్-బర్ధమాన్ ద్వారా) 434 కి.మీ. (270 మై.). రెగ్యులర్ బస్సు సర్వీసులు ఈ ప్రాంతాలను హజారీబాగ్‌కు కలుపుతాయి.
చరిత్ర
[మార్చు]ప్రాచీన కాలంలో జిల్లా స్వతంత్రంగా ఉండే గిరిజనులు నివసించలేని అడవులతో నిండి ఉంది. చోటనాగ్‌పూర్ భూభాగం, ఇప్పుడు జార్ఖండ్ అని పిలువబడుతుంది (అటవీ భూభాగం అని అర్ధం) ప్రాచీన భారతదేశంలో బాహ్య ప్రభావానికి మించి ఉండవచ్చు. టర్కో-ఆఫ్ఘన్ కాలంలో (1526 వరకు), ఈ ప్రాంతం బాహ్య ప్రభావాల నుండి దూరంగా ఉంది. 1557 లో అక్బర్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించడంతోనే జార్ఖండ్‌లోకి ముస్లిం ప్రభావం ప్రవేశించింది. అప్పుడు మొఘలులకు కోక్రా అని పేరు వచ్చింది. 1585 లో, అక్బర్ చోటనాగ్‌పూర్ రాజాను ఓడించి సామంతరాజుగా చేసుకునేందుకు షాబాజ్ ఖాన్ నాయకత్వంలో ఒక దళాన్ని పంపాడు. 1605 లో అక్బర్ మరణం తరువాత, ఈ ప్రాంతం దాని స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందింది. దీనికి 1616 లో బీహార్ గవర్నర్ క్వీన్ నూర్జెహాన్ సోదరుడు ఇబ్రహీం ఖాన్ ఫతే జాంగ్ ఒక దండయాత్ర చెయ్యాల్సిన అవసరం పడింది. చోటనాగ్‌పూర్‌కు 46 వ రాజైన దుర్జన్ సాల్‌ను ఇబ్రహీం ఖాన్ ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. అతను 12 సంవత్సరాలు ఖైదు చేయబడ్డాడు. కానీ తన సామర్థ్యాన్ని చూపించిన తరువాత విడుదలై తిరిగి సింహాసనంపై తిరిగి నియమించబడ్డాడు.
1632 లో, చోటనాగ్‌పూర్‌ను జాగీర్ (ఎండోమెంట్) గా గవర్నర్‌కు పాట్నాలో రూ .1,36,000 వార్షిక చెల్లించే నిబంధనతో ఇచ్చారు. దీనిని 1636 లో రూ .1,61,000 కు పెంచారు. ముహమ్మద్ షా (1719-1748) పాలనలో, అప్పటి బీహార్ గవర్నర్ సర్బలంద్ ఖాన్ చోటనాగ్‌పూర్ రాజాను ఎదిరించి అతన్ని లొంగదీసుకున్నాడు. 1731 లో బీహార్ గవర్నర్ ఫక్రుద్దౌలా నేతృత్వంలో మరో దండయాత్ర జరిగింది. అతను చోటనాగ్‌పూర్ రాజాతో సంధి చేసుకున్నాడు. 1735 లో అలీవర్దీ ఖాన్, ఈ సంధి నిబంధనల ప్రకారం రామ్‌గఢ్ రాజా నుండి రూ .12,000 వార్షిక శిస్తును వసూలు చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డాడు.
హజారీబాగ్ పట్టణం
[మార్చు]హజారీబాగ్ పట్టణం 1790 లో కంటోన్మెంట్‌గా మారింది. దానికి పదేళ్ళ ముందే రామ్‌గఢ్ బెటాలియన్ ఏర్పడింది. ఇది అప్పుడు రామ్‌గఢ్ జిల్లాలో భాగం. ఇది 1834 లో జిల్లా కేంద్రంగా మారింది. 1869 లో హజారీబాగ్ మునిసిపాలిటీగా మారింది. పట్టణానికి ఆగ్నేయాన మిలిటరీ కంటోన్మెంటు 1874 వరకు అభివృద్ధి చెందింది. 1874 లో ప్రేవుల్లో వచ్చే జ్వరం ప్రబలినపుడు, అక్కడి జైలు కాపలా కోసం కొందరి సైనికులను ఉంచి మిగతావారినందరినీ అక్కడి నుండి ఖాళీ చేయించారు.
దీని ఫలితంగా ప్రణాళికాబద్ధమైన నగరం ఏర్పడింది. పట్టణం యొక్క ఈ భాగాన్ని బొడ్డాం బజార్ అని పిలుస్తారు. బ్రిటిషు కాలంలో చాలా మంది ఆంగ్లేయులు హజారీబాగ్‌లో స్థిరపడ్డారు. వారు వాలు పైకప్పులతో, పెద్ద బంగ్లా తరహా ఇళ్లను నిర్మించుకున్నారు. వారు గొప్ప వేటగాళ్లు. వారి గురించి చెప్పే మౌఖిక వేట కథలు పట్టణంలో పుష్కలంగా ఉన్నాయి. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత వారిలో చాలా మంది వెళ్లిపోయారు. ఈ వేట కథల జాబితాలో టుటు ఇమామ్, రాజేంద్ర పాండేలు అగ్రస్థానంలో ఉన్నారు. ఒక శతాబ్దం క్రితం పులులు, చిరుతలు పట్టణం పొలిమేరల్లో పశువులను వేటాడటం సర్వసాధారణంగా ఉండేది.
1901 జనాభా లెక్కల ప్రకారం పట్టణం జనాభా 15,799. ఇది "పూర్వ సైనిక బజార్ చుట్టూ పుట్టుకొచ్చిన కుగ్రామాల సమూహం కంటే కొంచెం పెద్దది" అని అభివర్ణించబడింది.
భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నాయకులను హజారీబాగ్ సెంట్రల్ జైలులో ఖైదు చేసేవారు. భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ జైలులో ఉన్నాడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జయప్రకాశ్ నారాయణ్‌ను ఈ జైలులోనే ఖైదు చేసారు. అతను జైలు గోడ దాటడానికి 53 పంచెల సహాయంతో స్థానిక ప్రజల మద్దతుతో తప్పించుకున్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సంవత్సరాల్లో, దేశంలో నివసించే జర్మనీ పౌరులను హజారీబాగ్ లోనే నిర్బంధించారు ("పెరోల్ క్యాంప్"). 1942 జూన్ లో ఈ క్యాంపులో 36 మంది మహిళలు, 5 గురు పురుషులు, 16 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 21 మంది మహిళలను, 13 మంది పిల్లలను 1942 ఫిబ్రవరి 25 న దియతలావా నుండి పంపించారు. శరత్కాలంలో వారిని పురంధర్ లేదా సతారా ల్లో ఉన్న కుటుంబ శిబిరాలకు బదిలీ చేసారు.
శీతోష్ణస్థితి
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Hazaribagh (1981–2010, extremes 1901–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 30.6 (87.1) |
33.6 (92.5) |
39.1 (102.4) |
41.7 (107.1) |
43.9 (111.0) |
46.6 (115.9) |
39.6 (103.3) |
39.1 (102.4) |
33.3 (91.9) |
34.0 (93.2) |
31.7 (89.1) |
29.4 (84.9) |
46.6 (115.9) |
సగటు అధిక °C (°F) | 21.8 (71.2) |
24.7 (76.5) |
29.6 (85.3) |
34.9 (94.8) |
36.6 (97.9) |
34.0 (93.2) |
29.3 (84.7) |
28.7 (83.7) |
28.9 (84.0) |
27.7 (81.9) |
25.0 (77.0) |
22.2 (72.0) |
28.6 (83.5) |
సగటు అల్ప °C (°F) | 8.3 (46.9) |
11.8 (53.2) |
16.4 (61.5) |
21.2 (70.2) |
23.6 (74.5) |
23.9 (75.0) |
22.9 (73.2) |
22.7 (72.9) |
22.0 (71.6) |
18.2 (64.8) |
13.2 (55.8) |
9.1 (48.4) |
17.8 (64.0) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0.9 (33.6) |
1.7 (35.1) |
2.9 (37.2) |
10.6 (51.1) |
15.6 (60.1) |
18.3 (64.9) |
18.9 (66.0) |
20.0 (68.0) |
16.5 (61.7) |
9.7 (49.5) |
4.4 (39.9) |
0.5 (32.9) |
0.5 (32.9) |
సగటు వర్షపాతం mm (inches) | 19.1 (0.75) |
22.2 (0.87) |
15.8 (0.62) |
18.8 (0.74) |
44.8 (1.76) |
237.6 (9.35) |
387.7 (15.26) |
341.3 (13.44) |
256.1 (10.08) |
57.9 (2.28) |
9.3 (0.37) |
9.7 (0.38) |
1,400.3 (55.13) |
సగటు వర్షపాతపు రోజులు | 1.5 | 2.0 | 1.9 | 1.4 | 3.3 | 10.7 | 17.0 | 15.7 | 11.9 | 4.2 | 0.5 | 0.9 | 71.1 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 58 | 54 | 43 | 35 | 38 | 58 | 77 | 78 | 75 | 66 | 58 | 60 | 59 |
Source: India Meteorological Department[4][5] |
జనాభా వివరాలు
[మార్చు]హజారీబాగ్ జనాభా | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1901 | 15,799 | — | |
1911 | 17,009 | 7.7% | |
1921 | 17,060 | 0.3% | |
1931 | 20,947 | 22.8% | |
1941 | 24,918 | 19.0% | |
1951 | 33,812 | 35.7% | |
1961 | 40,958 | 21.1% | |
1971 | 54,818 | 33.8% | |
1981 | 80,155 | 46.2% | |
1991 | 97,824 | 22.0% | |
2001 | 1,27,269 | 30.1% | |
2011 | 1,42,489 | 12.0% | |
మూలం:[6] |
2011 భారత జనగణన ప్రకారం, హజారీబాగ్ అర్బన్ అగ్లోమరేషన్ మొత్తం జనాభా 1,53,599. ఇందులో పురుషులు 80,095, మహిళలు 73,504.[7] హజారీబాగ్ పట్టణ ప్రాంతంలో (అర్బన్ అగ్లోమరేషన్) హజారీబాగ్ (నగరపాలక సంస్థ), ఓక్ని (జనగణన పట్టణం) లు ఉంటాయి.[8]
2011 భారత జనగణన ప్రకారం, హజారీబాగ్ నగర్ పరిషత్ మొత్తం జనాభా 1,42,489, ఇందులో 74,132 మంది పురుషులు, 68,357 మంది మహిళలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు 7,987, షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2,708.[9]
2001 జనగణన ప్రకారం, [10] హజారీబాగ్ జనాభా 1,27,243. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% ఉన్నారు. హజారీబాగ్ సగటు అక్షరాస్యత 76%. ఇది జాతీయ సగటు 64.83%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 81%, స్త్రీల అక్షరాస్యత 70%. హజారీబాగ్ జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
అక్షరాస్యత
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, హజారీబాగ్ పట్టణ ప్రాంతంలో అక్షరాస్యుల సంఖ్య 1,22,881 (మొత్తం జనాభాలో 90.14%) వీరిలో 66,602 (పురుషులలో 93.82%) పురుషులు, 56,279 (స్త్రీలలో 86.14%) మహిళలు.[7]
2011 జనాభా లెక్కల ప్రకారం, హజారీబాగ్ నగర్ పరిషత్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,12,533, వీరిలో 60,840 మంది పురుషులు, 51,693 మంది మహిళలు ఉన్నారు.[9]
మౌలిక సదుపాయాలు
[మార్చు]జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ 2011 ప్రకారం, హజారీబాగ్, హజారీబాగ్ ( నగర్ పరిషత్ ) 26.35 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. పౌర సదుపాయాలలో, 269 కి.మీ. రోడ్లున్నాయి. 23,825 గృహ విద్యుత్ కనెక్షన్లు, 1,405 వీధి దీపాలున్నాయి. విద్యా సౌకర్యాలలో 28 ప్రాథమిక పాఠశాలలు, 22 మధ్య పాఠశాలలు, 15 మాధ్యమిక పాఠశాలలు, 4 సీనియర్ మాధ్యమిక పాఠశాలలు, 5 సాధారణ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 1 వైద్య కళాశాల, 1 ఇంజనీరింగ్ కళాశాల, 1 నిర్వహణ సంస్థ/ కళాశాల, 1 పాలిటెక్నిక్, 2 గుర్తింపు పొందిన సంక్షిప్తలిపి, టైప్‌రైటింగ్, వృత్తి శిక్షణ సంస్థలు, 1 అనధికారిక విద్యా కేంద్రం (సర్వ శిక్షా అభియాన్) ఉన్నాయి.
సామాజిక, వినోద, సాంస్కృతిక సౌకర్యాలలో, వికలాంగుల కోసం 1 ప్రత్యేక పాఠశాల, 1 అనాథాశ్రమం, 3 పని చేసే మహిళా హాస్టళ్లు, 1 వృద్ధాశ్రమం, 2 స్టేడియంలు, 5 సినిమా థియేటర్లు, 3 ఆడిటోరియం/కమ్యూనిటీ హాళ్లు, 3 పబ్లిక్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లు ఉన్నాయి. సత్తు, అగరబత్తి, రైస్ మిల్లు ఉత్పత్తులు, ఫర్నిచర్ ఇది తయారు చేసిన మూడు ముఖ్యమైన వస్తువులు. ఇది 14 జాతీయం చేయబడిన బ్యాంకులు, 8 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులు, 1 సహకార బ్యాంకు, 1 వ్యవసాయ రుణ సంఘం, 19 వ్యవసాయేతర రుణ సంఘాల శాఖలున్నాయి.[11]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]పరిశ్రమ
[మార్చు]హజారీబాగ్ జార్ఖండ్‌లో రెండవ అత్యధిక బొగ్గు నిల్వను కలిగి ఉంది (ధన్‌బాద్ మొదటిది). ఇది కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఇటీవల ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలను ముమ్మరం చేసింది. NTPC వారి 3000 మె.వా విద్యుత్కేంద్రం అభివృద్ధికి పనులు జరుగుతున్నాయి. రిలయన్స్ పవర్ సంస్థకు చెందిన 3600 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. అయితే భూ పంపిణీపై ప్రభుత్వానికి కంపెనీకి మధ్య చర్చలు విఫలం కావడంతో తరువాత ఉపసంహరించుకున్నారు. డెమోటాండ్, చానోలు ఇక్కడికి సమీపం లోని పారిశ్రామిక ప్రాంతాలు.
ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Hazaribagh City". Archived from the original on 2022-06-05. Retrieved 2021-09-29.
- ↑ "Incredible India, Hazaribagh". Incredible India. Retrieved 27 January 2021.
- ↑ "Archived copy". Archived from the original on 21 May 2014. Retrieved 4 February 2016.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Station: Hazaribagh Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 321–322. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 August 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M82. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 August 2020.
- ↑ "District Census Handbook Hazaribagh, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Section II Town Directory, Statement I: Status and Growth History, Pages 652-654. Directorate of Census Operations, Jharkhand. Retrieved 21 January 2021.
- ↑ 7.0 7.1 "Provisional population totals, Census of India 2011" (PDF). Urban Agglomeration – Cities having population 1 lakh and above. Government of India. Retrieved 14 December 2015.
- ↑ "Provisional population totals, Census of India 2011" (PDF). Constituents of Urban Agglomerations haing population above 1 lakh and above, Census 2011. Government of India. Retrieved 14 December 2015.
- ↑ 9.0 9.1 "2011 Census – Primary Census Abstract Data Tables". Jharkhand – District-wise. Registrar General and Census Commissioner, India. Retrieved 14 December 2015.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "District Census Handbook Hazaribagh, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Pages 651-662. Directorate of census Operations, Jharkhand. Retrieved 21 January 2021.