ఇండియా టుడే
| మ్యాగజైన్ | ఇండియా టుడే |
|---|---|
| చీఫ్ ఎడిటర్ | ఆరోన్ పూరి |
| విషయాలు | వార్తలు, సైన్సు, క్రీడలు |
| ఫ్రీక్వెన్సి | వీక్లీ |
| సర్క్యులేషన్ | 1100000 |
| మొదటి ప్రతి | 1975 |
| కంపెనీ | ఇండియా టుడే గ్రూప్ |
| కేంద్రం | న్యూ ఢిల్లీ |
| వెబ్సైట్ | indiatoday.in |
ఇండియా టుడే లివింగ్ మీడియా ఇండియా లిమిటెడ్ వారిచే ప్రచురించబడే ఇంగ్లీష్ వార వార్తా పత్రిక (వీక్లీ న్యూస్ మ్యాగజైన్) . ఇది న్యూ ఢిల్లీ కేంద్రంగా ప్రచురితమవుతుంది. ఇండియా టుడే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ప్రచురితమగును. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ ఆరోన్ పూరి. 1975 నుండి ఈయన ఆ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇది ఇండియా టుడే గ్రూప్ లో బాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో స్తాపించబడింది. ఇది ఇప్పుడు 13 పత్రికలు, 3 రేడియో స్టేషన్లు, 4 TV చానెల్స్, 1 వార్తాపత్రిక, ఒక శాస్త్రీయ సంగీత లేబుల్ (మ్యూజిక్ టుడే) కలిగి వున్నది. 1975 లో 5,000 ప్రతులు ఒక సర్క్యులేషన్ తో ప్రచురణ ప్రారంభమై ప్రస్తుతం మిలియన్ (1000000) కాపీల సర్క్యులేషన్ తో 5 కోట్ల మంది చదువరులను కలిగి వున్నది.
ఇంగ్లీష్ లోనే కాక హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో దాని ఆనువాద ప్రచురణలు ప్రారంబించి, నాణ్యమైన జాతీయ స్థాయి వార్తలు అందించడంతో ఇంగ్లీష్ రాని వారికి గొప్ప వరంలా మారింది. ఆ విధంగా ప్రాంతీయ భాషల్లో ఇండియా టుడే ప్రచురణలు మంచి ప్రశంశలు పొందాయి.