దివ్యవాణి (వారపత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివ్యవాణి
సంపాదకులుస్వామి సత్యప్రకాష్ మెహెరానంద
వ్రాయసగాళ్ళుకె.వి.సూర్యనారాయణ, డి.వి.యన్. మూర్తి
వర్గాలువారపత్రిక
రూపంటాబ్లాయిడ్
ముద్రణకర్తశ్రీ మెహెర్ చైతన్య నికేతన్ ట్రస్ట్, మండపేట
మొదటి సంచిక1978, అక్టోబరు 15
భాషతెలుగు

దివ్యవాణి ఆధ్యాత్మిక వారపత్రిక. మండపేట నుండి శ్రీ మెహెర్ చైతన్య నికేతన్ తరఫున ఈ వారపత్రిక వెలువడింది. కె.వి.సూర్యనారాయణ ప్రచురణకర్త. నిడదవోలు లోని మెహెర్ ప్రెస్‌లో ముద్రించబడింది. స్వామి సూర్యప్రకాష్ మెహెరానంద ఈ పత్రికకు గౌరవ సంపాదకునిగా వ్యవహరించాడు. కె.వి.సూర్యనారాయణ, డి.వి.ఎన్.మూర్తి సహ సంపాదకులు. అవతార్ మెహెర్ బాబా బోధనలు ఈ పత్రిక ప్రచారం చేసింది.

ఈ పత్రిక తొలి సంచికలో ఈ క్రింది విధంగా ఉంది. అవతార్ మెహెర్ బాబా వారి సేవకు అంకితమై స్వామి సూర్యప్రకాశ్ మెహెరానందజీ సంపాదకులుగా ఒక దశాబ్దికి పైగా అవిరళ కృషి సల్పిన దివ్యవాణి మెహెర్ చైతన్య నికేతన్ ట్రస్ట్ (మెహెర్-మండపేట) ఆధ్వర్యంలో తెలుగు వారపత్రికగా పునరుద్ధరింపబడి....”

దీనిని బట్టి ఈ పత్రిక అదే పేరుతో 1978కు ముందే ఒక దశాబ్దం పాటు వెలువడిందని తరువాత వారపత్రికగా 1978లో పునరుద్ధరించబడిందని తెలుస్తున్నది.

15-10-1975 సంచికలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.

  • సిద్ధపురుషుని ద్వారా జ్ఞానోదయం - మెహెర్‌బాబా వారి మహోపదేశం
  • పునరంకితం (సంపాదకీయం)
  • దక్షిణాదిని గల సద్గురువు
  • కర్మ రహస్యం: బీజ జాగృతి
  • గురుర్బ్రహ్మ నమామ్యహం
  • స్మృతి - విస్మృతి
  • వార్తలు
  • పుస్తక పరిచయము : సమాధాన సరళి మొదటి భాగం
  • నవజీవన పరమార్థం


మూలాలు

[మార్చు]

[permanent dead link] ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో మొదటి సంచిక మూలప్రతి]