హొహొబ నూనె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జొజొబమొక్క పొద
ఆడ పుష్పము
మగపుష్పము.
కాయలు
హహోబ గింజ
హహోబ నూనె

హహొబ (Jojoba)చెట్టు సిమ్మోండసియేసి(simmondsiaceae)వృక్షకుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామం సిమ్మోండసియ చినెన్‍సిస్(simmondasia chinensis).ఈచెట్టుయొక్క మూల స్దానం మెక్సికోలోని సొనొరన్ ఎడారి[1]. విత్తనంలో 50-55%నూనెవుంటుంది.ఈ చెట్టు పేరును జొజొబ(jojoba)అని వ్రాసినప్పటికి హహొబ(hohoba)అని పిలుస్తారు,అనగా లిఖితరూపానికి మరియు వుచ్ఛరణకు వ్యత్యాసం వుంది.

భారతదేశంలో సాగుకై అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించినవి[మార్చు]

గుజరాత్,హర్యానా,రాజస్తాన్,పంజాబ్,ఉత్తరప్రదేశ్,ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు,మరియు కర్నాటక.రాజస్తాన్,గుజరాత్‍ల 'కచ్' ప్రాంతం ఈచెట్ల పెంపకానికి బాగా అనుకూలమైనది.క్రీ.శ.1960 మధ్య కాలంలో IARI(Indian arid region institute)ద్వారా భారతదేశకు కొనిరాబడి సాగుకై అభివృద్ధిచేయబడినది.IARI ప్రస్తుతపేరు NBPGR(National Burea of Plant Genetic Resources).ఎక్కువదిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్దిచేయడం,సాగుకు అనుకూలమైనప్రాంతాలను గుర్తించి,సలహాలు ఇవ్వడంచేస్తారు.రాజస్తాన్ లోని థార్ఎడారిలో ఈచెట్ల పెంపకంచేపట్టి ఎడారిప్రాంతాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టారు..

నూనె[మార్చు]

హహొబ గింజ అండాకారంగా,బ్రౌన్ రంగులోవుండి గట్టిగా వుండును(fruit nut).గింజలో 54% వరకు నూనె(liquid wax)వుండును.హెక్టారుకు 1-1.5 టన్నులవరకు గింజదిగుబడి వుండును.పంటదిగుబడి నాల్గవసంవత్సరంనుండి మొదలవుతుంది.కాని చెట్టుదిగుబడితక్కువగా వుంటుంది(50గ్తాం.లు/చెట్టుకు).పదవసంవత్సరంనుండి దిగుబడి పెరుగుతుంది.చెట్లవరుసలఖాలి 3x1.3మీ.లేదా4x1M మీ.వరుసలున్న తోటలలో చెట్టుకుఒక కే.జి.గింజలు,4x2మీ.వరుసకొలతలున్న తోటలలో 3.5 కిలోల దిగుబడివచ్చును.

నూనెలోని కొవ్వు ఆమ్లాలు పొడవైనహైడ్రొకార్బను శృంఖాలను(C20-C22)కలిగివున్నవి.ఈనూనె తిమింగళంనూనెను గుణాలలో పోలివుండి,దానికి మారుగా వినియోగిస్తునారు.అమేరికాలో ఈనూనెనుండి బయోడిసెల్ ఉత్పత్తికూడా మొదలైనది.ఔషదమందుల తయారిలో కూడా వాడెదరు.

హహొబ(jojoba) గింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[2][3]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 250Cవద్ద 1.4648-1.4650
ఐయోడిన్ విలువ 82-89
సపనిఫికెసను విలువ 92-167
అన్‌సఫొనిపియబుల్ పధార్దం 37-49
అసెటైల్‍ విలువ 6.8
R-M వులువ 0.7
సాంద్రత 250Cవద్ద 0.8642-0.8990
ద్రవీభవన ఉషోగ్రత (0C) 11.2-11.8
ఫైర్‍పాయింట్ 3300C
polenskey number 0.31
సంతృప్త ఆమ్లాలు 1.5-1.7

సాధారణంగా మొక్కల,చెట్ల విత్తనంలనుండి తీయు నూనెలలో 10-40% వరకు సంతృప్తకొవ్వుఆమ్లాలుంటాయి.మొక్కల విత్తనాలనుండి తీయు నూనెలలో సంతృప్తకొవ్వుఆమ్లాలు10-25% వరకుంటె,చెట్లగింజలనుండి తీయు నూనెలలో 20-45% వరకు సంతృప్త కొవ్వుఆమ్లాలుంటాయి.కాని జొజొబా ఎడారిమొక్క అవ్వటం వలననేమో,దీని నూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలులేవు.కేవలం అసంతృప్తకొవ్వుఆమ్లాలున్నాయి. అత్యధిక నూనెలలో 18 కార్బనులున్నకొవ్వుఆమ్లాలుండగా ఇందులో 18కార్బనులున్న,ఏకద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం 1%కన్నతక్కువవుండి,మిగిలిన అసంతృప్త కొవ్వుఆమ్లాలన్ని 20-22 వరకు కార్బనులనుకలిగినవి.

హహొబ(jojoba)గింజల నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం[3]

ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటొలిక్ ఆమ్లం(C16:1) 0.24
ఒలిక్ ఆమ్లం(C18:1) 0.66
11-Eicosenoic Acid(C20:1) 30.3
Docosenoic Acid(C22:1) 14.2
Docosdienoic acid(C22:2) 33.7}
9-Godoelic Acid(C20:1) 14.6

నూనె ఉపయోగాలు[మార్చు]

  • తిమింగళపు నూనెకుబదులు వాడెదరు[4]
  • బయోడిసెల్ తయారిలో ఉపయోగిస్తారు[5].
  • కాస్మాటిక్సు తయారిలో వాడెదరు[6]
  • మైనం(wax)తయారుచేయుటలో వాడెదరు.
  • కందెనలు(Lubricants)ఉత్పత్తిచేయుటలో వినియోగిస్తారు.
  • పార్మాసుటికల్స్(pharamceutucals)తయారిలో కూడా ఉపయోగించుతున్నారు.
  • అఢెస్సివులు(Adhesives)తయారులోను వాడెదరు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.hort.purdue.edu/newcrop/afcm/jojoba.html.D.J. Undersander1, E.A. Oelke2, A.R. Kaminski1, J.D. Doll1, D.H. Putnam2, S.M. Combs1, and C.V. Hanson2
  2. http://books.google.be/books?id=b8t59-2bLUMC&pg=PA24&dq=jojoba+oil+flash+point&hl=en&sa=X&ei=86DAUIvqGo2yhAf86oGgBQ&redir_esc=y#v=onepage&q=jojoba%20oil%20flash%20point&f=false
  3. 3.0 3.1 SEA HandBook-2009.By The Solvent Extractors' Association of India.page NO;931
  4. D.J. Undersander, E.A. Oelke, A.R. Kaminski, J.D. Doll, D.H. Putnam, S.M. Combs, and C.V. Hanson (1990). "Jojoba". Alternative Field Crops Manual. 
  5. "Jojoba oil could fuel cars and trucks". New Scientist. March 6, 2003. Retrieved 2006-10-13. 
  6. "Jojoba Oil for Nails: Natural Care for Your Perfect Manicure". Body (personal) care. Oily Oily. Retrieved 29 August 2013. 


"http://te.wikipedia.org/w/index.php?title=హొహొబ_నూనె&oldid=1220912" నుండి వెలికితీశారు