ఆంధ్రప్రదేశ్ కోటలు
Jump to navigation
Jump to search
భారతదేశాన్ని స్వాతంత్ర్యం రాక పూర్వం అనేక రాజవంశాలు పరిపాలించారు. రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయినా వారు వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే ఉన్నాయి.[1] అవి ఆనాటి చరిత్రను, నాగరికతను, అనాటి జనజీవనాన్ని, ఆర్థిక సామజిక పరిస్థితులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వుండగా కొన్ని ఆలనా పాలన లేక ముష్కరుల చేతిలో మరింత దోపిడికి గురౌతున్నాయి. ఆయా రాజులు, రాజ్యాలు ఆనాటి సంపదను ఆ యా కోటలలో దాచి వుంచారని దుండగులు వాటిని తస్కరించే ప్రయత్నంలో చారిత్రాత్మిక ప్రధానమైన ఆ యా కట్టడాలు మరింత శిథిల మవుతున్నాయి. ఆ నాటి కోటలు నిధినిక్షేపాలకు ఆలవాలమే గాదు, విజ్ఞాన బాండాగారాలు, సాంస్కృతిక సంపదకు ఆలవాలాలు. వీటి పరి రక్షణ భావి తరాలకు ఎంతో ముఖ్యం..
అనంతపురం జిల్లా కోటలు
[మార్చు]- గుత్తి కోట - ఇది అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఉన్న గిరిదుర్గం.[2]
- పెనుగొండ కోట - ఇది అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ఉన్న విజయనగర రాజులు నిర్మించిన దుర్గం.[3]
- రాయదుర్గం కోట - అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో వుంది.
- రత్నగిరి కోట: సీమ గోల్కొండ గా పేరొందిన 18 వ శతాబ్దపు కోట. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో భాగం.
కర్నూలు జిల్లా కోటలు
[మార్చు]- కొండారెడ్డి బురుజు - ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది.కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. కానీ మిగతా మూడు బురుజులు శిధిలమైపోయాయి.
- అంకాళమ్మ కోట: ఇది కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది.
కృష్ణా జిల్లా కోటలు
[మార్చు]- కొండపల్లి కోట - విజయవాడకు సమీపంలో ఉన్న ఒక శిథిలమైన కోట.
- చల్లపల్లి కోట - విజయవాడ నుంచి చల్లపల్లి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గుంటూరు జిల్లా కోటలు
[మార్చు]- కొండవీడు కోట - యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామ పరిధిలోని ఉంది.ఇది పర్యాటక ప్రదేశం.
- నరసరావుపేట కోట - నరసరావుపేట పట్టణంలో ఉన్న కోట.రాష్ట్రంలో ఉన్న పురాతన స్వదేశీ సంస్థానాలలో నరసరావుపేట మల్రాజు సంస్థానం వారు నిర్మించిన కోట. ఇది నేడు కనుమరుగైంది.
- బెల్లంకొండ కోట - ఇది గుంటూరు - పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో బెల్లంకొండలో ఉంది.ఇది పర్యాటక ప్రదేశం.
చిత్తూరు జిల్లా కోటలు
[మార్చు]- చంద్రగిరి కోట: ఇది చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో 17వ శతాబ్దిలో విజయనగర రాజులు నిర్మించిన దుర్గం.
- గుర్రంకొండ కోట:ఇది కడప - బెంగళూరు రహదారిలో ఉంది. గుర్రంకొండ ఒక పర్యాటక ప్రదేశం.
పశ్చిమ గోదావరి జిల్లా కోటలు
[మార్చు]- మొగల్తూరు కోట - మొగల్తూరు మండలం, మొగల్తూరు గ్రామంలో ఉంది
విజయనగరం జిల్లా కోటలు
[మార్చు]- విజయనగరం కోట: ఇది విజయనగరం జిల్లా కేంద్రంలో 18వ శతాబ్దిలో నిర్మించిన దుర్గం.
- కురుపాం కోట: ఇది కురుపాం రాజవంశానికి చెందిన కోట.
- బొబ్బిలి కోట: ఇది బొబ్బిలి పట్టణంలో 18వ శతాబ్దానికి చెందిన కోట.
- సాలూరు కోట: ఇది సాలూరు పట్టణంలోని ప్రాచీనమైన కోట.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోటలు
[మార్చు]- ఉదయగిరి కోట: ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉన్న సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన దుర్గం.
వైయస్ఆర్ జిల్లా కోటలు
[మార్చు]- గండికోట చరిత్ర - పెన్నానది తీరాన 13వ శతాబ్దిలో నిర్మించబడిన దుర్గం. జమ్మలమడుగు మండలంలోని గండికోట గ్రామం ఉంది
- సిద్ధవటం కోట - సిద్ధవటం మండలంలోని, సిద్ధవటం గ్రామంలో ఉంది.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "visit forts and palaces in andhra pradesh and telangana - Telugu Nativeplanet". web.archive.org. 2019-11-12. Archived from the original on 2019-11-12. Retrieved 2019-11-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "పర్యాటక స్థలాలు | అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము | భారతదేశం". web.archive.org. 2019-11-12. Archived from the original on 2019-11-12. Retrieved 2019-11-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "రాయల కీర్తి పతాక పెనుకొండ". web.archive.org. 2019-11-12. Archived from the original on 2019-11-12. Retrieved 2019-11-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)