చర్చ:ఆంధ్రప్రదేశ్

వికీపీడియా నుండి
(చర్చ:ఆంధ్ర ప్రదేశ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 8 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
ఆంధ్రప్రదేశ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ రాష్ట్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


చర్చ

good that u removed that biased info. .

but we need to add the cms info and what happend at the time of nadeMDla from an ecedemic point of view.

and also at least we need to mention chandra baabu naidu

ఆంధ్రప్రదేశ్ కి శాసన సభ, శాసన మండలి అని రెండు చట్ట సభలు ఉన్నాయి కదా. ఒకటే ఉన్నట్లు కుడివైపు పటం లో ఉంది. ఏది సరి అయినది?----కంపశాస్త్రి 19:02, 30 ఆగష్టు 2007 (UTC)
ఈ వ్యాసం మండలి ఏర్పడకముందు వ్రాసినది. ఇప్పుడు సవరించాను. --వైజాసత్య 19:21, 30 ఆగష్టు 2007 (UTC)
వ్యాసం లో శాసన మండలి స్థానాలు 60 అని ఉంది. కుడివైపు పటం లో 90 అని ఉంది. ఏది నిజం? ఆంధ్రప్రదేశ్ వెబ్ సైటు లో శాసన మండలి గురించిన ప్రస్తావన లేదు. దీనిని గురించి సైటు నిర్వాహకులను (టిసియస్ వారిని) అడుగుదామని ప్రయత్నిస్తే వెబ్ ద్వారా వర్తమానం వెళ్లలేదు నిన్న. మనం ఏమైనాచెయ్యగలమా? ----కంపశాస్త్రి 20:32, 30 ఆగష్టు 2007 (UTC)
ఇక్కడ చూడండి 90 అని ఉంది. వాళ్ళ సైట్లో మార్చాలంటు వాళ్ళకు వర్తమానం పంపడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు. వికీలో మాత్రం నిర్ధారించుకొని మార్చవచ్చు --వైజాసత్య 20:45, 30 ఆగష్టు 2007 (UTC)
  • విద్యారంగంలో నాగార్జున విశ్వవిద్యాలయం నీలి రంగు అక్షరాలతో వ్యాసం ఉన్నట్లుగా ఉంది.కానీ వ్యాసం లేదు.--Nrahamthulla 13:02, 26 నవంబర్ 2008 (UTC)

Question about geographical names

Can anyone translate to Telugu geographical names listed below? Aotearoa 12:34, 8 ఆగష్టు 2009 (UTC)

  • Bay of Bengal
  • Indian Peninsula
  • Coromandel Coast
Bay of Bengal — బంగాళాఖాతం
Indian Peninsula — భారత ద్వీపకల్పం
Coromandel Coast — కోరమాండల్ తీరం

Thank you. Aotearoa 20:19, 9 ఆగష్టు 2009 (UTC)

  • పొట్టిశ్రీరాములు గారు చనిపోయింది మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం.అయితే తరువాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.తరువాత తెలంగాణాను కలుపుకున్నారు.అప్పటికే అక్కడ ఉర్దూ రాజ్యమేలుతూ ఉంది.ఉర్దూ ను రెండవ అధికారభాష అన్నారు.వాళ్ళ ఉర్దూ పోయింది,మన తెలుగూ పోయింది.ఇంగ్లీషు రాజ్యమేలుతోంది.ఇక మనం ఆంగ్లాన్ని మోయక తప్పదు.తెలుగు రాష్ట్ర పాలనా భాషగా ఇంగ్లీష్ వైభవం చూడండి http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39281&Categoryid=1&subcatid=18 --Nrahamthulla 04:20, 1 నవంబర్ 2009 (UTC)

జిల్లాల కొత్త పటం చేర్చుట

జిల్లాల కొత్త పటం జిల్లా పేర్లపై మౌజ్ తో నొక్కి ఆ యా జిల్లా పేజీలకు వెళ్లుటకు తయారు చేశాను. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం చూడండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు పేజీలో జతపరచాను. జిల్లా ముఖ్య పట్టణాల స్థానాలలో స్వల్ప దోషము వున్నట్లుంది, పటము అక్షాంశ రేఖాంశాలలో స్వల్ప దోషము వలన కావచ్చు. ఇది ఇంగ్లీషు వికీ నుండి తీసుకున్నాను. ఇలాగా జిల్లాలోని పట్టణాలకు పటాలు తయారుచేయవచ్చు. దీనిని ఆంధ్రప్రదేశ్ లో చేర్చుటకు మీ స్పందనలు తెలపండి.--అర్జున (చర్చ) 17:11, 27 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సవరణ అవసరం

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినందున ఈ వ్యాసమును చాలా సవరించాల్సిన అవసరం ఉన్నది. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 13:01, 3 జూన్ 2014 (UTC))[ప్రత్యుత్తరం]

భూపతిరాజు రమేష్ రాజు గారికి, సవరణ అవసరం గుర్తించినందుకు ధన్యవాదాలు. నేను కొంత సవరణ చేస్తున్నాను. మీరూ పాలుపంచుకోండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:54, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పేజి ఆంధ్రప్రదేశ్ కి దారి మార్పు లేదా పేజి పేరు మార్పు

ఈ పేజి కి ఆంధ్ర ప్రదేశ్ కి దారి మార్పు లంకె లేదా పేజి ని ఆంధ్రప్రదేశ్ కి మార్చమని నా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ అని టైపు చేస్తే పేజి లేనట్టు గ చూపించబడుతుంది.
-KingDiggi

ఏ మార్పులు అవసరము లేదనుకుంటాను. JVRKPRASAD (చర్చ) 18:39, 13 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి, తెలుగులో కలిపి చదువుతాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. వర్గాలపేరులలో ఇప్పటికే మార్పులు చేస్తున్నారు. --అర్జున (చర్చ) 01:56, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారికి, కేవలం పేర్లు కలిపి చదివినంత మాత్రాన మొత్తం పేరంతా కలిపి వ్రాయాలనే నియమం ఈమధ్య కాలంలోని తెలుపుతున్నారు. పేరులోని చివరన ఉన్న శాస్త్రి, ప్రసాద్, రావు, చౌదరి, ఇలాంటి పదాలు విడిగా వ్రాయడమే ఆనవాయితి.ఇక్కడ వికీలో మీలాంటి అధికారులు చెప్పినదే వేదం,చేసేదే ధర్మంగా కొనసాగుతున్నది. ఎందుకంటే వాడుక పదాలు కూడా బూతులు అంటూ నిషేదిస్తూ శిక్షలు వేస్తున్నారు. ఈ మద్యన వికీలో వ్యక్తుల ప్రాధాన్యం బాగా పెరిగి పోయింది. సమిష్టి ఆలోచనల్ అస్సలు సాగడం లేదు. తెలుగులో పేర్లూ అనేవి కలిపి చదువుతాము కాబట్టి పదాలు అన్నీ కలిపి వ్రాయాలన్న నియమం నా దృష్టిలో చాలా తప్పు అని నా భావన, అబిప్రాయం. ఇక్కడ గ్రూపుగా ఉండే పెద్దలు ఇష్టమే నదుస్తుంది. నా పేరు "వెంకటరామకృష్ణప్రసాద్" అని గుడిలో కూడా అంటారు కానీ నేను పదాలు కలిపి మాత్రము వ్రాసుకోను. గమనించండి.JVRKPRASAD (చర్చ) 01:53, 23 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD మీ వాదనలో బలం వుంది. కాని ఈ మార్పులు ప్రారంభించేముందు సముదాయ చర్చ జరిగిందేమో తెలియదు. --అర్జున (చర్చ) 01:11, 6 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కాదు, (తుళ్ళూరు) అమరావతి

కావల్సిన లింకు : https://en.wikipedia.org/wiki/Amaravati -- 2017-07-13T12:04:47‎ 223.31.192.130

పదిసంవత్సరాల వరకు హైదరాబాదు కూడా చట్ట ప్రకారం కొనసాగుతుంది. అయినా కార్యకలాపాలు అమరావతికి మారినందున, మార్చబడింది. --అర్జున (చర్చ) 01:59, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాల తనిఖీ

మూలాలు తనిఖీ పూర్తి చేసి పనిచేయని లింకులకు బదులు ఆంగ్ల వికీనుండి లేక వెబ్ నుండి పని చేసే మూలాలు చేర్చాను. అలాగే ఆర్కైవ్ లో సరిగా భద్రపరచని లింకులను తొలగించాను.-- అర్జున (చర్చ) 11:45, 3 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరణ

ఆంగ్ల వ్యాసంరూపు లో భాగాలను క్రమేణ అనువదించి వాడుకరి:Arjunaraoc/ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేసి విలీనం చేస్తున్నాను. --అర్జున (చర్చ) 01:10, 6 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరణ పూర్తయింది. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు తెలియని చాలా సంగతులు తెలిశాయి. Module:Convert సంబంధిత పేజీల ద్వారా తెలుగులో కొలమానాన్ని చూపటానికి తొలి ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఆంగ్లంలో బి గ్రేడ్ స్థాయిలో వున్న వ్యాసంలో కూడా చాలావరకు పాత సమాచారం వున్నదనిపించింది. తెలుగు వికీవ్యాసంలో కొంత తాజా సమాచారం వున్నా వ్యాసం చాలా క్లుప్తంగా వుంది. తెలుగు వికీవ్యాసాలకంటే 10 రెట్లు వీక్షణలు పొందే వ్యాసం, ఎక్కువమంది కృషి చేసే వ్యాసం ఇలా వుంటే, తెలుగు వికీపీడియాలో స్థానికంగా ప్రాముఖ్యంగల వ్యాసాలు చాలావరకు తాజపరచక, విస్తరించక నాణ్యత తక్కువగా వున్నయి. చురుకుగా వున్న వికీపీడియన్లు తమ కృషిలో పెద్దభాగం స్థానికంగా ప్రముఖమైన వ్యాసాలపై పనిచేయటం, చర్చలలో పాల్గొనడం చేస్తే మంచిదని నా అభిప్రాయం--అర్జున (చర్చ) 11:28, 10 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మెరుగు

YesY సహాయం అందించబడింది

సహ వికీపీడియన్లు తెలుగు వికీపీడియాకి ప్రముఖవ్యాసాల్లో ఒకటైన దీనిని మరింత మెరుగుపరచడానికి సవరణలు, లేదా అభిప్రాయాలు పంచుకోవడం, చర్చల ద్వారా సహకరించమని మనవి.--అర్జున (చర్చ) 11:28, 10 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --అర్జున (చర్చ) 12:00, 18 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ, నేను సమీక్ష చేస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 18:32, 6 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, మీ సమీక్షకు ధన్యవాదాలు. సవరణలు బాగున్నాయి. సమీక్ష కొనసాగించండి--అర్జున (చర్చ) 01:06, 7 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సంస్కృతి విభాగంలో దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించాడు. ఈ వాక్యం తిరగరాయాలి అనిపిస్తుంది. కానీ ఎలా రాయాలో అర్థం కాలేదు. ఒకసారి పరిశీలించండి. రవిచంద్ర (చర్చ) 17:33, 7 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సిద్దేంద్ర యోగి వ్యాసంలో కూచిపూడి, భాగవతమేళనాటకంనుండి ఆవిర్భవించిందని వుంది. భాగవతమేళ లో స్త్రీలు పాల్గొనేవారా లేదా అనేది తెలియదు. ఈ వాక్యానికి ప్రత్యేక మూలం కూడా తెలియదు. కావున ఈ వాక్యాన్ని "భాగవతమేళ నాటకం బీజంగా బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేసే కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించాడు." అని మార్చటం మంచిదనిపిస్తుంది. --అర్జున (చర్చ) 00:04, 8 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక రౌండు సమీక్ష పూర్తయింది. వీలు వెంబడి మళ్ళీ పరిశీలించి అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తాను. రవిచంద్ర (చర్చ) 17:54, 7 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, ధన్యవాదాలు. నేను ప్రవేశికను మెరుగు చేశాను. ఎక్కువమంది పరిశీలించి మెరుగు చేయటం, లేక మెరుగు చేయటానికి సూచనలు అందిస్తే ఈ వ్యాసం మరింత నాణ్యతస్థాయికి చేరుతుంది.--అర్జున (చర్చ) 00:56, 8 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం చేయబడింది}} చేర్చాను.--అర్జున (చర్చ) 09:23, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక్కడికి లింకైన దారిమార్పు పేజీలు

ఎనిమిది దారిమార్పులు పరిశీలించి వాటికి ఒకవేళ వున్న లింకులు సవరించి తొలగించాను. వాటిలో ఒకదానికి {{ZWNJ}} అక్షరంకూడా కలది. అవి ప్రదర్శించినపుడు తేడా తెలియదు కనుక అటువంటివి వాడకూడదు. అవి ఏంటంటే ఆంద్రప్రదేశ్, ఆంధ్ర దేశము, ఆంధ్ర ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, నవ్యాంధ్ర ప్రదేశ్, సూర్యోదయ దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సన్ రైజ్ కంట్రీ. అవికాక ఇంకొక దారిమార్పుపేజీకి మెరుగైన దారిమార్పు చేశాను.

విడిగా వున్న పదాలను శైలి కోసమని వర్గాలలో కలపటం వలన అవసరమైన పూర్తి మార్పులు చేయలేకపోవచ్చు, ఇతర అనర్ధాలకు అవకాశముంటుంది. చర్చించకుండా ఇకముందు చేయకూడదు. ప్రస్తుత దారిమార్పు పేజీలు చూడండి. -- అర్జున (చర్చ) 11:04, 14 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, "విడిగా వున్న పదాలను శైలి కోసమని వర్గాలలో కలపటం వలన అవసరమైన పూర్తి మార్పులు చేయలేకపోవచ్చు, ఇతర అనర్ధాలకు అవకాశముంటుంది." - ఇది నాకు అర్థం కాలేదు. మీరు తొలగించిన దారిమార్పుల హేతువు గురించి నేను చర్చించను గానీ.., నాకు తెలిసినంతలో ఒక పదానికి ఉన్న సరైన పేర్లనే కాక, దానికి వాడుతూ ఉండే తప్పు పేర్లకు కూడా దారిమార్పు పేజీలను సృష్టించవచ్చు, సృష్టిస్తే మంచిది. అందుకు ఉదాహరణ..
..మీరు తొలగించిన దారిమార్పు పేజీలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌ అనే తొలగించిన దారిమార్పు పేజికి దాదాపు 60 ఇన్‌కమింగు లింకులున్నై. ఇప్పుడవన్నీ తెగిపోయిన దారిమార్పులై ఉంటై. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 06:29, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను చేద్దామనుకున్న మార్పులలో పొరపాటుగా చేయనివి తెలిపినందులకు ధన్యవాదాలు. అవి ఇప్పుడు సరిచేశాను. మీరిచ్చిన ఉదాహరణ తప్పు పేరు కాదు, వాడుకలో సమస్యలు కలిగించే అవకాశమున్న పేరు అని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 01:31, 20 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

లింకైన పేజీల ప్రవేశికలు మెరుగు

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసంలో నేటికి 707 అంతర్వికీ లింకులున్నాయి. వాటిని కనీసం ప్రవేశిక భాగాలను మెరుగు చేస్తున్నాను. ముఖ్యమైన వ్యాసాలకు సూచనలు, చర్చల రూపంలో చేయికలిపితేనే, తెవికీ నాణ్యత మెరుగుపడుతుంది. ఈ వ్యాసానికి 41 మంది తమ వీక్షణ జాబితాలో వుంచుకొనగా, వారిలో 9 మంది ఈ వ్యాస మార్పులను ఇటీవల గమనిస్తున్నారు. ఇటీవల కాలంలో నేను గమనించినంతలో వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Chaduvari ఈ కృషిలో చేయి కలిపారు. మీరు సహకరించండి. ఈ వ్యాసం ఆంగ్ల వికీ వ్యాసం కంటే మెరుగైన నాణ్యతకు చేరుకోవాలనే లక్ష్యం దిశగా తద్వారా, ఎక్కువ వీక్షణలుండే స్థానిక అంశాల వ్యాసాలు ఆంగ్ల వికీవ్యాసాల కంటే మెరుగుగా చేయడానికి ప్రేరేపణ కావాలని నా కోరిక. ఈ సమష్ఠి కృషి లో పాల్గొంటే నాణ్యమైన వ్యాసాల గురించి మనందరం మరింత తెలుసుకొని మన నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతాం.--అర్జున (చర్చ) 12:17, 14 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, ఈ వ్యాసం కలగాపులగంగా తయారైంది. దాదాపు పూర్తిగా తిరగరాయాల్సి ఉంటుందని నా ఉద్దేశం. నాకు తోచినంతలో సాయపడతాను. ఈ సందర్భంలో మీరు "ముఖ్యమైన వ్యాసాలకు సూచనలు, చర్చల రూపంలో చేయికలిపితేనే, తెవికీ నాణ్యత మెరుగుపడుతుంది." అని అన్నారు కాబట్టి ఒక సంగతి..
చర్చల రూపంలో చేయి కలిపితేనే తెవికీలో ఏ పనైనా జరుగుతుంది. ముఖ్యమైన వ్యాసాలే కాదు, ఏదైనా సరే. విధానాల రూపకల్పన కూడా. పై మాటలు చెప్పిన మీరు కూడా అనేక చర్చల్లో పాల్గొనకపోవడం నేను గమనించాను. మనం మొదలెట్టిన చర్చల్లో మాత్రం అందరూ పాల్గొనాలి, మనం మాత్రం ఇతర చర్చల్లో పాల్గొనం అనే పద్ధతి తెవికీకి పనికిరాదు. ఫలానా అంశంపై నేను మొదలుపెట్టిన చర్చలో ఎవరూ పాల్గొనకపోవడం శోచనీయం అని బాధపడి ఈమధ్య ఒక చర్చను ముగించారు మీరు. సరిగ్గా అదే సమయంలో, సరిగ్గా అదే అంశంపై జరుగుతున్న చర్చలో మీరు పాల్గొనకపోవడం మీకు శోచనీయంగా అనిపించలేదా? మీరు చేసే పని ముఖ్యమైనది, ఇతరులు చేసేపనులు కావు అనే భావన మీకు ఉందని నేను అనుకోవడం లేదు గానీ, మీ వ్యాఖ్యలు అలా సూచిస్తున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకోండి. __చదువరి (చర్చరచనలు) 04:47, 15 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు గతచర్చలలో చేసినట్లు చర్చను దారిమళ్లించే ప్రయత్నం చేయటం బాధాకరం. వ్యాసం ఏ విధంగా కలగాపులగం అయిందని మీకు అనిపిస్తున్నదో వివరించి ఎలా సరిచేయాలో చూపండి. నేను, ఇంకా ఈ వ్యాసానికి కృషి చేసిన వాళ్లం నేర్చుకుంటాం.--అర్జున (చర్చ) 00:37, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, కలగాపులగం అనే మాటను నేను నెగటివుగా వాడలేదు. వికీపీడియాలో అనేక మంది కలిసి వ్యాసాన్ని అభివృద్ధి వెయ్యడం పద్ధతి. అలా చేసే క్రమంలో కొద్దికొద్దిగా సమాచారం చేరుతూ ఉంటుంది. వ్యాసం పెద్దదయ్యే కొద్దీ పాఠ్యంలో ప్లో తగ్గి, కొన్ని వేరువేరు వాక్యాల సంచయంగా వ్యాసం తయారౌతుంది. స్థాయీ భేదాలుండొచ్చు గానీ, ఎక్కువగా వ్యాసాలు ఇలాగే అవుతాయి. ఆ స్థితిలో, ఉన్న సమాచారాన్నంతా సరైన పద్ధతిలో పేరుస్తూ తిరగ రాస్తే వ్యాసం ఏకరూపతతో, చదవను వీలుగా, ముచ్చటగా తయారౌతుంది. పైన నే చెప్పిన పరిస్థితిలో ఉన్న వ్యాసంలో కింది లక్షణాలు కనబడవచ్చు:
  1. సమాచారం పునరుక్తి కావచ్చు
  2. ఒకచోట ఉండాల్సిన సమాచారం మరో స్థానంలో ఉండవచ్చు
  3. పాఠ్యలో అసంగతాలుండవచ్చు (ఉదాహరణకు సర్వనామాలు వాడాల్సిన చోట నామవాచకం రావడం వంటివి)
  4. వివిధ రకాలైన కొలమానాలు వాడవచ్చు
  5. వికీ శైలిలో భేదాలుండవచ్చు
  6. మరీ ఎక్కువ విభాగాలను, అనావశ్యక విభాగaలనూ సృష్టించవచ్చు
  7. ఆవశ్యక సమాచారం విలుప్తం కావచ్చు. (అంటే నా ఉద్దేశం అవసరమైన సమాచారం లేకుండా, దానికి సంబంధించిన తదనంతర సమాచారం మాత్రం ఉండడం. దాంతో లింకు లేకుండా పోతుంది)
  8. అసహజత్వం, పలు మాండలికాల వంటి భాషా లోపాలుండవచ్చు
ఇవన్నీ ఉన్నాయని కాదు, కొన్ని ఉండవచ్చు. కొన్నిటిని నేను మిస్సయి ఉండవచ్చు. ఇక వ్యాసాన్ని ఆమూలాగ్రం పరిశీలించండి, లోపాలేమైనా కనిపిస్తే సరిచెయ్యండి. ఏమీ లేవని మీకనిపిస్తే, వదిలెయ్యండి.
కలగాపులగం అనే మాట వాడినందుకు మీకు కష్టం కలిగినట్టుగా నాకు తోస్తోంది. ఒకవేళ ఆ మాట మీకు కష్టం కలిగిస్తే క్షంతవ్యుణ్ణి. పై లోపాలతో కలగాపులగమవడం వికీలో సహజం అనే ఉద్దేశం నాది. అంచేతనే అలా రాసాను. అది ఈ వ్యాసానికే ప్రత్యేకం కాదు. మీకు కష్టం కలిగేలా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు.
ఈ వ్యాసంలో కృషి చేసిన వాళ్ళం నేర్చుకుంటాం అని మీరు రాసారు, నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మీకుందో లేదో నాకు తెలవదు గానీ మిగతా వాళ్ళేవరికీ లేదు. ముఖ్యం నా దగ్గర నుండి నేర్చుకోవాల్సిన అగత్యం వాళ్లకు లేదు. వాళ్ళు అనుభవజ్ఞులు, తెలిసిన వాళ్ళు.
ఇక మీ సంగతి.. మీరు బహుశా వారందరి కంటే అనుభవజ్ఞులు, పదమూడేళ్ళకు పైగా అనుభవం కలిగినవాళ్ళు, మీముందు నేనెంత? మీకు నేర్పగలిగేంతటి వాణ్ణి కాను. __ చదువరి (చర్చరచనలు) 04:59, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మరొక్కటి రాయమరచాను.. ఈ వ్యాసానికే ప్రత్యేకమైన అంశం ఒకటి ఉంది.. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయాలను ప్రస్తావించినపుడు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని వాస్తవాలు తప్పయ్యే అవకాసం ఉంతుంది. అలాంటి సందర్భాలు ఒకటో రెండో ఈ వ్యాసంలో ఉన్నట్టు నేను గమనించాను. __ చదువరి (చర్చరచనలు) 05:05, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, మీ ఇద్దరి చర్చ మధ్యలో కలుగజేసుకుంటున్నందుకు మన్నించాలి. నాకు తెలిసినంతవరకు ఈ వ్యాసం మొత్తం ఆంగ్ల వికీ నుంచి అర్జున గారే అనువదించారు. అర్జున గారు చేర్చిన సమాచారం చాలా వరకు ముందున్న సమాచారాన్ని పూర్తిగా తిరగ రాసినట్లే. ఇప్పుడున్న సమాచారం కన్నా అంతకుముందున్న పాఠ్యం ఇంకా ఎక్కువ కలగాపులగంగా ఉండింది. ఆ పైన నేను, మిగతా సభ్యులు ప్రామాణీకరణ కోసం సాధ్యమైనన్ని మార్పులు చేశాము. మీరు పైన రాసిన విధంగా ఇంకా ఇందులో లోపాలున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ విధంగా సరిచేస్తే బాగుంటుందని సూచనలివ్వడమో, సభ్యులే సరిచేయడమో చేస్తే ఈ వ్యాసం మంచి వ్యాసంగా తయారవుతుందని అర్జున గారి ఉద్దేశ్యం. తెలుగు వికీలో తెలుగు వారి ప్రధాన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసం మంచి వ్యాసాలకు ఒక ఉదాహరణ వ్యాసంగా ఉంటే తెలుగు వికీ సభ్యులుగా మనందరికీ గర్వకారణమేకదా. ఇంకా అర్జున గారు పలుచోట్ల, కొత్త వ్యాసాలు రాసేటపుడు, ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసేటపుడూ స్థానిక అంశాలకు ప్రాధాన్యత నివ్వాలనీ దాని వల్ల ఎక్కువ సందర్శనలున్న వ్యాసాలు నాణ్యంగా తయారయితే పాఠకులను సదభిప్రాయం ఏర్పడుతుందని ఆయన ఆలోచిస్తుంటారు. అది ఆయన ఆలోచనా విధానం. అందరూ అలానే ఆలోచించవలసిన అవసరమేమీ లేదు. కానీ సహకారం కోరినపుడు ఆసక్తి ఉన్నవాళ్ళు సహాయం చెయ్యడమే.
ఇక నేర్చుకోవడం విషయానికొస్తే ఇక్కడనే కాదు ఏ పనిలోనైనా ఎవరి దగ్గరైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాన్నేను. అందరూ అలాగే ఉంటే మంచిదని నా ఉద్దేశ్యం. కాబట్టి మీరు గమనించకపోయినా మీ మార్పులు అనుసరిస్తూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. అలాగే మిగతా సభ్యుల నుండి కూడా. రవిచంద్ర (చర్చ) 06:23, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, ముందుగా ఈ వ్యాసం గురించి.. నాకు తోచినంతలో సాయపడతాను అని రాసాను. మీరు బహుశా గమనించే ఉంటారు.
దీనిలో చెయ్యాల్సిన మార్పులు నాకు తోచినవి కొన్ని ఇవి:
  1. స్వాతంత్ర్యానంతర చరిత్ర, ప్రభుత్వం రాజకీయాలు అనే విభాగాల్లో ఉన్న సమాచారం ఒకే చోట, "ప్రభుత్వం, రాజకీయాలు" విభాగంలో, ఉండాలి. (చర్చ కొనసాగింపు లింకు)
  2. స్వాతంత్ర్యానంతర చరిత్ర విభాగంలో ఉండాల్సింది ముఖ్యమంత్రుల గురించి కాకుండా, రాష్ట్ర చరిత్ర ఎలా సాగింది అనేది ఉండాలి.
  3. చరిత్ర విభాగంలో మతం అనే విభాగం మరీ ఈ పేజీ సందర్భానికి ఎక్కువగా ఉంది. తీసెయ్యాలి, లేదా మతాలు అనే విభాగంలో తగు సవరణలతో కలపేసి, ఈ వుభాగాన్ని తీసెయ్యాలి.(చర్చ కొనసాగింపు లింకు)
  4. విద్యుదుత్పత్తి కేంద్రాలు అనే విభాగం స్థానం మార్చాలి వనరుల్లో ఉండాల్సినది కాదది.(చర్చ కొనసాగింపు లింకు)
  5. భాషలో సవరణలు చెయ్యాల్సి ఉంది. (జనవరి 15 నాటికి ఒక్క "మరియు" కూడా లేదీ వ్యాసంలో. ఫిబ్రవరి 18 నాటికి 26 "మరియు"లు కొత్తగా వచ్చి చేరాయి. వాటన్నిటినీ మీవంటి వారు తొలగించారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే తొలగించాలి.) (సవరించబడింది)
  6. 2009 లో రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడని రాయాలి. దాంతో అక్కడున్న వాక్యాలకు సందర్భ శుద్ధి కలుగుతుంది. (సవరించబడింది)
  7. కొన్ని చోట్ల మిలియన్లు, కొన్ని చోట్ల లక్షలు రాసారు. వాటన్నిటినీ లక్షలు, కోట్ల లోకి మార్చాలి. (చర్చ కొనసాగింపు లింకు)
  8. కొన్ని చోట్ల అంకెలు కామాల్లేకుండా రాసారు. చదవను వీలుగా లేదు, మార్చాలి. ( నగరాల జనాభాలో సవరించబడింది)
  9. కొన్ని చోట్ల అనవసరమైన విషయాలు ఉన్నాయి.. (లాంగ్ టన్నులు, షార్ట్ టన్నులు వంటివి). వాటిని మార్చాలి. (సవరించబడింది)
  10. వంటకాలు విభాగం, అందులో ఉన్న వాక్యమూ సరిగ్గా లేవు. దాన్ని విస్తరించడమో, తీసెయ్యడమో చెయ్యాలి.
  11. రాష్ట్ర విభజన నేపథ్యంలో గణాంకాలను, ముఖ్యంగా ఆర్థిక విభాగం లోని విశేషాలను సంవత్సరంతో క్వాలిఫై చెయ్యాల్సి ఉంది. ఉదా: ఆసియా గుడ్ల గిన్నె.. (సవరించబడింది)
ఇవి ఓ నాలుగదు రోజుల కిందట నేను గమనించినవి. చాలావరకూ అలాగే ఉన్నాయి. కొన్ని సరైపోయాయేమో చూడాలి.
పోతే.. "కానీ సహకారం కోరినపుడు ఆసక్తి ఉన్నవాళ్ళు సహాయం చెయ్యడమే." - అని అన్నారు. 100 శాతం ఏకీభవిస్తాన్నేను. అర్జున గారి ఆలోచనల గురించి కూడా రాసారు మీరు. దాంతోటీ ఏకీభవిస్తాన్నేను. నేను ఈ విభాగంలో రాసిన మొదటి వ్యాఖ్యను బట్టి, అర్జున గారు రాసిన ఈ వ్యాసం పట్ల నాకేదో వ్యతిరేక భావముందని మీరు భావిస్తున్నారేమో తెలీదు గానీ నాకు అలాంటి భావనేదీ లేదు. రిషి వ్యాలీ పాఠశాల చూడండి. ఆ వ్యాసం దాదాపు అంతా (94%) అర్జున గారే రాసారు. దానిలో నేను చాలా దిద్దుబాట్లు చేసాను, పరిశీలించండి. ఆ పని చెయ్యమని ఆయనేమీ నన్నడగలేదు. (అడగాల్సిన పనే లేదని నా గట్టి అభిప్రాయం). కాబట్టి పేజీల్లో పనిచేసే విషయంలో మీరు నా నిబద్ధతను శంకించనవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి నేను మొదటి వ్యాఖ్యలో రాసినది ఎందుకు రాసానో మరోచోట చెబుతాను.
ఇక, నేర్చుకోవడం విషయంలో మీ పంథాయే నాదీనూ. నేను ఉగ్రశ్రవసువును :) __ చదువరి (చర్చరచనలు) 08:04, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ఏ వ్యాసంలోనైనా దిద్దుబాట్లు చేయడంలో మీ నిబద్ధతను ఏ మాత్రం శంకించను. చర్చ బాగా నడవడం కోసం అర్జున గారి అభిప్రాయాలను నాకు అర్థమైన విధంగా వివరించే ప్రయత్నం చేసాను అంతే. రవిచంద్ర (చర్చ) 10:19, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari:, వివరమైన చక్కటి సూచనలు చేసినందులకు ధన్యవాదాలు. మీ సూచనల ప్రకారం, సరిచేయాలని అనిపించినవి నేను సరి చేశాను. చర్చ అవసరమని అనుకున్నవి వేరే విభాగాలుగా చేస్తే చర్చకు మరింత అనుకూలంగా వుంటుంది కావున నేను వాటిని విభాగాలుగా చేర్చి నా స్పందనలు రాశాను. వాటికి ప్రతిస్పందించమని అందరిని కోరుతున్నాను. ఈ రెండూ జరగని సూచనల గురించి సహసభ్యులు పరిశీలించి సరిచేయటమో వేరే విభాగంలో చర్చ ప్రారంభించడమో చేయమని సూచిస్తున్నాను. పై సూచనల జాబితాలో తగు విధంగా స్థితిని బ్రాకెట్లలో చేర్చాను. అర్జున (చర్చ) 22:41, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర:, మీ స్పందనకు ధన్యవాదాలు. నా ఆలోచనలు మరింత వివరంగా తెలిపినందుకు కృతజ్ఞతలు. ఒక్క విషయం: ఇది ఇద్దరి మధ్య చర్చ కాదండి. ఎందుకంటే నా వాడుకరి చర్చ పేజీలోనో, చదువరిగారి చర్చ పేజీలోనో చర్చ జరుగుట లేదు. మీ లాగే క్రియాశీలంగాను, ఆసక్తివున్న వాడుకరుల అందరు స్పందించాలి. అప్పుడే అందరికీ అవగాహన పెరగడం, నాణ్యత మెరుగుపడే అవకాశాలుంటాయి. అర్జున (చర్చ) 22:38, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పురోగతి

వాడుకరి:Arjunaraoc/ఆంధ్రప్రదేశ్ నుండి లింకుల మెరుగు అనుభవాలు చూడండి.

  • ప్రవేశిక లో లింకైన వ్యాసాలను కనీసం ప్రవేశిక, గరిష్టంగా మొత్త వ్యాసం అభివృద్ధి చేయటం పూర్తయింది. ఇంకా చాలా వ్యాసాలు మెరుగుచేశాను. ఇప్పటివరకు వ్యాసంలో వచ్చిన క్రమంలో అభివృద్ధి పరచాను. ఇకముందు వీలునిబట్టి అధిక పేజీవీక్షణల క్రమంలో మెరుగు చేయటం మంచిది. --అర్జున (చర్చ) 12:39, 9 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాతంత్ర్యానంతర చరిత్ర, ప్రభుత్వం రాజకీయాలు విలీనం

పై చర్చలో చదువరి గారి సూచన: "స్వాతంత్ర్యానంతర చరిత్ర, ప్రభుత్వం రాజకీయాలు అనే విభాగాల్లో ఉన్న సమాచారం ఒకే చోట, "ప్రభుత్వం, రాజకీయాలు" విభాగంలో ఉండాలి."

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటీవలి ప్రధాన ఘట్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అవశేష ఆంధ్రప్రదేశ్ గా మారటం. అందువలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికిలో వున్నంతవరకు చరిత్ర విభాగంలో, తదనంతరం సమాచారం వేరే విభాగంలో వుండడమే మెరుగు. అర్జున (చర్చ) 22:48, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, నేను అర్థమయ్యేలానే చెప్పాను గానీ, మీరు ఈ ఒక్క పాయింటునూ విడదీసి ఒక విభాగం చెయ్యడంతో సమస్య వచ్చింది. దీన్నీ, దీని పై పాయింటునూ కలిపి చదవండి. అర్థం కావచ్చు. లేదంటే... మీరు ఇంగ్లీషు వ్యాసాన్నే ఉదహరిస్తున్నారు కదా, అందులోనే చూడండి ఎలా ఉందో. అలాగే ఆ మతం అనే పాయింటు కూడా అక్కడ ఎలా ఉందో చూడండి. __చదువరి (చర్చరచనలు) 05:31, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు అంటున్న పాయింటు "స్వాతంత్ర్యానంతర చరిత్ర విభాగంలో ఉండాల్సింది ముఖ్యమంత్రుల గురించి కాకుండా, రాష్ట్ర చరిత్ర ఎలా సాగింది అనేది ఉండాలి." ఇదేనా?
నేను అనువదించిన ఆంగ్ల వ్యాసం స్థాయి బి గ్రేడు (సెప్టెంబరు 2016) అని నిర్ధారించారు, తెలుగు వ్యాసంతో అనువాదం విలీనం చేసినపుడు వ్యాస నాణ్యత మెరుగుకు నిర్మాణంలో సవరణలుండవచ్చు. మీ ఇతర సూచనల ప్రకారం వేరే విషయాన్ని ఇలానే సవరించాను. వ్యాస నిర్మాణంపై ఒక్కొక్కరికి ప్రత్యేక దృక్కోణం వుండవచ్చు. చర్చలో ఏ అభిప్రాయానికి మద్దతు ఎక్కువగా వుంటే అలా మార్చడానికి నాకేమి అభ్యంతరంలేదు. --అర్జున (చర్చ) 22:48, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్ర విభాగంలో మతం ఉపవిభాగం

@Chaduvari: గారి సూచన: "చరిత్ర విభాగంలో మతం అనే విభాగం మరీ ఈ పేజీ సందర్భానికి ఎక్కువగా ఉంది. తీసెయ్యాలి, లేదా మతాలు అనే విభాగంలో తగు సవరణలతో కలపేసి, ఈ విభాగాన్ని తీసెయ్యాలి."

వ్యాసాన్ని పునర్నిర్మించే క్రమంలో మతంను రెండుచోట్లగా నేనే మార్చాను. ఎందుకంటే చరిత్రలో మతం విభాగంలో చారిత్రక వివరాలు మాత్రమే వుంచితే బాగుంటందన్న ఆలోచన వచ్చింది. దీనికి డా బి.ఎస్.ఎల్ హనుమంతరావు గారి ఆంధ్రుల చరిత్ర ప్రధాన ప్రేరణ. దానిలో ఒక్కొక్క చరిత్ర కాలానికి సంబంధించి మతం, సంస్కృతిల ప్రభావం వివరించారు. అర్జున (చర్చ) 22:53, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రుల చరిత్ర వ్యాసంలో రాసే విషయానికి, ఆంధ్రప్రదేశ్ వ్యాసం లోని చరిత్ర విభాగంలో రాసే విషయానికీ ఉండే తేడాను మనం గమనించాలి. __చదువరి (చర్చరచనలు) 05:21, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

"విద్యుదుత్పత్తి కేంద్రాలు" విభాగం స్థానం

చదువరి గారి సూచన: "విద్యుదుత్పత్తి కేంద్రాలు అనే విభాగం స్థానం మార్చాలి వనరుల్లో ఉండాల్సినది కాదది."

నేరుగా ఈ చర్చ చదివేవారికి ఒక్క వివరణ, ఈ వనరులు ఆర్ధిక స్థితి లో వనరులు, మూలాల దగ్గర వుండే వనరులు కాదు. ఈ విభాగ స్థానం ఆంగ్ల వికీ వ్యాసాన్ని అనువాద చేసి విలీనం చేసినపుడు మూల వ్యాసంలో మాదిరిగానే వుంచాను. మెరుగైన విభాగాన్ని సూచించండి. అర్జున (చర్చ) 23:00, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీషు లోని మూల వ్యాసం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ అక్కడక్కడ ఇలాంటి తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సందేహం వచ్చినపుడు అలాంటివే ఇతర వ్యాసాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. వాటిలో విశేష వ్యాసం లాంటివైతే ఇంకా మెరుగు.
విద్యుత్తు మౌలిక వసతుల రంగం (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్) లోనిది. అందులో చేర్చండి. ఒకవేళ ఈ వ్యాసంలో ఆ విభాగం లేకపోతే, నేరుగా ఆర్థిక వ్యవస్థ కిందనే ఒక ఉపవిభాగంగా చెయ్యండి.
విద్యుదుత్పత్తి కేంద్రాలు అనే పేరునున్ని విద్యుచ్ఛక్తి అని మారిస్తే బాగుంటుంది.. ఉత్పత్తే కాకుండా, సరఫరా, వినియోగం, గ్రిడ్ వగైరాల గురించి రాయొచ్చు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 05:41, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారు, మీ సూచన బాగుంది. అవస్థాపనా_వసతులు విభాగం చేర్చి సవరించాను.--అర్జున (చర్చ) 22:28, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, అవస్థాపనా వసతులు, మౌలిక సదుపాయాలు -ఈ రెంటికీ తేడా ఏంటండి?__చదువరి (చర్చరచనలు) 03:17, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారు, అవస్థాపన అనే పదం infrastructure కి అనువాదంగా వాడాను. కె నాగేశ్వరరావు, ed. (2008). ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ది. తెలుగు అకాడమీ. p. 430. పుస్తకంలో ఇదే పదం వాడారు. ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 ప్రకారం ఇదే పదం సూచించబడింది. మౌలిక సదుపాయలు అన్నప్పుడు దానికి విశేషణం (గ్రామం, పరిశ్రమ..) చేర్చితేనే మెరుగైన అర్ధం వస్తుందని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 00:07, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, ఈ "విశేషణం చేర్చడం" అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. వివరించగలరు.
పాఠకుడికి మామూలుగా వాడుతూ ఉండే పదాల విషయంలో ఇలాంటి అయోమయం కలిగించకూడదు. వ్యాసం లోని సమాచారం తెలుసుకునే క్రమంలో, సాఫీగా సాగిపోయే ప్రవాహానికి ఇవి అడ్డు పడతై. పైగా ఆ పదాలు వాడడంలో మీ అభిప్రాయమేంటో పాఠకులకు తెలిసే అవకాశం లేదు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:21, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, అనువాదం చేసినపుడు ప్రామాణిక పదాలు వాడడం అందరూ వాడవలసిన పద్ధతే కదా. గ్రామ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు మౌలిక సదుపాయలు అన్న వాడుకలోనే మౌలిక సదుపాయాలు అన్న పదం మెరుగుగా వుంటుందని నా అభిప్రాయం. భాషావేత్తను కాదు కావున అంతకన్నా ఎక్కువ వివరించలేను. కొత్త పదానికి, సందర్భోచితంగా అందరు అర్ధం గ్రహించగలుగుతారు. ఒకవేళ గ్రహించలేకపోతే గూగుల్ వాడి తెలుసుకుంటారు అని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 22:00, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సందేహాం మౌలిక సదుపాయాలు శీర్షికను ఉపశీర్షికగా వుంచటం వలన కలిగిందని అనుకుంటున్నాను. ఆ ఉపశీర్షికను సరిదిద్దాను. --అర్జున (చర్చ) 22:28, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు @Arjunaraoc గారు. __ చదువరి (చర్చరచనలు) 02:40, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సంఖ్యలకు భారత కొలమానం, విదేశీ కొలమానం

చదువరి గారి సూచన: "కొన్ని చోట్ల మిలియన్లు, కొన్ని చోట్ల లక్షలు రాసారు. వాటన్నిటినీ లక్షలు, కోట్ల లోకి మార్చాలి."

ఇదే విషయం నాకు అనిపించింది కానీ ప్రపంచీకరణ మరింతగా బలపడుతున్న కాలం కావున, ఆంగ్ల భాషా ప్రభావం వలన మిలియన్, బిలియన్ వాడకం అధికమవుతున్నందున, ఒక పేరాలో ఒకే రూపులో వుండే విధంగా సవరించడం మంచిదని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 23:51, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, మీరు చెప్పిన ఆలోచన చేయదగ్గదే. కానీ, అది ఈ ఒక్క వ్యాసానికే పరిమితమైన విషయం కాదు కాబట్టి వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)కు ఉపపేజీగా కానీ, వికీపీడియా చర్చ:శైలిలో కానీ ప్రతిపాదన ప్రారంభిస్తే ఏకాభిప్రాయాన్ని అనుసరించి శైలి పేజీలో చేర్చుకుందాం. --పవన్ సంతోష్ (చర్చ) 04:35, 17 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ గారు, మీ సూచనకు ధన్యవాదాలు. చర్చను ఇక్కడే కొనసాగించడం వలన కొన్ని లాభాలున్నాయి. చర్చలో పాల్గొనే వారు, చర్చిత అంశాన్ని వ్యాస సందర్భంలో చూసి మరింతగా అవగాహన చేసుకొనే అవకాశముంది. అలాగే కొత్తగా చర్చలలో పాల్గొనే వారికి వ్యాస చర్చలో పాల్గొనడం, విధానాల చర్చలలో పాల్గొనడం కంటే సులభం. చర్చ పూర్తయిన తర్వాత ఈ చర్చకు లింకుతో లేక నకలుతో సంబంధిత విధాన పేజీలలో చేర్చవచ్చు. అర్జున (చర్చ) 22:33, 17 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఈ చర్చ పరిమితమైన విషయానికి సంబంధించింది కాదు, ఒక విస్తృతమైన శైలీ పరమైన విషయం. ఒక వ్యాసపు చర్చ పేజీలో ఏం ఉండాలో, విధాన చర్చ, శైలీపరమైన చర్చ ఎక్కడ జరగాలో మీకు తెలియదని నేను అనుకోను. మీకు ఉదాహరణ కావాలంటే పేజీకి, ఇంకా కావాల్సి వస్తే విభాగానికి లింకు ఇచ్చుకునే వీలు ఉంది కదా. అంతగా కావాల్సి వస్తే అక్కడే ఇదీ ఉదాహరణ పాఠ్యం అని రాయగలరు కదా. చర్చ సరైన చోట చేయకపోవడానికి ఇది కారణం కాబోదు. ఒక వ్యాసపు చర్చా పేజీలో చర్చించేవారు ఈ చర్చ ప్రభావం ఈ పేజీకే పరిమితం అన్న దృష్టితో చర్చిస్తారే తప్ప విస్తృతమైన వికీపీడియా పేజీలన్నిటికీ వర్తిస్తుందని ఊహించరు. కాబట్టి, ఇక్కడ చర్చించేసి, దాన్ని నకలు చేసి అక్కడ పెట్టుకోమనడం సరికాదు. కాబట్టి ఈ చర్చ సరైన చోటికి తీసుకువెళ్ళాలి. ఈ సంగతి మీకు తెలియనిదీ కాదు, గతంలో పలుచోట్ల మీరే స్వయంగా సూచించనిదీను. కాబట్టి, ఆ ప్రకారం చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 02:58, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు చేసిన సూచన సబబుగా ఉంది. ఇది అనేక పేజీలను ప్రభావితం చేసే అంశం. దీనిపై ఒక శైలీ విధానాన్ని రూపొందించుకోవాలి. కాబట్టి చర్చను వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) కు ఉపపేజీలో చేద్దాం. __చదువరి (చర్చరచనలు) 04:35, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Chaduvari గారు, ఈ చర్చను ఎవరైనా మీరు ప్రతిపాదించిన విధంగా కొనసాగించవచ్చు. నాకు అభ్యంతరము లేదు. అర్జున (చర్చ) 22:38, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ గారు, వ్యాసం మెరుగు చేయాలనే ప్రధాన లక్ష్యానికి చర్చ ఎక్కడ జరిగింది అన్నది అప్రధానం. గత రెండు సంవత్సరాలలో నేను ఇటువంటి సూచన చేసినట్లు నాకు గుర్తులేదు. ఒకవేళ చేసివుంటే, నా అవగాహన మెరుగైనందున నా అభిప్రాయం మారినట్లుగా గమనించండి. అర్జున (చర్చ) 22:36, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు చేసిన సూచన వికీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.ఎందుకంటే ఇది ఈ ఒక్క వ్యాసానికి సంబంధించింది కాదు.ఈ సమస్య ఉన్న వ్యాసాలు నేను వందలలో సవరణలు చేసాను.ఈ సమస్య కొన్ని వేల వ్యాసాలకు సంబంధించింది.పవన్ సంతోష్ గారు సూచించినట్లు రచ్చబండలో చర్చించటం సమంజసం అని నా అభిప్రాయం.సముదాయానికి సముచిత గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుంది.మరి అర్జున గారూ చర్చలలో అందరినీ కాదని ఎందుకు మొండి పట్టుదల పడుతున్నారో నాకర్థం అగుటలేదు.అర్జున గారితో జరిగిన చర్చలలో 10 చర్చలకు, సుమారు 8 చర్చలకు నేను ఏకీభవించిన సందర్బాలు ఉన్నవి.నాకెందుకో అనిపిస్తుంది."మొండివాడురాజుకన్నాబలవంతుడు అన్నట్లు" అనే నానుడి ప్రకారం చర్చలు సాగిస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను.చచ్చినట్లు నా అభిప్రాయాలు ఒప్పుకోవలసిందే అన్న చందాన ఉంటున్నవి.సరే లోపం ఎవరిదైనా, ఈ రకంగా చర్చలు కొనసాగితే ఏకాభిప్రాయంరాక, వికి అభివృద్ధికి అవరోధం కలిగిందని నేను నమ్ముతున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:34, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:యర్రా రామారావు గారు, నేను పైన తెలిపిన వ్యాఖ్యను మీరు సరిగా గమనించలేదేమోననిపించింది. అభ్యంతరం లేదని తెలిపినపుడు మొండిపట్టు పట్టడం ఎలా అవుతుంది. అర్జున (చర్చ) 00:09, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు ప్రపంచీకరణ ప్రభావం ఏమో కానీ కొన్నాళ్ళ క్రితం దాకా యూట్యూబులో వీడియోల వీక్షణల చూపేందుకు మిలియన్లు, బిలియన్లు వాడేవారు. ఇప్పుడు భారతదేశం నుంచి వస్తున్న వీక్షకులకు లక్షలు కోట్లలో చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అన్ని చోట్లా గుడ్డిగా వారిని అనుసరించకుండా ప్రాంతీయ వివరాలు తెలిపేటపుడు లక్షలు, కోట్లు, విదేశీ గణాంకాలు రాసేటపుడు వీలైతే మన సంఖ్యామానంలోకి మార్చడం లేదా వాళ్ళ సంఖ్యల్లోనే ఉంచేయడం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. రవిచంద్ర (చర్చ) 05:48, 17 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, మీ సూచన బాగానేవుంది కాని, చాలావరకు తెలుగువారికి ఆసక్తివుంటే వ్యాసాలలో మూలాలు విదేశీవి కూడా వుండే అవకాశం వుంది. కావున ఒక (ఉప)విభాగంలో (నేను తొలిగా తెలిపిన పేరా కు సవరణ) ఒక కొలమానం వాడడం మంచిదని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 22:37, 17 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పు మూసలు

@Arjunaraoc గారూ, విమానాశ్రయాలు, ఓడరేవులు విభాగాల్లో మొలక మూసను పెట్టారు - వేరే పేజీలను ఇక్కడ ట్రాన్స్‌క్లూడు చేసినందున ఈ మూసలు ఈ విభాగాల్లోకి చేరాయి. దీంతో ఈ పేజీ మొలక వర్గం లోకి చేరింది. ఆ రెండు మూలపు పేజీలను తగువిధంగా సవరించడమో, ఆ పటాలను నేరుగా ఇక్కడ పెట్టడమో, మరోటో చెయ్యండి. ఒకవేళ ఆ విభాగాలను విస్తరించే మూసను ఈ విభాగాల్లో పెట్టదలిస్తే {{విభాగపు విస్తరణ}} అనే మూసలు పెట్టండి.__ చదువరి (చర్చరచనలు) 13:37, 21 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరిగారు, నా స్పందన మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల పటం లో చూడండి. --అర్జున (చర్చ) 00:19, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అక్కడి చర్చలో తీసుకున్న నిర్ణయం మేరకు తగు సవరణలు చేసాను.__ చదువరి (చర్చరచనలు) 05:30, 1 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలో ఉన్న సంరక్షణ మూస

ఈ వ్యాసం పేజీలో పైన సంరక్షణ మూసను ఉంచారు. సంరక్షణ గురించి అది తెలియజేస్తోంది. కానీ ఆ మూసను అక్కడి నుండి తీసెయ్యాలని, ఆ సందేశాన్ని వేరే విధంగా అందించాలనీ నా అభిప్రాయం. దానికి కారణాలివి:

  1. ఆ సందేశం "పాఠకులకు" అవసరం లేదు. సంరక్షణ గురించి పాఠకులకు చెప్పాల్సిన పని లేదు కదా!
  2. వ్యాసం లోని సమాచారం గురించి ఆ మూస వివరించడం లేదు, దాని గురించిన విశేషాలేమీ చెప్పడం లేదు. పాఠకుడికి అది ఉపయోగపడదు. పైగా అది కొంత నెగటివుగా ఉంది.
  3. ఆ సందేశం అవసరమైనది దిద్దుబాటు చేయగోరేవారికే. అంచేత "సోర్సు చూడు" అని నొక్కి దిద్దుబాటు పేజీకి వెళ్ళినవారికి మాత్రమే ఆ సందేశం చూపిస్తే చాలు.
  4. అక్కడ వారికి ఈసరికే ఒక సందేశం చూపిస్తున్నాం. ఆ సందేశం ఇది:
ఈ క్రింది కారణం వల్ల, ఈ పేజీని సవరించే అనుమతి మీకు లేదు:

ఈ పేజీలో మార్పులు వగైరాలు చెయ్యకుండా ఉండేందుకు గాను, సంరక్షించబడింది.

కావాలంటే ఈ సందేశాన్ని మరింత వివరంగా చూపించ వచ్చు. మరొక్క సంగతి.. ఈ పేజీని ఈ వారం వ్యాసంగా చూపించాలని ఎంచుకున్నాం. అలాంటి పేజీలో ఈ సందేశం ఉండడం ఏమంత శోభనివ్వదు.

ఈ సంరక్షణ సందేశాన్ని చేర్చిన @Arjunaraoc గారు, ఇతరులూ పరిశీలించవలసినది. __

చదువరి (చర్చరచనలు) 06:21, 1 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఆంగ్ల వికీలోలాగా తాళం బొమ్మ కనిపించేలా చేసే ప్రయత్నంలో సంబంధించిన మూసలు దిగుమతి, వాడుక జరిగింది. అయితే మూసలో దోషమున్నందున తాళం బొమ్మ కనిపించడంలేదు. అది కొద్ది రోజులలో సరిచేద్దామనే ఉద్దేశ్యంతో మూసను అలానే వుంచాను. కాని ఆ దోషం సరిచేయడానికి వీలవలేదు, కావున ఆ మూసని తొలగించాను. మూస చర్చ:Pp లో వివరాలు చేర్చాను. సాంకేతికాలపై అనుభవం కలవారు, సాయం చేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 23:45, 1 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దిద్దుబాటు అనుమతి లేని వాడుకరులు "సోర్సు చూడు"కు వెళ్ళినపుడు ఇదివరకు కనిపించే ఏకవాక్యపు సందేశాన్ని తీసేసి, మరింత వివరమైన, సందేశాన్ని చేర్చాను (ఎన్వికీ లాగానే). ఇది గతంలో ఉన్న సందేశం కంటే ఎంతో మెరుగు. అర్జున గారూ, పేజీలోంచి ఆ నోటీసును తిసేసినందుకు ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 05:15, 2 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:13, 3 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

జనాభా విషయాలు / భాషలు

YesY సహాయం అందించబడింది

భాషల విభాగంలో ఉన్న గణాంకాల మూలాలపై సందేహం ఉంది.

  1. నవ్యాంధ్ర భాషలు పేరిట ఉన్న పై-ఛార్టుకి మూలంగా (మూలం #77) 2011 జనాభా లెక్కల భాషా గణాంకాలను పేర్కొన్నారు. అయితే, ఆ మూలంలో నవ్వాంధ్రప్రదేశ్ గణాంకాలు ఏమీ విడిగా లేవు. ఆ అంకెలు ఎక్కడ నుండి వచ్చాయో మూలం సవరించాలి.
  2. అలానే 90% మందికి తెలుగు మాతృభాష అనే వాక్యానికి మూలంగా భాషా మైనారిటీల నివేదికను (మూలం #79) పేర్కొన్నారు. అయితే, ఈ మూలంలో ఉన్నది 2001 జనాభా లెక్కలు, అందులోనూ నవ్యాంధ్రకు విడిగా లెక్కలు లేవు.
  3. మూలం #78 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేజీ)లో కూడా 90% అనే అంకె లేదు.

తతిమా ఎడిటర్లు, ఒకసారి సరిచూడండి. — వీవెన్ (చర్చ) 07:27, 24 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veeven, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ విభాగం ఆంగ్ల వికీనుండి అనువాదం చేయబడింది. ఆంగ్లవికీలో ఈ వివరం చేర్చినప్పటి తేడాల లింకుచూడండి. కావున ఈ సందేహాన్ని ఆంగ్లవికీ వ్యాసపు చర్చాపేజీలో అడిగాను. అర్జున (చర్చ) 10:23, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Veeven గారు, ఆంగ్లవికీలో ఇటువంటి మార్పులు పరిశీలించినమీదట, జనగణన రాష్ట్రాల వారీగా మాతృభాష గణాంకాలు లో జిల్లా స్థాయి గణాంకాలున్నాయని తెలిసింది. బహుశా ఇవి వాడివుండవచ్చు. ఆంగ్లవికీ చర్చలో స్పందన తరువాత వ్యాసంలో తగిన సవరణ చేస్తాను. --అర్జున (చర్చ) 03:43, 26 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కృతజ్ఠతలండీ! సరైన మూలం ఇది కావచ్చు. వీవెన్ (చర్చ) 05:48, 27 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వీవెన్ గారు, ఆంగ్లవికీవాడుకరి స్పందనలో ఇదే సమాచారం వాడి, నవ్యాంధ్రకు బదిలీచేయబడిన మండలాలను కూడా నవ్యాంధ్రలో లెక్కించబడినదని తెలిపారు. వ్యాసంలో మూలం సవరణ చేశాను.--అర్జున (చర్చ) 12:09, 30 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం, లింకులు గల వ్యాసాలు తాజాచేయటానికి ప్రత్యామ్నాయ నిర్వహణ ప్రక్రియ

ఈ వ్యాసం, లింకులు గల వ్యాసాలు తాజాచేయటానికి ప్రత్యామ్నాయ నిర్వహణ ప్రక్రియ వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి పేజీ చూడండి. మీరు పాల్గొనండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 06:56, 8 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రక్రియలో రెండవదిగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ వలన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణ ఘట్టం 2022 ఏప్రిల్ 4 న ప్రారంభమై, 2022 ఆగష్టు 9 నాడు ముగిసింది. దీనిపై అర్జున అనుభవాలు చూడండి. అర్జున (చర్చ) 13:39, 15 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2022 అక్టోబరు 5 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

Andhra Pradesh is 7th largest state in India but in this Wikipedia it’s mentioned that it’s the 8th largest state . Please correct it

2023 మార్చి 18 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

కేంద్ర ప్రభుత్వం ప్రకారం ప్రస్తుత రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే. విశాఖపట్నం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..