భారతదేశ ప్రాంతీయ మండళ్లు
జోనల్ కౌన్సిల్‌లు సలహా మండలి, భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో రూపొందించబడ్డాయి.వాటి మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఐదు జోన్‌లుగా విభజించబడ్డాయి.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956లోని విభాగం-III ద్వారా వీటిని ఏర్పాటు చేశారు.
జోనల్ కౌన్సిల్ సభ్యులు
[మార్చు]ఐదు జోనల్ కౌన్సిల్‌లకు కేంద్ర హోంమంత్రి ఉమ్మడి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.ప్రతి ముఖ్యమంత్రిని, మండలి వైస్ చైర్మన్‌గా రొటేషన్ ద్వారా వ్యవహరిస్తారు. ఒకేసారి ఒక సంవత్సరం పాటు మాత్రమే వారు పదవిలో కొనసాగుతారు.
జోనల్ కౌన్సిల్సు
[మార్చు]ఈ ప్రతి జోనల్ కౌన్సిల్ ప్రస్తుత కూర్పు క్రిందివిధంగా ఉంది:- [1]
వ.సంఖ్య | జోన్ పేరు | సభ్యులుగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు | ప్రధాన కార్యాలయం[2] |
---|---|---|---|
1. | ఉత్తర జోనల్ కౌన్సిల్ | న్యూ ఢిల్లీ | |
2. | దక్షిణ జోనల్ కౌన్సిల్ | చెన్నై | |
3. | సెంట్రల్ జోనల్ కౌన్సిల్ | ప్రయాగ్‌రాజ్ | |
4. | తూర్పు జోనల్ కౌన్సిల్ | Kolkata | |
5. | వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ | Mumbai | |
6. | ఈశాన్య మండలి | Shillong |
ఈశాన్య రాష్ట్రాలు ఏ జోనల్ కౌన్సిల్‌ల పరిధిలో లేవు. వారి ప్రత్యేక సమస్యలను ఈశాన్య మండలి చట్టం-1971 ద్వారా రూపొందించిన షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనే మరొక చట్టబద్ధమైన సంస్థ ద్వారా పరిష్కరించబడతాయి.[3] ఈ మండలిలో వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.తరువాత సిక్కిం రాష్ట్రం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (సవరణ) చట్టం-2002 ప్రకారం 2002 డిసెంబరు 23న నోటిఫై చేయబడింది.[4]
కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్,నికోబార్ దీవులు,లక్షద్వీప్‌లు ఏ జోనల్ కౌన్సిల్‌లోనూ సభ్యులుగా లేవు.[5]అయితే, వారు ప్రస్తుతం దక్షిణ జోనల్ కౌన్సిల్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.[6]
ఇది కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని సాంస్కృతిక మండలాలు
- భారతదేశంలోని ప్రత్యేక ఆర్థిక మండలాల జాబితా
- భారతదేశంలోని పర్యావరణ ప్రాంతాల జాబితా
- భారతదేశ పరిపాలనా విభాగాలు
మూలాలు
[మార్చు]- ↑ "Zonal Council". Archived from the original on 8 May 2012. Retrieved 7 March 2012.
- ↑ M Laxmikanth (2020). Indian Polity (in ఇంగ్లీష్) (6th ed.). McGraw Hill Education (India) Private Limited. p. 15.5. ISBN 978-93-89538-47-2.
- ↑ "NEC -- North Eastern Council". Archived from the original on 15 April 2012. Retrieved 25 March 2012.
- ↑ "Zonal Council |". mha.nic.in. Retrieved 26 October 2016.
- ↑ "The States Reorganisation Act, 1956 (Act No.37 Of 1956)" (PDF). Retrieved 16 November 2020.
- ↑ "Present Composition of the Southern Zonal Council" (PDF). Retrieved 16 November 2020.