Jump to content

టీఆర్ఎస్ ప్లీనరీ 2022

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 11.07 గంటలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్లీనరీ ప్రారంభమైంది.[1][2]

టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కమిటీలు

[మార్చు]

ఈ ప్లీనరీ నిర్వహణకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏడు కమిటీలను ప్రకటించారు.ఈ కమిటీల ఆధ్వర్యంలోనే అన్ని ఏర్పాట్లు జరుగుతాయని ప్రకటించాడు.[3]

ఆహ్వాన కమిటీ

[మార్చు]

1. సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి 2. జి.రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ 3.అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే 4.గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ మేయర్ 5.మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే

సభా వేదిక ప్రాంగణం అలంకరణ కమిటీ

[మార్చు]

1.మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే 2.బాలమల్లు, చైర్మన్ 3.మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్

ప్రతినిధుల నమోదు, వాలంటరీ కమిటీ

[మార్చు]

1.శంబీపూర్ రాజు, ఎమ్మెల్సీ 2.రావుల శ్రీధర్ రెడ్డి , చైర్మన్ 3.మన్నె క్రిశాంక్, చైర్మన్

పార్కింగ్

[మార్చు]

1.కె.పి. వివేకానంద గౌడ్, ఎమ్మెల్యే, 2.బండి రమేష్, పార్టీ జనరల్ సెక్రటరీ, 3.బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మాజీ మేయర్,

ప్రతినిధుల భోజనం

[మార్చు]

1.మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే 2.కె. నవీన్ రావు, ఎమ్మెల్సీ 3.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే

తీర్మానాల కమిటీ

[మార్చు]

1.సిరికొండ మధుసూధనాచారి ఎమ్మెల్సీ 2. పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ 3.శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

మీడియా కమిటీ

[మార్చు]

1.బాల్క సుమన్, ఎమ్మెల్యే 2.టి. భానుప్రసాద్ రావు, ఎమ్మెల్సీ 3.కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ

ప్లీనరీలో 13 తీర్మానాలు

[మార్చు]

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం 13 తీర్మానాలను ప్రతిపాదించి.. బలపరిచారు.[4][5]

  1. యాసింగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం
  2. దేశం విస్తృత ప్రయోజనాల రిత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం
  3. ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్రమ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం
  4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  5. భారత దేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని,మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం
  6. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  7. తెలంగాణ రాష్ట్రసామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
  8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలనీ, డివిజబుల్ పూల్ లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం
  9. నదీజలాల వివాదం చట్టం సెక్షన్ -3 ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  10. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం
  11. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను ,వైద్యకళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
  12. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  13. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీనిపూర్తిగా తీసివేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

భోజనాలు

[మార్చు]

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి హాజరయ్యే అతిధుల కోసం 33 ర‌కాల ఐటమ్స్ ను ఏర్పాటు చేశారు.[6]

డబుల్ కామీటా, గులాబ్ జామ్, మిర్చి బజ్జీ, రుమాలి రోటి , తెలంగాణ నాటు కోడి కూర, చికెన్ దమ్ బిర్యాని, దమ్ కా చికెన్, మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్ కర్రీ, , తలకాయ కూర, బోటి దాల్చా, కోడి గుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్డ్ వెజ్ కుర్మా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజు ఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాటా కర్రీ, వెల్లి పాయ కారం, టమాటా ,కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చి పులుసు, ఉలవచారు క్రీం, టమాటా రసం, పెరుగు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ స్టాల్, అంబలి, బట్టర్ మిల్క్[7]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (27 April 2022). "తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. Andhra Jyothy (28 April 2022). "అట్టహాసంగా ప్లీనరీ!" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. Eenadu (19 April 2022). "తెరాస ప్లీనరీ.. ఏడు కమిటీలు ఏర్పాటు". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  4. Namasthe Telangana (27 April 2022). "ప్లీనరీలో 13 తీర్మానాలు.. ప్రతిపాదించేది ఎవరంటే." Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  5. Eenadu (27 April 2022). "తెరాస ప్లీనరీ.. ఇవే 13 తీర్మానాలు". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  6. TV5 News (26 April 2022). "టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల పసందైన వంటకాలు..!" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. TV9 Telugu (26 April 2022). "రేపే పింక్‌ ఫెస్టివల్.. ప్లీనరీలో పసందైన భోజనం..మటన్ ముక్క, నాటుకోడి పులుసు.. మెనూ ఇదే." Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)