తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
(తమారెడ్డి గోపాలకృష్ణమూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి
జననంతమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి
అక్టోబరు 4, 1920
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం, చినపాలపర్రు
మరణంసెప్టెంబరు 16, 2013
హైదరాబాదు
ప్రసిద్ధిప్రముఖ హేతువాది , వామపక్షవాది
పిల్లలుతమ్మారెడ్డి భరద్వాజ
తండ్రితమ్మారెడ్డి వెంకటాద్రి
తల్లిసౌభాగ్యమ్మ

తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి (అక్టోబరు 4, 1920సెప్టెంబరు 16, 2013) హేతువాది, వామపక్షవాది.

జననం

[మార్చు]

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రులో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు 1920 అక్టోబరు నాలుగో తేదీన జన్మించాడు. 'గోరా' ప్రభావానికి లోనయ్యాడు. మాలపల్లిలో సహ పంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాది. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి 'స్వతంత్ర భారత్' అనే పత్రిక వ్రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించాడు. సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1945లో కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు. 1950 నవంబరులో మద్రాసుకు మకాం మార్చిన కృష్ణమూర్తి మొదట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత కాలం గడిపారు. కొడవటిగంటి కుటుంబరావు పేరు పెట్టిన 'పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్' సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసినిమా పల్లెటూరు తీసాడు. సారథి సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశాడు. సారథి నా విశ్వవిద్యాలయం అంటాడు. తెలుగు, తమిళం లలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశాడు. హైదరాబాద్‌లో 'సారథి స్టూడియో' ఏర్పాటుకు కృషి చేశాడు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. 'ఏరువాక సాగారో' పాటకు నర్తించిన వహీదా రెహమాన్‌ను తీసుకొచ్చింది కృష్ణమూర్తే. 1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాడు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ రవీంద్రతోనే మొదలయ్యాయి. లక్షాధికారి, జమీందారు, బంగారుగాజులు, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు, అమ్మా నాన్న, లవ్ మ్యారేజ్... ఇలా ఎన్నో చిత్రాలు. జూబ్లీ హిల్స్‌లో ఫిల్మ్‌నగర్ వ్యవస్థాపకుడు. జంట నగరాల్లో ఇరవైమూడు కాలనీలను ఒక గొడుగు క్రిందకు తెచ్చి, ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడు. తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారు. ప్రజానాట్యమండలి పోషకులు. నంది అవార్డు ల కమిటీలో సభ్యుడు, ఛైర్మన్ అయ్యాడు. చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ సభ్యుడు. వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకూడనే అభిప్రాయంతో కన్నుమూసే వరకు వృద్ధాశ్రమంలో కాలం గడిపారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సభ్యుడు. ఆ సంస్థ నడిపే వృద్ధాశ్రమంలోనూ సేవ చేస్తున్నాడు. 'సినిమా ఒక మజిలీ... సమసమాజం నా అంతిమ లక్ష్యం' అంటారు. ఇతడు2007 లో "రఘుపతి వెంకయ్య అవార్డు"ను పొందినాడు.[1][2]

ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈయన కుమారుడు.[3]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

వారి నాన్న పేరు తమ్మారెడ్డి వెంకటాద్రి, అమ్మ పేరు సౌభాగ్యమ్మ. వారికి ముగ్గురు సోదరులు. ఇద్దరు సోదరీమణులు. సోదరుల పేర్లు సత్యనారాయణ, రఘురామయ్య, వెంకటేశ్వరరావు, ఇద్దరు సోదరీమణులలో ఒకరిని పొట్లూరి హనుమంతరావుకు మరొకరిని పొట్లూరి వెంకట సుబ్బయ్యకు యిచ్చి వివాహం చేశారు.

విద్య

[మార్చు]

వారి ఊరిలో అప్పుడు కేవలం పాతిక ఇళ్ళుండేవి. ఊరికి దూరంగా మాలపల్లి ఉండేది. వారి ప్రాథమిక విద్య నాలుగో తరగతి వరకు వారి ఊళ్ళోనే జరిగింది. వారి బడిలో చరచూరి వెంకట బ్రహ్మం అనే టీచరు ఉండే వారు. ఆయన చాలా ఆసక్తిగా పాఠాలు చెప్పేవాడు. చదువు విషయంలో వారు ఎప్పుడూ ముందుండే వారు.

ఉద్యమంలో

[మార్చు]

ప్రజానాట్యమండలి ఆవిర్బావం

[మార్చు]

రహస్య జీవితం

[మార్చు]

1946లో నిర్భంధ విధానం వచ్చింది. అప్పుడు రెండు సంవత్సరాలు వానపాముల గ్రామంలో వారి కుటుంబాన్ని ఉంచి వారు రహస్య జీవితానికి వెళ్ళారు.

మరణం

[మార్చు]

సెప్టెంబరు 16, 2013 న తుదిశ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]
  1. Raghupathi Venkaiah award 2007 to Tammareddy Krishna Murthy
  2. "Starry fare marks awards night in The Hindu". Archived from the original on 2009-02-23. Retrieved 2013-05-20.
  3. "Interview with Tammareddy Bharadwaja by Jeevi". Archived from the original on 2013-07-24. Retrieved 2013-05-20.

బయటి లింకులు

[మార్చు]