దాశరథి సినిమా పాటలు
స్వరూపం
దాశరథి సినిమా పాటలు | |
కృతికర్త: | దాశరథి కృష్ణమాచార్య |
---|---|
సంపాదకులు: | కె. ప్రభాకర్ |
ముఖచిత్ర కళాకారుడు: | టి. సాయికృష్ణ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సినీ సాహిత్యం |
ప్రచురణ: | లావణ్య ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల: | 2010 |
పేజీలు: | 124 |
దాశరథి సినిమా పాటలు అనే పుస్తకం దాశరథి కృష్ణమాచార్య రచించిన తెలుగు సినిమా పాటల సంకలనం. దీని సంకలన కర్త కె. ప్రభాకర్.
దీనిని లావణ్య ఆర్ట్ క్రియేషన్స్, హైదరాబాద్ వారు మొదటిసారిగా 2010 సంవత్సరంలో ముద్రించారు. ఈ పుస్తకాన్ని శ్రీమతి లక్ష్మీ దాశరథి గారికి అంకితం చేయబడింది. దీనికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, చంద్రబోస్ ముందుమాటలు వ్రాశారు.
ఈ పుస్తకంలో 1960 నుండి 1978 వరకు దాశరథి రచించిన 124 సినిమా పాటల సాహిత్యాన్ని అందించారు. ఇవి సంవత్సరాల వారీగా చేర్చబడ్డాయి. ఇందులో ఉన్నత సాహిత్య విలువలనున్న పాటలు ఎన్నో ఉన్నాయి.
కొన్ని చక్కని పాటలు
[మార్చు]- ఇద్దరు మిత్రులు (1961) : ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
- వాగ్దానం (1961) : నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా
- అమరశిల్పి జక్కన (1964) : అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి
- డాక్టర్ చక్రవర్తి (1964) : ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
- దాగుడు మూతలు (1964) : గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక
- మంచి మనసులు (1964) : గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది
- నాదీ ఆడజన్మే (1964) : కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా
- ప్రేమించి చూడు (1965) :అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
- ఆత్మగౌరవం (1966) : ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
- నవరాత్రి (1966) : నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు
- శ్రీకృష్ణ తులాభారం (1966) : ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల
- వసంత సేన (1967) : కిలకిల నగవుల నవమోహిని ప్రియకామినీ సాటిలేని సొగసుల గజగామినీ
- పూల రంగడు (1967) : నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి
- నిండు మనసులు (1967) : నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో
- కంచుకోట (1967) : ఈ పుట్టినరోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు
- పట్టుకుంటే పదివేలు (1967) : తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా
- రంగులరాట్నం (1967) : కనరాని దేవుడే కనిపించినాడే ; నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
- బంగారు గాజులు (1968) : విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో వున్న కోరిక
- రాము (1968) : రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
- బందిపోటు దొంగలు (1968) : విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
- ఆత్మీయులు (1969) : మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె
- బుద్ధిమంతుడు (1969) : నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
- భలే రంగడు (1969) : నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు నాదేలే
- మాతృ దేవత (1969) : మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా
- మూగ నోము (1969) : ఈవేళ నాలో ఎందుకో ఆశలు ; నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
- ఇద్దరు అమ్మాయిలు (1970) : పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా
- చిట్టి చెల్లెలు (1970) : మంగళగౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా
- అమాయకురాలు (1971) : పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా
- మనసు మాంగల్యం (1971) : ఆవేశం రావాలి ఆవేదన కావాలి ; ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
మూలాలు
[మార్చు]- దాశరథి సినిమా పాటలు, సంకలన కర్త : కె. ప్రభాకర్, లావణ్య ఆర్ట్ క్రియేషన్స్, హైదరాబాద్, 2010.