Jump to content

దీప్సిక దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
దీప్సిక దేశ్‌ముఖ్
2021లో దీప్సిక దేశ్‌ముఖ్
జననందీప్సిక భగ్నానీ
(1983-10-29) 1983 అక్టోబరు 29 (వయసు 41)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతదేశం
ఇతర పేర్లుహనీ
వృత్తి
  • సినిమా నిర్మాత
  • పారిశ్రామికవేత్త
Notable work(s)సర్బ్ జిత్, మదారి, జవానీ జానేమాన్
భార్య / భర్తధీరజ్ దేశ్‌ముఖ్
పిల్లలు2
బంధువులుజాకీ భగ్నానీ (సోదరుడు)
రకుల్ ప్రీత్ సింగ్ (కోడలు)
అమిత్ దేశ్‌ముఖ్ (బావగారు)
అదితి దేశ్‌ముఖ్ (సోదరి)
రితేష్ దేశ్‌ముఖ్
జెనీలియా
తండ్రివశు భగ్నాని

దీప్సిక దేశ్‌ముఖ్ (జననం 1983 అక్టోబరు 29) హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ చిత్ర నిర్మాత.[1]

పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలో దీప్సిక దేశ్‌ముఖ్ అనేక చిత్రాలను నిర్మించింది. ఆమె 2020లో విడుదలైన జవానీ జానేమన్, 1995లో వచ్చిన కూలీ నంబర్ 1 రీమేక్ తో సహా అనేక బాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా పనిచేసింది. ఆమె చర్మ సంరక్షణ బ్రాండ్ లవ్ ఆర్గానిక్ ను కూడా స్థాపించింది.

ఆమెకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ అవార్డు 2023లో వరించింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

దీప్సిక దేశ్‌ముఖ్ 1983 అక్టోబరు 29న పశ్చిమ బెంగాల్ కోల్‌కాతాలో చిత్ర నిర్మాత వశు భగ్నాని, పూజా భగ్నాని దంపతులకు జన్మించింది. ఆమెకు నటుడు, చిత్ర నిర్మాత అయిన జాకీ భగ్నాని అనే తమ్ముడు ఉన్నాడు.

కెరీర్

[మార్చు]

దీప్సిక దేశ్‌ముఖ్ పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నది. ఆమె 2016లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, రణదీప్ హుడా నటించిన సర్బ్ జిత్ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేసింది.[3] ఆమె ఇర్ఫాన్ ఖాన్ నటించిన మదారి వంటి చిత్రాలను నిర్మించింది.[4][5][6] పూజా ఎంటర్టైన్మెంట్ మొదటి పంజాబీ చిత్రం సర్వన్ కు నిర్మాతగా ఆమె ప్రియాంక చోప్రాతో కలిసి వ్యవహరించింది.[7][8][9]

2018లో ఆమె వెల్కమ్ టు న్యూయార్క్ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, దిల్జిత్ దోసాంజ్, కరణ్ జోహార్ తదితరులు నటించారు.[10][11] అదే సంవత్సరంలో, ఆమె తాప్సీ పన్నూ, సాకిబ్ సలీమ్ నటించిన దిల్ జుంగ్లీని కూడా నిర్మించింది.[12]

2020లో, ఆమె సైఫ్ అలీ ఖాన్, టబు, అలయా ఫర్నిచర్‌వాలా ప్రధాన పాత్రల్లో నటించిన జవానీ జానేమాన్ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంతోనే అలయా నటిగా అరంగేట్రం చేసింది.[13] అదే సంవత్సరం చివరిలో, 1995 చిత్రం పునర్నిర్మాణం అయిన కూలీ నంబర్ 1 (2020), ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలైంది. అసలు చిత్రం, రీమేక్ రెండింటినీ పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.[14]

అక్షయ్ కుమార్, వాణీ కపూర్, లారా దత్తా, హుమా ఖురేషి మొదలైనవారు నటించిన బెల్ బాటమ్ (2021), టైగర్ ష్రాఫ్, కృతి సనన్ నటించిన యాక్షన్ డ్రామా గణపథ్ చిత్రాలకు ఆమె నిర్మాతగా పనిచేసింది. బహుభాషా చారిత్రక డ్రామా చిత్రం సూర్యపుత్ర మహావీర్ కర్ణ (2024) ఆమె నిర్మాణంలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది.[15]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె మహారాష్ట్ర లాతూర్ రూరల్ శాసనసభ నియోజకవర్గంనకు చెందిన ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ను వివాహం చేసుకున్నది, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[16][17][18] నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆమె తమ్ముడు. ఆయన రాజకీయ నాయకుడు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ చిన్న కుమారుడు.[19] ఆమె మారుపేరు హనీ. .[20]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
నిర్మాతగా
సంవత్సరం సినిమా గమనిక
2016 సర్బ్ జిత్
2016 మదారీ
2016 టుటక్ టుటక్ టుటియా తెలుగులో అభినేత్రి గా విడుదలైంది
2017 సర్వాన్
2018 వెల్కమ్ టున్యూయార్క్
2018 దిల్ జుంగ్లీ
2020 జవానీ జానేమన్
2020 కూలీ నెం. 1
2021 బెల్ బాటమ్
2022 కట్పుట్లి
2023 మిషన్ రాణిగంజ్
గణపథ్
2024 బడే మియాన్ చోటే మియాన్

మూలాలు

[మార్చు]
  1. "Jackky Bhagnani & Deepshikha Deshmukh's 'Carbon: The Story of Tomorrow' Wins Best Short Film Award". news.abplive.com. 21 February 2020.
  2. "Governor presents Dr Babasaheb Ambedkar National Awards to Udit Narayan, Kumar Sanu, Ranvir Shorey | Raj Bhavan Maharashtra | India". rajbhavan-maharashtra.gov.in (in ఇంగ్లీష్).
  3. "From Sarbjit to Sarvann". Tribuneindia News Service.
  4. "Irrfan Khan's 'Madaari' producer Deepshikha Deshmukh mourns his demise". Zee News. 29 April 2020.
  5. "My family taught me about failure: Deepshikha Deshmukh". outlookindia.com/.
  6. "The Reason For Investing in Madaari Was Irrfan & Nishikant Kamat: Deepshikha Deshmukh – Bollywoodirect". 17 July 2016.
  7. "Priyanka Chopra and Deepshikha Deshmukh at The Kapil Sharma Show". 22 December 2016.
  8. "Speaking about Sarvann: An Interview with Producer Deepshikha Deshmukh". bollywoodfilmfame.com. Archived from the original on 21 February 2023. Retrieved 11 August 2020.
  9. "Priyanka Chopra works in the US during day, in India at night: Deepshikha Deshmukh". 23 December 2016.
  10. "Poster of Sonakshi Sinha, Diljit Dosanjh, Kjo's 'Welcome To New York' Is Here". iDiva. 19 January 2018.
  11. "Welcome to New York | Edmonton Movies". Edmonton Movie Guide.
  12. "Dil Juunglee makers – Deepshikha Deshmukh and Aleya Sen all excited". mid-day. 9 March 2018.
  13. Gera, Sonal (January 31, 2020). "'Jawaani Jaaneman' review: Alaya F makes a brilliant debut with this unfunny movie". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-26. And complementing him in every frame is Alaya F. What a debut!
  14. "Coolie No 1: Varun Dhawan and Sara Ali Khan cut a fine frame in latest still". India Today. 2 January 2020.
  15. "Deepshikha Deshmukh". Bollywood Hungama. 31 October 2023.
  16. "Dheeraj Deshmukh and Deepshikha Wedding Ceremony Photos – FilmiBeat". Filmibeat. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
  17. "Dhiraj V Deshmukh and Honey Bhagnani with their children during Aaradhya Bachchan's birthday party held at Pratiksha in Mumbai – Photogallery". photogallery.indiatimes.com. 17 November 2015. Archived from the original on 20 November 2015. Retrieved 4 June 2021.
  18. "Actor Riteish Deshmukh raises poll fever, turns crowd puller for this Brothers in Latur". The Times of India. 12 October 2019. Retrieved 25 October 2019.
  19. "Rise of Deshmukh scions: Will Amit, Dhiraj continue Vilasrao's legacy?". Business Standard. 25 October 2019.
  20. "Deepshikha Deshmukh talks about being a Mompreneur". Mid-day (in ఇంగ్లీష్). 9 October 2017. Retrieved 29 April 2024.