Jump to content

ప్రవతి పరిదా

వికీపీడియా నుండి
(ప్రవటి పరిదా నుండి దారిమార్పు చెందింది)
ప్రవతి పరిదా

ఉప ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 12
Serving with [[కనక్ వర్ధన్ సింగ్ డియో]]
గవర్నరు రఘుబర్ దాస్
ముందు బసంత్ కుమార్ బిస్వాల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 4
ముందు సమీర్ రంజన్ దాష్
నియోజకవర్గం నిమాపరా

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి శ్యామ్ సుందర్ నాయక్

ప్రవతి పరిదా ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఒడిశా శాసనససభ ఎన్నికలలో నిమాపరా నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై జూన్ 12న ఒడిశా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[1][2][3]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

నిమాపారాకు చెందిన పరిదా మాజీ ప్రభుత్వోద్యోగి. ఆమె శ్యామ్ సుందర్ నాయక్‌ను వివాహం చేసుకుంది. 1995లో ఉత్కల్ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి, అదే సంవత్సరంలో కొంత కాలం పాటు ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకుంది.[4]తరువాత, ఆమె 2005లో ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఎ. కూడా చేసింది.[5]

వృత్తి జీవితం

[మార్చు]

2024 ఒడిశా శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి[6] ప్రాతినిథ్యం వహిస్తున్న నిమాపార అసెంబ్లీ నియోజకవర్గం నుండి పరిదా గెలుపొందింది. ఆమె 95,430 ఓట్లు సాధించి, బిజూ జనతా దళ్‌కు చెందిన దిలీప్ కుమార్ నాయక్‌ను 4,588 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించింది.[7][8]

2024 జూన్ 12న, భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా, ప్రవతి పరిదా, కనక్ వర్ధన్ సింగ్ డియో ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ వారిచేత ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారతీయ జనతా పార్టీల పాలిత పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.[9][10] [11] [12][13] She bఆమె ఒడిశా మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి అయ్యారు.[14]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (11 June 2024). "మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి.. డిప్యూటీ సీఎం పదవిని సొంత చేసుకున్న ప్రవతి పరిదా". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. News18 (11 June 2024). "Who Is Pravati Parida? All About BJP Leader Set To Become Odisha's First Female Deputy Chief Minister". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. India Today (11 June 2024). "KV Singh Deo, Pravati Parida to be new Deputy Chief Ministers of Odisha". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  4. https://www.hindustantimes.com/india-news/meet-pravati-parida-bjp-leader-set-to-be-odishas-first-female-deputy-cm-101718110776015.html
  5. "Pravati Parida(Bharatiya Janata Party(BJP)): Constituency- NIMAPARA(PURI) - Affidavit Information of Candidate". www.myneta.info. Retrieved 2024-06-06.
  6. "Nimapara Assembly Election Result 2024: BJD's Dilip Kumar Nayak to take on BJP's Parvati Parida". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-06.
  7. "Nimapara Election Result 2024 LIVE Updates Highlights: Assembly Winner, Loser, Leading, Trailing, MLA, Margin". News18. 2024-06-04. Retrieved 2024-06-06.
  8. "Nimapara Assembly Election Results 2024: Nimapara Odisha Election Schedule, Vote share and Results". Financialexpress. 2024-06-06. Retrieved 2024-06-06.
  9. "Highlights: BJP Tribal Leader, 4-Time MLA Mohan Majhi Sworn In As Odisha Chief Minister". NDTV.com. Retrieved 2024-06-13.
  10. Barik, Satyasundar (2024-06-12). "Mohan Charan Majhi sworn in as Odisha's first BJP Chief Minister". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-06-13.
  11. "Odisha Cabinet portfolios: CM Mohan Charan Majhi keeps Home". India News. 2024-06-13. ISSN 0971-751X. Retrieved 2024-06-15.
  12. https://www.hindustantimes.com/india-news/meet-pravati-parida-bjp-leader-set-to-be-odishas-first-female-deputy-cm-101718110776015.html
  13. "Odisha New CM Live Updates: Mohan Charan Majhi declared new Odisha Chief Minister, KV Singh Deo, Pravati Parida to be Deputy CMs". Financialexpress. 2024-06-11. Retrieved 2024-06-11.
  14. https://www.livemint.com/politics/odishas-first-female-deputy-cm-is-high-court-lawyer-pravati-parida-5-points-11718117624306.html