Jump to content

ప్రీతి ఝంగియాని

వికీపీడియా నుండి
ప్రీతి ఝంగియాని
జననం
వృత్తిమోడల్, నటి
భాగస్వామిపర్వీన్ దబాస్ (2008–ప్రస్తుతం)

ప్రీతి ఝంగియాని ఒక భారతీయ చలనచిత్ర నటి, మోడల్. ఈమె పేరును ప్రీతి జింగానియాగా, ప్రీతి జింగ్యానిగా సినిమా టైటిల్స్‌లో పేర్కొన్నారు.

విశేషాలు

[మార్చు]

ప్రీతి ఝంగియాని ముంబైలో ఒక సింధీ కుటుంబంలో జన్మించింది.[1] ఈమె మొదటి సారి రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి "యే హై ప్రేమ్" మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించింది. ఈ ఆల్బం ఈమె, అబ్బాస్ ఇద్దరితో పాటు ఆల్బం గుర్తుగా వాడిన కోలాకు పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఈమె నిర్మా శాండల్ సోప్ ప్రకటనలో నటించింది. తరువాత అనేక ప్రకటనలలో మోడల్‌గా కనిపించింది.

ఈమె మలయాళ సినిమా "మళవిల్లు"తో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె ప్రశాంత్ తో హలో అనే తమిళ సినిమాలో, పవన్ కళ్యాణ్ తో తమ్ముడు అనే తెలుగు సినిమాలలో నటించింది. 2000 సంవత్సరంలో "మొహబ్బతే" సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆమె తరువాత హిందీ సినిమా "ఆవారా పాగల్ దీవానా" అనే కామెడీ సినిమా. ఈమె ఇంకా కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాలలో నటించింది.

ఈమె ఆదిత్య చోప్రా, అరుణ్ ప్రసాద్, ఎస్. ఎస్. రాజమౌళి, శ్రీను వైట్ల, బి.గోపాల్, రవిరాజా పినిశెట్టి, దినేష్ బాబు, కె.సెల్వ భారతి,అర్జున్ సబ్లోక్, విక్రం భట్, మనోజ్ అగర్వాల్, రవి దీవాన్, టిన్నూ వర్మ, జె.పి.దత్తా, మాధుర్ భండార్కర్, శ్రీను యరజాల, శివమణి, కీర్తి కుమార్, సౌరభ్ శుక్లా, జై ప్రకాష్, గ్లెన్ బ్లారెట్టో, అంకుష్ మొహ్లా, ముస్తఫా ఇంజనీర్, హృదయ్ శెట్టి, అనంత్ మహదేవన్, వర ముళ్ళపూడి, జయతీర్థ, గౌతం అనిల్ నాగరథ్ మొదలైన దర్శకుల సినిమాలలో నటించింది.

ఈమె పవన్ కళ్యాణ్, ప్రశాంత్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున, సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, గోవిందా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రాజేంద్ర ప్రసాద్, జె. డి. చక్రవర్తి, ఉపేంద్ర, జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లరి నరేష్ వంటి నటులతో కలిసి పనిచేసింది.

ఈమె సహీ దంధే గలత్ బందే అనే హిందీ సినిమాను స్వంతంగా నిర్మించి బాలీవుడ్ మహిళా నిర్మాతల సమూహంలో చేరింది. ఈమె 2013 తర్వాత వివాహం, సంతానం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి 2017లో పునఃప్రవేశం చేసింది.

పురస్కారాలు

[మార్చు]

ఈమె నటించిన రాజస్థానీ సినిమా "తావ్‌డొ ద సన్‌లైట్"లో ఈమె నటనకు రాజస్థానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌(RIFF)లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.[2] 2017లో జరిగిన రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది[3].

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మేనకా ఝంగియాని, గోబింద్ ఝంగియానిలు ఈమె తల్లిదండ్రులు. ఈమె 2008, మార్చి 23న నటుడు, దర్శకుడు అయిన పర్వీన్ దబాస్ ను వివాహం చేసుకుంది. 2011లో జయ్‌వీర్, 2016లో దేవ్ అనే ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఈమె తన కుటుంబంతో ముంబైలోని బాంద్రా అనే ప్రదేశంలో నివసిస్తున్నది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుభాషవివరాలు
1999మళవిల్లువీణమలయాళం
హలోశ్వేతతమిళం
తమ్ముడుజానకి / జానుతెలుగు
2000మొహబ్బతేకిరణ్హిందీ
2001నరసింహ నాయుడుఅంజలితెలుగు
అధిపతిఅనూరాధతెలుగు
2002నా తుమ్‌ జానో నా హమ్‌హిందీప్రత్యేక పాత్ర
ఆవారా పాగల్ దీవానాప్రీతిహిందీ
వాహ్! తేరా క్యా కహ్నామీనాహిందీ
అనర్థ్ప్రీతిహిందీ
2003బాజ్: ఎ బర్డ్ ఇన్ డేంజర్ప్రీతి రస్తోగిహిందీ
ఎల్.ఓ.సి. కార్గిల్బల్వాన్ సింగ్ స్నేహితురాలుహిందీ
2004అప్పారావు డ్రైవింగ్ స్కూల్అంజలితెలుగు
ఆన్: మెన్ ఎట్ వర్క్జానకిహిందీ
ఆనందమానందమాయెమహేశ్వరితెలుగు
ఓంకారదివ్యకన్నడ
2005సౌదా - ది డీల్దేవికహిందీ
సుఖ్సుశీల చంద్రప్రకాష్ శర్మహిందీ
చెహరాడా.రీనాహిందీ
చాహత్ - ఏక్ నషారశ్మి ఎస్.జెట్లీహిందీ
2006విత్ లవ్ తుమ్హారాఅనూరాధ బి. సింగ్హిందీ
జానే హోగా క్యాసుచిత్రహిందీ
చాంద్ కే పార్ చలోనిర్మల / గరిమహిందీ
2007సజ్నా వె సజ్నాపంజాబీ
గాడ్‌ఫాదర్: ద లెజెండ్ కంటిన్యూస్ఉర్దూపాకిస్థానీ సినిమా
విక్టోరియా నెం.203దేవయాని / మోనాహిందీ
యమదొంగఊర్వశితెలుగుయంగ్ యమా యంగ్ యమా పాటలో ఒక అప్సరసగా ప్రత్యేక పాత్రలో నటించింది
2008విశాఖ ఎక్స్‌ప్రెస్సుచిత్రతెలుగు
2009హసీనా: స్మార్ట్, సెక్సీ, డేంజరస్టీనాహిందీ
2010తేజంతెలుగుఐటం సాంగ్‌లో నటించిందిr[4]
యాజ్ ద రివర్ ఫ్లోస్హిందీసంజయ్ సూరితో కలిసి నటించింది.[5]
2011ద మాస్టర్‌పీస్ప్రీతిహిందీలఘుచిత్రం
సహీ ధంధే గలత్ బందేశాలినీ మెహతాహిందీనిర్మాత కూడా
2013దేఖో యే హై ముంబై రియల్ లైఫ్హిందీ
టోనికన్నడ
కాష్ తుమ్‌ హోతేహిందీ
మిస్టేక్బెంగాలీవిక్రం చటర్జీతో కలిసి నటించింది.
బిక్కర్ బాయ్ సెంటిమెంటల్పంజాబీ
2017తావ్‌డొ ద సన్‌లైట్[6]పాల్కిరాజస్థానీ

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Leena Mulchandani, ET Bureau (2009-07-11). "Sindhi film industry striving hard to revive fading culture - Page 2 - Economic Times". Articles.economictimes.indiatimes.com. the original నుండి 2015-02-18 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-08-05.
  2. "Preeti Jhangiani wins best actor award for 'Taawdo' at RIFF - Times of India".
  3. "DPK NEWS". dpknewsindia.com. the original నుండి 2017-11-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-03-07.
  4. "Preeti Jhangiani tried southern pastures". realbollywood.com. 26 March 2009. the original నుండి 30 మార్చి 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 May 2011.
  5. "Preeti to make Bollywood comeback". digitalspy.com. 3 July 2009. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 May 2011.
  6. "राजस्थानी फिल्म तावड़ो 31 मार्च को होगी रिलीज". 29 March 2017. the original నుండి 19 జూలై 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 మార్చి 2018.

బయటి లింకులు

[మార్చు]