చంక
Appearance
(బాహుమూలము నుండి దారిమార్పు చెందింది)
చంక | |
---|---|
పురుషుని బాగు మూలలు | |
Deep muscles of the chest and front of the arm, with the boundaries of the axilla. | |
లాటిన్ | axilla |
గ్రే'స్ | subject #149 585 |
ధమని | axillary artery |
సిర | axillary vein |
నాడి | axillary nerve, medial cord, posterior cord, lateral cord |
లింఫు | axillary lymph nodes |
MeSH | Axilla |
Dorlands/Elsevier | a_76/12171908 |
చంక లేదా బాహుమూలము (Axilla or Armpit) దండచేయికి ఛాతీకి మధ్యనున్న ప్రదేశము. తెలుగు భాషలో దీనిని కక్షము అని కూడా అంటారు.[1] చంకకాళ్ళు అనగా వికలాంగులు నడవడానికి సహాయంగా తీసుకొనే crutches. చంకను తగిలించుకొను మూటను చంకతాళి అంటారు.
వైద్యశాస్త్ర ప్రాముఖ్యత
[మార్చు]వైద్యంలో రోగియొక్క శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపి (Thermometer) ని ఉంచే నాలుగు ప్రదేశాలలో ఒకటి. మిగిలిన మూడు: నోరు, పురీషనాళం, చెవి.
వాసన
[మార్చు]చంకలోని వాసన సాధారణంగా స్వేద గ్రంధుల స్రావాలపై బాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల చర్య మూలంగా వస్తుంది. ఈ వాసన లేకుండా ఇటీవల కొంత మంది డీ ఓడొరెంట్ అనబడే అత్తర్లు పిచికారీ చేసుకుంటున్నారు.