మహేంద్రగఢ్ జిల్లా

వికీపీడియా నుండి
(మహేంద్రగఢ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మహేంద్రగఢ్ జిల్లా
महेन्‍द्रगढ जिला
హర్యానా పటంలో మహేంద్రగఢ్ జిల్లా స్థానం
హర్యానా పటంలో మహేంద్రగఢ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంనార్నౌల్
మండలాలు1. నార్నౌల్, 2. మహేంద్రగఢ్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు4
Area
 • మొత్తం1,859 km2 (718 sq mi)
Population
 (2001)
 • మొత్తం9,21,680
 • Density500/km2 (1,300/sq mi)
 • Urban
13.49%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత69.89%
Websiteఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో మహేంద్రగఢ్ జిల్లా (హిందీ: महेन्‍द्रगढ जिला) ఒకటి. ఈ జిల్లా వైశాల్యం 1,859 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 8,12,022. జిల్లా కేంద్రంగా నార్నౌల్ పట్టణం ఉంది. జిల్లా పేరు జిల్లా కేంద్రం పేరు వేరువేరుగా ఉండే కొద్ది జిల్లాలలో మహేంద్రగఢ్ ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా జనసంఖ్య పరంగా హర్యానా రాష్ట్ర జిల్లాలలో 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో పంచ్‌కుల, రేవారీ జిల్లాలు ఉన్నాయి.[1]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

జిల్లా కేంద్రం మహేంద్రగఢ్ పట్టణం కారణంగా జిల్లకు ఈ పేరువచ్చింది. ముందు ఈ జిల్లాకు కనౌడ్ అనే పేరు ఉండేది. ఆ పేరు రావడానికి ఇక్కడ కనౌడియా బ్రాహ్మణులు అధికంగా నివసించడం ఒక కారణం. ఈ నగరాన్ని బాబర్ సేవకుడు మాలిక్ మహాదుబ్ ఖాన్ స్థాపించాడు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మరాఠీ మహారాజు తాంతియాతోపే ఒక కోట నిర్మించాడు. 1861లో తన కుమారుడు మహేంద్రసింగ్ గౌరవార్ధం పటియాలా మహారాజా నరేంద్ర సింగ్ ఈ కోటకు మహేంద్రగఢ్ అని నామకరణం చేసాడు. ఫలితంగా పట్టణానికి కూడా మహేంద్రగఢ్ అనే పేరు వచ్చింది. నిజామత్ నిజామౌల్ అనే పేరు మహేంద్రగఢ్ నిజామౌత్ అయింది.

చరిత్ర[మార్చు]

1948లో మహేంద్రగఢ్ జిల్లా మునుపటి రెండు రాజాస్థానాలకు చెందినదిగా ఉండేది. పాటియాలా రాజాస్థానాల నుండి నార్నౌల్, మహేంద్రగఢ్ తాలూకాలు, జింద్ రాజాస్థానం నుండి చర్కిదాద్రి తాలూకాలు, నభా రాజాస్థానం నుండి భవాల్ నిజామత్ ప్రాంతాలను కలిపి ఈ జిల్లా రూపొందించబడింది. 1956 నవంబరు 1 న పెప్సు పంజాబుతో కలుపబడిన తరువాత ఇది పంజాబు రాష్ట్రంలో భాగం అయింది. 1956లో హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేయబడిన తరువాత ఇది హర్యానా రాష్ట్రంలో భాగంగా మారింది. 1972లో గుర్‌గావ్ జిల్లాలోని రెవారి భూభాగం ఈ జిల్లాలో కలుపబడింది. 1989లో తాలూకా ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది.

భౌగోళికం[మార్చు]

మహేంద్రగఢ్ 270 47 నుండి 280 26 ఉత్తర అక్షాంశం, తూర్పు 750 56’ నుండి 760 51 రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో భివాని, రెవారి జిల్లాలు, తూర్పు సరిహద్దులో ఆల్వార్ జిల్లా రాజస్థాన్, దక్షిణ సరిహద్దులో జైపూర్ (రాజస్థాన్),శిఖర్ (రాజస్థాన్) జిల్లాలు, ఝుంఝును ( రాజస్థాన్) జిల్లాలు ఉన్నాయి.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న హర్యానా రాష్ట్ర 2 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు[మార్చు]

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 4 తాలూకాలు: నార్నౌల్, అట్లెలి, కనెనా, మహేంద్రగఢ్.
ఉపవిభాగం ఉప తాలూకా: నాంగల్ చౌదరి.
అసెంబ్లీ నియోజక వర్గం
పార్లమెంటు నియోజక వర్గం. భివాని [3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 921,680,[1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 462 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 485 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.43%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 894:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 78.9%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

విలేజ్ జాబితా[మార్చు]

 • శాంతలి
 • బర్ద ఆకాష్ గోయల్
 • బస్సా
 • జంజర్జవాస్
 • సిగ్రా
 • ఝూక్
 • పయేగ
 • బుదీన్
 • నాంగల్ సిరోహి
 • పథెర
 • కల్వారి
 • కుస్కి
 • జంట్
 • బర్కొడ
 • చికాకుపరచు బల్లవ
 • నాంగల్ హర్నాథ్
 • సిహోర్
 • కొథల్ కలాన్

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 3. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 157. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-08-25.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934