వాడుకరి:యర్రా రామారావు/ప్రయోగశాల-1
(వికీపీడియా ప్రయోగార్థం సష్టించబడింది)
సందేహాలు
[మార్చు]- ఇండియా కూటమి -భాషా లింకు Big tent ఆంగ్ల వ్యాసానికి ఎందుకు వెళుతుంది? దానికి సరియైన ఆంగ్లవ్యాసం Indian National Developmental Inclusive Alliance
నియోజక వర్గాల సంఖ్య, మూసలు ఎక్కింపు
[మార్చు]వ.సంఖ్య | రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరు | లోక్‌సభ
నియోజకవర్గాల సంఖ్య |
మూసలు
ఎక్కించిన రాష్ట్రాలు |
శాసనసభ
నియోజకవర్గాల సంఖ్య |
మూసలు
ఎక్కించిన రాష్ట్రాలు |
---|---|---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ | 25 | Yes | 175 | Yes |
2 | అరుణాచల్ ప్రదేశ్ | 2 | Yes | 60 | Yes |
3 | అసోం | 14 | Yes | 126 | Yes |
4 | బీహార్ | 40 | Yes | 243 | Yes |
5 | ఛత్తీస్‌గఢ్ | 11 | Yes | 90 | Yes |
6 | గోవా | 2 | Yes | 40 | Yes |
7 | గుజరాత్ | 26 | Yes | 182 | Yes |
8 | హర్యానా | 10 | Yes | 90 | Yes |
9 | హిమాచల్ ప్రదేశ్ | 4 | Yes | 68 | Yes |
10 | జార్ఖండ్ | 14 | Yes | 81 | Yes |
11 | కర్ణాటక | 28 | Yes | 224 | Yes |
12 | కేరళ | 20 | Yes | 140 | Yes |
13 | మధ్య ప్రదేశ్ | 29 | Yes | 230 | Yes |
14 | మహారాష్ట్ర | 48 | Yes | 288 | Yes |
15 | మణిపూర్ | 2 | Yes | 60 | Yes |
16 | మేఘాలయ | 2 | Yes | 60 | Yes |
17 | మిజోరం | 1 | N/A | 40 | Yes |
18 | నాగాలాండ్ | 1 | N/A | 60 | Yes |
19 | ఒడిశా | 21 | Yes | 147 | Yes |
20 | పంజాబ్ | 13 | Yes | 117 | Yes |
21 | రాజస్థాన్ | 25 | Yes | 200 | Yes |
22 | సిక్కిం | 1 | N/A | 32 | Yes |
23 | తమిళనాడు | 39 | Yes | 234 | Yes |
24 | తెలంగాణ | 17 | Yes | 119 | Yes |
25 | త్రిపుర | 2 | Yes | 60 | Yes |
26 | ఉత్తర ప్రదేశ్ | 80 | Yes | 403 | Yes |
27 | ఉత్తరాఖండ్ | 5 | Yes | 70 | Yes |
28 | పశ్చిమ బెంగాల్ | 42 | Yes | 294 | Yes |
29 | ఢిల్లీ | 7 | Yes | 70 | Yes |
30 | జమ్మూ కాశ్మీరు | 5 | Yes | 90 | Yes |
31 | పుదుచ్చేరి | 1 | N/A | 30 | Yes |
32 | దాద్రా నగర్ హవేలీ, | 2 | Yes | N/A | N/A |
33 | అండమాన్, నికోబార్ దీవులు | 1 | N/A | N/A | N/A |
34 | చండీగఢ్ | 1 | N/A | N/A | N/A |
35 | లడఖ్ | 1 | N/A | N/A | N/A |
36 | లక్షద్వీప్ | 1 | N/A | N/A | N/A |
మొత్తం | 543 | 535 | 4123 |
తెలుగు వికీపీడియాలో గ్రామాల ప్రస్థానం
[మార్చు]గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని మనందరకు తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా కాలం తరువాత, తాజాగా జిల్లాల, మండలాలు పునర్వ్యవస్థీకరణ తరువాత, ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఆవిర్బవించిన సంగతి మనందరికి తెలుసు. భారత జనాభా లెక్కలు ప్రకారం గ్రామం అంటే రెవెన్యూ గ్రామం అని అర్థం చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతి గ్రామానికి తెవికీలో వ్యాసం పేజీ ఉందని ఘంటాపధంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామ వ్యాసాలలో ప్రధానంగా ఆ గ్రామానికి చెందిన జనాభా, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యం, తాగునీరు, పారిశుద్యం, సమాచార రవాణా సౌకర్యాలు, వ్యవసాయం, దేవాలయాలు, గ్రామ శాసనాలు, గ్రామ చరిత్ర, ఆ గ్రామ ప్రముఖుల , ఆగ్రామ ఉనికిని తెలుపు అక్షాంశ, రేఖాంశాలుతో పాటు ఇంకా ఒకటేమిటి అన్ని వివరాలు అందుబాటులో వున్నాయి. శివారు గ్రామాల (రెవెన్యూయేతర గ్రామాలు) సమాచారం దాని రెవెన్యూ గ్రామంలోనే కలిసి ఉంటాయి. కొన్ని శివారు గ్రామాలకు ప్రత్వేక పేజీలు లేకపోలేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 26 జిల్లాలు, 670 మండలాలు, 16,479 గ్రామాలు ఉన్నవి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వస్తే 33 జిల్లాలు, 607 మండలాలు, 10,332 గ్రామాలు ఉన్నవి. వీటిన్నిటికి తెవికీలో పేజీలు ఉన్నవి. అంతేగాదు రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని రెవెన్యూ డివిజన్లుకు , పురపాలక సంఘాలకు, జనగణన పట్టణాలకు, అన్ని జిల్లాల, పురపాలక సంఘాల ముఖ్య పట్టణాలుకు వ్యాసాల పేజీలు తెవికీలో లభిస్తాయి. ఇదేగాదు
ఈ స్థాయికి సమాచారం తెవికీలో లభిస్తుందంటే ఇది ఏ ఒక్కరివల్లో సాధ్యపడిందికాదు. తెలుగు వికీపీడియా 2003 డిశెంబరు 10న ఆవిర్భవించిన నాటినుండి దేశ, విదేశాలలో ఉన్న అన్ని రంగాల తెలుగు వ్యక్తులు వీరంతా ఒక్క నయాపైసా పారితోషకం ఆశించకుండా నిరంతరం, వారి ప్రవృత్తిగా ఖాళీ సమయాన్ని ధారపోసి వందల కొద్దీ వ్యాసాలు రాస్తూ, రాసిన వ్యాసాలలో మరింత తాజా సమాచారం చేరుస్తూ, తప్పుఒప్పులు సవరిస్తూ , చేయీ, చేయీ కలుపుతూ సాగిన ప్రయాణమే తెలుగు వికీపీడియా. వికీపీడియా ఏ ఒక్కరి కష్టంతోనో సాధ్యపడలేదు. 2003 నాటి నుండి దేశ, విదేశాలలో ఉన్న తెలుగు వ్యక్తులు వందలాదిమంది ధనాపేక్షలేకుండా నిరంతరంచేసిన సమిష్టికృషి ఫలితమే ఇది. తాజా సమాచారం కోసం నిరంతరం అన్వేషణ కొనసాగతూనే ఉంటుంది. ఇది వుంది, ఇది లేదు అనకుండా మేధావులు అన్నిరంగాలకు చెందిన సమాచారాన్ని వికీపీడియా ద్వారా అందిస్తున్నారు. ఇది అన్ స్టాపబుల్ కార్యక్రమం.