వాడుకరి చర్చ:PARALA NAGARAJU
స్వాగతం
[మార్చు]PARALA NAGARAJU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
Nrgullapalli (చర్చ) 15:41, 13 ఫిబ్రవరి 2021 (UTC)
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:55, 1 సెప్టెంబరు 2021 (UTC)
అభినందనలు
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
--స్వరలాసిక (చర్చ) 09:49, 9 సెప్టెంబరు 2021 (UTC)
అంతర్వికీ లింకులు
[మార్చు]@PARALA NAGARAJU గారూ, తెవికీలో చురుగ్గా వ్యాసాలు రాస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలను మీరు తెలుగు వికీలోకి రాస్తున్నారు. అలా రాసినపుడు అంతర్వికీ లింకులు ఇవ్వడం లేదు. ఆంగ్ల వికీలో ఉన్న పేజీని తెవికీలో రాస్తున్నప్పుడు అంతర్వికీ లింకులు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. అంతర్వికీ లింకుల ప్రాముఖ్యత గురించి, అవి ఎలా ఇవ్వాలి అనే సంగతి గురించి వాడుకరులకు సూచనలు అనే పేజీలో ఉంది గమనించగలరు. ఇప్పటివరకి మీరు రాసిన వ్యాసాలకు అంతర్వికీ లింకులు చేరుస్తున్నాను. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:30, 22 ఫిబ్రవరి 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
[మార్చు]నమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:44, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)