Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

వికీపీడియా నుండి
(వికీపీడియా:ఈ వారం వ్యాసం నుండి దారిమార్పు చెందింది)

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2026 15వ వారం

మొఘల్ సామ్రాజ్యం

మొఘలాయిలు సా.శ. 1526 నుండి సా.శ 1707 వరకు భారత ఉపఖండాన్ని (ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్) పరిపాలించిన రాజవంశీయులు. 1526లో తైమూరు వంశానికి చెందిన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీమ్ లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మంగోల్ అనే పదాన్ని పర్షియా భాషలో మొఘల్ అంటారు. మంగోల్ అంటే మధ్య ఆసియాలోని చెంఘీజ్ ఖాన్ వంశీయులైన సంచార యుద్ధవీరులు అని అర్థం. మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని కచ్చితంగా పాటించారు. బాబరు తరువాత పరిపాలనా బాధ్యతల్ని చేపట్టిన హుమాయూన్ను పఠాన్ వీరుడైన షేర్ షా సూరి జయించి సుర్ సామ్రాజ్యం స్థాపించాడు. పదహారేళ్ళ తరువాత పోగట్టుకున్న కోటలన్నింటినీ హుమాయూన్ మళ్ళీ జయించాడు. హుమాయూన్ తరువాత అతని కుమారుడైన అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 1556 నుండి 1605 వరకు పాలించాడు. అక్బర్ తరువాత విశాలమైన మొఘల్ సామ్రాజ్యం అతని కుమారుడైన జహాంగీరుకు సంక్రమించింది. జహాంగీర్ తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యంగా కీర్తింపబడింది. ఇతను పరిపాలించిన కాలాన్నే చరిత్రకారులు మొఘల్ సామ్రాజ్య స్వర్ణ యుగంగా వర్ణిస్తారు. షాజహాను కీ.శ.1630, 1653 మధ్య, తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా, ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ కట్టించాలని సంకల్పించాడు. ముంతాజ్ తన 14వ బిడ్డ ప్రసవ సమయంలో మరణించింది. 1700 నాటికి వీరి సామ్రాజ్యం 40లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉత్థాన స్థితికి చేరుకొన్నది.
(ఇంకా…)




ప్రతిపాదించడం

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను ఉంచండి. ఏదైనా వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రదర్శించాలంటే, దానికి కింది అర్హతలుండాలి

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇదివరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసపు నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదం చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.

తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


వ్యాసం వార నిర్ణయం

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. /2026 ISO కేలండర్ వారం సంఖ్య ను చూడండి. వారం వ్యాసం ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని (అంటే భారతదేశంలో సోమవారం ఉదయం 05:30 గంటలకు) గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు ఉన్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గమనించండి.

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=????|వారం=??}} అన్న మూసను ఉంచండి.

వ్యాస పరిచయ రూపం సృష్టించడం

"ఈ వారం వ్యాసం" పరిచయ రూపంలో దీనిలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.

2026 జాబితా

2026 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ {{ఈ వారపు వ్యాసం/preload}} కోడ్ తో తెరుచుకొంటుంది. ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసం బొమ్మ పేరు, వ్యాసం పరిచయంనుండి కొంతభాగం ఆ పేజీలో చేర్చాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

ఇవి కూడా చూడండి

సంవత్సరం వారీగా సాధారణ జాబితా, కంప్యూటర్ ద్వారా విశ్లేషణకు ఉపయోగం

వ్యాసాల చర్చాపేజీల వర్గాలు

ప్రదర్శిత సంవత్సరం వారీగా

ప్రదర్శిత వారం వారీగా

వ్యాస పరిచయపేజీలు

వ్యాస పరిగణనలు

ఇతరాలు